పార్కింగ్‌ విషయంలో గొడవ..వ్యక్తికి కత్తిపోట్లు | man stabbed for parking place in banglore | Sakshi
Sakshi News home page

పార్కింగ్‌ విషయంలో గొడవ..వ్యక్తికి కత్తిపోట్లు

Oct 2 2016 9:35 AM | Updated on Aug 21 2018 6:21 PM

పార్కింగ్‌ విషయంలో గొడవ..వ్యక్తికి కత్తిపోట్లు - Sakshi

పార్కింగ్‌ విషయంలో గొడవ..వ్యక్తికి కత్తిపోట్లు

పార్కింగ్‌ విషయంపై ఆటో డ్రైవరు, ఇద్దరు ద్విచక్రవాహనదారుల మధ్య చోటు చేసుకున్న గొడవ..చివరకు కత్తిపోట్లకు దారితీసింది.

బెంగళూరు(బనశంకరి): పార్కింగ్‌ విషయంపై ఆటో డ్రైవరు, ఇద్దరు ద్విచక్రవాహనదారుల మధ్య చోటు చేసుకున్న గొడవ..చివరకు కత్తిపోట్లకు దారితీసింది. ఈ ఘటన సుబ్రమణ్యనగర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బసవరాజ్, చేతన్‌ అనే వ్యక్తులు బైకులో రాజాజీనగర మొదటిస్టేజ్‌లోని ఐసీసీ బ్యాంకు సమీపంలో అనన్య ఆసుపత్రి వద్ద పార్కింగ్‌ చేయడానికి యత్నిస్తూ అదే స్థలంలో పార్కింగ్‌ చేయడానికి వచ్చిన ఆటోను ఓవర్‌టేక్‌ చేశారు.

దీంతో ఆటోడ్రైవర్‌కు, వారికి మధ్య గొడవ  జరిగింది.  ఓ దశలో  ఆటోడ్రైవర్‌ విచక్షణ కోల్పోయి బసవరాజ్‌ను చాకుతో పొడిచి ఉడాయించాడు. చేతన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేకు సుబ్రహ్మణ్య నగర పోలీసులు కేసు నమోదు చేసుకొని బసవరాజ్‌ను ఆస్పత్రికి తరలించి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement