పట్టుబడిన బంగారం
శంషాబాద్: మల ద్వారంలో బంగారం పెట్టుకుని దొంగ రవాణా (స్మగ్లింగ్) చేస్తున్న నలుగురు సూడాన్ దేశస్తులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి ఏకంగా 7.3 కిలోల బరువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి దుబాయ్ నుంచి శంషాబాద్‌కు వచ్చిన విమానంలోని ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళల నడక తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో అప్రమత్తమయ్యారు.
వారిని వైద్యాధికారుల దగ్గరికి తీసుకెళ్లి పరీక్ష చేయించారు. వారు మలద్వారంలో బంగారం పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించి, బయటికి తీయించారు. ఈ నలుగురు సూడాన్ దేశస్తులని, వారు స్మగ్లింగ్ చేస్తున్న బంగారం విలువ రూ.3.6 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బంగారాన్ని ఎవరు ఎక్కడి నుంచి, ఎక్కడికి అక్రమ రవాణా చేస్తున్నరన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment