stabbing
-
సిడ్నీ మాల్లో కత్తిపోట్లు.. అయిదుగురు మృతి
ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో గురువారం దారుణం చోటుచేసుకుంది. నగరంలోని బిజీగా ఉంటే ఓ షాపింగ్‌మాల్‌లో కాల్పులు, కత్తిపోట్ల దాడి జరిగింది. వెస్ట్‌ఫీల్డ్ బోండీ జంక్షన్‌లోని మాల్‌లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో అయిదుగురు పౌరులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన స్థానిక సమయం ప్రకారం శనివారం మధ్యాహ్నం 3. 40 గంటలకు(భారత కాలమాన ప్రకారం 12.30PM ) వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు మాల్‌లోకి ప్రవేశించి నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మహిళా పోలీసు జరిపిన కాల్పుల్లో నిందితుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. కత్తిపోట్లకు గురై మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. కత్తిపోట్లు, కాల్పులతో దద్దరిల్లిన ఆ మాల్ నుంచి వందల సంఖ్యలో జనం పరుగులు తీసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. UPDATE: Sydney Terrorist Attack It was an 'ISLAMIC TERROR ATTACK' It's 100% confirm now. Terrorist was Pro - Palestine and Hezbollah. This Jihadi stabbed a 9 month old too. Inhuman cult !! pic.twitter.com/8Enj83dOch — Sunanda Roy 👑 (@SaffronSunanda) April 13, 2024 ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితి భయానకంగానే ఉంది. మాల్లో ఉన్న వారిని అధికారులు బయటకు పంపించారు. అటువైపు ఎవరూ రావొద్దని హెచ్చరించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ వీడియోల్లో ఒక వ్యక్తి పెద్ద కత్తితో మాల్లో తిరగడం కనిపిస్తోంది. గాయపడిన వ్యక్తులు నేలపై పడిపోయారు. వారిలో తల్లీబిడ్డ ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారి రక్తస్రావాన్ని ఆపేందుకు దుకాణంలోని దుస్తుల్ని ఉపయోగించినట్లు చెప్పారు. అయితే దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. Officer's heroic actions at Sydney mall saved lives. Deserves highest honor, like Cross of Valour, for bravery and selflessness. #Sydney #bondi #Australia pic.twitter.com/ycdiQlom4u — Rudra 🔱 (@invincible39) April 13, 2024 -
ఐర్లాండ్ రాజధానిలో చెలరేగిన హింస: ప్రధాని దిగ్భ్రాంతి,కొత్త చట్టాలు
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ సిటీ సెంటర్లో గత రాత్రి (గురువారం, నవంబరు 23) కత్తి పోట్ల ఘటన తీవ్ర అల్లర్లు , భారీ విధ్వంసానికి దారి తీసింది. పాఠశాల వద్ద ఓ వ్యక్తి పొడవాటి కత్తితో విద్యార్థులపై విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు, మహిళ (స్కూల్ కేర్ అసిస్టెంట్) తీవ్రంగా గాయపడ్డారు. ఈఘటన అనంతరం సెంట్రల్ డబ్లిన్ అంతటా హింసాత్మక నిరసన చెలరేగింది. ఈ ఘటన తరువాత దేశంలో మరింత అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని ఐర్లాండ్ పోలీసు చీఫ్ హెచ్చరించారు. శుక్రవారం నాటికి రాజధాని ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఉందని పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 34 మందిని అరెస్టు చేశారు. తీవ్ర ఆగ్రహావేశాలతో పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన నిరసన కారులు బీభత్సం సృష్టించారు. 11 పోలీసు వాహనాలను ధ్వంసం చేయగా, 13 దుకాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పోలీసులతో జరిగిన ఘర్షణలో మరిన్నిదుకాణాలను దుండగులు లూటీ చేశారు. మూడు గంటలకు పైగా జరిగిన అల్లర్లలో మూడు బస్సులు, ఒక రైలు(ట్రామ్‌ను) తగుల బెట్టారు. అనేక మంది పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇలాంటి హింస గతంలో ఎన్నడూ చూడలేదని ఐరిష్ పోలీసు కమీషనర్ డ్రూ హారిస్ వ్యాఖ్యానించారు. మరోవైపు డబ్లిన్ తగులబడిపోతున్నట్టుగా అనిపించిందంటూ స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ప్రధాని దిగ్భ్రాంతి, కొత్త చట్టాలు కత్తిపోట్ల ఘటనపై ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాదాపు 500 మంది అల్లర్లలో పాల్గొన్నారని , వీరంతా జాతికే అవమానం తెచ్చారని మండిపడ్డారు. వీరిపై కఠిన చర్యలు తీసుకునేందుకు త్వరలోనే కొత్తచట్టాలను తీసుకురానున్నట్టు తెలిపారు. We are all shocked by the incident which has taken place in Parnell Square. A number of people have been injured, some of them children. Our thoughts and our prayers go out to them and their families. — Leo Varadkar (@LeoVaradkar) November 23, 2023 50 ఏళ్ల ఐరిష్ పౌరుడిని నిందితుడిగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నాడు. నిరాయుధులను చేసి, పోలీసులు వచ్చే వరకు అతన్ని నేలపై పిన్ చేశారు. అతను ఆసుపత్రిలో మరియు కాపలాగా చికిత్స పొందుతున్నాడు. ఈ దాడికి కారణం ఏంటి అనేదానిపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. JUST IN: Another hotel on fire in Dublin, Ireland… Citizens set fire to the Holiday Inn that is used to house immigrants following the violent stabbing of three children..pic.twitter.com/51Y7Gj4dXC — Chuck Callesto (@ChuckCallesto) November 24, 2023 -
భార్యను 41 సార్లు స్క్రూడ్రైవర్‌తో పొడిచి.. దారుణ హత్య
అంకారా: టర్కీలో దారుణం జరిగింది. హోటల్ గదిలో ఓ బ్రిటీష్ పర్యటకుడు తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. స్క్రూ డ్రైవర్‌తో 41 సార్లు పొడిచి చంపాడు. ఇస్తాంబుల్ సమీపంలోని ఫాతిహ్ మెవ్లనాకపి జిల్లాలో మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. హోటల్ గదిలో అరుపులు వినడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు తీసి చూడగా.. మహిళ మృతదేహం అతి కారాతకంగా పొడిచి ఉంది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఆమె భర్త గది నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. నిందితున్ని ప్రశ్నించగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన భార్యను తనే స్క్రూ డ్రైవర్‌తో హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. అయితే.. తనకు డ్రగ్స్ ఇచ్చినందుకు ఇలా చేశానని పోలీసులకు చెప్పాడు. కానీ గదిలో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించలేదు. నిందితుడు మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 14న బ్రిటన్‌కు చెందిన భార్యభర్త ఇస్తాంబుల్‌కు వచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇదీ చదవండి: అంతరిక్షంలోకి స్నేక్ రోబో.. నాసా ఆవిష్కరణలో భారత మేధస్సు -
షాకింగ్: ఓనర్‌పై కత్తులతో దాడి.. అడ్డొచ్చిన మరో ఇద్దరినీ దారుణంగా..!
గాంధీనగర్: గుజరాత్‌లోని సూరత్‌లో ఆదివారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పనిలోంచి తీసేశాడనే కోపంతో ఫ్యాక్టరీ యజమాని, ఆయన ఇద్దరు బందువులను దారుణంగా పొడిచి చంపేశారు ఇద్దరు వర్కర్లు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఒకరు మైనర్‌గా గుర్తించామని, వారిని ఇటీవలే పని లోంచి తీసేసినట్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కల్పేశ్ ధోలకియాకు సూరత్‌లో వేదాంత టెక్సో పేరిటా ఎంబ్రయిడరీ ఫ్యాక్టరీ ఉంది. 10 రోజుల క్రితం పనిలోంచి తొలగించిన ఇద్దరు కార్మికులు ఆదివారం ఉదయం 9 గంటలకు ధోలకియాను కలిసేందుకు ఫ్యాక్టరీకి వచ్చారు. తమను పనిలోంచి తీసేయడంపై యజమానితో గొడవకు దిగారు. ఈ క్రమంలోనే అందులో ఒకరు కత్తి తీసి ధోలకియాను పొడిచాడు. అక్కడే ఉన్న కల్పేశ్ తండ్రి ధంజిభాయ్, అతడి మామ ఘన్‌శ్యామ్ రజోడియాలు కలుగజేసుకుని వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిని సైతం కత్తులతో పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు నిందితులు. హుటాహుటిన ముగ్గురిని స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు సూరత్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ హర్షద్ మెహత తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని, వారిలో ఒకరు జువెనైల్‌గా పేర్కొన్నారు. నైట్ డ్యూటీ సమయంలో వారు చేసిన తప్పిదం వల్ల ఇరువురిని పనిలోంచి తీసేసినట్లు గుర్తించామన్నారు. వారికి ఇవ్వాల్సిన జీతం మొత్తం ఇచ్చినట్లు చెప్పారు. ఇదీ చదవండి: ‘మా తల తీసేయమన్నా బాగుండేది’.. వర్శిటీల్లో నిషేధంపై అఫ్గాన్ మహిళల ఆవేదన -
షాకింగ్ ఘటన: కన్నకొడుకే కాలయముడిలా కుటుంబ సభ్యులందర్నీ...
న్యూఢిల్లీ: ఒక యువకుడు కుటుంబ సభ్యులందర్నీ హతమార్చాడు. ఈ షాకింగ్ ఘటన దక్షిణ ఢిల్లీలోని పాలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం...25 ఏళ్ల కేశవ్ గత రాత్రి కుటుంబ సభ్యులందర్నీగొంతు కోసి చంపేసినట్లు తెలిపారు. ఒక పదునైన ఆయుధంతో పలుమార్లు దాడి చేసి హతమార్చాడని వెల్లడించారు. మృతులు కేశవ్ నానామ్మ దేవనా దేవి(75), తండ్రి దినేష్(50), తల్లి దర్శన, కూతురు ఊర్వశిగా గుర్తించారు. వారందరూ వేర్వేరు గదుల్లో విగత జీవులుగా పడి ఉన్నారు. కేశవ్ తల్లిదండ్రులిద్దరు బాత్రుంలోనూ, చెల్లెలు, నానమ్మ వేర్వేరు గదుల్లో అతడి చేతిలో హత్యకు గురయ్యారని పోలీసులు చెప్పారు. గుర్గాన్లో ఉద్యోగం చేస్తున్న కేశవ్ ఒక నెలక్రితమే తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడని, దీపావళి నుంచే ఇంట్లో ఉంటున్నాడని చెప్పారు. అతను డ్రగ్స్‌కు బానిసై ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెప్పారు. నిందితుడు గత రాత్రి సుమారు 10.30 గం.ల ప్రాంతంలో ఈ ఘటనకు ఒడిగట్టినట్లు చెప్పారు. అదే ఇంటిలో ఉంటున్న పక్కింటి వాళ్లి, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఐతే ఇంతలో కేశవ్ తప్పించుకునేందుకు పథకం వేస్తుండగా అతని బంధువులు అడ్డకోవడంతో తాము అతన్న అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. (చదవండి: చంపి ముక్కలుగా నరికేస్తానని అఫ్తాబ్ బెదిరించాడు.. వెలుగులోకి 2020 నాటి ఫిర్యాదు) -
Crime News: ప్రేమించాలంటూ వెంటపడి మరీ..
మైసూరు: తన ప్రేమను నిరాకరించిందని ఓ కిరాతకుడు ఆమెను కత్తితో పొడిచి హత్యాయత్నం చేసిన ఘటన మైసూరు నగరంలోని హెబ్బాల భారత్ క్యాన్సర్ ఆస్పత్రిలో ఆవరణంలో చోటుచేసుకుంది. చామరాజనగర జిల్లా యలందూరుకు చెందిన నంజుండ స్వామి నిందితుడు. వివరాలు.. నర్సు, నంజుండస్వామి ఇదే ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నంజుండస్వామి తనను ప్రేమించాలని నర్సుపై తరచూ ఒత్తిడి తెచ్చేవాడు. ఆమె వ్యతిరేకించింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం విధుల్లో ఉండగా నంజుండస్వామి చాకుతో గొంతుపై పొడిచాడు. బాధితురాలిని హుటాహుటిన చికిత్సకు తరలించారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. (చదవండి: కాల్’ చేశాడు కటకటాల్లోకి చేరాడు! ) -
దారుణం: సోదరిపై వేధింపులను ప్రశ్నించాడని కత్తులతో పొడిచి చంపేశారు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. తన సోదరిపై వేధింపులకు పాల్పడటాన్ని ప్రశ్నించినందుకు ఓ 17 ఏళ్ల బాలుడిని దారుణంగా పొడించి చంపేశారు ఇద్దరు మైనర్లు. శుక్రవారం జరిగిన ఈ దారుణ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో నమోదైంది. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బాధితుడు పటేల్ నగర్‌కు చెందిన బాలుడిగా గుర్తించారు. వీడియో ప్రకారం.. ఓ గల్లీలో ముగ్గురు మైనర్లు గొడవ పడుతున్నారు. అందులో ఒకడు బాధితుడిని కత్తితో పలు మార్లు పొడిచాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. శరీరంలో దిగిన కత్తితో బాధితుడు పడిపోతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రాణాలు కోల్పోయే ముందు తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసేందుకు ప్రయత్నించినట్ల తెలుస్తోంది. కంప్యూటర్ క్లాస్‌కు వెళ్లి తిరిగి వచ్చిన క్రమంలో ఇంటివద్దే దాడి చేసి చంపేసినట్లు పోలీసులు తెలిపారు. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారని చెప్పారు. కేసు నమోదు చేసుకుని నిందితులైన ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. #Video: #Delhi Teen Stabbed To #Death After He Protested Sister's #Harassment. @DelhiPolice #PatelNagar #viral #murder #CCTV #news #UnMuteIndia #crime Subscribe to our YouTube page: https://t.co/EKkVQVGoS5 pic.twitter.com/sz4Q5XU8jD — UnMuteINDIA (@LetsUnMuteIndia) October 29, 2022 ఇదీ చదవండి: ఎంత ఘాటు ప్రేమయో.. ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు స్టూడెంట్స్.. చివరకు.. -
అమానుషం.. కత్తులతో పొడిచి చంపుతుంటే వేడుక చూశారు!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరం నడిబొడ్డున దారుణ ఘటన వెలుగు చూసింది. శనివారం సాయంత్రం సుందర్ నగరి ప్రాంతంలో ఓ యువకుడిని ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. సాయంత్రం 7.40 గంటల సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కత్తి పోట్లతో తీవ్ర రక్తస్రావమై మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ దారుణానికి పాల్పడుతున్న సమయంలో ఆ పక్కనే పలువురు వ్యక్తులు ఉన్నా.. చీమకుట్టినట్లు కూడా స్పందించకపోవటం గమనార్హం. బాధితుడు సుందర్ నగరికి చెందిన మనీశ్‌గా గుర్తించారు. పాత పగలతోనే యువకుడిని హత్య చేసి ఉంటారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో భారీగా బలగాలను మోహరించారు. ముగ్గురు రాక్షసులు కత్తులతో దారుణంగా పొడుస్తున్న దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ముందు బాధితుడితో పాటు నిందితులు మాట్లాడుతూ వచ్చారు. ఆ కొద్ది సేపటికే అతడిపై దాడి చేసేందుకు యత్నించగా పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ, ముగ్గురు ఉండటంతో వారి నుంచి తప్పించుకోలేకపోయాడు. పథకం ప్రకారం కత్తులతో వచ్చిన దుండగులు.. విచక్షణారహితంగా ఇష్టం వచ్చినట్లు పొడిచారు. కింద పడిపోయిన తర్వాత కూడా.. వెనక్కి తిరిగి వచ్చి మరీ పొడుస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ పక్కనే కొంత మంది కూర్చుని ఉన్నారు. ఒక వ్యాక్తిని దారుణంగా హత్య చేస్తున్నా.. వారిలో కొంచెం కూడా చలనం కలగలేదు. అలాగే.. చూస్తూ ఉండిపోయారు. ఈ పరిస్థితిని చూసిన పలువురు నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. మనిషన్నవాడు కనుమరుగవుతున్నాడని వాపోతున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు అలామ్, బిలాల్, ఫైజాన్‌లు సుందర్ నగరికి చెందినవారిగా గుర్తించామని, అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. A youth named Manish was stabbed to death in Sunder Nagri area of Delhi, 3 accused (Aalam, Bilal and Faizan) arrested by Delhi Police. pic.twitter.com/b6OS7v1s0k — Nikhil Choudhary (@NikhilCh_) October 1, 2022 ఇదీ చదవండి: ఫుట్‌బాల్ మైదానంలో తొక్కిసలాట.. 127 మంది దుర్మరణం -
షాకింగ్ ఘటన.. టెన్త్ విద్యార్థిని కత్తితో పొడిచి చంపిన క్లాస్మేట్స్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పదో తరగతి చదువుతోన్న 17 ఏళ్ల బాలుడిని ఐదుగురు తోటి విద్యార్థులు దారుణంగా పొడిచి హత్య చేశారు. క్లాస్మేట్స్ దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని.. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాధిత విద్యార్థి దీపాన్షుగా గుర్తించారు. విద్యార్థి హత్యపై వివరాలు వెల్లడించారు డిప్యూటీ కమిషనర్(వాయవ్య) ఉషా రంగ్నాని. పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 29న ఆదర్శ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు విద్యార్థిని కొంత మంది విద్యార్థులు కత్తులతో పొడిచినట్లు ఫోన్ వచ్చింది. ఆ వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకుని ఐపీసీ సెక్షన్ 302, 307, 34 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐదుగురు నిందితులతో బాధితుడు గొడవ పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆ పగతో దీపాన్షును బటన్ నైఫ్‌తో పొడిచి హత్య చేశారు. ఆ ఆయుధాన్ని ఆన్లైన్లో కొనుగోలు చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు. లాల్ బాఘ్, ఆజాద్‌పుర్ ప్రాంతాలకు చెందిన ఐదుగురు జువైనల్‌లను ఘటన జరిగిన రెండు గంటల్లోనే అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఇదీ చదవండి: 42 కార్లతో పంజాబ్ సీఎం కాన్వాయ్.. ‘వీఐపీ కల్చర్’ అంటూ విమర్శలు! -
‘థ్యాంక్ యూ’ చెప్పలేదని పొడిచి చంపాడు..!
వాషింగ్టన్: చిన్న చిన్న గొడవలకే కొందరు సహనం కోల్పోతున్నారు. ఎదుటివారిపై దాడి చేసి వారి ప్రాణాలు పోయేందుకు కారణమవుతున్నారు. అలాంటి సంఘటనే అమెరికాలోని బ్రూక్లిన్‌లో వెలుగు చూసింది. ‘థ్యాంక్ యూ’ చెప్పలేదని మొదలైన వాగ్వాదం.. చిలికి చిలికి గాలివానగా మారి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయేందుకు దారి తీసింది. 37 ఏళ్ల వ్యక్తిని మరో వ్యక్తి కత్తితో పొడవటంతో తీవ్ర గాయాలై మృతి చెందాడు. పార్క్ స్లోప్‌లోని 4వ అవెన్యూ భవనం స్మోకింగ్ దుకాణం వద్ద ఈ గొడవ జరిగింది. ఈ సంఘటన స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదైంది. తెల్ల రంగు టీషర్ట్ ధరించిన బాధితుడు లోపలికి రాగా.. మరో వ్యక్తి డోర్ తెరిచాడు. అయితే, డోర్ తెరిచినందుకు కృతజ్ఞతలు తెలపకపోవటంపై లోపలి వ్యక్తి ప్రశ్నించాడు. దాంతో తాను తెరవాలని కోరలేదని, థ్యాంక్ యూ చెప్పనని స్పష్టం చేశాడు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి కొట్టుకునే వరకు వెళ్లింది. బయటకు వెళ్లిన నిందితుడు తన సైకిల్ పై ఉన్న కత్తిని తీసుకొచ్చి బెదిరించాడు. బాధితుడు వెనక్కి తగ్గకుండా రెచ్చగొట్టగా.. పొట్ట, మెడ భాగంలో కత్తితో దాడి చేశాడు నిందితుడు. తీవ్రంగా రక్తస్రావమైంది. న్యూయార్క్ ప్రెస్బిటేరియన్ బ్రూక్లిన్ మెథొడిస్ట్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇదీ చదవండి: టిక్‌టాక్ ప్రేమ.. భర్తకు ప్రియురాలితో పెళ్లి చేసిన భార్య -
కత్తులతో మారణకాండ.. 10మంది మృతి.. 15మందికి గాయాలు
ఒట్టావా: కెనడాలో ఇద్దరు దుండగులు కత్తులలో రెచ్చిపోయారు. సంప్రదాయ తెగలు నివసించే ప్రాంతాలే లక్ష్యంగా విచక్షణా రహితంగా దాడులకు తెగబడ్డారు. కన్పించిన వారినళ్లా పొడుచుకుంటూ వెళ్లారు. మొత్తం రెండు ప్రాంతాల్లో 13 చోట్ల విధ్వంసం సృష్టించారు. ఈ మారణకాండలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. కెనడా చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి దారుణ ఘటన జరగలేదు. అమెరికాలో మాత్రమే తరచూ మాస్ షూటింగ్‌లు, హత్యలు జరగుతుంటాయి. ఈ ఘటనపై కెనడా ప్రధాని ట్రుడో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన హృదయం ముక్కలైందని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు ఇద్దరు నిందుతులు డెమియన్ సాండర్సన్(31), మైల్స్ సాండర్సన్(30) కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. వీరి ఫోటోలను కూడా విడుల చేశారు. అయితే నిందితులు ఏ కారణంతో దాడి చేసి ఉంటారనే విషయం మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు. మృతులంతా జేమ్స్ స్మిత్ క్రీ నేషన్, వెల్డన్ గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. జేమ్స్ స్మిత్ క్రీ నేషన్‌లో 3,400 మంది మాత్రమే నివసిస్తారు. వ్యవసాయం, వేట, చేపలు పట్టడమే వీరి వృత్తి. వెల్డన్‌లో 200మంది మాత్రమే జీవిస్తారు. ఈ ప్రాంతాల్లో ఎవరినో లక్ష్యంగా చేసుకునే దుండృగులు ఈ కిరాతక చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి దీనిపై మరిన్ని వివరాలు వెల్లడించలేమని పేర్కొన్నారు. చదవండి: మనం మళ్లీ పిల్లల్లా మారిపోతే! శాస్త్రవేత్తల అధునాతన ప్రయోగం -
Live Video: మున్సిపల్ ఆఫీస్ ముందే యువకుడి దారుణ హత్య
భోపాల్: పాత పగలతో హక్కుల పోరాట విభాగం కర్ణీ సేనాకు చెందిన 28 ఏళ్ల యువకుడిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. అంతా చూస్తుండగానే కత్తులతో పలుమార్లు పొడిచారు. ఈ సంఘటన గత శుక్రవారం రాత్రి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగింది. ఇటార్సిలోని కర్ణీ సేనా టౌన్ సెక్రెటరీ రోహిత్ సింగ్ రాజ్‌పుత్‌ను.. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం ముందే ముగ్గురు దారుణంగా పొడిచారు. రోహిత్‌ను కాపాడేందుకు యత్నించిన ఆయన స్నేహితుడు సచిన్ పటేల్‌పైనా కత్తులతో దాడి చేశారు. రక్తపు మడుగులో పడివున్న ఇరువురిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే రాజ్‌పుత్ ప్రాణాలు కోల్పోగా.. పటేల్ పరిస్థతి విషమంగా ఉంది. పాత పగలతోనే రోహిత్ సింగ్ రాజ్‌పుత్‌ను హత్య చేసినట్లు ఇటార్సి పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ ఆర్ఎస్ చౌహాన్ తెలిపారు. ప్రధాన నిందితుడు 27 ఏళ్ల రాను అలియాస్ రాహుల్‌గా చెప్పారు. ‘బాధితుడు, అతడి స్నేహితుడు మార్కెట్లోని ఓ టీ షాప్ ముందు నిలుచుని ఉన్నారు. బైక్‌లపై ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. వారితో గొడవకు దిగారు. ఈ క్రమంలోనే అందులోని ఓ వ్యక్తి కత్తి తీసి రాజ్‌పుత్‌పై దాడి చేశాడు. ముగ్గురు నిందితులు రాహుల్ రాజ్‌పుత్, అంకిత్ భట్, ఐషు మాలవియాలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచాం.’ అని తెలిపారు ఎస్సై. కర్ణీ సేన సభ్యుడి హత్య నేపథ్యంలో నిందితుల్లో ఒకడైన అంకిత్ భట్ నివాసాన్ని అధికారులు కూల్చేసినట్లు స్థానికులు తెలిపారు. మిగిలిన ఇద్దరి ఇళ్లను సైతం కూల్చేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలిసింది. అదే ప్రాంతంలో ఐదు రోజుల క్రితం ఓ బ్యాంకు ఉద్యోగిపై ఐదుగురు దుండగులు దాడి చేశారు. దీనిపై మాజీ స్పీకర్, బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ సితాశరన్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. A 28-year-old member Karni Sena was publicly stabbed to death on Friday night in Itarsi allegedly over an old dispute. His friend, Sachin Patel, was also stabbed when he tried to save him. @ndtv @ndtvindia pic.twitter.com/MR0PYkI5ss — Anurag Dwary (@Anurag_Dwary) September 4, 2022 ఇదీ చదవండి: ఎంత పని చేశావు తల్లీ! తన కొడుకుకంటే ఎక్కువ మార్కులు వచ్చాయని.. -
అయ్యో పాపం.. రోటీ ఇవ్వలేదని కత్తితో పొడిచి చంపేశాడు
న్యూఢిల్లీ: తినేందుకు రోటీ ఇవ్వలేదనే కోపంతో ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన సంఘటన ఢిల్లీలో కలకలం సృష్టించింది. కరోల్ బాఘ్ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. ‘రిక్షాలో ఇద్దరు వ్యక్తులు భోజనం చేస్తున్నారు. ఫూటుగా మద్యం తాగిన మరో వ్యక్తి అక్కడికి వచ్చాడు. తనకు భోజనం పెట్టాలని అడిగాడు. 40 ఏళ్ల మున్నా అనే వ్యక్తి రోటీ ఇచ్చాడు. మరో రోటీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అందుకు మున్నా నిరాకరించాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తన వద్ద ఉన్న కత్తిని తీసి మున్నాను పొడిచాడు.’ అని డిప్యూటీ కమిషనర్ శ్వేతా చౌహాన్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు మున్నాను ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితుడు ఆగ్రాకు చెందిన 26 ఏళ్ల ఫెరోజ్ ఖాన్‌గా గుర్తించారు. కరోల్ బాఘ్‌లోని ఓ పార్క్‌లో నిద్రిస్తున్న ఖాన్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: ‘గూగుల్’లో జాబ్ కొట్టటమే లక్ష్యం.. 40వ యత్నంలో సఫలం! -
హారన్ కొడితే తప్పుకోలేదని.. బధిరుడిని కత్తితో పొడిచి చంపిన బాలిక
రాయ్‌పూర్: పదేపదే హారన్ కొట్టినా తన స్కూటీకి దారివ్వలేదని ఆగ్రహించిన ఓ బాలిక సైకిల్‌పై వెళ్తున్న బధిరుడిని కత్తితో పొడిచి చంపేసింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్‌లోని కంకాలిపార ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. బాలికను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ బాలిక(15) తన తల్లిని తీసుకుని స్కూటీపై వెళుతోంది. సైకిల్ తొక్కుకుంటూ ముందు వెళ్తున్న సదామా లదేర్(40) అడ్డురావడంతో హారన్ కొట్టింది. బధిరుడైన సుదామ హారన్ వినిపించక పక్కకు తప్పుకోలేదు. హారన్ ఎన్నిసార్లు మోగించినా నిర్లక్ష్యంగా వెళ్తున్నాడనే కోపంతో బాలిక స్కూటీని ఆపి, అతడిపై కేకలు వేసింది. ఆపైన తన వద్ద ఉన్న చాకుతో అతడి మెడపై పొడిచింది. అనంతరం తల్లిని అక్కడే వదిలేసి స్కూటీతో పరారైంది. తీవ్ర రక్తస్రావమైన సుదామ ఆస్పత్రికి వెళ్లేలోగానేతీసుకెళ్తుండగానే చనిపోయాడు. ఇదీ చదవండి: జ్యూస్‌లో మత్తు మందు కలిపి అత్యాచారం -
జీన్స్ వేసుకోవద్దన్నాడని... భర్తనే కడతేర్చిన మహిళ
ఇటీవల కాలంలో చాలాచిన్న చిన్న విషయాలే ఘోర తప్పిదాలుగా కనిపిస్తున్నాయి. సామరస్య పూర్వకంగా మాట్లాడుకుని పరిష్కారించుకునే దిశగా ఆలోచించడం మాని ప్రాణాలు తీసుకునేంత కోపాలు తెచ్చుకుంటున్నారు. చివరికి ఇరు జీవితాలను నాశనం చేసుకుని కుటుంబికులకు తీరని విషాదాన్ని మిగుల్చుతున్నారు. అచ్చం అలానే ఇక్కడొక మహిళ ఘోరమైన దారుణానికి ఒడిగట్టింది. వివరాల్లోకెళ్తే...జార్ఘండ్‌కి చెందిన ఒక జంట గోపాల్పూర్ గ్రామంలో జరిగే జాతర చూసేందుకు వెళ్లింది. ఐతే ఆ జాతర చూసి ఇంటికి తిరిగి వచ్చాక భార్యభర్తలిద్దరూ తీవ్ర స్థాయిలో గొడవపడ్డారు. ఇంతకీ ఆ దపంతులకు గొడవకు కారణం జీన్స్ వస్తధారణ. ఆమె జీన్స్ ధరించి జాతరకు వచ్చిందని ఆమెను దూషించడం మొదలు పెట్టాడు భర్త. అయినా పెళ్లి తర్వాత మహిళలు జీన్స్ ధరించకూడదంటూ భార్యతో తీవ్ర స్థాయిలో గొడవపడ్డాడు. భర్త తీరుకి కోపంతో ఊగిపోయిన అతడి భార్య కత్తి తీసుకుని అతని పై దాడి చేసింది. దీంతో వెంటనే అతడి కుటుంబసభ్యులు హుటాహటినా ఆస్పత్రికి తరలించారు. అయితే బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు బాధితుడి తండ్రి కర్ణేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. జీన్స్ విషయంలో కొడుకు కోడలు మధ్య వాగ్వాదం వచ్చిందని, ఆ కోపంలోనే తన కోడలు కొడుకుని చంపేసిందని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: జస్టిస్ ఫర్ శ్రీమతి: టీచర్లు హరిప్రియ, కృతిక అరెస్ట్) -
జరిమానా విధించినందుకు ఎస్ఐ గొంతు కోశాడు.. సీఎం పరామర్శ
సాక్షి, చెన్నై: మద్యం మత్తులో వాహనం నడిపిన తనకు దేహశుద్ధి చేయడమే కాకుండా జరిమానా విధించిన మహిళా ఎస్ఐపై వాహనదారుడు కక్ష కట్టాడు. భద్రతా విధులలో ఉన్న ఆమెను వెంటాడాడు. పథకం ప్రకారం గొంతు కోసి తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులకు చిక్కాడు. వివరాలు.. తిరునల్వేలి జిల్లా సుత్తమల్లి పోలీస్ స్టేషన్లో మార్గెడ్ థెరిసా మహిళా యువ ఎస్ఐగా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి పలవూరు గ్రామంలో జరిగిన ఆలయ ఉత్సవాల భద్రతకు ఆమె వెళ్లారు. రాత్రి సమయంలో విధుల్లో ఉన్న ఆమెపై ఓ వ్యక్తి దాడి చేశాడు. కత్తితో గొంతు కొసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. స్థానికులు, విధుల్లో ఉన్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ థెరిసాను ఆస్పత్రికి తరలించారు. ఆమెకు తిరునల్వేలిలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అందుకే కక్ష కట్టాడు.. నిందితుడిని సత్తుమల్లికి చెందిన ఆర్ముగంగా గుర్తించారు. గత నెల మద్యంమత్తులో వాహనం నడి పి పోలీసులకు ఆర్ముగం పట్టుబడ్డాడు. మత్తులో మహిళా పోలీసులతో అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని గుర్తించిన ఎస్ఐ థెరిసా అతడికి దేహశుద్ధి చేశారు. జరిమానా విధించి వదిలి పెట్టారు. దీంతో కక్ష కట్టిన ఇతగాడు ఆమెను మట్టుబెట్టేందుకు పథకం వేశాడు. చివరికి ఆలయ ఉత్సవాల్లో గొంతు కోసి తప్పించుకునే క్రమంలో పోలీసులకు చిక్కాడు. దీంతో అతడిపై రెండు సెక్షన్లతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీఎం ఎంకే స్టాలిన్ ఎస్ఐ థెరిసాను ఫోన్ ద్వారా పరామర్శించారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియోను ప్రకటించారు. కాగా, ఈ ఘటనపై అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో– కన్వీనర్ పళనిస్వామి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో గవర్నర్‌కే కాదు, సాధారణ ఎస్ఐకు కూడా భద్రత కరువైందని ధ్వజమెత్తారు. చదవండి: (Preethi Manoj: రెండువారాలు మృత్యుపోరాటం) -
London: హైదరాబాద్ వాలా రెస్టారెంట్లో ఎన్నారై యువతిపై కత్తితో దాడి
లండన్‌లో దారుణం చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి పార్ట్‌టైం జాబ్ చేస్తున్న యువతిపై ఓ దుర్మార్గుడు కత్తితో దాడి చేశాడు. విచక్షణా రహితంగా పొడవడంతో ఆ యువతి తీవ్రంగా గాయాలపాలైంది. విషమ పరిస్థితుల మధ్యల లండన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కేరళాకు చెందిన సోనాబిజు (22) అనే యువతి మాస్టర్స్ చదివేందుకు గత నెల లండన్ చేరుకుంది. యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్‌లో చదువుతోంది. అక్కడే ఉన్న హైదరాబాద్ వాలా రెస్టారెంట్లో వెయిట్రస్‌గా పార్ట్‌టైం జాబ్ చేస్తోంది. కాగా 2022 మార్చి 25న ఆమెపై దాడి జరిగింది. మధ్యాహ్నం 2:20 సమయంలో ఆర్డర్ తీసుకునేందుకు ఓ టేబుల్ దగ్గరికి వెళ్లగా.. అక్కడ కూర్చున్న వ్యక్తి ఒక్కసారిగా ఆమె మీదకు వచ్చాడు. దగ్గరగా పట్టుకుని కత్తితో పొడవడం ప్రారంభించారు. అడ్డుకునేందుకు అక్కడున్న సిబ్బంది, ఇతర కస్టమర్లు ప్రయత్నించగా వారిని సైతం బెదిరించాడు. ఆ తర్వాత విచక్షణా రహితంగా ఆమె మీద దాడి చేసి అక్కడి నుంచి పరార్ అయ్యాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గాయపడిన యువతిని వెంటనే ఆస్పత్రికి తరలించగా దాడికి పాల్పడింది కూడా ఇండియన్‌గానే తేలింది. హైదరాబాద్‌కి చెందిన శ్రీరామ్ అంబర్ల (23) అనే వ్యక్తి ఈ దాడి చేసినట్టుగా గుర్తించిన లండన్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. థేమ్స్ మెజిస్ట్రేట్ కోర్టులో అతడిని హాజరుపరచగా ఏప్రిల్ 25 వరకు రిమాండ్ విధించారు. కేసు దర్యప్తు సాగుతోంది. మార్చి 19న బ్రిటీష్ ఇండియన్ సబితా (19) యువతిపై జరిగిన కత్తి దాడి ఘటన మరువకముందే లండన్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. -
24 ఏళ్లుగా అన్న కోసం గాలింపు.. చివరికి అతడి చేతిలోనే
రోమ్: ఇద్దరు అన్నదమ్ములు బాల్యం నుంచి చాలా అన్యోన్యంగా ఉండేవారు. తండ్రి మరణం తర్వాత అన్న ఇంటి నుంచి పారిపోయాడు. పోలీసు కంప్లైంట్ ఇచ్చారు.. టీవీ, పేపర్లో ప్రకటనలు ఇచ్చారు. అయినా ఫలితం లేదు. దాదాపు 24 ఏళ్లుగా సోదరుడి కోసం గాలిస్తూనే ఉన్నాడు తమ్ముడు. ఈ క్రమంలో ఓ దారుణం చోటు చేసుకుంది. ఏ అన్న కోసమైతే ఇంతలా గాలిస్తున్నాడో.. అతడే ఓ రోజు ఇంటికి వచ్చి.. తమ్ముడిపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు తమ్ముడు. ఈ సంఘటన ఇటలీలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. ఇటలీకి చెందిన మార్టిన్ రాబన్సర్ (35), ఐవో (42) ఇద్దరు సోదరులు. ఈ క్రమంలో 1997లో వీరి తండ్రి మరణించాడు. ఆ బాధ తట్టుకోలేపోయిన ఐవో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీవీలో, పేపర్లో ప్రకటనలు ఇచ్చారు. కానీ ఫలితం శూన్యం. కానీ మార్టిన్ మాత్రం పట్టువదలకుండా సోదరుడి కోసం గాలిస్తూనే ఉన్నాడు. (చదవండి: ఎయిర్ హోస్టెస్‌ల అర్థనగ్న నిరసనలు.. కారణం అదేనట..!) మార్టిన్ సోదరుడి కోసం వెతుకుతుండగా.. మరో వైపు ఐవో ఇందుకు భిన్నంగా ఉన్నాడు. ఇరుగు పొరుగు వాళ్లు అన్న మాటలు తట్టుకోలేక తన తండ్రి చనిపోయాడని.. కుటుంబ సభ్యులు కూడా బయటి వారికే మద్దతిచ్చారని అనుకోసాగాడు. ఈ క్రమంలో తమ్ముడి మీద పగ పెంచుకున్నాడు. ఎలాగైనా అతడి మీద ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. ఈ క్రమంలో ఓ రోజు తెల్లవారుజామున సోదరుడి ఇంటికి వచ్చాడు. వెంట కత్తి కూడా తెచ్చుకున్నాడు. ఇక నిద్రిస్తున్న మార్టిన్‌ని లేపి మరి కత్తితో దారుణంగా పొడిచి పారిపోయాడు. చావుబతుకుల్లో ఉన్న మార్టిన్‌ను అతడి భార్య ఆస్ప్రతిలో చేర్పించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఐవో కోసం గాలిస్తున్నారు. (చదవండి: మాజీ పోర్న్ స్టార్ అరెస్ట్.. కొడుకును హత్య చేసిందని ఆరోపణలు) ఇక ఇంటి నుంచి వెళ్లిపోయిన ఐవో పేవ్మెంట్ మీద నిద్రిస్తూ.. పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కాలం వెళ్లదీసినట్లు పోలీసులు తెలిపారు. ఖాళీ సమయమంతా లైబ్రరీలో గడిపేవాడన్నారు. ఇక మార్టిన్‌ను హత్య చేయాలని భావించిన ఐవో కొన్ని నెలల క్రితమే తమ్ముడు ఉంటున్న నగరానికి వచ్చాడని.. మార్టిన్‌ను కదలికలను గమనిస్తున్నాడని పోలీసులు తెలిపారు. చదవండి: నా భార్య బాధ తట్టుకోలేకపోతున్నా.. నన్ను జైల్లో పడేయండి! -
26 కత్తి పోట్లు: ‘దగ్గరకు వచ్చారో మీకు ఇదే గతి’
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పట్టపగలు దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ వ్యక్తి భార్యపై అమానుషంగా కత్తితో దాడి చేసి చంపేశాడు. కాపాడ్డానికి ప్రయత్నించిన వారిని దగ్గరకు రావద్దు.. వస్తే మీకు ఇదే గతి పడుతుంది అంటూ హెచ్చరించాడు. దాంతో జనాలు చూస్తూ నిలబడి పోయారు. ఆ వివరాలు. ఢిల్లీకి చెందిన హరీశ్, భార్యతో కలిసి బుధ్ విహార్ ప్రాంతంలో మ్యారేజీ బ్యూరో నిర్వహిస్తూ ఉండేవాడు. అయితే గత కొద్ది రోజులుగా అతడు భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించసాగాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం భార్యభర్తల మధ్య దీనికి సంబంధించి వివాదం రాజుకుంది. అది కాస్త ముదరడంతో ఆగ్రహంతో ఊగిపోయిన హరీశ్.. భార్యపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. భర్త నుంచి తప్పించుకోవడం కోసం ఆమె ఇంటి నుంచి బయటకు పరిగెత్తింది. ఆమెను వెంబడించిన హరీశ్.. నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే.. ఆమెపై కత్తితో దాడి చేశాడు. సుమారు 26 సార్లు భార్యను కత్తితో పొడిచాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. దాంతో హరీశ్ ‘‘దగ్గరకు రావద్దు.. వస్తే మీకు ఇదే గతి పడుతుందని’’ హెచ్చరిస్తూ.. తన దుశ్చర్యను కొనసాగించాడు. భార్య మరణించిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హరీశ్‌పై కేసు నమోదు చేశారు. చదవండి: దారుణం: భార్యను పొడిచి, ఆపై కారుతో... -
ఆవును కత్తితో పొడిచి చంపిన పండ్ల వ్యాపారి
ముంబై : పండు తిన్నదన్న కారణంతో ఓ వ్యక్తి ఆవును చంపిన దారణ ఘటన మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తౌఫిక్ బషీర్ ముజావర్ అనే వ్యక్తి రాయ్‌గడ్‌లోని మురుద్ ప్రాంతంలో పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. అయితే తన దుకాణం నుంచి ఆవు బొప్పాయి పండును దొంగలించి తిన్నదన్న కోపంతో ఆవుపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆవు పొత్తి కడుపులో కత్తితో కిరాతకంగా పొడిచి చంపాడు. దీన్ని గమనించిన ఓ బాటసారి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న ఆవును వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే ఆవు చనిపోయింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై జంతు నిరోధక చట్టం కింద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనపై హిందుత్వ సంఘాలు, పలువురు బీజేపీ నాయకులు మండిపడుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చదవండి : ( రేండేళ్లుగా ప్రియురాలపై అత్యాచారం: ప్రియుడి అరెస్టు) (ప్రియుడి దొంగతనం.. ప్రేమికుల అరెస్టు) -
దారుణం: భార్యను పొడిచి, ఆపై కారుతో...
వాషింగ్టన్: కేరళకు చెందిన మెరిన్ (26)అనే యువతి అమెరికాలో మంగళవారం దారుణ హత్యకు గురయ్యింది. మెరిన్ ఒక హాస్పటల్లో నర్సుగా విధులు నిర్వర్తిస్తుంది. ఆమె మంగళవారం ఆసుపత్రిలో విధులు ముగించుకొని వెళుతుండగా ఆమె భర్త ఫిలిప్ మ్యాథ్యు (34) వెనుక నుంచి వచ్చి ఆమెను కత్తితో అనేకసార్లు పొడిచాడు. అంతే కాకుండా రోడ్డుపై పడిపోయిన ఆమె మీద నుంచి కారును పోనిచ్చాడు. మెరిన్‌ను ఆసుపత్రిలో చేర్పించగా అప్పటికే ఆమె చనిపోయింది. నిందుతుడి కోసం పోలీసులు గాలించగా అప్పటికే అతను తనకు తాను గాయాలు చేసుకొని హాస్పటల్లో చేరాడు. మెరిన్, మాథ్యులకు ఒక పిల్లాడు ఉన్నాడు. స్థానికంగా వారు కేరళకు చెందిన వారు. బాబును కేరళలోనే వదిలేయాలని మ్యాథ్యు, మెరిన్తో గొడవపడ్డాడు. దీంతో ఆమె బాబును వదిలేసి భర్తతో కలిసి అమెరికాకు వెళ్లింది. అక్కడ కూడా వారిద్దరికి గొడవలు అయ్యాయి. తరువాత మెరిన్ 2018లో నర్సుగా ఆసుపత్రిలో చేరింది. కుటుంబ కలహాలు ముదరడంతో మ్యాథ్యు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: భార్యను హతమార్చి.. ఆత్మహత్యగా -
అల్లరి చేయొద్దన్నందుకు.. ఇంట్లోకి దూరి హత్య
సాక్షి, మైలార్‌దేవ్‌పల్లి: అల్లరి చేయొద్దని వారించిన యువకుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అనంతరం భయాందోళనతో పరుగులు తీయగా ఇంట్లోకి చొరబడి కత్తిపోట్లు పొడవడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మృతుడి కుటుంబీకులు, సీఐ సత్తయ్యగౌడ్ కథనం ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధి రోషన్ కాలనీలో మహ్మద్ అబ్దుల్ ముజీబ్(28), అజర్ నివాసముంటున్నారు. ముజీబ్ క్యాబ్ డ్రైవింగ్ చేస్తూ స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. పలు ఠాణాల్లో కేసులు నమోదైన అజర్(26) ఇతరులతో గొడవలు పడుతూ ఖాళీగా తిరుగుతుండేవాడు. ముజీబ్(ఫైల్); యువకుడి మృతదేహం కొంతకాలంగా ముజీబ్ ఇంటి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి వద్ద అజర్ తన స్నేహితులతో కలిసి అర్ధరాత్రి వరకు మద్యం తాగుతూ అల్లరి చేస్తున్నాడు. ఈనేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి అదేవిధంగా జరిగింది. దీంతో అల్లరి చేయొద్దని ముజీబ్ అజర్‌ను వారించాడు. తనకు చెప్పడానికి నీవెవరు అంటూ ఆగ్రహానికి గురైన అతడు ముజీబ్‌పై కత్తితో దాడి చేశాడు. దీంతో భయాందోళనకు గురైన అతడు తన స్నేహితులతో కలిసి అక్కడి నుంచి పారిపోయాడు. ముజీబ్ ఇంట్లో ఉన్నాడని తెలుసుకున్న అజర్ లోపలికి చొరబడి తల, ఛాతీపై నాలుగైదు కత్తిపోట్లు వేశాడు. తీవ్రంగా గాయపడిన ముజీబ్‌ను కుటుంబీకులు ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. విషయాన్ని తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు రోషన్ కాలనీకి చేరుకొని వివరాలు సేకరించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరారీలో ఉన్న అజర్ కోసం గాలిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. పోకిరీగా తిరుగుతున్న అజర్ కొంతకాలంగా ముజీబ్‌తో గొడవపడుతున్నారని కుటుంబీకులు తెలిపారు. రోషన్ కాలనీలో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్న పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించడం లేదని ఆరోపించారు. -
లండన్‌లో కత్తిపోట్లు
లండన్: లండన్ బ్రిడ్జ్ వద్ద కత్తితో పలువురిని గాయపరిచిన వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటనను ముందు జాగ్రత్త కోసం ఉగ్రవాద చర్యగా పరిగణిస్తున్నామని పోలీసులు తెలిపారు. రద్దీగా ఉండే లండన్ బ్రిడ్జ్ వద్ద ఓ వ్యక్తి కత్తితో పలువురిని గాయపరిచాడు. ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు టీవీల్లో ప్రసారమయ్యాయి. పోలీసులు వెంటనే స్పందించి దుండగుడిని మట్టుబెట్టారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో సోదాలు చేయడంతో పాటు లండన్ బ్రిడ్జిపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. -
జపాన్‌లో విద్యార్థినులపై కత్తులతో దాడి
కవాసకీ: జపాన్‌లోని కవాసకీ నగరంలో మంగళవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. స్కూల్ విద్యార్థినులే లక్ష్యంగా ఓ వ్యక్తి కత్తులతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఘటనలో ఓ విద్యార్థిని సహా ప్రభుత్వ ఉద్యోగి మరణించారు. 17 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన నోబోరిటో పార్క్ సమీపంలో ఉన్న బస్టాప్‌లో చోటుచేసుకుంది. గాయాలైన వారిలో 6 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న బాలికలే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది కారిటాస్ గాక్వెన్ అనే పాఠశాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులంతా బస్ కోసం వేచి చూస్తున్న క్రమంలో ఓ వ్యక్తి రెండు చేతులతో కత్తులు పట్టుకుని దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఘటనకు కారణమైన వ్యక్తి గొంతు కోసుకుని మరణించాడని పోలీసులు వెల్లడించారు. దాడికి గల కారణాలు తెలియరాలేదు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
జర్మనీలో భారతీయ జంటపై దాడి : భర్త మృతి
మ్యూనిచ్ : జర్మనీలో భారతీయ దంపతులపై ఒక వలసదారుడు దాడికి తెగడ్డాడు. కత్తితో దాడి చేయడంతో భర్త ప్రశాంత్ ప్రాణాలు కోల్పోగా, భార్య స్మిత ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నారు. జర్మనీలోని మ్యూనిచ్ వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్ ట్విటర్లో వెల్లడించారు. ప్రశాంత్ సోదరుడిని జర్మనీకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ట్వీట్ చేశారు. అలాగే వారి ఇద్దరి పిల్లల భద్రతపై అధికారులకు తగిన సూచనలు చేసినట్టు తెలిపారు. బాధిత కుటుంబానికి సుష్మా సంతాపం వెలిబుచ్చారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Indian couple Prashant and Smita Basarur were stabbed by an immigrant near Munich. Unfortunately, Prashant has expired. Smita is stable. We are facilitating the travel of Prashant's brother to Germany. My heartfelt condolences to the bereaved family. /1 — Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) March 30, 2019 -
నడిరోడ్డుపై దారుణం.. అప్పు తిరిగివ్వలేదని..
సాక్షి, హైదరాబాద్ : అప్పు విషయంలో జరిగిన గొడవ ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. అప్పు తీసుకుని డబ్బులు తిరిగివ్వటం లేదన్న కోపంతో నడిరోడ్డుపై స్నేహితుడిని కత్తితో పొడిచాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన బుధవారం రాత్రి మెహదీపట్నంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మెహదీపట్నానికి చెందిన ఫిరోజ్, సద్దాంలు మంచి స్నేహితులు. ఫిరోజ్ కొన్ని రోజులు క్రితం సద్దాం దగ్గర ఐదు వేలు అప్పు తీసుకున్నాడు. చెప్పిన సమయానికి డబ్బు తిరిగి ఇవ్వకపోవటంతో సద్దాం బుధవారం ఫిరోజ్‌ను ప్రశ్నించాడు. తన దగ్గర డబ్బులు లేవని ఫిరోజ్ చెప్పటంతో సద్దాం అతడితో గొడవకు దిగాడు. ఆగ్రహం పట్టలేక వెంట తెచ్చుకున్న కత్తితో నడిరోడ్డుపై ఫిరోజ్ కడుపులో పొడిచాడు. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫిరోజ్‌ను అత్యవసర చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రి తరలించారు. పరారీలో ఉన్న సద్దాం గురించి పోలీసులు గాలిస్తున్నారు. -
మెల్బోర్న్లో కత్తి పోట్లు కలకలం
-
మెల్బోర్న్లో కత్తి పోట్లు కలకలం
మెల్బోర్న్ : అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల ఘటన మరవక ముందే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో శుక్రవారం కత్తి పోట్లు కలకలం సృష్టించాయి. మెల్బోర్న్ సెంట్రల్ డిస్ట్రిక్‌లో అకస్మాత్తుగా ఓ కారు మంటల్లో చిక్కుకొనగా.. అక్కడికి వచ్చిన పోలీసులు అనుమానంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో ఆ వ్యక్తి కత్తితో అక్కడున్నవారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీస్ అధికారి తన గన్‌కు పనిచెప్పాడు. గాయపడ్డ నిందితుడిని ఆసుపత్రికి తరలించామని విక్టోరియా పోలీసులు మీడియాకు తెలిపారు. ఘటన గురించి పూర్తి వివరాలు తెలియలేదన్నారు. ఇక నిందితుడి కత్తిపోట్లతో ముగ్గురు గాయపడగా.. ఇందులో ఒకరు చికిత్స పొందుతూ మరణించాడు. రెండో వ్యక్తికి తల భాగంలో గాయమైందని, అతని ఆరోగ్య పరిస్థితి, మూడో వ్యక్తి గాయం గురించి సమాచారం లేదని స్థానిక మీడియా పేర్కొంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో నిందితుడు పోలీసులపై కత్తితో దాడి చేస్తుండగా.. వారు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికి అతను వినకపోవడంతో ఓ పోలీస్ అధికారి తుపాకీతో కాల్చేసినట్లు స్పష్టం అవుతోంది. చదవండి: నెత్తురోడిన అమెరికా -
రూ. 80 కోసం కత్తితో పొడిచి చంపారు..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. రూ. 80 కోసం వాదన జరగడంతో ప్రయాణీకులు ఆటోడ్రైవర్‌ను కత్తితో పొడిచి చంపిన ఘటన ఢిల్లీలోని జనసమ్మర్ధ కన్నాట్ ప్లేస్‌లో జరిగింది. నిందితులు నలుగురినీ పోలీసులు అరెస్ట్ చేశారు. మరణించిన ఆటో డ్రైవర్‌ను జామియా నగర్‌కు చెందిన జహంగీర్ అలాంగా గుర్తించారు. నిందితులందరూ తొమ్మిది, పదో తరగతి విద్యార్దులు కావడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి నలుగురు నిందితులు దక్షిణపురిలో ఆటో మాట్లాడుకుని మూల్‌చంద్‌లో పరాటాలు తినేందుకు వెళ్లారు. అయితే అక్కడా పరాటాలు లేకపోవగడంతో కన్నాట్ ప్లేస్‌కు వెళ్లాలని రూ. 120 ఇస్తామని చెప్పారు. ఆటో కస్తూర్బా గాంధీ మార్గ్ బస్‌స్టాప్ వద్దకు రాగానే అర్ధరాత్రి కావడంతో ఒక్కొక్కరికి రూ. 20 చొప్పున అదనంగా ఇవ్వాలని ఆటో డ్రైవర్ కోరడంతో వాగ్వివాదం జరిగింది. నిందితుల్లో ఒకరు జహంగీర్ ఆలంపై కత్తితో దాడి చేశాడు. బాధితుడు కేకలు వేయడంతో స్ధానికులు రాగా ఒక నిందితుడు పట్టుబడగా, మిగిలిన వారు పరారయ్యారు. గాయపడిన ఆలంను పోలీసులు రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. బాధితుడు చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు చెప్పారు. ఆలంపై కత్తితో దాడి చేసిన నిందితుడిని స్ధానికులు పట్టుకుని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఢిల్లీ డీసీపీ మాధుర్ వర్మ తెలిపారు. -
కత్తిపోట్లకు దారితీసిన వాట్సాప్ మెసేజ్
-
కత్తిపోట్లకు దారితీసిన వాట్సాప్ మెసేజ్
హైదరాబాద్: వాట్సాప్ గ్రూపులో మెసేజ్ ఓ యువకుడిపై కత్తిపోట్లకు దారి తీసింది. ఈ ఘటన హైదరాబాద్ శివారు పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రోహిత్(20), భువనేశ్వర్(20) మైసమ్మగూడలోని నర్సింహా రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నారు. వీరు తమ స్నేహితులతో కలసి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఇటీవల రోహిత్, భువనేశ్వర్‌ల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. గురువారం రాత్రి భువనేశ్వర్ ‘శుక్రవారం రోహిత్‌ను నేను కొట్టబోతున్నాను’ అంటూ వాట్సాప్ గ్రూపులో మెసేజ్ పెట్టాడు. దీన్ని చదివిన రోహిత్ శుక్రవారం ఉదయం తన స్నేహితులతో కలసి నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ వద్ద మాటు వేసి, బస్సు దిగుతున్న భువనేశ్వర్‌పై కత్తితో దాడి చేశాడు. ముఖం, చేతులు, నడుముకు గాయాలు కావడంతో అతడిని కళాశాల యాజమాన్యం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తోంది. దాడిని అడ్డుకునేందు కు ప్రయత్నించిన మరో విద్యార్థి కూడా గాయపడినట్లు సమాచారం. ఈ విషయాన్ని యాజమాన్యం దాచేందుకు ప్రయత్నించినా ఆ నోటా ఈ నోటా పోలీసులకు చేరింది. రోహిత్‌తోపాటు అతని నలుగురు స్నేహితులు భువనేశ్వర్‌ను గట్టిగా పట్టుకుని కత్తితో దాడికి పాల్పడినట్లు క్షతగాత్రుని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. -
ఇద్దరి మధ్య ఘర్షణ.. ఒకరికి కత్తిపోట్లు
ప్రకాశం జిల్లా : గిద్దలూరు మండలం అంబవరం గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నారాయణరెడ్డి అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన రంగడు శుక్రవారం కత్తితో గాయపర్చాడు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. నారాయణరెడ్డి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
30 సార్లు పొడిచి.. గొంతుకోసి
గుర్గావ్: మేఘాలయకు చెందిన 22 ఏళ్ల పింకి గుర్గావ్లో ఇటీవల దారుణ హత్యకు గురైంది. ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్లో జితేంద్ర(25) అనే యువకుడు ఆమెపై కత్తితో దాడిచేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్లైన్లో కనిపిస్తోంది. మెట్రో స్టేషన్లో ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు వెల్లడించారు. పింకి వెనుకాలే ఫాలో అవుతూ వెళ్లిన జితేంద్ర.. తన వెంట తీసుకొచ్చిన కత్తితో ఒక్కసారిగా దాడికి దిగిన దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయింది. ఆమె పొట్టలో 30 సార్లు పొడిచిన తరువాత గొంతుకోసి దారుణంగా హత్యచేశాడు. మొదట జితేంద్రను అడ్డుకోవడానికి ఒకరు బ్యాగుతో దాడిచేస్తూ ప్రయత్నించినప్పటికీ.. ఫలితం దక్కలేదు. చివరికి అక్కడున్న వారు ధైర్యం కూడగట్టుకొని నిందితుడిపై దాడి చేశారు. అయితే అప్పటికే పింకీ తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ దృశ్యాలు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి. -
30 సార్లు పొడిచి.. గొంతుకోసి
-
పార్కింగ్ విషయంలో గొడవ..వ్యక్తికి కత్తిపోట్లు
బెంగళూరు(బనశంకరి): పార్కింగ్ విషయంపై ఆటో డ్రైవరు, ఇద్దరు ద్విచక్రవాహనదారుల మధ్య చోటు చేసుకున్న గొడవ..చివరకు కత్తిపోట్లకు దారితీసింది. ఈ ఘటన సుబ్రమణ్యనగర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బసవరాజ్, చేతన్ అనే వ్యక్తులు బైకులో రాజాజీనగర మొదటిస్టేజ్లోని ఐసీసీ బ్యాంకు సమీపంలో అనన్య ఆసుపత్రి వద్ద పార్కింగ్ చేయడానికి యత్నిస్తూ అదే స్థలంలో పార్కింగ్ చేయడానికి వచ్చిన ఆటోను ఓవర్టేక్ చేశారు. దీంతో ఆటోడ్రైవర్‌కు, వారికి మధ్య గొడవ జరిగింది. ఓ దశలో ఆటోడ్రైవర్ విచక్షణ కోల్పోయి బసవరాజ్‌ను చాకుతో పొడిచి ఉడాయించాడు. చేతన్ ఇచ్చిన ఫిర్యాదు మేకు సుబ్రహ్మణ్య నగర పోలీసులు కేసు నమోదు చేసుకొని బసవరాజ్‌ను ఆస్పత్రికి తరలించి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. -
మహిళలంటే అసహ్యంతో.. ప్రతీకారం
సవతి తల్లి దాష్టీకానికి విసుగెత్తిన ఓ పాకిస్తానీ యువకుడు క్రూరంగా మారాడు. ఆమెపై ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు రోడ్డుపై కనిపించిన మహిళలను కత్తిపోట్లకు గురిచేస్తూ దారుణ ఘటనలకు పాల్పడుతున్నాడు. ఈ ఏడాదిలో 17 మంది మహిళలను కత్తిపోట్లకు గురిచేయగా.. ఓ మహిళా మరణానికి కారణమైనట్టు గారిసన్ నగర రావల్పిండి పోలీసులు శుక్రవారం పేర్కొన్నారు. 22 ఏళ్ల మహ్మద్ అలీ, రోడ్లపై కనిపించిన మహిళలపై యాధృచ్చికంగా దాడులకు పాల్పడుతున్నట్టు పోలీసు ఇన్వెస్టిగేటర్ మాలిక్ జుల్ఫికర్ హుస్సేన్ తెలిపారు. మహిళలంటే అసహ్యంతోనే వారిపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఈ ఘటనలకు పాల్పడుతున్నట్టు అలీ తన క్రూరత్మకాన్ని బయటపెట్టినట్టు హుస్సేన్ చెప్పారు. జనవరి నుంచి ఈ నెల వరకు 17 మంది మహిళలను కత్తిపోట్లతో తీవ్రంగా గాయపరిచినట్టు, ఈ దాడుల్లో ఒక నర్సు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు వెల్లడించారు. అలీ చిన్నతనంలోనే తన తల్లి చనిపోవడంతో, అతని తండ్రి మరో వివాహం చేసుకున్నాడు. సవతి తల్లిగా అలీ జీవితంలోకి వచ్చిన ఆమె, అతని తీవ్రంగా హింసించేది. ఆ దాష్టీక ఘటనలు భరించలేక అలీ క్రూరంగా మారాడు. సవతితల్లిపై హత్యాయత్నానికి కూడా పాల్పడాడు. అవకాశం చేజిక్కినప్పుడల్లా రోడ్డుపై కనిపించే మహిళలపై దాడులకు పాల్పడుతున్నాడని పోలీసు అధికారి హుస్సేన్ వెల్లడించారు. ఘటనలన్నీ రావల్పిండి వీధుల్లోనే జరిగాయని ఆయన వివరించారు. పరువు హత్యలపై, సాధారణ ప్రాంతాల్లో మహిళలపై జరిగే దాడులపై వ్యతిరేకంగా పాకిస్తాన్ మహిళలు తమ హక్కుల కోసం గతేళ్లుగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. -
పడగవిప్పిన పాతకక్షలు
కోలారు(బెంగళూరు): పాతకక్షలు పడగవిప్పి ఓ వ్యక్తి కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన నగరంలో కీలుకోట ప్రాంతంలో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల కథనం మేరకు.. కీలుకోటలోని కుమార్ అనే వ్యక్తి కుమార్తెను ట్యాంకర్ డ్రైవర్ అభి ప్రేమించాడు. విషయం తెలుసుకున్న కుమార్ కుటుంబానికి చెందిన వ్యక్తులు ఆరు నెలలక్రితం అభిని విశ్వేశ్వరయ్య స్టేడియం వద్ద హత్య చేశారు. ఘటనలో కుమార్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసు అరెస్టు చేశారు. ఏ3 గా నిందితుడిగా ఉన్న కుమార్ ఇటీవలే బెయిల్‌పై విడుదల కాగా మరో ఇద్దరు జైల్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అభి వర్గానికి చెందిన వారు నగరంలోని కీలుకోట సమీపంలో రైల్వే బ్రిడ్జి కింద శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో కాపుగాసి కుమార్(55)పై కొడవళ్లతో దాడి చేశారు. ఘటనలో కుమార్ కుడిచేయి తెగిపోగా మొడపై తీవ్రంగా గాయమైంది. వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు ఆర్ఎల్ జాలప్ప మెడికల్ కళాశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగుళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఘటన అనంతరం కుమార్ సంభంధీకులు కీలుకోట వద్ద ఏర్పాటు చేసిన నగర సభ మాజీ సభ్యుడు దివంగత నిరంజన్ శిలాఫలకాన్ని, వార్డుల వివరాలు తెలియజేసే బోర్డును ధ్వంసం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. జిల్లా ఎస్పీ దివ్య గోపినాథ్, బెంగళూరు ఏఎస్పీ నారాయణ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన జరిపారు. ఘటనకు సంభందించి నగరసభ కౌన్సిలర్ కాశీ విశ్వనాథ్, గోపాల్, నరసింహమూర్తిలను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా దాడికి పాల్పడిన నిందితులున అరెస్ట్ చేయాలని భారతీయ అస్పృశ్యతా నిర్మూలనా పోరాట సమితి కార్యకర్తలు ధర్నా చేశారు. -
గొడవ ఆపడానికి వెళ్తే కత్తి పోట్లు
అన్నదమ్ముల మధ్యలో జోక్యం చేసుకున్న పక్కింటి యువకుడు వారి చేతిలో కత్తిపోట్లకు గురయ్యాడు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సింగరేణి కాలనీలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసుల కథనం మేరకు... బ్లాక్‌నెంబర్ 52లో శోభ అనే మహిళ తన కుమారులు నాగరాజు, మధుతో కలసి నివసిస్తోంది. మధు ప్లంబర్‌గా పనిచేస్తుండగా నాగరాజు మద్యం, గంజాయి వ్యసనాలకు బానిసయ్యాడు. మద్యం మత్తులో తరచూ తల్లితో గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో నాగరాజు తల్లితో గొడవ పడుతుండగా తమ్ముడు మధు అడ్డుకున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో పక్కింట్లో ఉండే కిరణ్ వచ్చి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. తమ గొడవలో ఎందుకు జోక్యం చేసుకుంటావని ఆగ్రహంతో కిరణ్‌పై నాగరాజు కత్తితో దాడి చేశాడు. కిరణ్ భుజం, చేతికి కత్తిపోట్ల కారణంగా గాయాలు కావడంతో అతడ్ని చికిత్స కోసం ఉస్మానియాకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కత్తితో వెళ్లిన ఆ విద్యార్థిని సంకెళ్లు వీడాయి
వెస్ట్ బ్యాంక్: తమ దేశ పౌరులను పొడిచి చంపేందుకు ప్రణాళిక రచించిందన్న కారణంతో అరెస్టు చేసి జైళ్లో పెట్టిన పన్నేండేళ్ల పాలస్తీన బాలికను ఎట్టకేలకు ఇజ్రాయెల్ ప్రభుత్వం విడిచిపెట్టింది. దాదాపు రెండున్నర నెలలు జైలులో ఉంచి అనంతరం ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు తుకారెం పాయింట్ వద్ద వద్ద ఆ బాలికను తల్లిదండ్రులకు అప్పగించింది. ఈ సమయంలో ఆ బాలికకు తమ పట్టణం వెస్ట్ బ్యాంక్‌లోకి ఆహ్వానిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఇజ్రాయెల్‌లో జైలు శిక్ష అనుభవించిన అతి పిన్న పాలస్తీనా వాసి ఈ బాలికే. యూదుల ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ పట్టణం ప్రవేశం వద్ద పాలస్తీనాకు చెందిన దిమా అల్ వావి అనే పన్నేండేళ్ల బాలిక ఈ ఏడాది 9న తన స్కూల్ యూనిఫాం షర్ట్ చాటున ఓ కత్తిపట్టుకొని వచ్చింది. అప్పటికే ఈ ఇరు దేశాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. కత్తితో, బాంబులతో, కార్లతో సరిహద్దు ప్రాంతాల వద్ద దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. అదే సమయంలో ఇజ్రాయెల్ వాసులు ఆక్రమిత ప్రాంతానికి ఈ బాలిక కత్తితో రావడం గుర్తించిన ఆ పోలీసులు ఆ బాలికను అరెస్టు చేశారు. అయితే, పద్నాలుగేళ్ల లోపు ఉన్న బాలికకు సుదీర్ఘకాలంపాటు జైలు శిక్ష విధించడానికి యూదుల చట్టం అంగీకరించనందున ఆ బాలికకు కేవలం నాలుగున్నర నెలలు మాత్రమే జైలు శిక్ష విధించారు. ఇటీవల బాలిక తరుపు న్యాయవాది విజ్ఞప్తి చేయడంతో నాలుగు వారాల ముందే ఆ బాలికను విడుదల చేసి తిరిగి పాలస్తీనా అధికారులకు అప్పగించగా వారు తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. -
ఆర్మీ రిక్రూట్మెంట్లో తొక్కిసలాట
ఐదుగురికి తీవ్ర గాయాలు...ఒకరి పరిస్థితి విషమం హైదరాబాద్: ప్రాదేశిక సైన్యంలో తాత్కాలిక ప్రాతిపదికన జవాను, క్లర్క్ పోస్టుల ఎంపిక కోసం సికింద్రాబాద్‌లోని 125 ఇన్ఫాంట్రీ బెటాలియన్ (టెరిటోరియల్ ఆర్మీ) శుక్రవారం నిర్వహించిన రిక్రూట్మెంట్ ర్యాలీలో తొక్కిసలాట చోటుచేసుకుంది. అధికారులు ఒక్కసారిగా గేట్లు తెరవడం తోపులాటకు దారితీయడంతో పలువురు అభ్యర్థులు కిందపడగా వారిని తొక్కుకుంటూ మిగతా వారు లోపలకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఆదిలాబాద్‌కు చెందిన కృష్ణారెడ్డి(40), సాయికుమార్(18), గుంటూరుకు చెందిన అవినాశ్ పాండే (18), శ్రీకాకుళానికి చెందిన వసంతరావు(18), ఐడీఏ బొల్లారానికి చెందిన వేణుగోపాల్(40) అనే అభ్యర్థులు తీవ్రంగా గాయపడ్డారు. స్పృహ కోల్పోయిన వారిని హుటాహుటిన 108 అంబులెన్సులో తిరుమలగిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారిలో కృష్ణారెడ్డి పరిస్థితి విషమంగా మారడంతో అతన్ని మరో ఆస్పత్రికి తరలించారు. వీరితోపాటు ఇంకా చాలా మంది స్వల్ప గాయాలుకాగా ప్రథమ చికిత్స అనంతరం వెళ్లి పోయారు. అభ్యర్థులను నియంత్రించేందుకు సైనికాధికారులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. వివిధ రాష్ట్రాల నుంచి హాజరు... తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, గుజరాత్, రాజస్తాన్, మహారాష్ట్రల నుంచి టెన్త్, ఇంటర్ పూర్తిచేసిన 18 నుంచి 42 ఏళ్ల వయసువారు రిక్రూట్మెంట్కు రావొచ్చని అధికారులు ప్రకటించారు. దీంతో కేవలం 34 పోస్టులకు ఏకంగా 20 వేల మంది యువకులు గురువారం రాత్రే తిరుమలగిరిలోని లోతుకుంటకు చేరుకొని షాపులు, ఫుట్‌పాత్‌ల వద్ద విశ్రమించారు. శుక్రవారం ఉదయం 5 గంటలకే అభ్యర్థులంతా తిరుమలగిరిలోని డొక్కా స్టేడియానికి తరలివచ్చారు. తొలుత 10 మంది యువకుల చొప్పున స్టేడియం లోపలకు పంపిన అధికారులు...ఆ తర్వాత రోడ్డు బ్లాక్ కావడం, ట్రాఫిక్ చిక్కులు ఏర్పడటంతో ఒక్కసారిగా గేట్లు తెరిచారు. దీంతో గేట్ల ముందు నిలబడిన వారిని వెనకున్న వారు నెట్టడంతో కింద పడిపోగా వారిని తోక్కుకుంటు మిగిలిన వారు లోపలకు పరుగులు తీశారు. అంతా ముగిశాక వచ్చిన పోలీసులు తొక్కిసలాటతోపాటు నానా రభస జరిగిన తర్వాత పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఎంపిక సమయంలో ముందస్తుగా బందోబస్తు ఏర్పాట్లు చేసి ఉంటే ఇంత తొక్కిసలాట జరిగేది కాదని పలువురు అభ్యర్థులు విమర్శించారు. రిక్రూట్మెంట్ గురించి ఆర్మీ అధికారులు పోలీసులకు కనీస సమాచారం ఇవ్వలేదని...పోలీసులు ఎంపిక ప్రాంతానికి రాకూడదనే నిబంధన విధించారని తెలిసింది.వివిధ బెటాలియన్ల పరిధిలో సహాయకంగా పనిచేసేందుకు టెరిటోరియల్ ఆర్మీ పేరిట సైన్యం పార్ట్‌టైమ్ ఉద్యోగులను ఎంపిక చేస్తూ ఉంటుంది. ఇందుకు సంబంధించి ముందస్తుగా దరఖాస్తుల విధానాన్ని పాటించకుండా అభ్యర్థులంతా నేరుగా ఎంపిక కేంద్రానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉంటుంది. రాత పరీక్ష, ఇతరత్రా పోటీ విధానాన్ని పాటించని కారణంగా ముందుగా వచ్చిన వారికే ముందు (ఫస్ట్ కమ్ ఫస్ట్) ప్రాతిపదికన ఎంపిక చేస్తారేమోనని అభ్యర్థులు దరఖాస్తుల కోసం ఎగబడుతూ ఉంటారు. -
అమ్మ చెప్పిందని టీచర్‌ను పొడిచేసేందుకు..!
రామనాథపురం: అమ్మ చెప్పిందని ఓ 11 ఏళ్ల బాలిక టీచర్‌ను బాకుతో పొడిచేందుకు ప్రయత్నించిన ఘటన తమిళనాడులో జరిగింది. దక్షిణ తమిళనాడులోని రామనాథపురంలో ఆరో తరగతి చదువుతున్న బాలిక శుక్రవారం టీచర్‌కు చెప్పకుండా క్లాస్ మధ్యలోనే వెళ్లిపోయింది. దీంతో ఉపాధ్యాయురాలు తిడుతుందేమోనన్న భయంతో శనివారం బడికి వచ్చేటప్పుడు తల్లిని వెంటబెట్టుకొని వచ్చింది. టీచర్ ఇద్దరిని వెళ్లి ప్రధాన ఉపాధ్యాయుడిని కలిసి అనుమతి తెచ్చుకోవాలని సూచించింది. దీంతో టీచర్‌కి, విద్యార్థిని తల్లికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ మహిళ టీచర్‌ను పొడిచేయమంటూ కూతురికి చెప్పింది. వెంటనే ఆ చిన్నారి ఒక బాకు తీసుకొని టీచర్‌ను పొడిచేందుకు పూనుకుంది. భయభ్రాంతురాలైన టీచర్ వెంటనే అల్లారం మోగించి.. ప్రధాన ఉపాధ్యాయుడికి ఈ విషయం తెలియజేసింది. పోలీసులకు సమాచారం అందడంతో వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. టీచర్‌పై దాడికి ప్రయత్నించిన తల్లీకూతుళ్లను పోలీసులు కాసేపు ప్రశ్నించి వదిలేశారు. అయితే తన కూతురిని టీచర్ తరచూ వేధిస్తున్నదని, తమను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు పాల్పడుతున్నదని విద్యార్థిని తల్లి ఆరోపించింది. టీచర్ నుంచి భద్రత కోసమే తన కూతురు బాకును చేతిలో పట్టుకుందని ఆమె చెప్పుకొచ్చింది. -
టీచర్‌ను కత్తితో పొడిచిన విద్యార్థి
ఇంపాల్ : మద్యం తాగొద్దు అన్నందుకు టీచర్ ను ఓ విద్యార్థి కత్తితో పొడిచిన సంఘటన ఇంపాల్లోని జవహర్ నవోదయ విద్యాలయంలో చోటుచేసుకుంది. లివా సారెజ్ సమీపంలోని స్కూలు పరిసరాల్లో12వ తరగతి విద్యార్థి మద్యం సేవిస్తుండగా ఉపాధ్యాయుడు అలెక్స్ పమ్మి మందలించాడు. దీంతో ఆగ్రహంతో విద్యార్థి కత్తితో టీచర్ పై అయిదుసార్లు దాడి చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న పమ్మి పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పరారీలో ఉన్నవిద్యార్థి పేరు వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు. -
ఆస్ట్రేలియాలో మరో దారుణం
-
ఆస్ట్రేలియాలో మరో దారుణం: 8 మంది చిన్నారుల మృతి
మెల్బోర్న్ : సిడ్నీలోని కేఫ్ ఘటన, పాకిస్థాన్ పెషావర్‌లో చిన్నారుల నరమేధం మనోఫలకంపై నుంచి చెరగక ముందే ఆస్ట్రేలియాలోని సౌత్ క్వీన్స్ ల్యాండ్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. సౌత్ క్వీన్స్‌ల్యాండ్‌లోని కెయిర్న్స్ పట్టణంలోని ఓ ఇంటిలో మహిళ (34) తీవ్రంగా గాయపడినట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆ ఇంటి ఆవరణలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఎనిమిది మంది చిన్నారులను మృతదేహలను గుర్తించారు. ఆ మృతదేహలన్నీ ఏడాదిన్నర వయస్సు గల చిన్నారుల నుంచి 15 సంవత్సరాల వయస్సు గల వారివి ఉన్నాయని చెప్పారు. పదునైన ఆయుధాలతో దాడి చేసినట్లు ఆ మృతదేహాలపై గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా సోదరులుగా భావిస్తున్నామని చెప్పారు. గాయపడిన మహిళ ఆరోగ్యం పరిస్థతి ప్రస్తుతం నిలకడగా ఉందని వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆ ఇంటిని అణువణువు తనిఖీ చేస్తున్నారు. అలాగే ఇంటి పరిసరాల్లోని వారిని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనతో ఆస్ట్రేలియా ఒక్కసారిగా ఉల్కిపడింది. దేశం ప్రస్తుతం క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటుందని ప్రధాని టోని అబ్బాట్ తెలిపారు. ఈ దారుణంపై మాట్లాడేందుకు మాటలు రావడం లేదన్నారు. -
హర్షవర్థన్ మృతికి సంతాపంగా శాంతి ర్యాలీ
-
హర్షవర్థన్ మృతికి సంతాపంగా శాంతి ర్యాలీ
హైదరాబాద్ : సీనియర్ విద్యార్థి దాడిలో మృతి చెందిన హర్షవర్ధన్‌రావు మృతికి సంతాపంగా సోమవారం విద్యార్థులు శాంతి ర్యాలీ చేపట్టారు. విద్యార్థినిని ర్యాగింగ్ చేయొద్దన్న పాపానికి హనుమాన్ టేకిడీలోని ప్రగతి మహావిద్యాలయ కళాశాలలో రాంకోఠికి చెందిన హర్షవర్థన్‌పై సతీష్ కోడ్కర్ అనే విద్యార్థి దాడి చేయటంతో హర్షవర్థన్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా హర్షవర్థన్ అంతిమ యాత్రలో నిన్న వందలాదిమంది విద్యార్థులు, బంధువులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం వైఖరిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కళాశాల గేట్లు తోసుకొని లోపలికి దూసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కళాశాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విద్యార్థి మృతి పట్ల తమకు ఆవేదన, ఆందోళన ఉందని కళాశాల అధ్యాపకులు తెలిపారు. కాగా హర్షవర్థన్‌పై దాడి చేసి అతడి మృతికి కారణమైన సీనియర్ విద్యార్థి సతీష్ కోడ్కర్ను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అతడిని రహస్య ప్రాంతాలకు తరలించి విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే సతీష్ అరెస్ట్‌ను పోలీసులు ధ్రువీకరించలేదు. నిందితుడిని ఇవాళ లేదా మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. -
ప్రశ్నించినందుకు ప్రాణం తీశాడు
అమ్మాయిని ఎందుకు టీజ్ చేస్తున్నావన్న జూనియర్‌పై పిడిగుద్దులు కురిపించిన సీనియర్ విచక్షణరహితంగా కొట్టడంతో క్లాస్‌రూంలో అపస్మారక స్థితిలో పడిపోయిన హర్షవర్ధన్‌రావు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య నాలుగు గంటలు పోరాడి మృత్యుఒడిలోకి.. నగరంలోని ప్రగతి మహా విద్యాలయలో ఘటన సాక్షి, హైదరాబాద్: అమ్మాయిని ఎందుకు టీజ్ చేస్తున్నావని అడిగిన పాపానికి పిడిగుద్దులు కురిపించాడు.. సీనియర్‌నన్న తలబిరుసుతో జూనియర్ విద్యార్థిని ఇష్టానుసారం కొట్టాడు.. చివరికి ఆ విద్యార్థి 4 గంటలపాటు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడి ప్రాణాలు వదిలాడు! నగరం నడిబొడ్డున సుల్తాన్‌బజార్ లోని ప్రగతి మహా విద్యాలయలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. రాంకోఠికి చెందిన ఆటోమొబైల్ వ్యాపారి నర్సింగ్‌రావు రెండో కుమారుడు కోట హర్షవర్ధన్ రావు(18) ప్రగతి మహా విద్యాలయంలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇదే కాలేజీలో జియాగూడకు చెందిన సతీశ్ కోడ్కర్(19) బీకాం ఫైనలియర్ చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామ సమయంలో విద్యార్థులు క్లాస్ రూమ్‌లోంచి బయటికి వచ్చారు. తరగతి గదిలో హర్షవర్ధన్, మరో విద్యార్థిని ఉన్నారు. ఇదే సమయంలో రూమ్ నంబర్ 211లో ఉన్న సతీశ్... 203 రూమ్‌లో ఉన్న హర్షవర్ధన్ తరగతి గదికి వచ్చాడు. వస్తూనే విద్యార్థినిని తన మాటలతో వేధించాడు. ‘‘ఆమెను ఎందుకు కామెంట్ చేస్తున్నావు’’ అని హర్షవర్ధన్ నిలదీశాడు. దీంతో సీనియర్లనే ప్రశ్నిస్తావా.. అంటూ హర్షవర్ధన్‌పై సతీశ్ విచక్షణరహితంగా పిడిగుద్దులు కురిపించాడు. మెడ, తల వెనుక భాగం, ఛాతీపై బలంగా గుద్దడంతో హర్షవర్ధన్ అక్కడే అపస్మారక స్థితిలో పడి పోయాడు. ఈ విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు ఆయనను బయటికి తీసుకువచ్చి, ఆటోలో సమీపంలోని ఆదిత్య ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు సీటీ స్కాన్ చేశారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్సకు నిరాకరించారు. వెంటనే హర్షవర్ధన్‌ను నాంపల్లి కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ కూడా చికిత్సకు నిరాకరించారు. చివరికి పోలీసుల జోక్యంతో ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. సుమారు 4 గంటల పాటు ఆయన్ని బతికించేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. హర్షవర్ధన్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ విషయం తెలియగానే కళాశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని జరిగిన వివాదంపై ఆరా తీశారు. తెలివైన విద్యార్థి.. హర్షవర్ధన్‌కు తెలివైన విద్యార్థిగా పేరుంది. తండ్రి సంపాదనకు చేదోడువాదోడుగా ఉండేం దుకు పగటి పూట చదువుకుంటూ.. రాత్రి పూట అపోలో ఫార్మసీలో పనిచేస్తున్నాడు. హర్షవర్ధన్ తల్లి ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నారు. హర్షవర్ధన్ మృతి విషయం తెలియగానే తల్లిదండ్రులు హుటాహుటిన కేర్ ఆసుపత్రికి చేరుకుని గుండెలు పగిలేలా రోదించారు. హర్షవర్ధన్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. సతీశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మేమేం చేస్తాం: కాలేజీ కరస్పాండెంట్ విద్యార్థుల ఘర్షణపై కాలేజీ కరస్పాండెంట్ రాజేశ్ సి షాను వివరణ కోరగా.. ‘ఇద్దరు కొట్టుకుంటే మేమేం చేస్తాం..’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. గతంలో కూడా ఈ కాలేజీలో గొడవలు జరిగాయి. ఇటీవల ఓ విద్యార్థి ఈవ్ టీజింగ్ కేసులో జైలుకు వెళ్లాడు. గతంలో ర్యాగింగ్ కేసు సంచలనం సృష్టించింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థుల ఆందోళనలు ఇక్కడ నిత్యకృత్యంగా మారాయి. -
అమ్మాయిలపై కామెంట్లు.. అడ్డుకున్నందుకు హత్య!
అమ్మాయిలను ఏడిపించడం వల్ల విద్యార్థుల మధ్య మొదలైన ఘర్షణ.. ఓ విద్యార్థి మరణానికి కారణమైంది. హైదరాబాద్ కోఠి ప్రాంతంలోని డిగ్రీ కళాశాలలో జరిగిన విద్యార్థి హత్య కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. సతీష్ అనే విద్యార్థి అదే కళాశాలకు చెందిన కొంతమంది అమ్మాయిలపై కామెంట్లు చేశాడని, బీకాం రెండో సంవత్సరం చదువుతున్న హర్షవర్ధన్ రావు అనే విద్యార్థి అతడిని అడ్డుకున్నాడని సుల్తాన్‌బజార్ ఏసీపీ గిరిధర్ తెలిపారు. ఇలా అడ్డుకున్నందుకు సతీష్‌కు కోపం వచ్చి, హర్షవర్ధన్ రావుపై దాడి చేశాడన్నారు. ఛాతీపైన, మెడమీద బలమైన గాయాలు కావడంతో హర్షవర్ధన్ మృతిచెందినట్లు ఏసీపీ వివరించారు. మృతుడు హర్షవర్ధన్ రావు రాంకోఠి నివాసి కాగా, నిందితుడు సతీష్ హైదరాబాద్‌లోని జియాగూడ ప్రాంతానికి చెందినవాడని వివరించారు. ఈ ఘటనపై పోలీసులకు హర్షవర్ధన్ రావు తండ్రి ఫిర్యాదు చేశారు. -
చిన్న గొడవ.. చావుకు దారితీసింది!
-
విద్యార్థుల మధ్య కత్తిపోట్లు: ఒకరి మృతి?
-
విద్యార్థుల మధ్య కత్తిపోట్లు: ఒకరి మృతి
డిగ్రీ విద్యార్థుల మధ్య చిన్న విషయంలో మొదలైన గొడవ కాస్తా.. చివరకు పెద్దగా మారి కత్తిపోట్లకు దారితీసింది. దాంతో ఓ విద్యార్థి మరణించాడు. ఈ దురదృష్టకరమైన ఘటన హైదరాబాద్ సుల్తాన్ బజార్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు కళాశాలలో జరిగింది. జూనియర్లు, సీనియర్ల మధ్య జరిగిన గొడవలో బీకాం సెకండియార్ చదువుతున్న హర్షవర్ధనరావు అనే విద్యార్థి తీవ్రంగా కత్తిపోట్లకు గురయ్యాడు. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతడిని నాంపల్లిలోని కేర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా, ఫలితం లేక మరణించాడు. ఈ విషయాన్ని కేర్ వైద్యులు ధ్రువీకరించారు. సెకండియర్ చదువుతున్న హర్షవర్ధన్‌ను కొంతమంది విద్యార్థులు కలిసి ఓ సీసాతో తలపైన కొట్టినట్లు తెలిసింది. వీళ్లలో సతీష్ అనే సీనియర్ విద్యార్థి పాత్ర ఉన్నట్లు కొంతమంది చెబుతున్నారు. గొడవ పొద్దున్నే జరిగినా, హర్షవర్ధన్ మరణించిన తర్వాతే విషయం బయటకు పొక్కింది. ఇంతకుముందు కూడా విద్యార్థుల మధ్య గొడవలు జరిగాయి. ర్యాగింగ్ కారణంగా గతంలో కొంతమందిని డిబార్ చేశారు. ప్రేమ వ్యవహారమే తాజా గొడవకు కారణమని తెలిసింది. ఇంతకుముందు కూడా విద్యార్థుల మధ్య గొడవలు ఉన్నా, పొడుచుకుని చంపుకొనేంత పరిస్థితి ఎప్పుడూ లేదు. తొలుత విద్యార్థి మృతి విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. తర్వాత ఫిర్యాదు అందడంతో మొత్తం బయటకు చెప్పారు. ఈ వ్యవహారంతో కోఠి, సుల్తాన్‌బజార్ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.