![Upset At Being Fired Gujarat Man Stabs Boss And Other Two To Death - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/25/stabbing.jpg.webp?itok=iSPKKWRU)
గాంధీనగర్: గుజరాత్‌లోని సూరత్‌లో ఆదివారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పనిలోంచి తీసేశాడనే కోపంతో ఫ్యాక్టరీ యజమాని, ఆయన ఇద్దరు బందువులను దారుణంగా పొడిచి చంపేశారు ఇద్దరు వర్కర్లు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఒకరు మైనర్‌గా గుర్తించామని, వారిని ఇటీవలే పని లోంచి తీసేసినట్లు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కల్పేశ్ ధోలకియాకు సూరత్‌లో వేదాంత టెక్సో పేరిటా ఎంబ్రయిడరీ ఫ్యాక్టరీ ఉంది. 10 రోజుల క్రితం పనిలోంచి తొలగించిన ఇద్దరు కార్మికులు ఆదివారం ఉదయం 9 గంటలకు ధోలకియాను కలిసేందుకు ఫ్యాక్టరీకి వచ్చారు. తమను పనిలోంచి తీసేయడంపై యజమానితో గొడవకు దిగారు. ఈ క్రమంలోనే అందులో ఒకరు కత్తి తీసి ధోలకియాను పొడిచాడు. అక్కడే ఉన్న కల్పేశ్ తండ్రి ధంజిభాయ్, అతడి మామ ఘన్‌శ్యామ్ రజోడియాలు కలుగజేసుకుని వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిని సైతం కత్తులతో పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు నిందితులు.
హుటాహుటిన ముగ్గురిని స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు సూరత్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ హర్షద్ మెహత తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని, వారిలో ఒకరు జువెనైల్‌గా పేర్కొన్నారు. నైట్ డ్యూటీ సమయంలో వారు చేసిన తప్పిదం వల్ల ఇరువురిని పనిలోంచి తీసేసినట్లు గుర్తించామన్నారు. వారికి ఇవ్వాల్సిన జీతం మొత్తం ఇచ్చినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: ‘మా తల తీసేయమన్నా బాగుండేది’.. వర్శిటీల్లో నిషేధంపై అఫ్గాన్ మహిళల ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment