refuse love proposal
-
Crime News: ప్రేమించాలంటూ వెంటపడి మరీ..
మైసూరు: తన ప్రేమను నిరాకరించిందని ఓ కిరాతకుడు ఆమెను కత్తితో పొడిచి హత్యాయత్నం చేసిన ఘటన మైసూరు నగరంలోని హెబ్బాల భారత్ క్యాన్సర్ ఆస్పత్రిలో ఆవరణంలో చోటుచేసుకుంది. చామరాజనగర జిల్లా యలందూరుకు చెందిన నంజుండ స్వామి నిందితుడు. వివరాలు.. నర్సు, నంజుండస్వామి ఇదే ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నంజుండస్వామి తనను ప్రేమించాలని నర్సుపై తరచూ ఒత్తిడి తెచ్చేవాడు. ఆమె వ్యతిరేకించింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం విధుల్లో ఉండగా నంజుండస్వామి చాకుతో గొంతుపై పొడిచాడు. బాధితురాలిని హుటాహుటిన చికిత్సకు తరలించారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. (చదవండి: కాల్’ చేశాడు కటకటాల్లోకి చేరాడు! ) -
ప్రేమకు నిరాకరించిందన్న కక్షతో నవ వధువు దారుణ హత్య
దొడ్డబళ్లాపురం: తన ప్రేమను నిరాకరించిందన్న కక్షతో నవ వధువును కత్తితో దాడిచేసి దారుణంగా హత్య చేసిన సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని దేవనహళ్లి తాలూకా అవతి గ్రామంలో చోటుచేసుకుంది. సౌమ్య (23)హత్యకు గురైన వివాహిత. సుబ్రమణ్య (25) హత్య చేసిన నిందితుడు. సౌమ్య, సుబ్రమణి ఇద్దరూ గతంలో బెంగళూరు నాగవార వద్ద ఉన్న కాఫీడేలో పనిచేసేవారు. అప్పుడే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే కొన్ని రోజుల క్రితం సౌమ్య హఠాత్తుగా పనిమానేసింది. రెండు వారాల క్రితం వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది. దీంతో సౌమ్య తనను మోసం చేసిందని పగతో రగిలిపోయిన సుబ్యమణ్య సమయం కోసం వేచి చూసాడు. ఇలా ఉండగా బుధవారం సౌమ్య అవతికి వచ్చింది. అదే రోజు రాత్రి సౌమ్య ఇంట్లో ఒంటరిగా ఉండడం గమనించిన సుబ్యమణ్య ఇంట్లో జొరబడి ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. సౌమ్య కేకలు విన్న స్థానికులు పరుగున రావడంతో సుబ్రమణ్య ఇంటి వెనుక నుంచి గోడదూకి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ సౌమ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. విజయపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: పొద్దెక్కిన పావని నిద్రలేవలేదు..శరీరం పచ్చగా మారడంతో) -
ప్రియుడికిచ్చి పెళ్లి చేయకుండా దూరం చేశారని..
చంద్రగిరి(చిత్తూరు జిల్లా): ప్రేమ పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని రెడ్డివారిపల్లి పంచాయతీ, ఎగువరెడ్డివారిపల్లిలోని ఎస్‌ఎల్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. చంద్రగిరికి చెందిన మునిరాజ కుమార్తె మోహనకృష్ణ(19) చిన్నతనంలోనే తల్లి మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఆమెను ఎగువరెడ్డివారిపల్లిలోని తన మేనమామ బాలకృష్ణ చూసుకుంటున్నారు. మోహన్‌కృష్ణ ఇంట్లోనే ఉంటూ డిస్టెన్స్‌లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్స రం చదువుతోంది. చదవండి: భర్తతో గొడవ.. ఇద్దరు పిల్లలతో సహా వివాహిత అదృశ్యం ఈ క్రమంలో నాగయ్యగారిపల్లికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. వారం రోజుల క్రితం బాలిక.. ప్రేమించిన యువకుడితో కలిసి పారిపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ప్రేమజంటకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. తన ప్రియుడికిచ్చి పెళ్లిచేయకుండా దూరం చేశారనే మనస్తాపంతో యువతి గురువారం ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వంశీధర్ తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ప్రేమవద్దన్నందుకు బాలిక ఆత్మహత్య
జీడిమెట్ల: ప్రేమ వద్దని తల్లిదండ్రులు మందలించినందుకు మైనర్ బాలిక చెరువులో దూకి అత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కె.బాలరాజు, బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. దర్గయ్య, లలిత దంపతులు కుత్బుల్లాపూర్ అయోధ్యనగర్‌లో ఉంటున్నారు. వీరి కుమార్తె 9వ తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో శివ, ఇందిర దంపతుల కుమారుడు (14) 9వ తరగతి చదువుతున్నాడు. ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారనే విషయం తల్లిదండ్రులకు తెలియడంతో బాలికను ఇంటి వద్దనే ఉంచుతున్నారు. బుధవారం ఉదయం బాలిక అపార్ట్మెంట్లో పని చేస్తున్న తండ్రి దర్గయ్యకు టిఫిన్ బాక్సు ఇచ్చి సుభాష్‌నగర్‌లో బాలుడిని కలిసింది. ఇద్దరు కలిసి వీరితో చదివే వేరే బాలుడి ఇంటికి వెళ్లి అక్కడ బాలుడి స్కూల్ బ్యాగును ఉంచారు. మద్యాహ్నం సైకిల్‌పై ఇద్దరూ వెళ్లారు. రాత్రైనా ఇద్దరు తిరిగి ఇంటికి రాకపోవడంతో ఇరువురి కుటుంబ సభ్యులు వేర్వేరుగా జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు. సీసీ పుటేజీలను పరిశీలించిన పోలీసులు బాలిక, బాలుడి చెప్పులు, బాలుడి సైకిల్‌ను జీడిమెట్ల ఫాక్స్‌సాగర్ వద్ద గుర్తించారు. ఇద్దరు చెరువులో దూకి ఉంటారనే అనుమానంతో గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం సాయంత్రం బాలిక(14) మృతదేహం చెరువు నీటిపై తేలడంతో ఒడ్డుకు తీసి మృతదేహాన్ని పోస్టుమార్డమ్ నిమిత్తం గాంధీ అస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. లభించని బాలుడి ఆచూకీ? బాలుడు బాలికతో పాటు నీటిలో దూకాడన్న అనుమానంతో పోలీసులు చెరువులో వెతకడం మొదలుపెట్టారు. ఎంతసేపైనా బాలుడి అచూకీ లభించకపోవడంతో పాటు బాలుడి తండ్రి సదరు బాలుడికి ఈత వచ్చని తెలిపారు. దీంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. గురువారం చీకటి పడటంతో బాలుడికోసం గాలింపు చర్యలు సైతం చేపట్టారు. (చదవండి: కిడ్నాపర్ల చెరలో నందగిరి వాసి) -
‘ఫేస్బుక్ గాళ్‌ఫ్రెండ్’ను కలిసిన తొలిసారే..
కోయంబత్తూరు: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన స్నేహితురాలు ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు గాజుముక్కతో ఆమె మెడను కోశాడు. ఆమెను కలిసిన తొలిసారే యువకుడు దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు తమిళనాడులోని కోయంబత్తూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కోయంబత్తూరుకు చెందిన కనకలక్ష్మి (21) అనే యువతి భారతీయార్ యూనివర్శిటీలో ఎంసీఏ తొలి సంవత్సరం చదువుతోంది. ఏడాది క్రితం ఫేస్బుక్ ద్వారా వేంబురాజ్ (28) అనే యువకుడు పరిచయమయ్యాడు. రామనాథపురం జిల్లాకు చెందిన వెంబురాజ్ చెన్నైలో ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ తరచూ ఛాటింగ్ చేసుకునేవాళ్లు. కొన్ని నెలల తర్వాత వెంబురాజ్ ప్రేమ విషయాన్ని తెలపగా, ఆమె తిరస్కరించింది. తాను చదువుపై దృష్టిపెట్టాలంటూ తెలిపింది. అయితే ఆన్లైన్లో ఇద్దరూ ఛాటింగ్ చేసుకునేవాళ్లు. కనకలక్ష్మి ఫోన్ నెంబర్ సంపాదించిన వెంబురాజ్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అతని ప్రవర్తనతో విసిగిపోయిన కనకలక్ష్మి మాట్లాడటం మానేసింది. దీంతో వెంబురాజ్ నేరుగా ఆమెను కలవాలనుకున్నాడు. గత బుధవారం భారతీయార్ యూనివర్శిటీకి వెళ్లి బస్‌స్టాప్‌లో కనకలక్ష్మిని తొలిసారి కలిశాడు. వెంబురాజ్ మరోసారి ప్రేమ, పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా, ఆమె తిరస్కరించింది. అతను వెంటనే అక్కడ ఉన్న బాటిల్‌ను పగలగొట్టి గాజు ముక్కతో ఆమె మెడను కోశాడు. అక్కడున్న విద్యార్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేసరికే వెంబురాజ్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పోలీసులు కనకలక్ష్మిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి వెంబురాజ్ను అరెస్ట్ చేశారు.