ఎయిర్‌పోర్టులో ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ హల్‌చల్ | Facebook friends Hulchul in Airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులో ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ హల్‌చల్

Published Thu, Dec 25 2014 12:10 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

ఎయిర్‌పోర్టులో ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ హల్‌చల్ - Sakshi

ఎయిర్‌పోర్టులో ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ హల్‌చల్

అనుమతి లేకుండా స్కేటింగ్ చేస్తుండడంతో హెచ్చరించిన పోలీసులు
శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని పార్కింగ్ రహదారుల్లో ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ హల్‌చల్ చేశారు. అనుమతి లేకుండా స్కేటింగ్ చేస్తుండడంతో విమానాశ్రయ వర్గాలు ఇచ్చిన సమాచారంతో ఆర్‌జీఐఏ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని హెచ్చరించి వదిలేశారు. ఫేస్‌బుక్ స్నేహితులుగా ఉన్న నగరానికి చెందిన త్రిభువన్, కార్తీక్, రాహుల్, సుశాంత్ కుమార్, అబ్‌నాన్ అనే ఐదుగురు యువకులు బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని పార్కింగ్ రహదారుల్లో స్కేటింగ్ చేస్తూ.. అల్లరి చేయడంతో గమనించిన విమానాశ్రయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్కేటింగ్ చేయడంపై వారిని హెచ్చరించి వదిలేశారు. స్నేహితులు ఐదుగురిలో ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, సీఏ చదువుతున్నవారు ఉన్నారు. విమానాశ్రయంలో తరచూ జరిగే కార్టింగ్ రేసులకు ప్రభావితమై వారు ఇక్కడికి చేరుకున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement