Man Killed Woman By Stabbing Her For Refusing Love In Mysuru, Details Inside - Sakshi
Sakshi News home page

ప్రేమోన్మాది ఘాతుకం: ప్రేమించాలంటూ వెంటపడి మరీ..

Published Thu, Nov 17 2022 10:28 AM | Last Updated on Thu, Nov 17 2022 12:05 PM

Ma Kill Woman By Stabbing Her For Refusing Love - Sakshi

మైసూరు: తన ప్రేమను నిరాకరించిందని ఓ కిరాతకుడు ఆమెను కత్తితో పొడిచి హత్యాయత్నం చేసిన ఘటన మైసూరు నగరంలోని హెబ్బాల భారత్‌ క్యాన్సర్‌ ఆస్పత్రిలో ఆవరణంలో చోటుచేసుకుంది. చామరాజనగర జిల్లా యలందూరుకు చెందిన నంజుండ స్వామి నిందితుడు. వివరాలు.. నర్సు, నంజుండస్వామి ఇదే ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో నంజుండస్వామి తనను ప్రేమించాలని నర్సుపై తరచూ ఒత్తిడి తెచ్చేవాడు. ఆమె వ్యతిరేకించింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం విధుల్లో ఉండగా నంజుండస్వామి చాకుతో గొంతుపై పొడిచాడు. బాధితురాలిని హుటాహుటిన చికిత్సకు తరలించారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి విచారణ చేస్తున్నారు. 

(చదవండి: కాల్‌’ చేశాడు కటకటాల్లోకి చేరాడు! )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement