Facebook Followers
-
ఫేస్బుక్లో హింస ఈ రేంజ్లో ఉందా!?
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే అకౌంట్లపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది జూన్ 16 నుంచి జులై 31 మధ్య కాలంలో సుమారు 33.3 మిలియన్ల కంటెంట్ పీస్ (ఇమేజ్)లను అకౌంట్ల నుంచి తొలగించినట్లు ప్రకటించింది. యూజర్లు సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉండేందుకు ఫేస్ బుక్ గత కొంత కాలంగా యూజర్లు టెక్నాలజీ, ఏఐలపై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. తద్వారా ఫేస్ బుక్ యూజర్లకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేలా ఇమేజెస్, కంటెంట్లపై కన్నేసింది. ఈ రెండింటిలో ఫేస్‌బుక్‌కు చెందిన 10 కంటెంట్ పాలసీ నిబంధనలతో పాటు ఆ సంస్థకు చెందిన మరో సోషల్ నెట్ వర్క్ ఇన్ స్టాగ్రామ్‌లో 8 పాలసీల నిబంధనల్ని ఉల్లంఘించిన అకౌంట్లపై చర్యలు తీసుకుంటుంది. సోషల్ మీడియా వల్ల హింస పెరిగిపోతుందా? కరోనా కారణంగా సోషల్ మీడియా వినియోగం రోజురోజుకి పెరిగిపోయింది. సరైన అవగాహన ఉన్నవారు మనీ ఎర్నింగ్ కోసం ఫేస్‌బుక్‌ను ఓ వేదికగా మార్చుకుంటున్నారు. అదే సమయంలో మరికొందురు రెచ్చగొడుతూ హింసను ప్రేరేపించేలా ఉన్న కంటెంట్లను భారీగా తొలగించామంటూ ఇటీవల ఫేస్బుక్ స్పోక్ పర్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జులై 16 నుంచి జులై 31 మధ్య కాలంలో 25.6 మిలియన్ల ఇమేజ్ కంటెంట్, హింసను రెచ్చగొట్టేలా ఉన్న 3.5 మిలియన్ల గ్రాఫికల్ ఇమేజెస్‌పై, 2.6 మిలియన్ల అడల్ట్ కంటెంట్ ఉన్న ఇమేజెస్‌లను తొలగించినట్లు తెలిపారు. వీటితో పాటు 1లక్షా 23,400 హరాస్ మెంట్ కంటెంట్ ఉన్న అకౌంట్లపై చర్యలు తీసుకుంటున్నట్లు,1504 రిపోర్ట్‌ల ఫిర్యాదులు అందాయని వెల్లడించింది. ఫేస్బుక్కే కాదు.. ఇన్ స్టాగ్రామ్ లో కూడా.. ఫేస్బుక్కే కాదు..ఇన్ స్టాగ్రామ్ పోస్ట్‌లపై చర్యలు తీసుకుంటున్నట్లు ఫేస్బుక్ యాజమాన్యం వెల్లడించింది. 1.1 మిలియన్ల హింసాత్మక పోస్ట్‌లు, 8,11,000 వేల సూసైడ్, సెల్ఫ్ ఇంజూరీ ఇమేజ్ కంటెంట్ లపై చర్యలకు ఉపక్రమించింది. జూన్ 16 నుంచి జులై 31 వరకు 265 అకౌంట్లపై యూజర్లు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. వాట్సాప్ లో సైతం ఫేస్బుక్ కు చెందిన మెసేజింగ్ ప్లాట్ ఫామ్ వాట్సాప్‌లో జూన్ 16 నుంచి జులై 31 వరకు 3 మిలియన్ కంటే ఎక్కువ అకౌంట్లును తొలగించింది. ఇదే సమయంలో సెర్చ్ ఇంజిన్ గూగుల్ కు 36,934 ఫిర్యాదులు అందగా..95,680 ఇమేజెస్‌ను తొలగించింది. చదవండి: ఇకపై ఈజీగా ఎలక్ట్రిక్ వెహికల్‌ను సొంతం చేసుకోవచ్చు! -
ఫేస్బుక్లో మరో సూపర్ ఫీచర్, వాయిస్,వీడియో కాలింగ్..
మనం ఫోన్ తో చేసే వాయిస్ కాల్, వీడియోకాల్‌ను ఇకపై ఫేస్ బుక్ నుంచి చేసే అవకాశం ఉంది. ఎస్. ఫేస్ బుక్ ను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ఆ సంస్థ సీఈఓ మార్క్ జూకర్ బెర్గ్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఇందులో భాగంగా యుజర్లను మరింత అట్రాక్ట్ చేసేందుకు వాయిస్ - వీడియా కాలింగ్ ఆప్షన్ పై వర్క్ చేస్తున్నారని బ్లూమ్ బెర్గ్ తెలిపింది. వాస్తవానికి ఈ ఫీచర్‌ను ఫేస్బుక్..'ఫేస్బుక్ మెసేంజర్'కు అటాచ్ చేసింది. దీంతో యూజర్లు వీడియో కాలింగ్ చేసుకోవాలంటే ఫేస్బుక్ మెయిన్ పేజ్‌ను క్లోజ్ చేసి మెసేంజర్‌లోకి వెళ్లేవారు. అలా వెళ్లడం వల్ల యూజర్లు ఫేస్బుక్ ను వినియోగించడం తగ్గిస్తున్నారని మార్క్ జూకర్ బెర్గ్ గుర్తించారు. అయితే అప్పటి వరకు ఒకటిగా ఉన్న ఫేస్ బుక్ ను - ఫేస్ బుక్ మెసెంజర్ ను 2014లో వేరు చేశారు. వాయిస్ - వీడియో కాలింగ్ ఆప్షన్ ను ఫేస్ బుక్ మెసెంజర్‌కు జోడించారు. ఇప్పుడు మళ్లీ ఇదే ఫీచర్ ను ఫేస్బుక్ డెవలప్ చేసే పనిలో పడిందని బ్లూమ్ బెర్గ్ తన కథనంలో ప్రస్తావించింది.త్వరలో ఈ ఫీచర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని పేర్కొంది. -
ఫేస్‘బుక్'పై భారీ జరిమానా
-
ఫేస్‘బుక్'కు అమెరికా కోర్టు షాక్
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ కు అమెరికా కోర్టు షాక్ ఇచ్చింది. ఫేసుబుక్ వినియోగదారుల అనుమతి లేకుండా ఫోటో ఫేస్-ట్యాగింగ్, ఇతర బయోమెట్రిక్ డేటాను ఉపయోగించడంపై 650 మిలియన్ డాలర్లు(సుమారు రూ.4,780 కోట్లు) నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ అమెరికా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత గోప్యతకు ఫేస్బుక్ భంగం కలిగిందంటూ అమెరికాలోని ఇల్లినాయిస్లో 2015లో దాఖలు చేసిన క్లాస్-యాక్షన్ పిటిషన్‌పై యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జేమ్స్ డొనాటో విచారణ చేపట్టారు. ఇల్లినాయిస్లో దాదాపు 1.6 మిలియన్ల మంది ఫేసుబుక్ వినియోగదారులు వాదనలు సమర్పించారు. విచారణ చేపట్టిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జేమ్స్ డొనాటో ఫేస్బుక్ ప్రైవసీ పాలసీ నిబంధనలను పాటించలేదని తీర్పునిచ్చారు. ఇది యూజర్ల గోప్యత భంగం కలిగించడమే అని పేర్కొన్నారు. ఫేసుబుక్ వల్ల భంగం కలిగిన ప్రతి ఒక్కరికి 345 డాలర్ల చొప్పున మొత్తం 650 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రైవసీ పాలసీకి సంబంధించిన కేసుల్లో ఇంత మొత్తంలో నష్ట పరిహారం చెల్లించడం ఇదే తొలిసారని జడ్జి డొనాటో వెల్లడించారు. పిటీషన్ వేసిన చికాగో న్యాయవాది జే ఎడెల్సన్ చికాగో ట్రిబ్యూన్‌తో మాట్లాడుతూ తీర్పును అప్పీల్ చేయకపోతే ఫేస్బుక్ మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుందని వెల్లడించారు. దీనికి సంబంధించి ఫేస్బుక్ ప్రతినిధి స్పందిస్తూ.. తమ వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించడమే కర్తవ్యమన్నారు. ఈ విషయంపై పునరాలోచన చేయనున్నట్లు వెల్లడించారు. చదవండి: రూ.299కే బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ మార్చి నెలలో 11 రోజులు బ్యాంకులకు సెలవు -
నాటి రాళ్లు నేటి పూలు.. మన్నించు మారియా!
ఆరేళ్ల క్రితం.. ‘సచిన్ ఎవరో నాకు తెలీదు’ అని టెన్నిస్ తార మారియా షరపోవా అన్నందుకు ఆగ్రహించిన సచిన్ అభిమానులు ఇప్పుడు ఆ షరపోవాకే.. ‘మన్నించు మారియా, నువ్వన్నది కరెక్టే. అతడు నీకు తెలిసి ఉండాల్సినంత మనిషి కాదు’ అని ఆమె ఫేస్బుక్లో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఆమెకు లైకుల మీద లైకులు కొడుతున్నారు. రైతు ఉద్యమానికి మద్దతుగా నిలిచిన విదేశీ ప్రముఖుల్ని హెచ్చరిస్తూ.. ‘ఇది మా సొంత విషయం’ అని సచిన్ ట్వీట్ చేయడమే ఇందుకు కారణం. ఢిల్లీ సరిహద్దులలో కొన్ని నెలలుగా రైతు ఉద్యమం జరుగుతోంది. ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాలు తమ మెడకు ఉరి వంటివి కనుక వాటిని రద్దు చేయాలని రైతుల డిమాండ్. ప్రభుత్వానికి, రైతులకు మధ్య ఎన్ని విడతలుగా చర్చలు జరిగినా ఒక ఫలవంతమైన ముగింపు రావడం లేదు. ఈలోపు వివిధ కారణాల వల్ల కనీసం 170 మంది ఉద్యమ రైతులు మరణించారని వస్తున్న వార్తలతో ప్రపంచం నలుమూలల నుంచి రైతుల డిమాండ్‌కు ట్వీట్ల ద్వారా మద్దతు లభిస్తోంది. స్వీడన్ నుంచి పర్యావరణ పరిరక్షణ ఉద్యమ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్, బార్బడోస్ పాప్ గాయని రిహాన్నా వంటివారు రైతులకు తమ సంఘీభావం ప్రకటించారు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. విదేశీ సానుభూతి పరులకు వ్యతిరేకం గా పెట్టిన ట్వీట్ ఆయన అభిమానుల ఆగ్రహానికి కారణం అయింది. ‘భారత్ తన సార్వభౌమాధికారం విషయంలో రాజీకి రానవసరం లేదు. బయటి శక్తులు వీక్షకులుగా ఉండొచ్చు కానీ, భాగస్వాములు కాదగరు’ అని థన్‌బర్గ్, రిహాన్నాలను ఉద్దేశించే సచిన్ ఆ ట్వీట్ పెట్టారు. ∙∙ నిప్పు జ్వాల గాలి దిశను బట్టి వ్యాíపిస్తుంది. ఆగ్రహ జ్వాల ఎటువైపు అధాటున మళ్లుతుందో ఎవరూ ఊహించలేరు. సచిన్‌ను ‘క్రికెట్ దేవుడు’ అని ఆరాధించిన ఆయన అభిమానులు.. రైతులకు మద్దతు ఇస్తున్న విదేశీయుల్ని సచిన్ ‘హద్దుల్లో ఉండండి’ అని అర్థం వచ్చేలా హెచ్చరించినందుకు ఆయనపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ నిరసన నేరుగా లేదు. పరోక్షంగా ఉంది. పరోక్షంగా ఉన్నప్పటికీ శక్తిమంతంగా ఉంది. రష్యన్ టెన్నిస్ దిగ్గజం మారియా షరపోవా ఆరేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానంగా ‘సచిన్ ఎవరో నాకు తెలియదు’ అని అన్నందుకు ఆగ్రహోదగ్రులైన భారతీయులు, ముఖ్యంగా మలయాళీలు షరపోవా ఫేస్బుక్ వాల్‌పై కూర్చొని ఆనాడు ఆమెను అనరాని మాటలు అన్నారు. చాలావరకు అవి భారతీయ భాషల్లో ఉన్నాయి కనుకు షరపోవాకు అర్థమయ్యే అవకాశం లేదు. ఇంగ్లిష్‌లో ఉన్న కామెంట్స్నైనా ఆమె పట్టించుకున్న దాఖలాలు లేవు. కాని ఇప్పుడు అదే సచిన్ అభిమానులు.. అదే షరపోవా ఫేస్ బుక్ వాల్ మీదకు వెళ్లి ఆమెకు సారీ చెబుతున్నారు. ‘మన్నించు మారియా, నువ్వన్నది కరెక్టే. అతడు మీకు తెలిసి ఉండాల్సినంత మనిషి కాదు’ అని పోస్ట్‌ల మీద పోస్ట్‌లు పెడుతున్నారు. ఒకరైతే.. ‘మారియా, ఇండియా రండి. నా రెస్టారెంట్లో మీ కోసం ప్రత్యేకంగా షవర్మా, కుళిమంతీ (బిర్యానీ) చేయించి పెడతాను’ అని ఆమెను ఆహ్వానించారు. నాడు మారియాపై పడిన రాళ్లే, ఇప్పుడు పూలుగా మారుతున్నాయి. ‘డియర్ మారియా, వి ఆర్ సారీ. సచిన్‌కి సపోర్ట్ చేస్తూ ఆనాడు మీపై సైబర్ అటాక్ చేసినందుకు బాధపడుతున్నాం’ అని ఒకరు; ‘మారియా, ఆరోజు నాకు పరిణతి లోపించింది. సచిన్ తెలియదు అన్నందుకు నిన్ను నానా మాటలు అన్నాను. నన్ను క్షమించు’ అని ఇంకొకరు పోస్టు పెట్టారు. ఒక మహిళ అయితే.. ‘సారీ సిస్టర్, యువర్స్ ట్రూలీ’ అంటూ షరపోవాకు లైకుల మీద లైకులు కొట్టారు. ఈ ప్రేమ జ్వాల అంతకంతకూ పెరిగిపోయి, సచిన్ ఉండే ముంబై మీదుగా రైతులు పోరాడుతున్న ఢిల్లీ వరకు వ్యాపించేలా మారియాపై పూల వర్షం కురుస్తోంది. ఆ పూల వానను రైతుల పోరాటానికి ఆశీస్సులనే అనుకోవాలి. రిహాన్నా, గ్రెటా థన్‌బర్గ్ -
కూల్‌గా.. కామ్‌గా..!
ఎన్నికల ప్రచారం అంటే మైకుల హోరు.. డప్పువాయిద్యాలు.. బాణసంచా చప్పుళ్లు వినిపించేవి. కాలం మారింది. కొంత పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. తాము చెప్పదలచుకున్న విషయాన్ని క్షణాల్లో ఓటర్లు, కార్యకర్తలకు చేరిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకు వాట్సప్, ఫేస్‌బుక్‌లను ఉపయోగించుకుంటున్నారు. తమ పార్టీ మేనిఫోస్టోతో పాటు.. ఎన్నికల్లో తమను గెలిపిస్తే చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కామ్‌గా.. కూల్‌గా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మిర్యాలగూడ... టీఆర్ఎస్ అభ్యర్థి : నల్లమోతు భాస్కర్‌రావు ఫేస్బుక్ ఖాతా : నల్లమోతు భాస్కర్‌రావు ఫేస్ బుక్ ఫెండ్స్ : 35,678 పోస్టింగ్‌లు : ప్రతి రోజు ఎన్నికల ప్రచారంలో నిర్వహించిన ఫొటోలతో పాటు వీడియోలు ఫేస్బుక్లో పోస్టులు చేస్తున్నారు. అదే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు తిరిగి అధికారంలో వస్తే చేస్తామని చెబుతున్న ఎన్నికల మేనిఫెస్టోలను కూడా ప్రచారంలో పెట్టారు. వ్యూవర్స్ : ఎక్కువగా పార్టీ కార్యకర్తలే ఉన్నారు. ఈ సారి కూడా ఎన్నికల్లో గెలుస్తాడని, మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనే పోస్టులు పెడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి : ఆర్.కృష్ణయ్య ఫేస్బుక్ ఖాతా : ర్యాగా కృష్ణయ్య ఫేస్బుక్ ఫ్రెండ్స్ : 38,521 పోస్టింగ్‌లు : ప్రతి రోజు ఎన్నికల ప్రచారం ఫొటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా వచ్చిన వీడియో క్లిప్పింగ్‌లు, మహాకూటమి అధికారంలోకి వస్తే చేస్తామని చెబుతున్న ఎన్నికల మేనిఫెస్టోలకు సంబంధించిన ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు. వ్యూవర్స్ : బీసీలంతా ఏకమై గెలిపించాలని కోరుతూ ఉద్యమ నాయకుడు ఆర్ కృష్ణయ్యను గెలిపించాలని కోరుతూ పోస్టింగ్‌లు పెడుతున్నారు. నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి : కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్ పేరు : నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫేస్బుక్ ఫ్రెండ్స్ సంఖ్య : 5,000 మంది నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన పేరు మీద ఫేస్బుక్ ప్రారంభించారు. ఫేస్బుక్లో 5వేల మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రతిరోజు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర, నియోజకవర్గానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను, నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను పోస్టింగ్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఫేస్బుక్ ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, మేనిఫెస్టో అంశాలను వివరించడంతోపాటు లైవ్ ప్రోగ్రామ్‌లు కూడా నిర్వహిస్తూ నేరుగా ప్రసంగాలు కూడా చేస్తున్నారు. అంతేగాక ఉత్తమ్సేన, ఉత్తమ్ యువసేన పేరుతో మరో రెండు ఫేస్బుక్ ఖాతాలు కూడా ఆయన అనుచరులు ప్రారంభించి విస్తృత ప్రచారాలు చేస్తున్నారు. హూజూర్‌నగర్... శానంపూడి సైదిరెడ్డి : టీఆర్ఎస్ పార్టీ ఫేస్బుక్ పేరు : శానంపూడి సైదిరెడ్డి, అంకిరెడ్డి ఫౌండేషన్, సై యూత్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ సంఖ్య : 5,000 టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి తన పేరుమీద ప్రారంభించిన ఫేస్బుక్లో తన ప్రచార పోస్టింగ్‌లు పెడుతున్నారు. స్థానికత నినాదంతో ముందుకు వెళుతున్న ఆయన ఫేస్‌బుక్‌లోని తన ఫాలోవర్స్‌ను చైతన్యం చేసేందుకు ఇతర ప్రాంతాలకు చెందిన అభ్యర్థుల వల్ల నియోజకవర్గం ఏ విధంగా నష్టపోయిందనే అంశాలను వివరిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను కూడా పోస్టింగ్ చేయడంతోపాటు రాష్ట్రవ్యాప్త అంశాలను కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అంతేగాక సైదిరెడ్డి తన తండ్రి పేరు మీద ప్రారంభించిన అంకిరెడ్డి ఫౌండేషన్, సై యూత్ పేర్లపై కూడా ఫేస్‌బుక్‌లు ప్రారంభించారు. ఈ రెండు సోషల్ మీడియా ఖాతాలను సుమారు 10 వేల మంది ఫాలో అవుతున్నారు. అంకిరెడ్డి ఫౌండేషన్ సభ్యులతో పాటు సై యూత్ సభ్యులు కూడా సైది రెడ్డికి మద్దతుగా విస్తృతంగా పోస్టింగ్‌లు పెడుతూ ప్రచారం చేస్తున్నారు. భువనగిరి... ఫేస్బుక్ పేరు : అనిల్‌కుమార్‌రెడ్డి కుంభం ఫేస్బుక్ ఫ్రెండ్స్ సంఖ్య : 22,802 ఫేస్బుక్లో పెడుతున్న పోస్టింగ్‌లు: ప్రస్తుతం ఎన్నికల ప్రచార చిత్రాలు. ఎన్నికల ప్రచార లైవ్ కార్యక్రమాలు. ఎన్నికల ప్రచా రాలకు సంబంధించిన లైవ్ వీడియోలు. నాలుగేళ్ల కాలంలో భువనగిరి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి చేసిన పోరాటాలు, పాదయాత్రలు, సమావేశాలు. ధర్నాలు, రాస్తారోకోలు వంటి పోస్టింగ్‌లు పెడుతున్నారు. వీటితో సమాజ సేవా కార్యక్రమాలకు సంబంధించిన చిత్రాలు ఫేస్బుక్లో పోస్టింగ్ చేస్తున్నారు. జోరుగా ప్రచారం.. తిరుమలగిరి (తుంగతుర్తి) : తుంగతుర్తి నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఫేస్బుక్, వాట్సప్‌లలో తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గాదారి కిశోర్‌కుమార్ తన పేరు మీదనే ఫేస్బుక్, ట్విట్టర్లలో ఖాతాలు తెరిచి ప్రతిరోజు ప్రచారానికి సంబంధించిన ఫొటోలు, కార్యక్రమాల వివరాలను పోస్ట్ చేస్తున్నారు. దీంతో పాటు తుంగతుర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ, జీకే యూత్, అన్ని మండలాల గ్రూపులతో వాట్సప్ ఖాతాలు తెరిచి ప్రతిరోజు కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అద్దంకి దయాకర్ ఫేస్బుక్, వాట్సప్‌లలో 25 గ్రూపుల ద్వారా తన ప్రచార కార్యక్రమాన్ని, పర్యటన వివరాలను తెలియజేస్తున్నారు. బీజేపీ పార్టీ అభ్యర్థి కడియం రామచంద్రయ్య సామాజికమాద్యమాల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్థి పేరు : గాదరి కిశోర్‌కుమార్. ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల పేర్లు : గాదరి కిశోర్‌కుమార్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ సంఖ్య : 4448 ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య : 2560 అభ్యర్థి పేరు : అద్దంకి దయాకర్ ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల పేరు : అద్దంకిదయాకర్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ సంఖ్య : 5 వేలు ట్విట్టర్ఫాలోవర్ల సంఖ్య : 1670 అభ్యర్థి పేరు :కడియం రామచంద్రయ్య ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల పేరు : కడియం రామచంద్రయ్య ఫేస్బుక్ ఫ్రెండ్స్ సంఖ్య : 3859 -
ఫేస్బుక్ తంటా..యువకుడిపై పాశవిక దాడి!
మహబూబ్‌నగర్ క్రైం: పాతకక్ష్యలను మనసులో పెట్టుకుని కొందరు ఇద్దరు యువకులపై పాశవిక దాడికి పూనుకున్నారు. ఈ సంఘటన పట్టణంలో హల్చల్ సృష్టించింది. రూరల్ ఎస్ఐ భాస్కర్‌రెడ్డి కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని పీర్లబాయికి చెందిన శ్యాంసుందర్ అతని స్నేహితుడు రోహిత్ మంగళవారం లైసెన్స్ కోసం ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మర్లుకు చెందిన చాణక్య అతని స్నేహితులు జగదీష్, పల్లె నరేష్, పల్లె దేవ, కృతిక్తోపాటు మరికొందరు కలిసి శ్యాంసుదర్, రోహిత్‌ను పట్టుకుని వారి కాలనీకి తీసుకుకెళ్లారు. దుస్తులు తొలగించి నగ్నంగా చేసి చేతులతో, కర్రలతో దాడిచేశారు. అంతటితో ఆగకుండా వీడియో చిత్రీకరించారు. బయటికి వచ్చిందిలా.. ఆగస్టు 25న చాణిక్య, వేపూర్‌గేరికి చెందిన బంటి ఫొటోలను గుర్తుతెలియని వ్యక్తులు ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. అయితే అందులో చాణక్య ఫొటోను ఎక్కువ మంది లైక్ కొట్టడంతో పాటు కామెంట్లు చేశారు. నాకంటే ఎక్కువ లైక్‌లు అతనికి వచ్చాయని బంటి తట్టుకోలేక చాణక్యను కొట్టాలని పతకం రచించాడు. అందులో భాగంగానే చాణక్య స్నేహితుడు శ్రీకాంత్‌చారిని వెంట పెట్టుకొని బంటి అతని స్నేహితులు దత్తు, శ్యామ్‌సుందర్, జగదీష్, శివ, సందీప్, శివసాయి, రోహిత్, విష్ణు, మధుచారి, నందివర్ధన్రెడ్డిలతో కలిసి ఆగస్టు 25న రాత్రి 9.30గంటలకు చాణక్య ఇంటికి వెళ్లారు. శ్రీకాంత్ చారితో అతనిని బయటకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేసి కొంత దూరం మాటల్లో పెట్టి తీసుకెళ్లారు. బంటికి సారీ చెప్పాలని అతని స్నేహితులు చాణక్యతో గొడవ పడ్డారు. వినకపోవడంతో ఇనుప రాడ్లు, కట్టెలతో చాణక్యపై దాడి చేశారు. బట్టలు తీసి నగ్నంగా చేసి కొట్టడంతో రక్తగాయాలయ్యాయి. ఈ విషయం బయటికి పొక్కలేదు. ప్రతికారం తీర్చుకోవాలని చాణక్య అదేపద్ధతిలో చాణక్య అతని స్నేహితులు కలిసి శ్యాంసుందర్, రోహిత్‌పై దాడి చేశారు. శ్యాంసుందర్ తల్లి యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హోమో సెక్స్‌లో పాల్గొనలేదని చంపేశారు!
ప్రకాశం, దర్శి: ఫేస్బుక్లో పరిచయమైన ఓ యువకుడిని పార్టీ ఉందంటూ పిలిచారు. అనంతరం హోమో సెక్స్(స్వలింగ సంపర్కం)లో పాల్గొనాలంటూ అతడిపై ఒత్తిడి తెచ్చారు. అందుకు ఒప్పుకోని ఆ యువకుడు, విషయాన్ని అందరికీ చెబుతానని హెచ్చరించడంతో గొంతునులిమి చంపేశారు. ప్రకాశం జిల్లా దర్శిలో గత జూన్ 26న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన బ్రహ్మారెడ్డి కేసును పోలీసులు ఛేదించారు. ఓ మైనర్ సహా నలుగురు నిందితులతో పాటు వారికి సహకరించిన ఓ నిందితుడి తండ్రిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శి మండలం లంకోజనపల్లికి చెందిన పెదరామిరెడ్డి కుమారుడు బ్రహ్మారెడ్డి (27) ఇటీవల టెట్‌లో ఉత్తీర్ణత సాధించాడు. డీఎస్సీ కోసం సిద్ధమవుతున్నాడు. గత జూన్ 26న దర్శి నుంచి తూర్పువీరాయపాలెం వెళ్లే రోడ్డులోని ఓ సుబాబుల్ తోటలో అనుమానస్పద స్థితిలో అతడు మృతిచెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతుడి కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో దర్శికి చెందిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. అందరికీ చెబుతానని హెచ్చరించడంతో... దర్శికి చెందిన సాయికిరణ్‌కు ఫేస్బుక్లో బ్రహ్మారెడ్డితో పరిచయం ఏర్పడింది. జూన్ 26న పార్టీ ఉందంటూ అతడు బ్రహ్మారెడ్డిని తూర్పువీరాయపాలెం వెళ్లే రోడ్డులోని సుబాబుల్ తోట వద్దకు తీసుకెళ్లాడు. అతడితో పాటు తన స్నేహితులు జలపాటి శ్రావణ్‌కుమార్, పందిటి నరసింహారావు, మరో మైనర్ బాలుడితో కలిసి మద్యం సేవించారు. అనంతరం బ్రహ్మారెడ్డిని తమతో పాటు స్వలింగ సంపర్కంలో పాల్గొనాలని ఒత్తిడి చేశారు. అందుకు అతడు నిరాకరించడంతో చెట్టుకు కట్టేశారు. మీరు ఇలాంటి వారని అందరికీ చెబుతానంటూ హెచ్చరించడంతో.. పరుపు పోతుందని భావించిన వారు అతడి గొంతు నులిమి చంపేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయాన్ని శ్రావణ్ తన తండ్రి బ్రహ్మయ్యకు చెప్పడంతో అతడు నిందితులు పారిపోయేందుకు సహకరించడంతోపాటు సాక్ష్యాలు దొరక్కుండా చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో నిందితులతో పాటు బ్రహ్మయ్యను కూడా అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. -
రెండు కోట్ల నలభై లక్షలురెండు కోట్ల నలభై లక్షలు
రెండు కోట్ల నలభై లక్షలంటే కాజల్ అగర్వాల్ తీసుకుంటున్న పారితోషికం గురించి చెబుతున్నాం అనుకుంటున్నారా? అదేం కాదు. ఆ మాటకొస్తే.. దక్షిణాది హీరోయిన్లు 2 కోట్లు టచ్ చేయడం కష్టమే. మరి.. ఏ విషయంలో కాజల్ అగర్వాల్ ఈ రికార్డ్ సాధించారు అంటే.. ‘ముఖ పుస్తకం’ ద్వారా అన్నమాట. అంటే.. ఫేస్బుక్ అండీ. ‘‘ నా ఫాలోయర్ల సంఖ్య 24 మిలియన్స్‌కు చేరుకుంది. చాలా ఆనందంగా ఉంది’’ అని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. 24 మిలియన్స్ అంటే అక్షరాల 2 కోట్ల 40 లక్షల మంది. ఈ లెవల్లో కాజల్ ఫాలోయర్స్‌ని సంపాదించుకున్నారంటే ఆమెకు ఎంత క్రేజ్ ఉండి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ బ్యూటీ ఎక్కువగా ఫేస్బుక్ లైవ్ చాట్స్‌ను ప్రిఫర్ చేస్తుంటారు. ఫాలోయర్స్ సంఖ్య పెరగడానికి ఇదో కారణం అని ఊహించవచ్చు. ఈ సంగతి ఇలా ఉంచితే.. బుధవారం తన తల్లి సుమన్ అగర్వాల్ బర్త్‌డే సెలబ్రేట్ చేశారు కాజల్. ‘‘నాకు తెలిసిన అందమైన మహిళ మా అమ్మనే. ఆమెను అమ్మా అని పిలుస్తున్నందుకు అదృష్టంగా ఫీలవుతున్నాను. నా రోల్ మోడల్, గైడ్, స్ట్రెంత్ అన్నీ మా అమ్మగారే’’అని పేర్కొన్నారు కాజల్. ఇక సినిమాల విషయానికొస్తే... ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న సినిమాలోనూ, బాలీవుడ్ ‘క్వీన్’ తమిళ రీమేక్ ‘ప్యారిస్..ప్యారిస్’లోనూ ఆమె కథానాయికగా నటిస్తున్నారు. -
ఇల్లు కట్టించిన ఫేస్బుక్ మిత్రులు..
ఆనందంలో నిరుపేద పుష్ప కుటుంబీకులు బెల్లంపల్లి (మంచిర్యాల): పేదరికంలో మగ్గుతున్న కుటుంబానికి ఫేస్బుక్ స్నేహితులు గూడు కల్పించారు. రూ.లక్షా ఆరు వేల రూపాయలతో ఇంటిని నిర్మించారు. ఆదివారం గృహ ప్రవేశం చేయనున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాలబస్తీకి చెందిన లక్కపట్ల పుష్పది నిరుపేద కుటుంబం. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. పుష్పకు ఇద్దరు చెల్లెళ్లు. వారి వివాహ బాధ్యతలను స్వీకరించిన పుష్ప పెళ్లి చేసుకోలేదు. ఓ చెల్లెలికి పెళ్లి చేయడంతో ఆమె ఓ కూతురు రమ్యకు జన్మనిచ్చింది. ఆ తర్వాత చెల్లెలు భర్త అకాల మరణం చెందాడు. రమ్య పుట్టుకతోనే వికలాంగురాలు కావడంతో పుష్ప ఆమెను దత్తత తీసుకుంది. వీరి దుస్థితిని గమనించిన బెల్లంపల్లి మైహార్ట్ బీట్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సుదర్శన్, కల్పన జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో రమేశ్ ఈ నెల 1న పుష్ప దీనస్థితిని ఫేస్బుక్లో పోస్ట్ చేసి మిత్రుల సహకారం అర్థించగా.. రూ.1.06 లక్షలు జమయ్యాయి. వీటితో పుష్పకు ఇల్లు నిర్మించారు. -
ప్రధాని తర్వాత కోహ్లినే...
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ... ఫేస్బుక్లో భారత్ నుంచి అత్యధిక మంది ఫాలో అవుతున్న సెలబ్రిటీగా నిలిచాడు. అతను బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌ను అధిగమించాడు. ప్రస్తుతం 3 కోట్ల 57 లక్షల మంది కోహ్లిని ఫాలో అవుతున్నారు. ఓవరాల్‌గా ప్రధాని నరేంద్ర మోదీ (4 కోట్ల 22 లక్షలు) నంబర్‌వన్‌గా ఉన్నారు. -
ఒక లైక్ ఖరీదు.. రూ. 2.58 లక్షలు!
మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉందా? అందులో వచ్చే అప్డేట్లకు లైకులు కొడుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. కాస్తంత జాగ్రత్తగా చూసి అందులో కంటెంట్ ఏముందో చూసుకుని మరీ లైక్ కొట్టండి. లేకపోతే మీరు కూడా భారీ మొత్తంలో జరిమానా కట్టుకోవాల్సి ఉంటుంది. వేలు ఉంది కదా, దాంతో టచ్ చేస్తే చాలు లైక్, లవ్ లాంటి బటన్లు యాక్టివేట్ అవుతాయని అనుకోకండి. స్విట్జర్లండ్లో ఇలాగే లైక్ కొట్టినందుకు ఓ వ్యక్తి ఏకంగా రెండున్నర లక్షల రూపాయల జరిమానా కట్టుకోవాల్సి వచ్చింది. పరువునష్టం కలిగించేవిగా ఉన్న వ్యాఖ్యలకు లైక్ కొట్టినందుకు జడ్జి ఆ మొత్తంలో జరిమానా విధించారు. విషయం ఏమిటంటే.. ఎర్విన్ కెస్లర్ అనే వ్యక్తి జంతువుల హక్కుల గ్రూపు నడిపిస్తుంటారు. ఆయన చేసిన పోస్టుల మీద కొంతమంది వివక్షాపూరితమైన కామెంట్లు చేస్తారు. అలాంటి వ్యాఖ్యల మీద ఓ వ్యక్తి లైక్ కొట్టినందుకు జడ్జిగారికి అతడి మీద కోపం వచ్చింది. లైక్ చేయడం ద్వారా ఆ వివక్షాపూరిత వ్యాఖ్యలను సమర్థిచినట్లు అయిందని జడ్జి చెప్పారు. ఆ చర్చలలో పాల్గొన్న చాలామంది మీద కెస్లర్ దావాలు వేశారు. కెస్లర్ గురించి కామెంట్లు చేసిన కొంతమందిని కూడా కోర్టు దోషులుగా నిర్ణయించింది. సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యల మీద పరువునష్టం దావాలు బాగానే పడుతున్నాయి. ఇంతకుముందు ఒక ఫ్యాషన్ డిజైనర్ మీద ఇలాగే సోషల్ మీడియాలో అవమానకరంగా వ్యాఖ్యలు చేసినందుకు గాయన కోర్ట్నీ లవ్‌కు ఏకంగా 3.50 లక్షల డాలర్ల జరిమానా పడింది. అలాగే ట్విట్టర్లో అవమానకరమైన కామెంట్లు చేసినందుకు బ్రిటిష్ పత్రికలోని కాలమిస్టుకు 30వేల డాలర్ల జరిమానా విధించారు. ఇప్పటివరకు ఇలా కామెంట్లు చేసినందుకు జరిమానాలు పడ్డాయి గానీ, ఒక కామెంటును లైక్ చేసినందుకు జరిమానా పడటం మాత్రం ఇదే తొలిసారి అని స్విస్ న్యాయవాదులు చెబుతున్నారు. దాన్ని బట్టి చూస్తే ఇక మీద ఫేస్బుక్లో ఏమైనా లైక్ చేయాలన్నా కూడా కాస్తంత జాగ్రత్తగా ఉండక తప్పదని అంటున్నారు. -
ఫేస్బుక్ ద్వారా కిలాడీ లేడీ మోసాలు
-
ఫైవ్‌స్టార్ హోటల్లో.. ఫేస్బుక్ స్నేహితురాలిపై అత్యాచారం
గుజరాత్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తనకు ఫేస్బుక్లో పరిచయమైన గృహిణిని ముంబైలో ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌కు పిలిపించుకుని అక్కడ అత్యాచారం చేశాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మూడేళ్ల క్రితం వీళ్లిద్దరికీ ఫేస్బుక్లో పరిచయమైంది. కొన్నాళ్ల తర్వాత ఫోన్ నంబర్లు కూడా ఇచ్చిపుచ్చుకుని తరచు మాట్లాడుకునేవారు. వాట్సప్‌లో కూడా ఇద్దరూ చాట్ చేసుకునేవారని ఓ పోలీసు అధికారి తెలిపారు. తాను ముంబైకి వచ్చానని, ఒకసారి కలుద్దామని అతడు చెప్పడంతో ఆమె సరేనన్నారు. కాఫీ తాగేందుకు ఫైవ్ స్టార్ హోటల్లోని తన గదికి రావాలని పిలిచాడు. తొలుత ఆలీబాగ్‌లోని ఫాంహౌస్‌లో తన కుటుంబంతో కలిసి వారాంతం గడిపేందుకు వచ్చిన ఆమె.. అతడు కాల్ చేయడంతో ముంబైకి వెళ్లారు. అతడిని కలిసిన తర్వాత మళ్లీ అలీబాగ్ వచ్చేయాలని ఆమె అనుకున్నారు. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ఆమెను కలిసి, అక్కడినుంచి క్యాబ్‌లో హోటల్‌కు తీసుకెళ్లాడు. ముందు మంచినీళ్లు తాగమని ఇచ్చాడు. నీళ్లు తాగిన తర్వాత తనకు కాస్త మత్తుగా అనిపించిందని, తాను స్పృహ తెలిసీ తెలియని స్థితిలో ఉండగా అతడు తనపై అత్యాచారం చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెలకువ వచ్చిన తర్వాత ఆలీబాగ్ వెళ్లి జరిగిన విషయాన్ని తన భర్తకు తెలిపారు. వెంటనే ఆమె భర్త వ్యాపారవేత్తకు ఫోన్ చేసి గొడవపడ్డారు. వాస్తవానికి మరో రోజు ఉండాల్సిన ఆ వ్యక్తి.. అదేరోజు హోటల్ ఖాళీ చేసి వెళ్లిపోయాడు. ఫోన్ కూడా స్విచాఫ్ చేసేశాడు. భర్తతో కలిసి స్టేషన్‌కు వెళ్లిన బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సినీ నటిని గర్భవతిని చేసి...
బంజారాహిల్స్(హైదరాబాద్): ఫేస్బుక్లో పరిచయమైన యువతిని ప్రేమిస్తున్నట్లు నమ్మించి ఏడాదిపాటు సహజీవనం చేయడమేగాక ఆమె గర్భవతి అయ్యాక అబార్షన్ చేయించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకు ముఖం చాటేసిన బీటెక్ విద్యార్థిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. రహ్మత్‌నగర్‌లో నివాసం ఉండే యువతి(23) సినీ నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పని చేసేది. గుంటూరు జిల్లా వేల్పూరు గ్రామానికి చెందిన మేడ యశ్వంత్‌కుమార్ అనే బీటెక్ విద్యార్థితో 2014లో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడడంతో‡హ్మత్నగర్లో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. 2016 డిసెంబర్ 2న యశ్వంత్‌కుమార్ అదే గదిలో ఆమెకు పసుపుతాడు కట్టి పెళ్ళి చేసుకున్నట్లు నమ్మించి శారీరకంగా దగ్గరయ్యారు. ఇటీవల ఆమె గర్భవతికాగా స్థానిక ఆస్పత్రికి తీసుకెల్లి అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా, అందుకు అతడు నిరాకరించడంతో బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు యశ్వంత్‌కుమార్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. -
అన్ని కోట్ల మంది యూజ్ చేస్తున్నారా!
న్యూయార్క్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సంస్థ రూపొందించిన ఫేస్ బుక్ లైట్ యాప్ ను ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు వినియోగిస్తున్నారు. నెలవారీగా ఫేస్ బుక్ యాప్ వినియోగంపై సంస్థ జరిపిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ దీనిపై హర్షం వ్యక్తం చేశారు. ఈ యాప్ ను 2015 జూన్ నెలలో లాంచ్ చేశారు. 'సాధారణ ఫేస్ బుక్ యాప్ యూజ్ చేయాలంటే స్మార్ట్ ఫోన్ ర్యామ్ కాస్త ఎక్కువగా ఉండాలి. 1జీబీ కంటే తక్కువ ర్యామ్ ఉన్న స్మార్ట్ ఫోన్లు వాడే యూజర్ల ఇబ్బందులను తొలగించేందుకు సంస్థ ఫేస్ బుక్ లైట్ యాప్ ను ఆవిష్కరించింది' అని జుకర్ బర్గ్ తెలిపారు. '50 కంటే ఎక్కువ భాషలలో, లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా, యూరఫ్ ఖండాలలో 150కి పైగా దేశాల నెటిజన్లు ఈ యాప్ ను యూజ్ చేస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యూజర్లు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ ఎఫ్బీ యాప్ కంటే లైట్ యాప్ తక్కువ స్పేస్ తీసుకుంటుంది. ప్రోగ్రామర్స్ ఎంతో శ్రమించి రూపొందించిన ఫేస్ బుక్ లైట్ యాప్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సులువుగా లైక్స్, షేర్లు చేయొచ్చు. తక్కువ బ్యాండ్ విడ్త్ ఇంటర్ నెట్ కలిగి ఉన్న నెటిజన్లను దృష్టిలో ఉంచుకుని చేసిన తమ ప్రయత్నానికి విశేష స్పందన వచ్చిందని' ఓ ప్రకటనలో ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ వెల్లడించారు. -
ఫేస్బుక్ ఫ్రెండే హంతకుడు
⇒ రహీం హత్య కేసులో వీడిన మిస్టరీ ⇒ నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్: చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో మూడురోజుల క్రితం జరిగిన ఎలక్ట్రీషియన్ హత్యకేసు మిస్టరీని చేధించారు. శనివారం ఎల్బీనగర్ ఏసీపీ వేణుగోపాల్‌రావు, చైతన్యపురి ఇన్స్పెక్టర్ గురురాఘవేంద్ర కేసు వివరాలు వెల్లడించారు. కృష్ణాజిల్లాకు చెందిన షేఖ్‌రహీం అలియాస్ మున్నా నగరానికి వలసవచ్చి మలక్‌పేటలోని ఫ్లీట్‌మ్యాటిక్స్ కంపెనీలో పనిచేస్తూ న్యూ మారుతీనగర్‌లో నివాసం ఉండేవాడు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన కొంపెల్ల నవీన్(23) మూడు నెలల కిత్రం ఫేస్బుక్ ద్వారా రహీంకు పరిచయం అయ్యాడు. చెన్నైలో ఉద్యోగం చేసి వచ్చిన అతను ఇసామియాబజారులో ఉండేవాడు. రహీం, నవీన్ తరచూ న్యూ మారుతీనగర్‌లోని గదిలో మందు పార్టీలు చేసుకునేవారు. ఇదే క్రమంలో ఈ నెల 16న వారు ఇంటి సమీపంలో ఉండే పెయింటర్ లింగయ్యతో కలిసి మద్యం సేవించారు. ఈ సందర్భంగా రహీం ప్రియురాలిపై నవీన్ అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. దీనిని గమనించిన ఇంటి ఓనర్ అక్కడికి వచ్చి వారికి సర్దిచెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నవీన్ వైన్‌షాప్‌నకు వెళ్ళి మద్యం తీసుకురాగా మరోసారి కలిసి తాగారు. అర్ధరాత్రి నిద్రిస్తున్న రహీంపై నవీన్ జిమ్ డంబుల్స్తో తలపై చితకబాది చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత అతని పర్సు, సెల్ఫోన్లు తీసుకుని ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. రెండు రోజుల తర్వాత రహీం ఇంటికి వచ్చిన తోటి ఉద్యోగులు ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గుర్తించి తలుపును పగలగొట్టారు. రక్తపు మడుగులో పడిఉన్న రహీంను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరోజు వారితో కలిసి మద్యం సేవించిన లింగయ్యను విచారించగా రహీం స్నేహితుడు వచ్చివెళ్లినట్లు తెలిపాడు. దీంతో రహీం ఫేస్బుక్ ఓపెన్ చేసి స్నేహితుల ఫొటోలను చూపగా నవీన్‌గా గుర్తించాడు. అతని సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా నిందితున్ని శనివారం ఉదయం ఇసామియా బజార్లో అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి రూ.1500 నగదు, 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. హత్యకేసును ఛేదించిన ఇన్స్పెక్టర్ గురురాఘవేంద్ర, ఎస్సైలు రత్నం, కోటయ్యలను ఏసీపీ అభినందించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. -
ఫేస్బుక్ స్నేహితురాలి నగ్న ఫొటోలు తీసి..
గురుగ్రామ్: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన స్నేహితురాలికి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి నగ్న ఫొటోలు తీసిన కేసులో బీసీఏ విద్యార్థిని (21) పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. హరియాణాలోని గురుగ్రామ్‌లో ఈ సంఘటన జరిగింది. కొన్ని నెలల క్రితం బీసీఏ విద్యార్థి అమిత్ కుమార్‌కు ఫేస్బుక్ ద్వారా ఓ యువతి (22) పరిచయమైంది. ఆ తర్వాత ఇద్దరూ స్నేహితులయ్యారు. గత మంగళవారం ఆ యువతి అమిత్ కుమార్ ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో అమిత్ కుమార్ తప్ప ఎవరూ లేరు. అమిత్ కూల్ డ్రింక్ ఆఫర్ చేయగా ఆమె తీసుకుంది. అయితే డ్రింక్‌లో మత్తు పదార్థం కలపడంతో ఆమె అపస్మారక స్థితికి వెళ్లింది. అమిత్ ఆమె దుస్తులు తొలగించి తన సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీశాడు. కాసేపటి తర్వాత ఆమె స్పృహలోకి రాగా, అమిత్ అనుచితంగా ప్రవర్తించాడు. ఈ విషయం బయటకు చెబితే ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. బాధితురాలు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి, వారితో కలసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
యువతిని వేధిస్తున్న బీటెక్ విద్యార్థి అరెస్ట్
-
యువతిని వేధిస్తున్న బీటెక్ విద్యార్థి అరెస్ట్
సికింద్రాబాద్: ఫేస్బుక్లో నగ్న చిత్రాలు పెడతానంటూ ఓ యువతిని వేధిస్తున్న బీటెక్ విద్యార్థిని సికింద్రాబాద్ చిలకలగూడ పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. సీతాఫల్మండిలో నివశిస్తున్న ఆకాష్ రెడ్డికి,అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో ఐదేళ్లక్రితం ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. నిత్యం వీరు చాటింగ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఫోటోలు మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తానంటూ ఆకాష్‌రెడ్డి సదరు యువతిని బెదిరించి 5 లక్షల రూపాయలు వసూలు చేశాడు. అయినా వేధింపులు ఆపకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘ఫేస్బుక్ గాళ్‌ఫ్రెండ్’ను కలిసిన తొలిసారే..
కోయంబత్తూరు: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన స్నేహితురాలు ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు గాజుముక్కతో ఆమె మెడను కోశాడు. ఆమెను కలిసిన తొలిసారే యువకుడు దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు తమిళనాడులోని కోయంబత్తూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కోయంబత్తూరుకు చెందిన కనకలక్ష్మి (21) అనే యువతి భారతీయార్ యూనివర్శిటీలో ఎంసీఏ తొలి సంవత్సరం చదువుతోంది. ఏడాది క్రితం ఫేస్బుక్ ద్వారా వేంబురాజ్ (28) అనే యువకుడు పరిచయమయ్యాడు. రామనాథపురం జిల్లాకు చెందిన వెంబురాజ్ చెన్నైలో ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ తరచూ ఛాటింగ్ చేసుకునేవాళ్లు. కొన్ని నెలల తర్వాత వెంబురాజ్ ప్రేమ విషయాన్ని తెలపగా, ఆమె తిరస్కరించింది. తాను చదువుపై దృష్టిపెట్టాలంటూ తెలిపింది. అయితే ఆన్లైన్లో ఇద్దరూ ఛాటింగ్ చేసుకునేవాళ్లు. కనకలక్ష్మి ఫోన్ నెంబర్ సంపాదించిన వెంబురాజ్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అతని ప్రవర్తనతో విసిగిపోయిన కనకలక్ష్మి మాట్లాడటం మానేసింది. దీంతో వెంబురాజ్ నేరుగా ఆమెను కలవాలనుకున్నాడు. గత బుధవారం భారతీయార్ యూనివర్శిటీకి వెళ్లి బస్‌స్టాప్‌లో కనకలక్ష్మిని తొలిసారి కలిశాడు. వెంబురాజ్ మరోసారి ప్రేమ, పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా, ఆమె తిరస్కరించింది. అతను వెంటనే అక్కడ ఉన్న బాటిల్‌ను పగలగొట్టి గాజు ముక్కతో ఆమె మెడను కోశాడు. అక్కడున్న విద్యార్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేసరికే వెంబురాజ్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పోలీసులు కనకలక్ష్మిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి వెంబురాజ్ను అరెస్ట్ చేశారు. -
ఫేస్బుక్ ఫ్రెండ్ అని నమ్మి వెళ్లినందుకు..
బెంగళూరు: ఫేస్బుక్ స్నేహితుడు అని నమ్మి వెళ్లినందుకు ఓ 16 ఏళ్ల అమ్మాయి దారుణంగా మోసపోయింది. మత్తుమందు ఇచ్చి ఆమెపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఈ ఘటనను తాను సెల్ఫోన్లో చిత్రీకరించానని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ఆ వీడియోను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తానని హెచ్చరించాడు. మైనర్ బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఆ కిరాతకుడిని పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు నగరంలో జరిగిన ఈ ఘటన తాలుకు వివరాలివి.. బాధితురాలికి ఆరు నెలల కిందట నిందితుడు డానియెల్ (24) అనే వ్యక్తి ఫేస్బుక్లో పరిచయమయ్యాడు. గత సోమవారం సాయంత్రం ఆమె తన స్నేహితురాలి పుట్టినరోజు విందుకు వెళ్లింది. అక్కడికి డానియెల్ కూడా వచ్చి ఆమెతో మాట్లాడాడు. తాను కూడా ఓ చిన్న పార్టీ ఇస్తున్నానని, దానికి నువ్వు కూడా రావాలని బలవంతపెట్టాడు. మొదట బాధితురాలు ఒప్పుకోలేదు. చాలా బలవంతపెట్టడంతో చివరకు ఒప్పుకుంది. దీంతో డానియెల్ ముందే వెళ్లిపోయాడు. ఆ తర్వాత డానియెల్ స్నేహితుడు బాధితురాలిని తన బైక్‌పై తీసుకెళ్లి.. అతడు ఉన్న ఇంటివద్ద విడిచిపెట్టాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో బాధితురాలు అనుమానించింది. అయితే, ఆమెతో బలవంతంగా మత్తుపదార్థం కలిపిన కూల్ డ్రింక్ తాగించిన నిందితుడు.. స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్న ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత జరిగిన ఘటన తెలుసుకొని బాధితురాలు నిర్ఘాంతపోయింది. జరిగిన ఘటనను తన సెల్ఫోన్లో చిత్రీకరించానని, దీని గురించి పోలీసులకు చెప్తే ఆ వీడియోను ఇంటర్నెట్లో పెడతానని డానియెల్ బెదిరించాడు. అనంతరం ఆమెను ఇంటివద్ద వదిలేశాడు. అయితే, బాధితురాలు జరిగినదంతా ఇంట్లో చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు డానియెల్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫేస్బుక్ ఫ్రెండ్ పై పోలీసులకు ఫిర్యాదు
మంగళూరు: ఫేస్బుక్ లో పరిచయమైన యువతిని మోసగించి మరో పెళ్లికి సిద్ధమైన ప్రబుద్ధుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. పెళ్లి చేసుకుంటానని తనను వంచించి మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడని పర్వేజ్ ముషారఫ్ అనే వ్యక్తి కర్ణాటకలోని మంగళూరుకు చెందిన యువతి(26) పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనకు దగ్గరయ్యాడని, తర్వాత మొహం చాటేశాడని వాపోయింది. నాలుగు నెలల నుంచి తనను తప్పించుకుని తిరుగుతున్నాడని ఆమె తెలిపింది. బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడని తెలుసుకున్న బాధితురాలు.. అతడిని నిలదీసింది. తమ మధ్య సంబంధాన్ని మర్చిపోవాలని ఆమెకు సూచించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
భర్తను వదలి.. ఫేస్బుక్ ప్రేమికుడి కోసం
యువతీ యువకుల మధ్య ఫేస్బుక్ పరిచయాలు ప్రేమగా మారి, వివాహబంధంతో ఒక్కటయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాగే మరికొందరు వివాహబంధాన్ని వీడి ప్రేమికుడు/ప్రేమికురాలి కోసం పారిపోయిన సంఘటనలూ ఉన్నాయి. మహారాష్ట్రలోని నాసిక్‌లో రెండో రకం ఘటన జరిగింది. ఓ యువతికి మూడేళ్ల క్రితం నాసిక్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తతో వివాహమైంది. ఫేస్బుక్ ద్వారా ఆమెకు ఇటీవల ఉత్తరాఖండ్‌లోని లోహఘాట్కు చెందిన యువకుడు పరిచయమయ్యాడు. అతను ఢిల్లీలోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గత నెల 10న వివాహిత (25) తన భర్తను వదలి ప్రియుడి దగ్గరకు పారిపోయింది. ఆమె వెళ్తూ ఇంట్లో నుంచి నగలు, డబ్బు తీసుకెళ్లింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేశారు. ఉత్తరాఖండ్‌లోని చంపావత్‌లో ప్రేమజంట ఉన్నట్టు గుర్తించారు. నాసిక్ పోలీసులు చంపావత్ వెళ్లి వివాహితను గుర్తించి వెనక్కు తీసుకునివచ్చారు. కాగా విషయం తెలుసుకుని ఆమె ప్రియుడు పరారయ్యాడు. -
ప్రాణం తీసిన ఫేస్బుక్ పరిచయం
కడప : ఫేస్బుక్ పరిచయం ఓ నిండి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఖాజీపేటకు చెందిన యువకుడికి ఫేస్బుక్ ద్వారా ఓ అమ్మాయి పరిచయమైంది. తాను ఆర్థికంగా కష్టాల్లో ఉన్నానని.. సాయం చేయాలని అడిగింది. అమ్మాయి మాటలకు కరిగిపోయి ఇంట్లో తెలియకుండా ఆమె అకౌంట్లో డబ్బులు వేశాడు. చివరికి ఈ విషయం ఇంట్లో తెలియడం..ఆపై యువతి మోసం చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఆ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గం ఖాజీపేటలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. ఖాజీపేట బస్టాండులో మాడిచెట్టి నరసింహ ప్రసాద్ అలియాస్ రమేష్ (33) మూడేళ్లుగా టీకొట్టు నిర్వహిస్తున్నాడు. అతడు ఫేస్బుక్లో ఖాతా ప్రారంభించి ప్రతిరోజు తన మొబైల్ ద్వారా చూసేవాడు. ఇలా విశాఖపట్నానికి చెందిన ఓ అమ్మాయితో అతడికి నెలక్రితం పరిచయమైంది. ఆ పరిచయంతో ఆమె ఫోన్ నంబర్ తీసుకుని తరచూ మాట్లాడేవాడు. ఈ నేపథ్యంలో ఆమె తాను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని తనను ఆదుకోవాలని కోరింది. ఆమేరకు ఆమె ఎస్బీఐలోని గ్రీన్‌కార్డు అకౌంట్ నంబర్(20241371120)కు గతనెల 6వ తేదీ నుంచి ఇప్పటివరకు సుమారు రూ.2లక్షలు పంపాడు. ఈ విషయంలో అతని ఇంట్లో తెలియడంతో గట్టిగా మందలించారు. దీంతో అతను తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని ఆ యువతిపై ఒత్తిడి తెచ్చాడు. ఆమె ఇచ్చిన ఫోన్ నంబర్‌కు ఇదే విషయమై తరచూ మెసేజ్ పంపాడు. డబ్బు ఇవ్వకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని కూడా తెలిపాడు. అయినా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు. తాను మోసపోయానని.. డబ్బు విషయమై ఇంట్లోని పెద్దలకు ఏం సమాధానం చెప్పాలో దిక్కు తెలియక సోమవారం మధ్యాహ్నం బాత్రూంలోకి వెళ్లి ఉరి వేసుకున్నాడు. ఎంతకీ తమ కుమారుడు బాత్రూంలో నుంచి బయటికి రాకపోవడంతో అనుమానంతో వారు బాత్రూం తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే మృతి చెందాడు. ఆ తర్వాత అతని మొబైల్‌ను పరిశీలించగా అందులో ఆ యువతికి పంపిన మెసేజ్‌లు తదితర వివరాలు బయటపడ్డాయి. తర్జనభర్జన అనంతరం మంగళవారం ఉదయం మృతుని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ అమ్మాయి ఎవరు.? నరసింహ ఫోన్ చేసిన మొబైల్ నంబర్‌తో పాటు బ్యాంకు అకౌంట్ నెంబర్‌ను పోలీసులు పరిశీలించారు. విశాఖపట్నంలోని సీతంపేటకు చెందిన గార్లే కళ్యాణిగా ఉంది. కాగా బ్యాంక్ అకౌంట్‌కు ఇచ్చిన ఫోన్ నంబరు మరోలా ఉంది. ఆ యువకుడు ప్రతిరోజు ఫోన్ చేసిన నంబర్ వివరాలు సేకరిస్తే అక్కడ అనుశ్రీగా ఉంది. దీంతో ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.