‘ఫేస్బుక్ గాళ్ఫ్రెండ్’ను కలిసిన తొలిసారే.. | 'FB friend' stabs Tamil Nadu girl with bottle at first meet | Sakshi
Sakshi News home page

‘ఫేస్బుక్ గాళ్ఫ్రెండ్’ను కలిసిన తొలిసారే..

Published Fri, Nov 4 2016 3:06 PM | Last Updated on Wed, Aug 29 2018 8:38 PM

‘ఫేస్బుక్ గాళ్ఫ్రెండ్’ను కలిసిన తొలిసారే.. - Sakshi

‘ఫేస్బుక్ గాళ్ఫ్రెండ్’ను కలిసిన తొలిసారే..

కోయంబత్తూరు: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన స్నేహితురాలు ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు గాజుముక్కతో ఆమె మెడను కోశాడు. ఆమెను కలిసిన తొలిసారే యువకుడు దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు తమిళనాడులోని కోయంబత్తూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

కోయంబత్తూరుకు చెందిన కనకలక్ష్మి (21) అనే యువతి భారతీయార్ యూనివర్శిటీలో ఎంసీఏ తొలి సంవత్సరం చదువుతోంది. ఏడాది క్రితం ఫేస్బుక్ ద్వారా వేంబురాజ్ (28) అనే యువకుడు పరిచయమయ్యాడు. రామనాథపురం జిల్లాకు చెందిన వెంబురాజ్ చెన్నైలో ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ తరచూ ఛాటింగ్ చేసుకునేవాళ్లు. కొన్ని నెలల తర్వాత వెంబురాజ్ ప్రేమ విషయాన్ని తెలపగా, ఆమె తిరస్కరించింది. తాను చదువుపై దృష్టిపెట్టాలంటూ తెలిపింది. అయితే ఆన్లైన్లో ఇద్దరూ ఛాటింగ్ చేసుకునేవాళ్లు. కనకలక్ష్మి ఫోన్ నెంబర్ సంపాదించిన వెంబురాజ్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అతని ప్రవర్తనతో విసిగిపోయిన కనకలక్ష్మి మాట్లాడటం మానేసింది. దీంతో వెంబురాజ్ నేరుగా ఆమెను కలవాలనుకున్నాడు. గత బుధవారం భారతీయార్ యూనివర్శిటీకి వెళ్లి బస్స్టాప్లో కనకలక్ష్మిని తొలిసారి కలిశాడు. వెంబురాజ్ మరోసారి ప్రేమ, పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా, ఆమె తిరస్కరించింది. అతను వెంటనే అక్కడ ఉన్న బాటిల్ను పగలగొట్టి గాజు ముక్కతో ఆమె మెడను కోశాడు.

అక్కడున్న విద్యార్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేసరికే వెంబురాజ్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పోలీసులు కనకలక్ష్మిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి వెంబురాజ్ను అరెస్ట్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement