sacked
-
ఏపీ బీజేపీ సహ ఇంఛార్జ్ సునీల్ దేవధర్‌కి ఉద్వాసన
సాక్షి, విజయవాడ: ఏపీ బీజేపీ సహ ఇంఛార్జ్ సునీల్ దేవధర్‌కి ఆ పార్టీ ఉద్వాసన పలికింది. జాతీయ కార్యవర్గం నుంచి సునీల్ దేవధర్‌ను తొలగించింది. ఇప్పటి వరకు జాతీయ కార్యదర్శిగా ఉన్న ఆయన పని తీరుపై జాతీయ నాయకత్వం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. బీజేపీ జాతీయ కమిటీని అధిష్టానం శనివారం ప్రకటించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్‌ను నియమించింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీ జాతీయ కమిటీని ప్రకటించారు. తెలంగాణ నుంచి డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతుండగా.. ఏపీ నుంచి సత్యకుమార్ బీజేపీ జాతీయ కార్యదర్శిగా కొనసాగనున్నారు. చదవండి: ఆపరేషన్ ఆకర్ష్.. జయసుధ సహా తెలంగాణ బీజేపీలోకి భారీ చేరికలు! -
మణిపూర్ కాదు.. మన సంగతేంది?
జైపూర్: మహిళలపై జరుగుతున్న అకృత్యాలకుగానూ.. సొంత ప్రభుత్వాన్ని, అదీ అసెంబ్లీ సాక్షిగా నిలదీసిన మంత్రికి గంటల వ్యవధిలోనే కేబినెట్ నుంచి ఉద్వాసన పలికింది రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం. శుక్రవారం ఈ పరిణామం చోటు చేసుకోగా.. ఆ నేత వ్యాఖ్యలతో ప్రతిపక్ష బీజేపీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. రెండున్నర నెలలుగా మణిపూర్‌లో నెలకొన్న హింసాత్మక పరిస్థితులు.. తాజాగా వెలుగులోకి వచ్చిన అకృత్యాలపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రంతో పాటు మణిపూర్ ప్రభుత్వం పైనా ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే.. అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించిన మంత్రి రాజేంద్ర సింగ్ గుధా.. రాజస్థాన్‌లో మహిళలపై జరుగుతున్న నేరాల కట్టడికి మన ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. ‘‘ఇక్కడ కఠిన వాస్తవం ఏంటంటే.. మన ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమవుతోంది. రాజస్థాన్‌లో మహిళలపై అకృత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. కాబట్టి.. మణిపూర్ అంశంపై దృష్టిసారించే బదులు ముందు నా సహచరులు ముందు మన సంగతి చూసుకోవడం ఉత్తమం’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన. రాజస్థాన్ మినిమమ్ గ్యారెంటీ బిల్ 2023పై చర్చ సందర్భంగా గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖల మంత్రిగా ఉన్న గుధా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు రాజకీయ సంచలనానికి దారి తీయగా.. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించారు. రాజేంద్ర సింగ్ గుధాను మంత్రివర్గం నుంచి వెంటనే తొలగిస్తున్నట్లు రాజస్థాన్ రాజ్‌భవన్‌కు సిఫార్సు పంపగా.. గవర్నర్ కల్రాజ్ మిశ్రా దానికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. గంట వ్యవధిలోనే ఈ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఇక ప్రతిపక్ష బీజేపీ రాజేంద్ర వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకుని.. కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తోంది. అంతకు ముందు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఆరంభానికి ముందు కూడా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లోనూ శాంతి భద్రతలు ఘోరంగా దెబ్బ తింటున్నాయని, మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: మా దగ్గరా మణిపూర్‌లాంటి ఘటనే జరిగింది: బీజేపీ ఎంపీ -
టీచరే బడిదొంగ... ఇరవై ఏళ్లుగా డుమ్మా!
స్కూలుకు డుమ్మా కొట్టే స్టూడెంట్స్‌ను చూసి ఉంటారు. కానీ, టీచర్ని ఎప్పుడైనా చూశారా! ఫొటోలో కనిపిస్తున్న ఈ టీచర్ ఒక రోజు కాదు, వారం కాదు.. ఏకంగా ఇరవై సంవత్సరాలు స్కూలుకు డుమ్మా కొట్టింది. ఇటలీకి చెందిన సింజియా పలైన డిలియో, వెనిస్లోని ఓ స్థానిక ప్రైవేట్ పాఠశాలలో సైన్స్ టీచర్‌గా పనిచేస్తుంది. ఇరవై నాలుగు సంవత్సరాల తన ఉద్యోగ జీవితంలో తను స్కూలుకెళ్లింది కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే! అనారోగ్య సెలవులు, కుటుంబ సెలవులు, అనుమతి సెలవులు వంటి వివిధ రకాల సెలవులు పెట్టి, డుమ్మా కొట్టేది. వీటిల్లో కొన్ని రికార్డుల్లో ఉంటే, చాలా వరకు సెలవులు రికార్డుల్లోనే లేవు. ఈ మధ్యనే స్కూల్ ఇన్స్పెక్టర్లు లియో బోధనను పరిశీలించినపుడు, ఆమె గందరగోళంగా పాఠాలను బోధించింది. తర్వాత పనితీరుపై పరీక్ష నిర్వహించినపుడు, విద్యార్థుల నుంచే లియో పుస్తకాలను సేకరించడం గమనించి, ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. లియో ఇందుకు ఒప్పుకోలేదు. ఉద్యోగం తిరిగి సాధించుకోవడానికి కోర్టులో కేసు వేసింది. కోర్టు కూడా లియో దాదాపు రెండు దశాబ్దాలు స్కూలుకు హాజరు కాలేదని గుర్తించింది. ‘ఆమెతన ఉద్యోగం తిరిగి పొందలేదు’ అని తీర్పు ఇవ్వడంతో, ఇది కాస్త వైరల్‌గా మారింది. (చదవండి: చిన్నపిల్లలే!.. వారికేం తెలియదు అనుకుంటే..పప్పులో కాలేసినట్లే..) -
హిట్లర్‌ను పొగిడాడు.. దిగ్గజ టెక్ కంపెనీలో మంచి ఉద్యోగం పోగొట్టుకున్నాడు!
అడాల్ఫ్ హిట్లర్.. ప్రపంచాన్ని వణికించిన నియంత. కొన్ని లక్షల మంది ప్రజలను పొట్టన బెట్టుకున్న క్రూరుడు. అతడి చెరలో పడితే చావే తప్పితే పునర్జన్మ ఉండదు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, మిత్ర రాజ్యాల దళాలు నాజీలను ఓడించడానికి ఆరేళ్లు ప్రయత్నించాయంటే..హిట్లర్ ఎంతటి గట్టివాడో అర్థం చేసుకోవచ్చు. అలాంటి నియంతను పొగిడాడంటూ ప్రముఖ టెక్ దిగ్గజం డెలాయిట్ ఓ ఉద్యోగుని విధుల నుంచి తొలగించింది. నీరభ్ మెహ్రోత్రా డెలాయిట్‌లో అసోసియేట్ డైరెక్టర్, రిస్క్ అడ్వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, తాజాగా నీరభ్ ‘ఫ్రైడే ఇన్స్పిరేషన్’ అనే కొటేషన్‌తో అడాల్ఫ్ హిట్లర్ ఆకర్షణీయమైన వ్యక్తి అంటూ నియంతపై పొగడ్తల వర్షం కురిపించారు. ‘‘ఇటీవల నేను ది డార్క్ చార్మ్ ఆఫ్ అడాల్ఫ్ హిట్లర్ బుక్ కొనుగోలు చేశా. ఆ బుక్ చదివే కొద్దీ ఇంకా ఇంకా చదవాలని అనిపిస్తుంది. ముఖ్యంగా అందులో హిట్లర్ గురించి, వరల్డ్ వార్ 2 పై ఈ బుక్ నాకు సరైన అవగాహన ఇచ్చింది’’ అని మెహ్రోత్రా సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. దీంతో పాటు ఆకర్షణీయమైన అడాల్ఫ్ హిట్లర్‌లోని కొన్ని లక్షణాల్ని మనం ఆకళింపు చేసుకోవాలి. తన మాటలతో ప్రజల్ని ఆకర్షించే మాగ్నెటిక్ స్పీకర్, కాన్ఫిడెంట్ ఎక్కువ’అని పేర్కొన్నాడు. అంతే అడాల్ఫ్ హిట్లర్‌ను పొగుడుతావా? అంటూ నెటిజన్లు మెహ్రోత్రాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్ల వర్షం కురిపించారు. నెటిజన్ల కామెంట్లపై మెహ్రోత్రా స్పందిస్తూ బహిరంగ లేఖలో ఇలా రాశారు. ‘‘నేను ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. క్షమించండి అంటూ అభ్యర్థించాడు. ‘నేను తప్పు చేస్తే దానిని అంగీకరించే ధైర్యం ఉండాలని నా గురువులు, బాస్‌లు, కోచ్‌లు నాకు సలహా ఇచ్చారు. వారి మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాను. నేను చేసిన పోస్ట్‌పై క్షమాణలు కోరుతున్నాను అని అందులో రాశాడు. మరోవైపు ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన కొద్ది సేపటికే డెలాయిట్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. మెహ్రూత్రా ఇకపై తమ కంపెనీలో పనిచేయడం లేదని పేర్కొంది. గత నెలలో మా సంస్థలో చేరిన ఉద్యోగి సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు మా భాగస్వామ్య విలువలకు అనుగుణంగా లేవు.మా అంతర్గత విధానాలను ఉల్లంఘించారు. ఈ ఉద్యోగి ఇకపై డెలాయిట్ ఇండియాలో పని చేయడు’ అని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు ఆ ప్రటకనలో తెలిపారు. -
వందల మంది ఉద్యోగుల తొలగింపుపై స్పందించిన విప్రో!
సాక్షి, ముంబై: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో వందలమంది ఫ్రెషర్లకు షాకిచ్చింది. పేలవమైన పనితీరు కారణంగా ఫ్రెషర్స్‌ను విధుల నుంచి తొలగించినట్లు బిజినెస్ టుడే రిపోర్ట్ చేసింది. (ఇదీ చదవండి: మరో బాంబు, వేలమందికి షాకివ్వనున్న టెక్ దిగ్గజం) ఈ తరుణంలో ఉద్యోగుల తొలగింపుపై విప్రో స్పందించింది. ‘విప్రోలో, మేం అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉన్నందుకు గర్వపడుతున్నాం. సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా, ప్రతి ఎంట్రీ - లెవల్ ఉద్యోగి వారి నియమించబడిన వర్క్ ప్లేస్‌లో నిర్దిష్టమైన నైపుణ్యాన్ని కలిగి ఉండాలని మేము ఆశిస్తున్నాము. వ్యాపార లక్ష్యాలు, క్లయింట్ల అవసరాలు ఉద్యోగుల పనితీరుపై ఆధారపడి ఉంటాయి. మానిటరింగ్, రీట్రైనింగ్ వంటి ప్రక్రియల్లో భాగంగా కంపెనీ నుండి కొంతమంది ఉద్యోగుల విభజన చేయాల్సి ఉంటుంది. కాబట్టే ట్రైనింగ్ తర్వాత పేలవంగా రాణిస్తున్న ఫ్రెషర్స్‌ను విధుల నుంచి తొలగించాల్సి వచ్చిందని తెలిపింది. (స్విగ్గీ ఉద్యోగాల ఊచకోత: 380 మందిపై వేటు) -
షాకింగ్: ఓనర్‌పై కత్తులతో దాడి.. అడ్డొచ్చిన మరో ఇద్దరినీ దారుణంగా..!
గాంధీనగర్: గుజరాత్‌లోని సూరత్‌లో ఆదివారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పనిలోంచి తీసేశాడనే కోపంతో ఫ్యాక్టరీ యజమాని, ఆయన ఇద్దరు బందువులను దారుణంగా పొడిచి చంపేశారు ఇద్దరు వర్కర్లు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఒకరు మైనర్‌గా గుర్తించామని, వారిని ఇటీవలే పని లోంచి తీసేసినట్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కల్పేశ్ ధోలకియాకు సూరత్‌లో వేదాంత టెక్సో పేరిటా ఎంబ్రయిడరీ ఫ్యాక్టరీ ఉంది. 10 రోజుల క్రితం పనిలోంచి తొలగించిన ఇద్దరు కార్మికులు ఆదివారం ఉదయం 9 గంటలకు ధోలకియాను కలిసేందుకు ఫ్యాక్టరీకి వచ్చారు. తమను పనిలోంచి తీసేయడంపై యజమానితో గొడవకు దిగారు. ఈ క్రమంలోనే అందులో ఒకరు కత్తి తీసి ధోలకియాను పొడిచాడు. అక్కడే ఉన్న కల్పేశ్ తండ్రి ధంజిభాయ్, అతడి మామ ఘన్‌శ్యామ్ రజోడియాలు కలుగజేసుకుని వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిని సైతం కత్తులతో పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు నిందితులు. హుటాహుటిన ముగ్గురిని స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు సూరత్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ హర్షద్ మెహత తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని, వారిలో ఒకరు జువెనైల్‌గా పేర్కొన్నారు. నైట్ డ్యూటీ సమయంలో వారు చేసిన తప్పిదం వల్ల ఇరువురిని పనిలోంచి తీసేసినట్లు గుర్తించామన్నారు. వారికి ఇవ్వాల్సిన జీతం మొత్తం ఇచ్చినట్లు చెప్పారు. ఇదీ చదవండి: ‘మా తల తీసేయమన్నా బాగుండేది’.. వర్శిటీల్లో నిషేధంపై అఫ్గాన్ మహిళల ఆవేదన -
అపుడు వేటు..ఇపుడు స్పెషల్ గిఫ్ట్: ట్విటర్ మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్
న్యూఢిల్లీ: 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను కొనుగోలుచేసిన తరువాత టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ పలు కీలక నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా అప్పటి సీఈవో పరాగ్ అగర్వాల్ సహా, పలువురి కీలక ఎగ్జిక్యూటివ్‌లపై వేటు వేశారు. అంతేకాదు నిర్దాక్షిణ్యంగా అనేకమంది సీనియర్ ఉద్యోగులతో పాటు, దాదాపు 50 శాతం మందిని తొలగించారు. అయితే ఆశ్చర్యకరమైన ఉదంతం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి మాజీ మహిళా ఉద్యోగి పోస్ట్ ఒకటి వైరల్ గామారింది. (ElonMusk సంచలన ప్రకటన: ఎడ్వర్టైజర్లకు బూస్ట్?) తొలగించిన ఉద్యోగుల్లో ఒకరైన ట్విటర్ సీనియర్ రీసెర్చ్ మేనేజర్ ఎలైన్ ఫిలాడెల్ఫో ట్విటర్ నుంచి పదేళ్ల వార్షికోత్సవ అభినందలు, బహుమతిని తాజాగా అందుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ట్విటర్లో షేర్ చేశారు. "ఈరోజు స్పెషల్ డెలివరీ వచ్చింది!!" పదేళ్ల వార్షికోత్సవ అభినందన సందేశంతో ట్విటర్ పార్శిల్ వచ్చిందంటూ ఆమె ట్వీట్ చేశారు. ఇప్పటికే ట్విటర్లో ఉద్యోగాన్ని కోల్పోయిన ఉద్యోగులు తమ భావోద్వేగాలను ట్విటర్లో షేర్ చేసుకున్నారు.ఎలైన్ కూడా వరుస ట్విట్లలో తనను తొలగించడంపై బాధను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక ఎరా ముగిసింది. పదేళ్ల సేవల తరువాత దుర్మార్గంగా తొలగించారంటూ ఆవేదన వెలిబుచ్చారు. అలాగే తన తోటి ఉద్యోగులకు మద్దతు తెలిపారు. ఇదీ చదవండి: Snapchat కొత్త ఫీచర్: వారికి గుడ్ న్యూస్, నెలకు రూ. 2 లక్షలు కాగా ట్విటర్ పగ్గాలు చేపట్టిన తర్వాత, మస్క్ గత వారం ప్రపంచవ్యాప్తంగా సిబ్బందిని తొలగించారు. ఈ చర్య చట్టాల ఉల్లంఘన, అమానవీయమంటూ ప్రపంచవ్యాప్తంగా మస్క్‌పై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. got a special delivery today!! pic.twitter.com/Xzc3cmEEfJ — Elaine Filadelfo (@ElaineF) November 7, 2022 End of an era. This is a brutal way to go after 10 years, but Twitter isn’t defined by last night. It’s defined by the culture *we* made, the lifelong friendships, how we supported each other, the damn good work we did along the way. You’re my people forever #LoveWhereYouWorked — Elaine Filadelfo (@ElaineF) November 4, 2022 -
బికినీలో ‘మేడమ్’ హల్చల్.. కంగుతిన్న పేరెంట్స్!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఓ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోల కారణంగా ఆమె ఉద్యోగం ఊడింది. అందుకు కారణం.. ఆ ఫొటోలు అభ్యంతకరంగా ఉన్నాయని పేరెంట్స్ ఫిర్యాదు చేయడమే!. ఏడాది కాలంగా నడుస్తోంది ఈ కేసు.. కోల్‌కతాకు చెందిన ఓ ప్రముఖ కాలేజీలో సదరు అసిస్టెంట్ ఫ్రొఫెసర్ పని చేస్తోంది. అయితే ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తరచూ ఫొటోలు అప్లోడ్ చేస్తూ వెళ్తోంది. ఈ క్రమంలో ఓరోజు ఫ్లస్ టూ చదువుతున్న ఓ విద్యార్థి(18) ఆమె ఫొటోలను పదే పదే చూస్తూ ఉండిపోయాడట. అది రహస్యంగా గమనించిన అతని తండ్రి బీకే ముఖర్జీ.. కాలేజీ యాజమాన్యానికి ఓ లేఖ రాశాడు. సదరు మేడమ్‌గారు అలాంటి ఫొటోలు అప్లోడ్ చేయడం సిగ్గుచేటని.. ఆమె వల్ల తమ పిల్లలు పాడైపోతున్నారని, ఆమె బికినీలో ఫొటోలు అప్లోడ్ చేయడం విద్యార్థులను రెచ్చగొట్టడమే అవుతుందని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నాడు. అంతేకాదు ఆమె ఫొటోలను సైతం ఎటాచ్ చేసి మరీ పంపించాడట. ఈ నేపథ్యంలో.. కిందటి ఏడాది అక్టోబర్‌లో మీటింగ్ పెట్టి మరీ ఆమెను తొలగించక తప్పలేదు కాలేజీ యాజమాన్యానికి. అయితే ఆమె తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసిందని.. అభ్యంతరకర ఫొటోల విషయంలో కాదని కాలేజీ యాజమాన్యం ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అయితే ఆ మరుసటిరోజే ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఇదిలా ఉంటే.. తన ఫోన్‌ను, సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేసి ఎవరో.. వ్యక్తిగత ఫొటోలను అప్లోడ్ చేస్తున్నారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన క్యారెక్టర్‌ను దిగజార్చే క్రమంలోనే ఇదంతా జరుగుతోందని, ఇది ముమ్మాటికీ కాలేజీ యాజమాన్యం తనపై చేస్తున్న వేధింపుల కిందకే వస్తుందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. A student of St. Xavier’s Kolkata was recently caught looking at a pic of a Prof in her swimsuit (taken from her private IG). His father sent a letter to the uni condemning HER for his son’s leching. Prof was forced to resign in a strikingly humiliating manner. 2022… damn. pic.twitter.com/2RNLnXBd0p — Sukhnidh ⚆ _ ⚆ (@skhndh) August 8, 2022 ఈలోపు తనకు సదరు విద్యార్థి తండ్రి చేసిన ఫిర్యాదు కాపీ ఇవ్వాలంటూ యూనివర్సిటీకి సదరు ప్రొఫెసర్ లీగల్ నోటీసులు పంపింది. ఆ నోటీసులు ఈ ఏడాది మార్చ్ 28న యూనివర్సిటీ స్పందించింది. లీగల్ నోటీసులను దురద్దేశ పూర్వకంగా పంపారని, ఇది కాలేజీ ప్రతిష్టను దెబ్బ తీయడమే అవుతుందని బదులు ఇచ్చింది. అంతేకాదు భేషరతు క్షమాపణలు చెప్పాలని, నష్టపరిహారం కింద 99 కోట్ల రూపాయలు చెల్లించాలని సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు బదులు ఇచ్చింది యూనివర్సిటీ. దీంతో ప్రస్తుతం ఆమె హైకోర్టుకు వెళ్లనున్నారు. ఇదీ చదవండి: హాయ్.. నేను కలెక్టర్ టీనా దాబిని! -
అవినీతి ఆరోపణలు: బుల్లెట్ ట్రైన్ బాస్‌పై వేటు
న్యూఢిల్లీ: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ అగ్నిహోత్రిని విధులనుంచి తొలగించింది కేంద్రం. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) ఎండీ సతీష్ సేవలను రైల్వే శాఖ రద్దు చేసినట్లు సీనియర్ అధికారులు నిన్న( గురువారం) తెలిపారు. అలాగే ప్రాజెక్ట్స్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్‌కు మూడు నెలల పాటు ఈ బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. అధికార దుర్వినియోగం, నిధులను అక్రమంగా ప్రైవేట్ కంపెనీకి మళ్లించడం లాంటి అనేక ఆరోపణల నేపథ్యంలో అగ్నిహోత్రిపై ఈ చర్య తీసుకున్నట్టు చెప్పారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ సీఎండీగా తొమ్మిదేళ్ల పదవీకాలంలో ఒక ప్రైవేట్ కంపెనీతో కుదుర్చుకున్న "క్విడ్ ప్రోకో" డీల్ ఆరోపణలువెల్లువెత్తాయి. దీనిపై జూన్ 2న లోక్‌పాల్ కోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో ఆయననను తొలగించేందుకు నిర్ణయించినట్లు వారు తెలిపారు. అవినీతి నిరోధక చట్టం, 1988 కింద నేరం జరిగిందో లేదో నిర్ధారించుకోవడంతోపాటు, విచారణ నివేదికను ఆరు నెలల్లోగా లేదా డిసెంబర్ 12, 2022 లోపు సమర్పించాలని లోక్‌పాల్ సీబీఐని ఆదేశించింది. అలాగే అగ్నిహోత్రి పదవీ విరమణ చేసిన ఒక సంవత్సరంలోనే ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం తీసుకున్నారని కూడా అధికారులు ఆరోపించారు. రిటైర్డ్ అధికారులు కేంద్రం ఆమోదం లేకుండా పదవీ విరమణ తరువాత ఏడాది దాకా ఎలాంటి వాణిజ్య ఉద్యోగాలను స్వీకరించకూడదన్న ప్రభుత్వ నిబంధనను ఉల్లంఘించారని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై అగ్నిహోత్రి అధికారికంగా స్పందించాల్సి ఉంది. మరోవైపు ఈ అరోపణలను అతని సన్నిహితులు తీవ్రంగా ఖండించారు. 1982 బ్యాచ్ ఐఆర్ఎస్ఈ అధికారి, అగ్నిహోత్రి 2021జూలై లో ముంబై, అహ్మదాబాద్ మధ్య ప్రతిష్టాత్మక బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సిసీఎల్‌లో చేరారు. అంతకుముందు ఆర్వీఎన్ఎల్ సీఎండీగా ఉన్నారు. -
రిలయన్స్ జియో షాకింగ్ న్యూస్
సాక్షి, ముంబై: సంచలనాల టెలికాం సంస్థ మరో సంచలనానికి తీరతీసినట్టు తెలుస్తోంది. తాజా రిపోర్టుల ఆధారంగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. వేలాదిమంది ఉద్యోగులను ఇంటికి పంపించింది. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 10 శాతం శాశ్వత ఉద్యోగుల తోపాటు, కాంట్రాక్టు ఉద్యోగులు 5 వేల మందిని తొలగించిందంటూ మీడియాలో పలు రిపోర్టులు వెలువడ్డాయి. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు లాభాలను పెంచుకునేందుకుగాను 5వేలమంది ఉద్యోగులను ఉద్వాసన పలికింది. ప్రస్తుతం రిలయన్స్ జియోలో 50 వేలమంది విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో పది శాతం అంటే 5 వేలమందిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఇందులో 500-600 మంది శాశ్వత ఉద్యోగులున్నారు. ముఖ్యంగా జనవరి-మార్చి మధ్యకాలంలో సంస్థ వేలమంది కాంట్రాక్ట్ సిబ్బందిని తొలగించిందట. జియో పింక్ స్లిప్స్ సప్లై చైన్, హెచ్ఆర్, ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్, నెట్ వర్క్స్ విభాగాల్లోని ఉద్యోగులకు రిలయన్స్ జియో పింక్ స్లిప్స్ ఇచ్చింది. గత రెండేళ్లలో నిర్వహణ మార్జిన్లలో పెద్దగా పురోగతి లేకపోవడంతో ఉద్యోగులను తొలగించినట్లుగా తెలుస్తోంది. అయితే నియామకాల్లో తమ సంస్థ కీలకంగా ఉంటుందని, కాస్ట్ కటింగ్ అనే ప్రశ్నే లేదని జియో స్పందించిందని ఈటీ నౌ రిపోర్ట్ చేసింది. కాగా 2016లో టెలికాం మార్కెట్లో సునామీలా దూసుకొచ్చిన రిలయన్స్ జియో మూడేళ్లలోనే 30 కోట్ల యూజర్లకు చేరుకుంది. ప్రస్తుత యూజర్ల సంఖ్య 30.7 కోట్లు. యూజర్ బేస్ ప్రకారం 26 శాతం మార్కెట్ షేర్ కలిగి ఉంది. రెవెన్యూ మార్కెట్ షేర్ 31 శాతంగా ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రిలయన్స్ జియో 126.2 కోట్ల లాభాన్ని గడించింది. అంతకుముందు క్వార్టర్లో రూ.131.7 కోట్లు గడించింది. -
చందా కొచర్‌కు మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఐసీఐసీఐ-వీడియోకాన్ కుంభకోణానికి సంబంధించి బ్యాంకు మాజీ సీఎండీ, ఈ స్కాంలో ప్రధాన నిందితురాలు చందా కొచర్‌కు (56) మరో షాక్ తగిలింది. ఈ స్కాంపై విచారణకు నియమించిన జస్టిస్ శ్రీకృష్ట (స్వతంత్ర కమిటీ) తన రిపోర్టును సంస్థకు అందించింది. వీడియోకాన్ రుణం కేసులో చందాకొచర్ దోషేనని, బ్యాంకునకు సంబంధించిన అంతర్గత నిబంధనలను ఆమె ఉల్లఘించారని స్వతంత్ర విచారణలో కమిటీ తేల్చింది. ఈ మేరకు ఆమెను దోషిగా నిర్ధారిస్తూ బ్యాంకు బుధవారం ప్రకటన జారీ చేసింది. అలాగే ఈ ఆరోపణలతోనే బ్యాంకు నుంచి ఆమెను తొలగించినట్టు బోర్డు ప్రకటించడం విశేషం. ఆమెకు సంబంధించిన చెల్లింపులను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. అంతేకాదు ఏప్రిల్,2009 నుంచి 2018 మార్చివరకు ఆమెకు చెల్లించిన బోనస్, ఇంక్రిమెంట్లు, మెడికల్ ఇన్సూరెన్స్ సహా ఇతర చెల్లింపులను బ్యాంకునకు వెనక్కి చెల్లించాలని పేర్కొంది. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బీఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీవీడియోకాన్ రుణ కేసులో క్విడ్-ప్రో-ఆరోపణలపై విచారణ జరిపింది. వీడియోకాన్ సంస్థకు రుణాల కేటాయింపు సందర్భంగా చందాకొచర్ బ్యాంకు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు పేర్కొంది. రెండవ అతిపెద్ద ప్రయివేటు బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకులో చోటుచేసుకున్న సుమారు రూ.3250కోట్ల కుంభకోణంలో క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారన్నఆరోపణలతో చందా కొచర్‌తోపాటు, ఆమె భర్త దీపక్ కొచర్, వీడియోకాన్ అధినేత వేణుగోపాల్ ధూత్‌లపై సీబీఐ ఇప్పటికే ఎప్ఐఆర్ నమోధు చేసిన సంగతి తెలిసిందే. -
ఆపరేషన్ థియేటర్లో నర్సుకు ముద్దుపెట్టాడు..
ఉజ్జయిని: ఆపరేషన్ థియేటర్లో విధులను మరిచి ప్రవర్తించిన ఓ ప్రభుత్వ వైద్యుడు తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ప్రభుత్వ ఆస్పత్రిలో సివిల్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి.. అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న మహిళ నర్సును ఆపరేషన్ థియేటర్లో ముద్దుపెట్టుకున్నాడు. అయితే ఆపరేషన్ థియేటర్లో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఈ వీడియో తొలుత ఆస్పత్రికి చెందిన వాట్సాప్ గ్రూప్‌లో చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం కలెక్టర్ శశాంక్ మిశ్రా దాకా వెళ్లడంతో.. ఆయన వెంటనే స్పందించారు. ఆ వైద్యుని విధుల నుంచి తొలగించడంతోపాటు, ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారి మోహన్ మల్వియా మాట్లాడుతూ.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. ఆ వీడియో ఎక్కడ చిత్రీకరించారనే దానిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, స్థానిక పోలీసులకు ఈ కేసులో అధికారింగా ఎటువంటి ఫిర్యాదు అందలేదు. -
రేప్ బెదిరింపులు : టీసీఎస్ ఉద్యోగిపై వేటు
సాక్షి, కోలకతా: దేశంలో ఒకవైపు మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలపై తీవ్ర చర్చ కొనసాగుతుండగా దేశీయ ఐటీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ఉద్యోగి ఒకరు ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన అంశం వెలుగులోకి వచ్చింది. టీసీఎస్ ఉద్యోగి రాహుల్ సింగ్ ఇద్దరు మహిళలకు అత్యాచారం, హత్య బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించిన సంస్థ రాహుల్‌ని విధులనుంచి తొలగించింది. వివరాల్లోకి వెళితే టీసీఎస్‌కు చెందిన రాహుల్ సింగ్ ఇద్దరు మహిళలకు అభ్యంతరకరమైన,అసభ్య సందేశాలతోపాటు, మీ భర్త, పిల్లలను హత్య చేస్తానంటు బెదరింపులకు దిగాడు. అయితే బాధిత మహిళల్లో ఒకరు ఆ స్ర్కీన్ షాట్లను సోషల్ మీడియాలో(ట్విటర్, ఫేస్బుక్) షేర్ చేశారు. ఇవి వైరల్ అయ్యాయి (ఈ పోస్టులను రాహుల్ తర్వాత డిలీట్ చేశాడు.) దీంతో రాహుల్‌ని తక్షణమే ఉద్యోగంనుంచి తొలగించడంతోపాటు, ఈ విషయాన్ని పరిశీలించేందుకు దర్యాప్తును ప్రారంభించింది టీసీఎస్. మహిళలపై లైంగిక వేధింపులు, ఇతర అసంబద్ధ చర్యలను క్షమించేది లేదని టీసీఎస్ ప్రతినిధి వెల్లడించారు. ప్రభుత్వ విధానాలపై తన అభిప్రాయాలను ఫేస్బుక్లో పెట్టిన పోస్టులకు స్పందించిన రాహుల్ అభ్యంతరమైన మెసేజ్‌లతో వేధించాడని అసోంకు చెందిన మహిళ తెలిపారు. తను భర్తను, కొడుకును చంపుతానని హెచ్చరించడంతోపాటు, రేప్ చేస్తానంటూ బెదిరింపులకు దిగడంతో పోలీసులకు ఫిర్యాదు చేసానని పేర్కొన్నారు. కాగా ఉద్యోగులు అనుచితంగా ప్రవర్తించిన సందర్భాల్లో భారతీయ సంస్థలు తీవ్రంగా స్పందించిన ఘటనలు గతంలో కూడా ఉన్నాయి. ముఖ్యంగా గత రెండు నెలల కాలంలో ఇది రెండో సంఘటన. మాజీ ఉద్యోగిపై అనైతికంగా వ్యాఖ్యానించిన రిచా గౌతంను టెక్ మహీంద్రా ఉద్యోగం నుంచి తొలగించింది. మరో ఘనటలో కతువా అత్యాచార ఘటనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తన ఉద్యోగిని కోటక్ మహీంద్రా బ్యాంకు సంస్థనుంచి తొలగించింది. -
కేరళ వరదలు : కారుకూత, తగిన శాస్తి
వరద బీభత్సంతో కేరళ ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతుంటే, వారి అవసరాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఉద్యోగికి ఓ గల్ఫ్ కంపెనీ యాజమాన్యం తగిన బుద్ధి చెప్పింది. కనీస మానవత్వాన్ని మరిచి వ్యాఖ్యానించాడు. నోటికొచ్చినట్టుగా అనుచితంగా ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కంపెనీ అతగాడిని ఉద్యోగంనుంచి తొలగించింది. తప్పయిందంటూ ఆనక లెంపలేసుకున్నా..ఆ కంపెనీ కనికరించలేదు. అటు ఈ వ్యాఖ్యలు చేసింది కేరళకు చెందిన వ్యక్తే కావడం గమనార్హం. కేరళకు చెందిన రాహుల్ లులు గ్రూప్ కంపెనీ ఒమన్ బ్రాంచ్‌లో కేషియర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కేరళలో వరద బాధితులకు వలంటీర్లు సహాయం చేస్తుండడంపై రెండు రోజుల క్రితం ఫేస్బుక్లో ఆయనో పోస్ట్ పెట్టాడు. సహాయక శిబిరాల్లో ఎవరైనా సానిటరీ నేప్కిన్స్ కోసం అడిగితే, తాను మాత్రం వాటికి బదులుగా కండోమ్స్ అడుగుతానంటూ బాధితులను అవహేళన చేస్తూ మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలు వైరల్ అవడంతో రాహుల్ ఉద్యోగం చేస్తున్న సంస్థ స్పందించింది. తక్షణమే రాహుల్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. మద్యం మత్తులోఅలా మాట్లాడాను తప్పైపోయింది, క్షమించండంటూ నాలిక్కరుచుకున్నా.. కంపెనీ ఎంతమాత్రం ఉపేక్షించలేదు. రాహుల్‌కు తగిన శాస్తి చేసింది. కాగా కేరళ వరద బాధితుల పునరావాస కార్యక్రమాలకోసం విరాళమిచ్చిన గల్ఫ్ కంపెనీల్లో లులు గ్రూపు కంపెనీ కూడా ఉంది. కేరళకు చెందిన వ్యాపారవేత్త, లులు గ్రూపు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసుఫ్ అలీ 5కోట్ల రూపాయలును విరాళమిచ్చారు. అటు తమ ఆర్థిక వ్యవస్థ విజయంలో కేరళీయులది కీలక భాగమని, వారికి సహాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
బికినీలో టీచర్ల రచ్చ
సోషల్ మీడియాలో హాట్‌గా ఫోటోలు పెట్టిందన్న ఒకే ఒక్క కారణం ఆ ఉపాధ్యాయురాలి పాలిట శాపంగా మారింది. పలువురు పేరెంట్స్ ఫిర్యాదు చేయటంతో ఆమె ఉద్యోగం ఊడింది. మరెక్కడా ఆమెకు పని దొరకటం లేదు. ఈ విషయం తెలిసిన తోటి ఉపాధ్యాయులు వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. బికినీ ఫోటోలతో సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు!! మాస్కో: 26 ఏళ్ల విక్టోరియా పోప్‌రోవా ఓమ్స్క్ పట్టణంలో 7 సిటీ స్కూల్లో హిస్టరీ టీచర్‌గా పని చేస్తుండేది. ఆ మధ్య సెలవులపై కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఆమె.. బికినీలో ఓ ఫోటోషూట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశారు. అయితే ఆమెను ఫాలో అయ్యే వారిలో ఆమె స్టూడెంట్లు కూడా ఉన్నారు. ఈ విషయం కొందరు పేరెంట్స్ దృష్టికి రావటంతో వారంతా స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె నుంచి వివరణ కోరిన స్కూల్ మేనేజ్మెంట్.. చివరకు ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. విషయం తెలిసిన టీచర్ల అసోసియేషన్ మండిపడింది. టీచర్స్ ఆర్ హ్యూమన్స్ టూ(#TeachersAreHumansToo) పేరిట వినూత్నంగా నిరసనకు పిలుపునిచ్చింది. అందులో మొత్తం 11 వేల మంది టీచర్లు ఫ్లాష్‌మాబ్‌లో పాల్గొన్నారు. వారంతా బికినీలతో ఫోటోలు దిగి విక్టోరియా పోప్రోవాకు మద్దతు తెలిపారు. ఆమెకు న్యాయం జరగకపోతే ఉద్యమం మరో రూపం దాల్చుతుందని హెచ్చరించారు. ఈ ఉద్యమం సోషల్ మీడియాను కదిలించింది. దేశంలోని మిగతా ప్రాంతాల నుంచి కూడా టీచర్లు ఆమెకు మద్ధతు ప్రకటిస్తూ.. తమ ఫోటోలను అప్లోడ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బికినీ ఉద్యమం అక్కడ హాట్ టాపిక్‌గా మారింది. -
ప్రపంచకప్‌కు ఒక్కరోజు ముందు సంచలనం
ఫిఫా ప్రపంచ కప్ ఆరంభానికి ఒక్కరోజు ముందు స్పానిష్ ఫుట్‌బాల్ ఫెడరేషన్(ఆర్ఎఫ్ఈఎఫ్) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత కోచ్ జులెన్ లోపెటిగుయ్ను తప్పించి ఫెర్నాండో హియర్రోను నియమించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం(జూన్ 15న) పోర్చుగల్‌తో తలపడబోతున్న స్పెయిన్ జట్టు ఆటపై ఈ అనూహ్య నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత నెలలోనే ప్రధాన కోచ్‌గా నియమితులయిన జులెన్ 2020 వరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ అర్ధంతరంగా కోచ్ పదవి నుంచి తప్పించారు. జులెన్ను స్థానిక క్లబ్ రియల్ మాడ్రిడ్ జట్టు మేనేజర్‌గా ఆర్ఎఫ్ఈఎఫ్ నియమించింది. 2010 ఫిఫా చాంపియన్ అయిన స్పెయిన్ ఈసారి ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. కోచ్ జులెన్ నిష్ర్కమణతో దిగ్గజ జట్టు ఎలా ఆడుతుందో వేచి చూడాలి. -
ఉద్యోగం నుంచి తీసేసారని
సాక్షి,న్యూఢిల్లీ: ఉద్యోగంలోంచి తీసేసారన్న అక్కసుతో ఏకంగా కంపెనీ ఉన్నతోద్యోగిపై దాడిచేసిన ఘటన కలకలం రేపింది.ఢిల్లీలోని ఒక కార్పొరేట్ కంపెనీకి చెందిన ఉద్యోగి ఉన్నతాధికారిపై హత్యాయత్నం చేశాడు. అయితే సదరు అధికారి తృటిలో ప్రాణాపాయంనుంచి తప్పించుకోవడంతో కంపెనీ ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఊపిరి పీల్చు కున్నారు. జర్మనీ లగ్జరీ కారు మేకర్ మిత్సుబిషి కంపెనీ హెచ్ఆర్ హెడ్ బినిష్ శర్మపై ఈ దాడి జరిగింది. గుర్గావ్ కార్యాలయంలో గురువారం ఈ ఉదంతం చోటు చేసుకుంది. గురువారం ఉదయం బినిష్ శర్మ కార్యాలయానికి వెళుతుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయన కారును అడ్డగించేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన కారు ఆపక పోవడమే కాకుండా వేగాన్ని మరింత పెంచారు. అయితే వెనుక కూర్చున్న వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం ఇద్దరూ సంఘటనా స్థలంనుంచి పారిపోయారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు గాయపడిన బాధితుడిని రాక్లాండ్ ఆసుపత్రిలో చేర్చారు. బినిష్కు ప్రాణాపాయం లేదని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. కాగా శర్మని చంపాలనే లక్ష్యంతోనే దుండగులు కాల్పులు జరిపారని గుర్గావ్ పోలీస్ అధికారి రవీందర్ కుమార్ పిటిఐకి తెలిపారు. నిందితుల్లో ఒకరైన జోగిందర్ అనే వ్యక్తిని అనైతిక ప్రవర్తన ఆరోపణలతో బుధవారం విధులనుంచి తొలగించారని చెప్పారు. ఈ నేపథ్యంలో తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని లేదంటే, భయంకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని వివరించారు. కానీ శర్మ ఆ హెచ్చరికను సీరియస్‌గా తీసుకోలేదని అధికారి తెలిపారు. ప్రస్తుతం ఆయన బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నామనీ, నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. -
అమ్మవారికి మహా అపచారం
సాక్షి, నాగపట్టణం: అమ్మవారి విగ్రహాన్ని సల్వార్ కమీజ్‌తో అలంకరించిన ఇద్దరు అర్చకులపై వేటు పడింది. తమిళనాడు నాగపట్టణం జిల్లా మయిలాదుతుదైలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మయూర్‌నాథర్ ఆలయంలో చోటుచేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. అమ్మవారి విగ్రహానికి ఆధునిక బట్టలు ఆలయంలోని అభయాంబిగై అమ్మవారిని ప్రతి శుక్రవారం వివిధ రంగుల కాగితాలతో అలంకరిస్తుంటారు. సంప్రదాయానికి భిన్నంగా రాజ్ అనే పురోహితుడు అమ్మవారి విగ్రహానికి ఆధునిక బట్టలు తొడిగారు. పింక్ రంగు సల్వార్ కమీజ్, నీలం రంగు దుపటాతో అమ్మవారిని అలంకరించారు. సీనియర్ అర్చకుడు కళ్యాణమ్ కుమారుడైన రాజ్‌ను తండ్రికి సహాయంగా ఉంటాడనే ఉద్దేశంతో గతేడాది ఆగస్టులో ఆలయంలో నియమించారు. తండ్రీకొడుకులపై వేటు వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఆగమ నియమాలకు విరుద్ధంగా అమ్మవారికి అపచారం జరగడంతో భక్తులు, సీనియర్ అర్చకులు మండిపడ్డారు. దీంతో స్పందించిన దేవస్థానం పాలక మండలి ఇద్దరు అర్చకులను విధుల నుంచి తొలగించింది. చేసిన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోవడంతో వీరిద్దరిపై చర్య తీసుకోవాల్సివచ్చిందని పాలక మండలి ప్రతినిధి ఎస్. గణేశన్ తెలిపారు. తాను ఎటువంటి దురుద్దేశంతోనూ ఈ తప్పు చేయలేదని అర్చకుడు రాజ్ చెప్పారు. ఆలయ ప్రతిష్టను దిగజార్చాలన్న ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. నంది విగ్రహానికి నోట్లతో అలంకరణ ప్రచారం కోసం గతంలోనూ రాజ్ ఇటువంటి పనులు చేశాడని మయిలాదుతుదై ఫొటోజర్నలిస్ట్ ఒకరు చెప్పారు. నంది విగ్రహాన్ని రూ. 15 వేల విలువ చేసే వంద రూపాయల నోట్లతో అలకరించించాడని, అప్పుడు అతడిని అందరూ మెచ్చుకున్నారని వెల్లడించారు. కానీ ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డాడని తెలిపారు. కాగా, అమ్మవారి విగ్రహాన్ని సల్వార్ కమీజ్‌లో అలంకరించిన ఫొటోలను రాజ్ తన స్నేహితులకు పంపడంతో సామాజిక మాధ్యమాల్లో ఇవి వైరల్‌గా మారాయి. -
‘పిలిచి ఉన్నపళంగా రాజీనామా చేయమన్నారు’
న్యూఢిల్లీ: బెంగళూరులో ఆంగ్ల సబ్జెక్టును బోధించే అసోసియేట్ ప్రొఫెసర్(స్వలింగ సంపర్కుడు)ను విధుల్లో నుంచి తప్పించారు. అతడి వల్ల విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలుగుతుందనే కారణంతో ఆయనను బలవంతంగా ఉద్యోగంలో నుంచి తీసివేశారు. ఈ విషయాన్ని ఆ ప్రొఫెసరే స్వయంగా చెప్పాడు. బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ అనే కాలేజీ ఉంది. అందులో ఆంగ్ల విభాగంలో ఆష్లే టెలీస్ అనే వ్యక్తి అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. అతడు ఓ స్వలింగ సంపర్కుడు. పైగా ఎల్జీబీటీ హక్కుల ఉద్యమకారుడిగా కూడా ఉన్నాడు. కొన్ని విషయాలతో అతడికి వ్యక్తిగతంగా భిన్నమైన అభిప్రాయాలుండేవి. వాటిని అతడు విద్యార్థులపై రుద్దుతున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతడిని రాజీనామా చేయాలని కాలేజీ యాజమాన్యం ఆదేశించింది. ఈ విషయాన్ని అతడే తన మాటల్లో ఎలా చెప్పారంటే.. ‘మార్చి 9, 2017న నేను బీకామ్ సెకండియర్ విద్యార్థులకు పాఠం చెబుతున్నాను. ప్రిన్సిపాల్ పిలుస్తున్నారంటూ పాఠం మధ్యలోనే పిలిచారు. అక్కడికి వెళ్లాక పది నిమిషాలు ఎదురుచూడమన్నారు. ఆ తర్వాత పిలిచి ‘నీ వ్యక్తిగత అభిప్రాయాల కారణంగా విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలుగుతోంది. వెంటనే నీ బాధ్యతలకు రాజీనామా చేసి వెళ్లిపో.. ఇది ఇప్పుడే జరగాలి’ అని చెప్పారు. వాస్తవానికి విద్యార్థులు నిజంగానే డిస్ట్రబ్ అయితే.. అలా చేయడం కూడా బోధకుల పనే. అలా చేయలేకుంటే విద్యార్థులు ఎలా ఆలోచిస్తారు? ఎప్పుడు ఈ ప్రపంచం మారుతుంది? అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన తన అనుభవాలను ఫేస్బుక్లో పంచుకున్నారు. -
తండ్రి సన్నిహితుడికి అఖిలేష్ ఝలక్
లక్నో : మరో రెండు రోజుల్లో(ఫిబ్రవరి11న) ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉత్తరప్రదేశ్ తొలి దశ ఎన్నికలకు తెరలేవబోతున్న నేపథ్యంలో మళ్లీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన క్యాబినెట్లో ఉన్నతవిద్యా శాఖామంత్రిగా పనిచేస్తున్న శారదా ప్రసాద్ శుక్లాకు ఉద్వాసన పలికారు. శుక్లను ఉన్నతవిద్యాశాఖ మంత్రిగా తీసివేయడానికి తన క్యాబినెట్ ఆమోదం తెలిపిందని తెలుపుతూ ఆ రాష్ట్ర గవర్నర్ రాం నాయక్‌కు అఖిలేష్ ఓ లేఖను రాశారు. ఎస్పీ సుప్రిం, అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్‌కు శుక్ల సన్నిహితుడు. అయితే సమాజ్ వాద్ పార్టీ తరుఫున ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో శుక్ల ఇటీవలే రాష్ట్రియ లోక్‌దళ్‌లో చేరారు. పొత్తు పెట్టుకుందామనుకున్న ఎస్పీ, రాష్ట్రీయ లోక్దళ్లు చివరి నిమిషాల్లో విరమించుకున్నాయి. ఎస్పీ ఆర్ఎల్డీతో పొత్తుపెట్టుకోదని, కేవలం కాంగ్రెస్‌తో కలిసి మాత్రమే పోటీచేస్తామని ఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడు కిరణ్మయ్ నందా స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. ఎస్పీ నుంచి టిక్కెట్ దక్కకపోవడంతో శారదా ప్రసాద్ శుక్ల లక్నో సరోజిని నగర్ నియోజకవర్గం నుంచి ఆర్ఎల్డీ తరుఫున బరిలోకి దిగబోతున్నారు. -
500మంది ఉద్యోగులపై వేటు
ముంబై: ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫినాన్స్ సంస్థ ఎల్ అండ్ టీ ఫినాన్స్ హోల్డింగ్స్ 500 మంది ఉద్యోగులపై వేటు వేసింది. గ్రామీణ ప్రాంతాలలో గృహ, వాహన, రుణాల కల్పలనలో మంచి పట్టు కలిగి వున్న ఈ సంస్థ కరువు కష్టాలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులపై తొలగిస్తూ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ చైర్మన్, ఎండీ డియోస్తలే తెలిపారు. బాధకరమైనా, తప్పలేదని పేర్కొన్నారు. వివిధ సెక్టార్లలో పేలవమైన ప్రదర్శన చూపించిన ఉద్యోగులను తొలగించినట్టు చెప్పారు. ముఖ్యంగా రీటైల్, రూరల్ సెగ్మంట్లలో పూర్ పెర్మాన్స్ కనబర్చిన వారికి ఉద్వాసన పలికినట్టు వెల్లడించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ఒత్తిడిని ఫేస్ చేస్తున్నట్టు చెప్పారు. ఇది తమ మార్కెట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించిందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రుణాలను తీసుకున్న రైతులు, తిరిగి చెల్లించడంలో విఫలమవుతున్నారన్నారు. రుతుపవనాలు వైఫల్యాలతో ఒత్తిడి చాలా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పరికరాల ఫైనాన్స్ లో తమ వ్యాపారం క్షీణించిందని తెలిపారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో కరువు కారణంగా పలువురు రైతుల పరిస్థితి దిగజారిందనీ, దీంతో ట్రాక్టర్లకు డిమాండ్ తగ్గడంతో పాటు రుణాల చెల్లింపులో సామర్థ్యం తగ్గిందన్నారు. ఈ పరిస్థితి మరో అయిదారు నెలలు వ్యవసాయ రంగంలో ఒత్తిడి చూడవచ్చన్నారు. ఈ ఏడాది రెండవ సగంలో పరిస్థితి మెరుగుపడవచ్చనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాగా మంగళవారం కంపెనీ ప్రకించిన మార్చి త్రైమాసిక ఫలితాల్లో రూ 237 కోట్ల నికర ఆదాయాన్ని ఆర్జించింది. ఆదాయం వృద్ధిలో 15 శాతం పెరుగుదల నమోదు చేసింది. -
'అక్రమ నిర్మాణాలు అడ్డుకోలేదని..'
హైదరాబాద్: అక్రమ నిర్మాణాలు నియంత్రించడంలో అలసత్వం చూపిన అధికారిపై వేటు పడింది. రాజేంద్రనగర్ టౌన్ ప్లానింగ్ అధికారిని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ సోమవారం సస్పెండ్ చేశారు. అక్రమ నిర్మాణాలు నియంత్రించలేనందున టౌన్ ప్లానింగ్ అధికారిని సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
తొమ్మిది నెలల్లో ఆరుగురు!
గడిచిన తొమ్మిది నెలల్లో మిజోరాం గవర్నర్లుగా ఆరుగురిగిని మార్చిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ప్రస్తుత గవర్నర్ అజీజ్ ఖురేషిని కూడా తొలిగించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదంతో తెలపడంతో కేంద్రం శనివారం ఖురేషి తొలిగింపు నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో ఫెడరల్ వ్యవస్థలో కీలకమైన గవర్నర్ ల నియామ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం ఇష్టారీతిగా వ్యవహరిస్తోందనే విమర్శలకు బలం చేకూరినట్లయింది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత యూపీయే హయాంలో నియమితులైన గవర్నర్లను వరుసగా తొలిగిస్తుండటంపై ఆగ్రహించిన ఖురేషీ.. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో కొంత ఇరకాటంలోపడ్డ కేంద్రం.. అదనుచూసి ఖురేషీపై వేటు వేసింది. జనవరి తొమ్మిదిన మిజోరాం గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన అజీజ్.. 2017, ఆగస్టు వరకు పదవిలో కొనసాగాల్సి ఉంది. కానీ ఆ అవకాశం ఇవ్వకుండానే కేంద్రం ఆయనను తొలిగించింది.