customs officers
-
ఎయిర్‌పోర్ట్‌లో భారీగా ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లు స్వాధీనం..
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లు భారీగా పట్టుబడ్డాయి. ఇటీవలే యాపిల్ సంస్థ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అచితూ ఈ ఫోన్లను అక్రమంగా తీసుకెళ్తున్న ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహిళ తన వ్యానిటీ బ్యాగ్‌లో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లను టిష్యూ పేపర్లలో చుట్టి దాచిపెట్టిందని అధికారులు తెలిపారు. కాగా ఐఫోన్ సిరీస్‌లో.. 16 ప్రో మాక్స్ టాప్ మోడల్.ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. హాంగ్‌కాంగ్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఓ మహిళ 26 ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లను తీసుకొచ్చింది.ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో ఆమెను పట్టుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి మరింత విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. స్మగ్లింగ్ చేసిన ఆ ఫోన్లు ఖరీదు సుమారు 37 లక్షలు ఉంటుందని అంచనా. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.21 లక్షల బంగారం పట్టివేత
హైదరాబద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ ప్రయాణికురాలు కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది. ఆమె వద్దనుండి రూ.21 లక్షలు విలువ చేసే సుమారు 350 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. బంగారానికి రోడియం కోటింగ్ వేసి ఓ మహిళ తెలివిగా బంగారాన్ని తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు ఆమె ప్రయత్నాన్ని భగ్నంచేశారు. హెయిర్ క్లిప్పులకు, గాజులకు, ఇతర నగలకు రోడియం కోటింగ్ వేసి ఆ నగలను ధరించగా అనుమానమొచ్చిన అధికారులు తనిఖీ చేయగా అసలు గుట్టు రట్టయ్యింది. గాజులు ఇతర నగలు 18 క్యారెట్లు, 22 క్యారెట్లుగా గుర్తించారు. ఇండిగో విమానంలో షార్జా నుంచి హైదెరాబాద్ తరలించిన ఈ బంగారాన్ని పాక్స్ ప్రొఫైలింగ్, నిఘా విభాగం సమర్ధవంతంగా వ్యవహరించి పట్టుకున్నామని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. హైదరాబాద్ జీఎస్టీ కస్టమ్స్ జోన్ అనే ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ బంగారం మొత్తం 397 గ్రాములు ఉంటుందని దాని ఖరీదు సుమారు రూ.21 లక్షలు ఉంటుందని తెలిపారు కస్టమ్స్ అధికారులు. Based on pax profiling & efficient surveillance, @hydcus officers at RGIA intercepted one pax arriving from Sharjah by Indigo 6E 1422 on 21.8.23 and seized #gold weighing 397 gm valued at Rs 20.59 lakhs. @cbic_india @DDNewslive pic.twitter.com/jkM9Q5BT97 — CGST & Customs Hyderabad Zone (@cgstcushyd) August 21, 2023 ఇది కూడా చదవండి: BRICS 2023: జోహన్నెస్‌బెర్గ్‌కు పయనమైన ప్రధాని మోదీ -
ఏంది రా అయ్యా ఇది.. రెండేళ్ల చిన్నారి డైపర్‌లో..
యశవంతపుర(బెంగళూరు): విదేశాల నుంచి బంగారాన్ని స్మగ్లర్లు విచిత్రమైన మార్గాల్లో తెస్తూ దొరికిపోతున్నారు. రెండేళ్ల చిన్నారి డైపర్‌లో బంగారాన్ని దాచి తీసుకొచ్చిన ప్రయాణికున్ని మంగళూరు విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి బెల్ట్‌లో నడుం కట్టుకొని తెస్తుండగా పట్టుకున్నారు. మరో వ్యక్తిలో దుస్తుల్లో ద్రావణం రూపంలో బంగారాన్ని తెచ్చారు. తనిఖీల్లో గుర్తించి బంగారాన్ని సీజ్ చేసి నిందితులను అరెస్టు చేశారు. మార్చి 1 నుండి 15 వరకు రూ. 90 లక్షలు విలువగల 1.606 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. చదవండి: అనంతపురంలో విషాదం.. వారం కిందటే పెళ్లి.. ఏం జరిగిందో ఏమో! -
రూ.3 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లు స్వాధీనం
సాక్షి, అమరావతి: అక్రమంగా తరలిస్తోన్న రూ.3 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను విజయవాడ కస్టమ్స్ అధికారులు పల్నాడు జిల్లాలో మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. 30 లక్షల పారిస్ బ్రాండ్ సిగరెట్లను మయన్మార్ నుంచి భారత్‌లోకి అక్రమంగా తరలించినట్లు విచారణలో వెల్లడైంది. బిహార్‌లోని ముజఫరాబాద్‌లో ఓ లారీలో వీటిని లోడ్ చేసి అక్రమంగా రవాణా చేస్తుండగా కస్టమ్స్ అధికారులు నరసరావుపేట శివార్లలో తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ సిగరెట్లను గోధుమ పిండి బ్యాగుల్లో ప్యాక్ చేసి టార్పాలిన్లు కప్పి తరలిస్తున్నట్లు గుర్తించారు. వీటిపై చట్టపరమైన హెచ్చరికలు ముద్రించి లేకపోవడంతో అధికారులు లారీని జప్తు చేసి కేసు నమోదు చేశారు. కాగా, గత 6 నెలల్లో విజయవాడ కస్టమ్స్ అధికారులు.. తనిఖీల్లో రూ.1.50 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
వామ్మో.. లోదుస్తుల్లో బంగారం..
సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): పాదరక్షల్లో బంగారం దాచి తీసుకొచ్చిన ఆరుగురిని మీనంబాక్కం విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం అర్ధరాత్రి శ్రీలంక నుంచి శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ప్రత్యేక విమానం వచ్చింది. చెన్నైకి చెందిన ఆరుగురు ప్రయాణికులు ఒక బృందంగా వచ్చారు. అధికారులకు వారిపై అనుమానం రావడంతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇద్దరు ప్రయాణికుల పాదరక్షల్లో బంగారం, నలుగురి లోదుస్తుల్లో 928 గ్రాముల బంగారాన్ని గుర్తించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. చదవండి: Tamilnadu: తల్లి వద్దు.. ప్రియుడే కావాలి.. -
మలద్వారంలో బంగారం స్మగ్లింగ్!
శంషాబాద్: మల ద్వారంలో బంగారం పెట్టుకుని దొంగ రవాణా (స్మగ్లింగ్) చేస్తున్న నలుగురు సూడాన్ దేశస్తులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి ఏకంగా 7.3 కిలోల బరువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి దుబాయ్ నుంచి శంషాబాద్‌కు వచ్చిన విమానంలోని ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళల నడక తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో అప్రమత్తమయ్యారు. వారిని వైద్యాధికారుల దగ్గరికి తీసుకెళ్లి పరీక్ష చేయించారు. వారు మలద్వారంలో బంగారం పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించి, బయటికి తీయించారు. ఈ నలుగురు సూడాన్ దేశస్తులని, వారు స్మగ్లింగ్ చేస్తున్న బంగారం విలువ రూ.3.6 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బంగారాన్ని ఎవరు ఎక్కడి నుంచి, ఎక్కడికి అక్రమ రవాణా చేస్తున్నరన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత
సాక్షి, శంషాబాద్(హైదరాబాద్): శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బంగారాన్ని తరలిస్తున్నట్లు.. పక్కా సమాచారం ప్రకారం అధికారులు ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులపై ప్రత్యేక నిఘా పెట్టారు. కాగా, అధికారులు రూ. 34 లక్షల విలువైన బంగారాన్నిస్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు రియాద్ ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: మరో నెలరోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి బాజాలు.. అంతలోనే.. -
రూ.78 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అధికారులు ఆదివారం భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉగాండా, జాంబియా నుంచి వచ్చిన ఇద్దరు మహిళల నుంచి కస్టమ్స్ అధికారులు 12 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.78 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఉగాండా, జాంబియా నుంచి ఇద్దరు మహిళలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు విచారిస్తున్నారు. చదవండి: రూ. 300 కోసం.. రూ.1.90 లక్షలు పోగొట్టుకున్న యువతి -
చెన్నైలో రూ.70 కోట్ల హెరాయిన్ స్వాధీనం
తిరువొత్తియూరు (చెన్నై): దక్షిణాఫ్రికా నుంచి చెన్నై విమానాశ్రయానికి తీసుకొచ్చిన రూ.70 కోట్ల విలువైన 9.8 కిలోల హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు శుక్రవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. చెన్నై మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయానికి దోహా నుంచి వస్తున్న ప్రత్యేక విమానంలో డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు వచ్చిన సమాచారంతో కస్టమ్స్ కమిషనర్ రాజన్ చౌదరి నేతృత్వంలో అధికారులు నిఘా ఉంచారు. ప్రయాణికుల్లో ఓ మహిళ వీల్‌చైర్‌లో, ఆమెకు తోడుగా మరొక మహిళ వచ్చారు. ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చినట్లు వారు తెలిపారు. సూట్‌కేస్‌లను తనిఖీ చేయగా నాలుగు పార్శిళ్లలో 9.8 కిలోల హెరాయిన్ బయటపడింది. -
మొత్తం కేసులు 536, బంగారం 312 కిలోలు
సాక్షి, హైదరాబాద్: ‘పలుకే బంగారమ య్యేనా..’‘నీ ఇల్లు బంగారం కానూ..’‘మా ఆయన బంగారం..’ఇలాంటి మాటలను బట్టి చూస్తే తెలియడంలేదూ.. బంగారమంటే ఎవరికైనా ఎంతిష్టమో! ఒంటిపై బంగారు నగలుంటే ఆ దర్జానే వేరు. సామాజిక, ఆర్థిక అంతరాలకు అతీతంగా అంద రూ పసిడిని అమితంగా ఇష్టపడుతుంటారు. మగువల సంగతి సరేసరి. ఈ ఇష్టం ఈనాటిది కాదు. వేల ఏళ్లనాటిది. బంగారానికి ఆదరణ అధికంగా ఉన్నచోట పలు అక్రమాలు వెలుగుచూడటం మరోకోణం. కొందరు సుంకాన్ని ఎగ్గొట్టేందుకు బంగారాన్ని అక్రమరవాణా చేస్తుంటారు. విదేశాల్లో తక్కువకు కొని, మనదేశంలో పన్ను ఎగ్గొట్టి రహస్యంగా తరలిస్తుంటారు. కస్టమ్ లేకుండా వచ్చి.. ఇక్కడ చిక్కుతున్నారు. పన్ను ఎగ్గొట్టేందుకే..! మనరాష్ట్రంలో అంతర్జాతీయ ప్రయాణాలకు సింహద్వారం శంషాబాద్ విమానాశ్రయం. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ రాష్ట్రాల విదేశీయానానికి ఇదే ముఖద్వారం. అందుకే, ఈ విమానాశ్రయం ద్వారా విదేశాల నుంచి అక్రమంగా బంగారం తీసుకొచ్చేవారు తరచూ కస్టమ్స్ అధికారులకు చిక్కుతుంటారు. వాస్తవానికి వీరు అక్కడ బంగారాన్ని కొనుక్కునే వస్తారు. దానికి కస్టమ్స్ డ్యూటీ చెల్లిస్తే ఏ సమస్యా ఉండదు. కానీ, చాలామంది కస్టమ్స్ డ్యూటీ చెల్లించేందుకు ఇష్టపడక.. పలు అడ్డదారులను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీ, నిఘావ్యవస్థలు అక్రమ బంగారం రవాణాను ఇట్టే పట్టేస్తున్నాయి. కిలో వరకు చాన్స్ వాస్తవానికి విదేశాలకు వివిధ వేడుకలు, విహారయాత్రలు, వ్యాపారాల పనిమీద వెళ్లేవారికి ఒక కిలో వరకు బంగారం కొనుగోలు చేసి తీసుకువచ్చేందుకు నిబంధనలు అనుమతిస్తాయి. ఈ సదుపాయం కేవలం భారత పౌరులకు మాత్రమే. వీరు తీసుకువచ్చిన కిలో బంగారం మొత్తం విలువలో 38.5 శాతం కస్టమ్స్ డ్యూటీ చెల్లించి తీసుకువెళ్లవచ్చు. ఒకవేళ సంవత్సరంపాటు భారతీయులు విదేశాల్లో ఉండి ఇండియాకు వచ్చినట్లయితే వారు తీసుకువచ్చిన మొత్తం బంగారం విలువలో 13.5 శాతం కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. అక్రమమార్గంలో ఎంతంటే.? గత ఐదేళ్లలో కస్టమ్స్ అధికారులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎంత బంగారాన్ని పట్టుకున్నారన్న విషయం తెలుసుకునేందుకు నగరానికి చెందిన రాబిన్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు కింద దరఖాస్తు చేసుకున్నారు. 2015 నుంచి 2020 డిసెంబర్ వరకు 536 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో మొత్తం రూ.96.15 కోట్ల విలువైన 312.87 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ దేశాల నుంచే అధికంగా.. విదేశాల నుంచి శంషాబాద్‌కు వచ్చే బంగారంలో అధికశాతం గల్ఫ్ దేశాలదే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఖతార్, సౌదీ అరేబియా, జెడ్డా, మలేసియా, బెహ్రా యిన్, థాయ్‌లాండ్, సింగపూర్ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల వద్దే పైన పేర్కొన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని కస్టమ్స్ అధికారులు ప్రకటించారు. ఆయా దేశాల్లో బంగారం విక్రయాలపై పెద్దగా ఆంక్షలు లేవు. అందుకే, చాలామంది బంగారం కొనేసి విమానమెక్కుతారు. తీరా ఇండియాకు వచ్చేసరికి విధించే 38.5 శాతం కస్టమ్స్ ట్యాక్స్ చూసి కళ్లు తేలేస్తుంటారు. కానీ, బంగారం విక్రయాల్లో ఆరితేరిన వారు అక్రమమార్గాల్లో తీసుకువస్తుంటారు. ఈ రెండు మార్గాల్లో కాకుండా విదేశాల్లో స్థిరపడి ఏడాదికి ఒకసారి వచ్చేవారిని కొందరు ఆశ్రయిస్తారు. ఇక్కడ నుంచి డబ్బులు పంపి బంగారం కొనిపించి మరీ తెప్పిస్తారు. 13.5 శాతం ట్యాక్స్ కూడా వీరే కడతారు. ఇలా బంగారం తెచ్చిచ్చినందుకు వారికి టికెట్ ఖర్చులో, ఇతర బహుమానాలో ఇస్తుంటారు. -
బంగారాన్ని ట్యాబ్లెట్లుగా చేసి స్మగ్లింగ్
కోజికోడ్: బంగారం అక్రమ మార్గాల్లో రవాణా చేస్తూ పట్టుబడుతున్న కేసులు అధికంగా నమోదవుతున్నాయి. బంగారాన్ని రహాస్యంగా తరలించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూ చివరకు పోలీసులకు చిక్కుతున్నారు. తాజాగా కేరళలో బంగారు స్మగ్లింగ్ కేసు పోలీసులను ఆశ్చర్ల్యంలో ముంచెత్తింది. బంగారాన్ని ట్యాబ్లెట్లు మాదిరిగా తయారు చేసి అక్రమంగా తరలించే ప్రయత్నం చేశాడు. తీరా విమానాశ్రయంలో తనిఖీల వద్ద వచ్చేసరికి అధికారులు గుర్తించారు. ఈ ఘటన కోజికోడ్ విమానాశ్రయంలో జరిగింది. ఒకరు షార్జా నుంచి రాగా, మరో వ్యక్తి దుబాయ్ నుంచి వచ్చారు. వారు విమానాశ్రయంలోకి దిగగా వారి ప్రవర్తన అనుమానంగా కనిపించడంతో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పరిశీలించగా షార్జా నుంచి వచ్చిన వ్యక్తి సాక్షుల్లో ట్యాబ్లెట్లు కనిపించాయి. వాటిని పరీక్షించగా 478 గ్రాముల బంగారం కనిపించింది. మరో వ్యక్తి వద్ద నుంచి 765 గ్రాముల బంగారం సీజ్ చేశారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం బంగారం 1.24 కిలో గ్రాములు. దాని విలువ రూ.53 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. -
భారీగా బంగారం పట్టివేత..
సాక్షి, కృష్ణా జిల్లా: గన్నవరం ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు గురువారం భారీగా బంగారం పట్టుకున్నారు. కువైట్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను అనుమానంతో తనిఖీలు నిర్వహించగా, వారి నుంచి ఎటువంటి పత్రాలు లేని 1,865 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.95,11,500 ఉంటుందని కస్టమ్స్ అదనపు కమిషనర్ నాగేంద్రరావు తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశామని, బంగారం ఎక్కడికి తరలిస్తున్నారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. -
ఆరు గంటల పాటు కృనాల్ విచారణ
ముంబై: ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాను సుదీర్ఘ విచారణ అనంతరం కస్టమ్స్ అధికారులు విడిచిపెట్టారు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్ దుబాయ్ నుంచి గురువారం ముంబై చేరుకున్నాడు. అతని వద్ద విలువైన వస్తువులు (ధ్రువపత్రాలు లేని), బంగా రం ఉండటంతో ఎయిర్పోర్ట్ అధికారులు అడ్డగించారు. పరిమితికి మించి బంగారం, అత్యంత విలువైన నాలుగు లగ్జరీ వాచ్‌లు (ఒమెగా, అంబులర్ పిగెట్ బ్రాండ్లు) దుబాయ్‌లో కొనుగోలు చేసినట్లు తెలిసింది. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ. కోటి. ఈ విచారణ అర్ధరాత్రి దాకా సాగింది. నిబంధనలు తెలియకే ఇంతగా కొనుగోలు చేశానని, పన్నులతో పాటు జరిమానా కూడా కడతానని విచారణ సందర్భంగా అతను క్షమాపణలు చెప్పడంతో అధికారులు అతన్ని విడిచిపెట్టారు. అయితే అతను తెచ్చిన వస్తువుల్ని తిరిగివ్వలేదు. విలువైన బ్రాండ్లకు చెందిన వాచీలను కొనుగోలు చేసిన కృనాల్ దీనికి సంబంధించి కస్టమ్స్ డ్యూటీ చెల్లించలేదు. ఇప్పుడు వీటిపై 38 శాతం డ్యూటీ, అదనంగా జరిమానా చెల్లించాక... దర్యాప్తు మొత్తం పూర్తయ్యాకే వీటిని అతనికి అప్పగిస్తారు. -
కేరళలో 123 కేజీల బంగారం సీజ్
కొచ్చి: కేరళలోని త్రిసూర్ జిల్లాలో రూ.50 కోట్ల విలువ చేసే దాదాపు 123 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. రాష్ట్రంలో స్మగ్లింగ్ సిండికేట్‌పై జరిగిన ఆపరేషన్‌లో భాగంగా జిల్లాలో 23 ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో ఈ బంగారాన్ని సీజ్ చేసినట్లు కస్టమ్స్ కమిషనర్ (ప్రివెంటివ్) సుమిత్ కుమార్ తెలిపారు. స్మగ్లర్లు తమిళనాడులోని వివిధ నగరాల నుంచి బంగారాన్ని సేకరించి, రోడ్డు మార్గం ద్వారా త్రిసూర్‌కు అక్రమంగా రవాణా చేశారని పేర్కొన్నారు. అక్రమంగా బంగారం రవాణా చేస్తున్న మొత్తం 17 మందిని పట్టుకున్నామని, ప్రస్తుతం వారిని విచారిస్తున్నామని తెలిపారు. బంగారంతోపాటు రూ.2 కోట్ల నగదు, రూ.6.40 లక్షల విలువ చేసే అమెరికా డాలర్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. -
ఐరన్ బాక్సుల్లో 9 కిలోల బంగారం
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి వద్ద నుంచి 9.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 3.46 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. నాలుగు ఇస్త్రీ పెట్టెల్లో బంగారాన్ని తరలిస్తుండగా అనుమానం వచ్చిన అధికారులు తనిఖీలు నిర్వహించగా వీ-ఆకారంలో ఉన్న బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకొని బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
గోల్డ్ స్మగ్లింగ్‌లో ఐదో స్థానం
సాక్షి, హైదరాబాద్: బంగారం అక్రమ రవాణాలో హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే ఐదో స్థానంలో నిలిచిందని కస్టమ్స్ విభాగం కమిషనర్ ఎంఆర్ఆర్ రెడ్డి వెల్లడించారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 40 కేజీల పసిడి స్వాధీనం చేసుకోగా.. గత నెల 1 నుంచి మంగళవారం వరకు 10 కేజీలు చిక్కినట్లు తెలిపారు. నిరుపేదల్ని పావులుగా మార్చుకుని యథేచ్ఛగా ఈ వ్యవహారం సాగిస్తున్నారని, మరికొందరు కమీషన్ కోసం క్యారియర్లుగా మారుతున్నారని అన్నారు. అదనపు కమిషనర్ మంజుల హోస్మానీ, డిప్యూటీ కమిషనర్ కల్యాణ్ రేవెళ్లతో కలసి శంషాబాద్‌లోని కస్టమ్స్ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఎంఆర్ఆర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కొందరు స్మగ్లర్లు వ్యవస్థీకృతంగా వ్యవహరిస్తూ భారీ స్థాయిలో బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. హైదరాబాద్–దుబాయ్‌ల్లో బంగారం ధరల్లో ఉన్న భారీ వ్యత్యాసం నేపథ్యంలో ఈ దందాకు దిగుతున్నారు. నేరుగా దిగుమతి చేసుకుంటే 38.5 శాతం వరకు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉండటంతో స్మగ్లింగ్‌కు తెగబడుతున్నారు. అయితే ఎక్కడా వీళ్లు నేరుగా సీన్లోకి రావట్లేదు. ఆయా దేశాల నుంచి వస్తున్న కొందరు యువతను కమీషన్ పేరుతో ఆకర్షిస్తున్న స్మగ్లర్లు తమ తరఫున పనిచేసేలా చేసుకుంటున్నారు. అలాగే దుబాయ్ తదితర దేశాల్లో స్థిరపడిన వారితోనూ ఒప్పందాలు చేసుకుని వారినీ ఈ రొంపిలోకి దింపుతున్నారు. దుబాయ్‌లో ఉంటున్న స్మగ్లింగ్ గ్యాంగ్‌ల సభ్యులు అక్కడి ట్రావెల్ ఏజెంట్లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. వారి ద్వారా హైదరాబాద్‌కు వెళ్తున్న పేద, మధ్య తరగతి వారిని గుర్తిస్తున్నారు. ఆయా ప్రయాణికుల్ని సంప్రదిస్తున్న ముఠా సభ్యులు తాము అప్పగించిన వస్తువులు తీసుకువెళ్లేలా వారిని ఒప్పిస్తున్నారు. దీనికోసం కొందరికి రూ.10 వేల నుంచి రూ.15 వేలు కమీషన్ ఇస్తుండగా.. మరికొందరికి టికెట్ కొనిస్తున్నారు. సాంకేతిక పరిభాషలో క్యారియర్లుగా పిలిచే వీరిలో అత్యధికులకు తాము పసిడి తీసుకువస్తున్నామని తెలియట్లేదు. అలా ఉండేందుకు బంగారాన్ని వివిధ రూపాల్లోకి మార్చేసి వీరికి అప్పగిస్తున్నారు. ఇక్కడికి వచ్చాక వీరిని రిసీవ్ చేసుకునేది ఎవరో, వారి కాంటాక్ట్ నంబర్లు ఏమిటో చెప్పరు. అలా చేస్తే కస్టమ్స్ తనిఖీల్లో వీరు చిక్కితే ముఠా గుట్టురట్టవుతుందని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీరి ఫొటోలను మాత్రం వాట్సాప్ ద్వారా ఇక్కడ ఉంటున్న రిసీవర్లకు పంపుతున్నారు’ అని అన్నారు. ఇవీ గణాంకాలు: 2018–19 ఆర్థిక సంవత్సరంలో కస్టమ్స్ అధికారులు 86 స్మగ్లింగ్ కేసుల్ని గుట్టురట్టు చేశారు. వీరి నుంచి రూ.12 కోట్లకు పైగా విలువైన 40 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అరె స్టు అయిన వారిలో 20 మంది భారతీయులు, ఒక విదేశీయుడు ఉన్నారు. గత నెల 1 నుంచి మంగళవారం వరకు 14 కేసులు నమోదయ్యాయి. ఐదుగురిని అరెస్టు చేసిన కస్టమ్స్ అధికారులు వీరి నుంచి రూ.3 కోట్ల విలువైన 10 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పురుషులు 20, మహిళలు 40 గ్రాములు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు బంగారం విషయంలో తప్పక రూల్స్ పాటించాలని ఎంఆర్ఆర్ రెడ్డి తెలిపారు. విదేశాల నుంచి వచ్చే పురుషులు 20 గ్రాములు, మహిళలు 40 గ్రాముల బంగారాన్ని తమ వెంట తీసుకురావచ్చని అన్నారు. ఎక్కువ మోతాదులో బంగారం తెస్తుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిర్‌పోర్ట్‌లోని కస్టమ్స్ విభాగానికి చెందిన రెడ్ చానల్లో డిక్లేర్ చేసి పన్ను చెల్లించాలని చెప్పారు. రూ.20 లక్షలకు మించి విలువైన బంగారంతో పట్టుబడితే అరెస్ట్ చేస్తారని పేర్కొన్నారు. -
బొమ్మ కారులో బంగారం!
సాక్షి, హైదరాబాద్: విదేశాల నుంచి బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లు దాన్ని వివిధ రూపాల్లో తీసుకువస్తున్నారు. శనివారం వేర్వేరు ఘటనల్లో ఇద్దరిని పట్టుకున్న శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు వారి నుంచి 724.29 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు తనతో పాటు ఓ బొమ్మ కారు తీసుకువచ్చాడు. అతన్ని స్కాన్ చేసిన అధికారులు అనుమానిత వస్తువులు లేకపోవడంతో పంపేశారు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన ఇతడు తన లగేజ్‌లో ఉన్న బొమ్మ కారును బయటకు తీసి ఎదురు చూస్తున్నట్లు గుర్తించారు. దీంతో అక్కడున్న శాంతిభద్రతల విభాగం పోలీసుల సాయంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ బొమ్మకారును తని ఖీ చేయగా అందులో ఉండే ట్రాన్స్ఫార్మర్ అనుమానాస్పదంగా కనిపించింది. అందులో ఉండే ఇనుప ప్లేట్లను పసిడి వాటితో రీప్లేస్ చేయడంతో పాటు ఎవరూ గుర్తించకుండా ఐరన్ కోటింగ్ వేసినట్లు గుర్తించారు. వాటిని వెలికి తీయగా 348.94 గ్రాముల బంగారం బయటపడింది. దీన్ని తీసుకోవడానికి వచ్చిన అతడిని కూడా అధికారులు పట్టుకున్నారు. అలాగే దుబాయ్ నుంచి వచ్చిన నరియల్ వాలా అనే వ్యక్తి తనతో పాటు పేస్ట్ రూపంలో ఉన్న పసిడిని తీసుకువచ్చాడు. లోదుస్తుల్లో దాచి తెస్తున్న దీన్ని గుర్తించిన అధికారులు పట్టుకున్నారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న పేస్ట్‌ను ప్రాసెస్ చేయగా 375.35 గ్రాముల బంగారం వచ్చింది. పేస్టు రూప ంలో ఉన్న ఈ బంగారాన్ని ముంబై తరలించే ప్రయత్నాల్లో ఉన్నట్లు అధికారులు చెప్పారు. -
కారు విడిభాగంలో బంగారం
సాక్షి, హైదరాబాద్: షార్జాకు విహారయాత్రకు వెళ్లిన ఓ హరియాణా వాసి తనతోపాటు కారు ఇంజిన్ విడిభాగం తీసుకువస్తూ కస్టమ్స్ అధికారుల కళ్లలో పడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో తనిఖీలు చేయగా రూ.80 లక్షల విలువైన 2.3 కేజీల బంగారం బయటపడింది. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం ఈ స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. క్యామ్‌షాఫ్ట్‌లో కరిగించిన బంగారం హరియాణాకు చెందిన ఓ యువకుడు కొన్నాళ్లుగా ఢిల్లీలో పనిచేస్తున్నాడు. ఢిల్లీ కేంద్రంగా వ్యవస్థీకృ తంగా స్మగ్లింగ్ వ్యవహారాలు నడుపుతున్న ఓ గ్యాంగ్ ఇతడిని ట్రాప్ చేసింది. షార్జాకు రానుపోను టికెట్లు, కొంత కమీషన్ ఇస్తామంటూ ఆశ చూపి బంగారం అక్రమ రవాణా చేయడానికి క్యారియర్‌గా మార్చింది. దీనికి అంగీకరించిన అతడు 5 రోజుల క్రితం టూరిస్ట్ వీసాపై ఢిల్లీ నుంచి షార్జా వెళ్లాడు. అక్కడి వ్యక్తులు కారు ఇంజిన్‌లో ఉండే క్యామ్‌షాఫ్ట్ అనే విడిభాగంలో అమర్చి అందించిన బంగారాన్ని తీసుకువచ్చిహైదరాబాద్లో డెలివరీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఉక్కుతో తయారై ఉండే క్యామ్‌షాఫ్ట్ లోపలి భాగం డొల్లగా ఉంటుంది. దీంతో దీన్ని ఓ చివర చాకచక్యంగా ఓపెన్ చేసిన సూత్రధారులు అందులో కరిగించిన 2.3 కేజీల బంగారం పోశారు. ఎవరికీ అనుమానం రాకుండా దీన్ని మళ్లీ సీల్ వేసిన ట్లు అతికించేశారు. ఈ క్యామ్‌షాఫ్ట్‌ను చెకిన్ బ్యాగేజ్ లో వేసిన హరియాణావాసి ఆదివారం ఉదయం హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. విమానం దిగిన హరియాణా వాసి తన బ్యాగేజ్ కలెక్ట్ చేసుకుని బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. అతడి లగేజ్‌ను స్కాన్ చేసిన కస్టమ్స్ అధికారులు అందులో ఉన్న క్యామ్ షాఫ్ట్ను గుర్తించారు. దాని విషయం ఆరాతీయగా తనకు హరియాణాలో ఓ కారు ఉందని, దాని మరమ్మతు నిమిత్తం ఈ విడిభాగం అవసరమైందని పేర్కొన్నాడు. అనుకోకుండా విహారయాత్రకు షార్జా వెళ్లిన తాను అక్కడి ఈ క్యామ్‌షాఫ్ట్ రేటు ఆరా తీశానని, ఇక్కడి కంటే దాదాపు రూ.8 వేలు తక్కువ ధర ఉండటంతో ఖరీదు చేసుకుని వచ్చానని చెప్పాడు. దీంతో దానికి సంబంధించిన బిల్లు చూపించాలంటూ కస్టమ్స్ అధికారులు ప్రశ్నించారు. విదేశాల్లోని దుకాణాలు కచ్చితంగా కంప్యూటర్ జనరేటెడ్ బిల్లు ఇస్తారు. అయితే ఇతగాడు మాత్రం చేతిరాతతో ఉన్న ఓ బిల్లు చూపించాడు. దీంతో అనుమానం బలపడిన కస్టమ్స్ అధికారులు వాహనం నంబర్ చెప్పాలని కోరారు. అతడు చెప్పిన నంబర్‌ను హరియాణా రవాణా శాఖలో ఆరా తీయగా అది కారుది కాదని, ఓ ద్విచక్రవాహనానిదని తేలింది. దీంతో ఏదో మతలబు ఉందని అనుమానించిన కస్టమ్స్ అధికారులు క్యామ్‌షాఫ్ట్‌ను పగులకొట్టి చూడగా అందులో గడ్డ కట్టి ఉన్న బంగారం కనిపించింది. కరిగించి బయటకు తీయగా 2.3 కేజీల బరువుంది. హరియాణా వాసిని అదుపులోకి తీసుకున్న అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. ఈ స్మగ్లింగ్‌తో సంబంధం ఉన్న ఢిల్లీ, హైదరాబాద్ వాసుల కోసం ఆరా తీస్తున్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఇదో వ్యవస్థీకృత ముఠాగా కస్టమ్స్ అధికారులు భావిస్తున్నారు. -
సిల్వర్ ఫాయిల్స్‌లో గోల్డ్ బిస్కెట్లు
సాక్షి, హైదరాబాద్: విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా చేసేందుకు కొత్త కొత్త పంథాలను స్మగ్లర్లు అనుసరిస్తుంటారు. అయితే వారి ఎత్తులకు పైఎత్తులు వేసి స్మగ్లర్ల ఆటలు కట్టిస్తుంటారు మన కస్టమ్స్ అధికారులు. ఓ మహిళ వినూత్న పద్ధతిలో బంగారాన్ని అక్రమంగా ఇక్కడకు తరలించినప్పటికీ కస్టమ్స్ అధికారుల ముందు చూపుతో అడ్డంగా బుక్కైపోయింది. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు బంగారాన్ని అక్రమ రవాణా చేసిన ఓ సూడాన్ మహిళను శంషాబాద్ విమానాశ్రయం కస్టమ్స్ అధీనంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు శనివారం రాత్రి పట్టుకున్నారు. ఆమె నుంచి రూ.58.21 లక్షల విలువైన 1.79 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం రవాణాకు ఫాయిల్స్, టేపుల్ని వినియోగించింది. సూడాన్‌కు చెందిన తన్వీ ముసా అనే మహిళ మూడు నెలలుగా అనేకసార్లు దుబాయ్–హైదరాబాద్‌ల మధ్య ప్రయాణించింది. ఈ ప్రయాణ వివరాలను ప్రొఫైలింగ్ చేసిన కస్టమ్స్ అధికారులు తన్వీ ముసాను కీలక స్మగ్లర్లకు సహకరించే బంగారం క్యారియర్‌గా అనుమానించారు. ఇక్కడకు వచ్చిన క్యారియర్ల నుంచి రిసీవర్లు బంగారాన్ని తీసుకుని సూత్రధారులకు అప్పగిస్తుంటారు. శనివారం రాత్రి దుబాయ్ నుంచి వస్తున్న విమానంలో సుడాన్‌కు చెందిన మహిళ మరోసారి హైదరాబాద్‌కు వస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. విదేశాల నుంచి బంగారం తదితరాలు తీసుకువచ్చే ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లోని రెడ్ చానల్ ద్వారా బయటకు వస్తారు. తమ వద్ద ఎలాంటి వస్తువులు లేవని భావించే వారు గ్రీన్ చానల్ ద్వారా బయటకు వచ్చేస్తుంటారు. స్మగ్లర్లను పట్టుకోవడానికి కస్టమ్స్ అధికారులు ఇక్కడే కాపుకాస్తుంటారు. శనివారం రాత్రి కూడా తన్వీ ముసాను అధికారులు గ్రీన్ చానల్ వద్దే అదుపులోకి తీసుకున్నారు. ఆమె హ్యాండ్ బ్యాగ్‌ను తనిఖీ చేయగా మూడు పాలిథీన్ కవర్లలో ఉన్న బంగారం బిస్కెట్లు బయటపడ్డాయి. స్కానింగ్‌లో చిక్కకుండా ఉండటానికి స్మగ్లర్లు వాటికి సిల్వర్ ఫాయిల్స్ చుట్టి దానికి నల్లరంగు టేపు వేసి పంపారు. దీన్ని గుర్తించిన కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేసుకుని ఆమెను అరెస్టు చేశారు. ఈ వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
పసిడి దందాకు కొత్త పంథా
సాక్షి, హైదరాబాద్: బంగారం స్మగ్లర్లు రోజుకో పంథాలో తమ దందా కొనసాగిస్తున్నారు. పలు రూపాల్లో పసిడిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. హైదరాబాద్ వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు వేర్వేరుగా ఒకేరోజు ఛేదించిన రెండు కేసులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇద్దరు హైదరాబాదీయుల్ని అదుపులోకి తీసుకున్న అధికారులు మొత్తం రూ.1.17 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ అధికారులు గుట్టురట్టు చేసిన కేసు వివరాలను హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి బుధవారం వెల్లడించారు. గోల్కొండ ప్రాంతానికి చెందిన నిరుద్యోగి సయ్యద్ అబ్దుల్ హైతమీన్‌కు షార్జాలో ఉంటున్న సయ్యద్ అఫ్జల్ హుస్సేన్‌తో పరిచయం ఏర్పడింది. హుస్సేన్ గతంలో డ్రైవర్‌గా పని చేసి ప్రస్తుతం బంగారం స్మగ్లర్‌గా మారిపోయాడు. హైతమీన్‌ను క్యారియర్‌గా మార్చి స్మగ్లింగ్‌కు శ్రీకారం చుట్టాడు. గత నెల్లో షార్జా వెళ్లిన హైతమీన్ అక్కడ అఫ్జల్ సహకారంతో కొన్ని ప్రత్యేక దుకాణాల్లో 550 గ్రాముల బంగారాన్ని పేస్ట్ రూపంలోకి మార్చాడు. సీల్డ్ కవర్లో ప్యాక్ చేసి ఉన్న దీన్ని రెండు యాంకిల్ బ్యాండ్స్‌లో ఏర్పాటు చేయించుకున్నాడు. వీటిని రెండు కాళ్లకు అమర్చుకుని, వాటిపై సాక్సు వేసుకుని షూ ధరించి గత శనివారం సిటీకి వచ్చాడు. గిన్నెలో వేసి వేడి చేస్తే చాలు పసిడి య«థాతథంగా బయటపడుతోంది. కనీసం గ్రాము కూడా తరుగు ఉండదు. బంగారం రూపు మార్చడానికి ఆ దుకాణాలవారు రూ.16 వేలు (భారత కరెన్సీలో) చార్జ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్ఐలు పి.మల్లికార్జున్, ఎల్.భాస్కర్‌రెడ్డి, బి.దుర్గారావు, మహ్మద్ ముజఫర్ అలీ, కానిస్టేబుల్ బి.ప్రవీణ్ బుధవారం హైతమీన్ ఇంటిపై దాడి చేశారు. పేస్ట్ రూపంలో ఉన్న బంగారం, పాస్‌పోర్ట్ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ బంగారం విక్రయించిన తర్వాత వచ్చిన మొత్తాన్ని అఫ్జల్‌కు పంపిస్తానని, తనకు ఒక్కో ట్రిక్కు రూ.15 వేల నుంచి రూ.20 వేలు ఇస్తుంటాడని హైతమీన్ పేర్కొన్నాడు. కస్టమ్స్‌కు చిక్కిన మరో క్యారియర్... నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల దుబాయ్ వెళ్లారు. బుధవారం తిరిగి వచ్చిన ఆయన తనతోపాటు నాలుగు ట్రాలీ బ్యాగ్స్ తీసుకువచ్చారు. అతడి వ్యవహారశైలితోపాటు బ్యాగులపై అనుమానం వచ్చిన కస్టమ్స్ ఆధీనంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) ఆపి తనిఖీలు చేసింది. అతడి వద్ద, బ్యాగుల్లోనూ అనుమానిత వస్తువులు లభించలేదు. అయితే అతడు నాలుగు బ్యాగుల్ని పట్టుకు రావడంపై కస్టమ్స్ అధికారులు దృష్టి పెట్టారు. దీంతో వాటిని అణువణువూ తనిఖీ చేశారు. ఆ ట్రాలీ బ్యాగ్స్‌కు ఉన్న ఫ్రేమ్‌లు, హ్యాండిల్, చక్రాలు తదితరాలన్నీ బంగారంతోనే తయారైనట్లు గుర్తించారు. దుబాయ్‌లో మూడు కిలోల బంగారం ఖరీదు చేసిన సూత్రధారులు దాన్ని కొందరి సాయంతో ఇలాంటి వస్తువులుగా మార్చారు. ఎవరికీ అనుమానం రాకుండా వాటిపై స్టీలు, ప్లాస్టిక్, అల్యూమినియం కోటింగ్స్ వేశారు. వీటిని ఆయా ట్రాలీ బ్యాగ్స్‌కు ఉన్న వాటితో రీప్లేస్ చేశారు. ఈ బ్యాగుల్ని తీసుకువస్తూ నగరవాసి కస్టమ్స్‌కు చిక్కాడు. ఫ్రేమ్‌లు, హ్యాండిల్, చక్రాలను వేరు చేసి తూకం వేయగా మూడు కేజీల బంగారం ఉన్నట్లు తేలింది. దీని ధర లోకల్ మార్కెట్లో రూ.కోటి ఉంటుందని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు. ఇతడు ఎవరి కోసం ఈ బంగారం తీసుకువచ్చాడు? దీని వెనుక ఎవరు ఉన్నారు? తదితర అంశాలను కస్టమ్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. -
విమానం టాయిలెట్లో బంగారం పట్టివేత
శంషాబాద్: కస్టమ్స్ తనిఖీలకు భయపడిన ఓ ప్రయాణికుడు తాను పట్టుబడుతానేమోననే ఆందోళనతో విదేశాల నుంచి తీసుకొచ్చిన బంగారాన్ని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టాయిలెట్లో వదిలివెళ్లాడు. ఆదివారం వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. 1,866 గ్రాముల బరువు కలిగిన పదహారు బంగారు బిస్కెట్లు ఇందులో బయటపడ్డాయి. వీటి విలువ రూ.60,94,122 ఉంటుందని అధికారులు నిర్ధారించారు. అయితే, విమానం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం తెలియరాలేదు. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాత్రూంలో 2.8 కిలోల బంగారం
సాక్షి బెంగళూరు: అక్రమంగా తరలిస్తున్న 2.8 కేజీల బంగారాన్ని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ సుమారు రూ.87.69 లక్షలుగా లెక్కగట్టారు. విమానాశ్రయంలోని శౌచాలయాన్ని శుభ్రపరిచే సిబ్బంది ఈ నెల 4వ తేదీన బాత్రూంలోని చెత్తబుట్టలో ఒక పాలిథీన్ బ్యాగ్ ఉండటాన్ని గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. ఆ బ్యాగును తెరిచి చూడగా 2.8 కేజీల బంగారు ఆభరణాలు లభించాయి. దీనిపై కస్టమ్స్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఎవరో అక్రమంగా బంగారాన్ని దేశానికి తీసుకొచ్చి, విమానాశ్రయం నుంచి బయటకు తీసుకెళ్లలేక వదిలేసి ఉంటారని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టు@బంగారం స్మగ్లింగ్
శంషాబాద్: దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు కేంద్రంగా బంగారం అక్రమ రవాణా చేస్తున్న భారీ స్మగ్లింగ్ ముఠా డొంక కదిలింది. ఈ నెల 4న ఈకే 528 విమానంలో దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికురాలి సమాచారంతో ముఠా గుట్టును కస్టమ్స్ అధికారులు రట్టు చేశారు. అదే విమానంలో వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలిపై అనుమానంతో అధికారులు ఆమె లగేజీ తనిఖీ చేశారు. లగేజీలో బొమ్మలు, వ్యక్తిగత వస్తువులు మాత్రమే ఉండటంతో మరింత లోతుగా తనిఖీలు చేపట్టారు. బొమ్మలు ఉన్న బాక్స్‌ను స్కానింగ్ చేయగా కార్బన్ కాగితాల వెనక కార్డ్‌బోర్డుకు మధ్య బంగారాన్ని రేకులుగా మార్చి అమర్చిన విషయాన్ని గుర్తించారు. సుమారు 1,100 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా.. తనకు ప్రయాణ చార్జీలతో పాటు ఉపాధి కల్పిస్తామని చెప్పడంతోనే బంగారాన్ని తీసుకువచ్చానని తెలిపింది. దుబాయ్‌లో బంగారం అప్పగించిన వ్యక్తి తన ఫొటో తీసుకుని హైదరాబాద్‌కు సమాచారం అందించినట్లు మహిళ వివరించింది. దీంతో కస్టమ్స్ అధికారులు శంషాబాద్ జోన్ పోలీసులతో కలసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి స్మగ్లర్లను ఎయిర్‌పోర్టులో 2 రోజుల కిందట అదుపులోకి తీసుకున్నారు. అదుపులో ఏడుగురు.. తొలిసారి ప్రయాణించే మహిళలతో పాటు ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వారిని కూడా ఈ ముఠా వలలో వేసుకుని వారి ద్వారా బంగారాన్ని అక్రమం గా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దుబాయ్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ముఠాకు సంబంధించిన ఆరుగురు వ్యక్తులు శంషాబాద్ ఎయి ర్పోర్టులోనే ఉంటున్నారు. ప్రయాణికుల ద్వారా వచ్చిన పార్సిళ్లను సమీపంలోని హోటళ్లకు తీసుకెళ్లి అక్కడి నుంచి నలుగురు వ్యక్తులు కేరళ తీసుకెళ్లి అక్కడి నుంచి ముంబైకి తరలిస్తున్నట్లు.. మరో ఇద్దరు వ్యక్తులు నేరుగా హైదరాబాద్ నుంచే ముంబైకి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆరుగురితో పాటు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. వారం రోజుల్లో 5 పార్సిళ్లను ముంబైకి తరలించినట్లు నిందితులు వెల్లడించినట్లు సమాచారం. సిబ్బంది పాత్ర సైతం.. ఈ నెల మొదటి వారంలో మరో 2 బంగారం అక్రమ రవాణా ఘటనలు జరిగినట్లు కస్టమ్స్ అధికారులు మంగళవారం వెల్లడించారు. దుబాయ్ నుంచి వచ్చిన ఈకే 528 విమానంలోని చెత్తను తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో వాటిని స్కానింగ్ చేశారు. అందులో టేప్లతో చుట్టి ఉన్న ఓ ప్యాక్‌లో 615 గ్రాముల బరువున్న 5 బంగారు కడ్డీలు బయటపడ్డాయి. వీటి విలువ సుమారు రూ.19 లక్షలు ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉంటే ఈ నెల 3న రాత్రి 12 గంటల సమయంలో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది ఒకరు పార్సిళ్లను ఏరో బ్రిడ్జి సమీపంలో పడేసి అక్కడే అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో ఎయిర్ ఇండియా అధికారి అతడిని ప్రశ్నించగా పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. విస్కాన్ ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్ తరఫున ఇండిగో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బందిగా పనిచేస్తున్నట్లు వెల్లడించాడు. అతడు పడేసిన పార్సిళ్లను చూడగా 1,632 గ్రాముల బంగారం బయటపడింది. -
విమానం సీటు కింద బంగారం
శంషాబాద్: గల్ఫ్ దేశాల నుంచి స్మగ్లర్ల ద్వారా అక్రమంగా బంగారాన్ని దేశంలోని పలు ప్రాంతాలకు తరలిస్తున్న ఓ వ్యక్తిని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విమానంలోని సీటు కింద అతడు దాచిన 1.22 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎయిర్ ఇండియా 952 విమా నంలో దుబాయ్ నుంచి శంషాబాద్ వచ్చిన ప్రయాణికుడిని అంతర్జాతీయ అరైవల్ వద్ద కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతడి వద్ద అక్రమ రవాణా వస్తువులు ఏమీ లభించలేదు. కానీ, అతడి కదలికలపై సందేహంతో పాస్‌పోర్టును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సదరు ప్రయాణికుడు గత కొద్ది రోజుల్లోనే గల్ఫ్ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు రాకపోకలు సాగించిన విషయాన్ని తెలుసుకున్నారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని లోతుగా విచారించారు. తాను ప్రయాణించిన ఎయిర్ ఇండియా విమానం సీటు కింద ఓ ప్యాకెట్లో 1.22 కేజీల బంగారాన్ని దాచినట్లు తెలిపాడు. అప్రమత్తమైన అధికారులు విమానంలోకి వెళ్లి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఈ విమానం శంషాబాద్ నుంచి సాయంత్రం 6 గంటలకు దేశీయ సర్వీస్‌గా మారి వైజాగ్‌కు బయలుదేరుతుంది. దీంతో సీటు కింద దాచిన బంగారాన్ని హైదరాబాద్‌కు చెందిన మరో ప్రయాణికుడు వైజాగ్‌కు తీసుకువెళ్లి అక్కడ నుంచి దానిని ఢిల్లీకి తీసుకువెళ్లనున్నట్లు నిందితుడు అధికారులకు వివరించాడు. దుబాయ్‌లోని ఓ స్మగ్లర్ నుంచి రూ.50 వేలకు బంగారం అక్రమ రవాణా చేసేందుకు ఒప్పుకున్నట్లు నిందితుడు తెలిపాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేపడుతున్నారు. -
రూ.9.7 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లు స్వాధీనం
అన్నానగర్ (చెన్నై): ఇరాన్ నుంచి తమిళనాడుకు సముద్ర మార్గంలో అక్రమంగా తీసుకొచ్చిన రూ.9.7 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను చెన్నై కస్టమ్స్ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ముందుగా అందిన రహస్య సమాచారం మేరకు కస్టమ్స్ అధికారులు చెన్నై హార్బర్లో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో దిండుగల్‌లోని ఒక ఎగుమతుల కంపెనీకి చెందిన నౌక ఇరాన్ నుంచి వచ్చింది. నౌకలో జిప్సం, ఉప్పు దిగుమతి చేస్తున్నట్టుగా తెలిపి అట్టపెట్టెల్లో విదేశీ సిగరెట్లను అక్రమంగా తీసుకొచ్చినట్టు గుర్తించారు. మొత్తం 490 అట్టపెట్టెల్లో ఇండోనేషియాలో తయారైన ప్రముఖ కంపెనీకి చెందిన సిగరెట్లు ఉన్నాయి. వీటిని స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. -
ఎయిర్‌పోర్టులో క్యాట్‌ఫిష్ స్వాధీనం
-
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో క్యాట్‌ఫిష్ స్వాధీనం
సాక్షి, శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.3 లక్షల విలువ చేసే 44 బాక్సుల క్యాట్ ఫిష్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. కోల్‌కతా నుంచి బీదర్ తరలించేందుకు ప్రయత్నిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. క్యాట్ ఫిష్ బాక్సులను మత్స్య శాఖ ఆధికారులకు అప్పగించి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎయిర్‌పోర్టులో తనిఖీలు: పట్టుబడిన బంగారం
సాక్షి, శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారుల శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మస్కట్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 350 గ్రాముల బంగారం బయటపడింది. పట్టుబడిన బంగారం సంబంధించి ఎలాంటి రసీదులు లేకపోవడంతో అధికారులు బంగారం స్వాధీనం చేసుకుని అతనిని విచారణ చేపడుతున్నారు. దొరికిన బంగారం రూ. 11.65 లక్షల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. -
బ్రెడ్ ప్యాకెట్ల మధ్యలో కరెన్సీ కట్టలు
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: విదేశీ కరెన్సీ అక్రమ రవాణాకు నగర పోలీసులు చెక్ పెట్టారు. భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు పాతబస్తీ వాసుల్ని అరెస్టు చేసి, వీరి నుంచి రూ.3.96 కోట్ల విలువైన ఏడు దేశాల కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. మొఘల్‌పుర ప్రాంతానికి చెందిన స్ప్రే పెయింటర్ రవూఫ్ భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని దుబాయ్‌కి తరలిస్తున్నట్లు దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అం దింది. దీంతో నిఘా ఉంచిన అధికారులు రవూఫ్ బుధవారం అరబ్ ఎమిరేట్స్ విమానం ఎక్కుతు న్నట్లు గుర్తించారు. అప్పటికే అతడు తన లగేజ్‌ను చెక్ ఇన్‌లో వేసి ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ కౌంటర్లు దాటి నట్లు నిర్థారించుకున్నారు. విమానాశ్రయం లోపలకు వెళ్లి చర్యలు తీసుకునే అధికారం టాస్క్‌ఫోర్స్‌కు లేకపోవడంతో కస్టమ్స్ అధికారుల్ని అప్రమత్తం చేశారు. ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ సిబ్బంది రవూఫ్‌ను అదుపులోకి తీసుకోవడంతోపాటు లగేజ్ బెల్ట్‌పై ఉన్న బ్యాగ్‌ను వెనక్కు రప్పించారు. దాన్ని తెరిచి చూడగా అందులోని ఆరు కట్టల్లో ఏడు దేశాలకు చెందిన కరెన్సీ లభించింది. ఈ బండిళ్లను రవూఫ్ బ్రెడ్, బిస్కెట్ ప్యాకెట్ల మధ్యలో ఉంచినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వాటిలో అమెరికన్ డాలర్లు, యూరోలతో పాటు సౌదీ, కువైట్, బెహరేన్, ఒమన్ దేశాలకు చెందిన కరెన్సీ బయటపడింది. తనకు ఈ డబ్బును మొఘల్పురకే చెందిన మెహరేన్ అందించాడని, దుబాయ్‌లో ఉండే అబ్దుల్లాకు చేరిస్తే రూ.15 వేల కమీషన్, విమాన టిక్కెట్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడని రవూఫ్ అంగీకరించాడు. మెహరేన్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి తనను దించి వెళ్లినట్లు ఇతడు చెప్పాడు.దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెహరేన్ని పట్టుకోవడానికి రంగంలోకి దిగారు. రవూఫ్‌తోనే ఫోన్ చేయించి అతడు ఎక్కడున్నాడో తెలుసుకుని పట్టుకొనేందుకు ప్రయత్నించారు. విమానాశ్రయం నుంచి పహాడీషరీఫ్ వెళ్లే మార్గంలో ఓ హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద అతడు ఉన్నట్లు గుర్తించారు. అయితే అతడు రవూఫ్నే క్యాబ్‌లో రమ్మని చెప్పి.. ఆ వాహనం నంబర్ తెలుసుకుని ఫాలో అవడం ప్రారంభించాడు. దీంతో సిటీ శివార్ల వరకు రహస్యంగా వెంబడించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా మెహరేన్ను అదుపులోకి తీసుకుని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ప్రాథమిక విచారణ నేపథ్యంలో ఈ నగదు మెహరేన్ సొంతం కాదని, కొందరు వ్యాపారుల వద్ద తీసుకుని 3 శాతం కమీషన్‌కు ఆశపడి దుబాయ్‌కు పంపుతున్నట్లు బయటపడింది. సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సైతం ఈ రాకెట్ మూలాలు కనుక్కోవడంపై దృష్టి పెట్టారు. ఇంత భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ ఏఏ మార్గాల్లో సిటీకి వచ్చిందనే అంశాలనూ ఆరా తీస్తున్నారు. -
అమెరికా నర్సునంటూ తీయని మాటలు
జయనగర: అమెరికాలో నర్సు, ఆర్బీఐ ఆఫీసర్, కస్టమ్స్ అధికారి తదితర పేర్లతో ఒక మాయలేడి నగరానికి చెందిన టెక్కీకి తీయని మాటలు చెప్పి దఫదఫాలుగా రూ.9.02 లక్షల నగదును తన అకౌంట్‌కు జమచేసుకుని మోసగించిన ఘటన నగరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. అశోకనగర పోలీసుల కథనం ప్రకారం....నెలమంగలకు చెందిన రమేశ్ అనే వ్యక్తి నగరంలో ఓ ప్రముఖ సాప్ట్వేర్ కంపెనీలో టెక్కీ. ఇతడికి ఫేస్ బుక్‌లో రచనా కరం అనే యువతి పరిచయమైంది. ఇద్దరూ మొబైల్ నెంబర్లు మార్చుకుని కబుర్లు చెప్పుకోవడం ఆరంభించారు. బెంగళూరుకు వస్తానని.. తాను అమెరికాలో నర్సుగా పనిచేస్తున్నట్లు, త్వరలో బెంగళూరుకు వస్తానని, పర్యాటక ప్రాంతాలను వీక్షించడానికి తాను బసచేయడానికి ఇంటిని చూడాలని రమేశ్‌కు తెలిపింది. ప్రస్తుతానికి తన వద్ద డబ్బులేదని రమేశ్ ఆమెతో చెప్పాడు. అమెరికా డాలర్లు, బంగారు ఆభరణాలు పార్శిల్ ద్వారా పంపిస్తానని, డాలర్లను రూపాయిల్లోకి మార్చుకోవాలని రచనా కరం అతణ్ని బుట్టలోకి వేసింది. ఇది నమ్మిన రమేశ్ కొన్నిరోజులకు ఆమె చెప్పిన బ్యాంకు ఖాతాలోకి రూ.4లక్షల 70 వేల నగదు జమచేశాడు. అనంతరం అక్టోబరు 2వ తేదీన ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్ అధికారి నిషా కుమారి పేరుతో రమేశ్‌కు ఫోన్ వచ్చింది. అమెరికా నుంచి పార్శిల్ వచ్చిందని, కస్టమ్స్ సుంకాన్ని విమానాశ్రయ అధికారి సుమన్‌దేవి ఖాతాకు జమ చేస్తే, పార్శిల్‌ను మీకు పంపిస్తానని చెప్పింది. ఈమె మాటలు నమ్మిన రమేశ్ అక్టోబరు 3వ తేదీన నిషా కుమారి ఖాతా కు రూ.1.62 లక్షల నగదు పంపారు. పార్శిల్ బరువు ఎక్కువగా, పన్నులు కట్టాలని రమేష్‌కు మళ్లీ నిషాకుమారి ఫోన్ చేసింది, మాన్సింగ్ ఖరే అనే అధికారి అకౌంట్‌కు రూ.2.70 లక్షల నగదు జమచేయాలని సూచించింది. ఈమె మాటలు నమ్మిన రమేశ్ ఆమె చెప్పిన ఖాతాలోకి ఆ సొమ్మును జమచేశాడు. మరో రూ.4.70 లక్షలు పంపాలని ఫోన్ చివరికి అక్టోబరు 25 తేదీన ఆర్బీఐ ప్రధానాధాకిరాఇ స్వరబ్ జోషిననే పేరుతో ఫోన్ చేసిన వ్యక్తి అమెరికా పార్శిల్ కోసం మీరు పంపిన డబ్బు ఆ అకౌంట్లలోకి జమ కాలేదని, మళ్లీ రూ.4.70 లక్షల నగదు అకౌంట్‌కు జమచేయాలని తెలిపాడు. దీంతో అప్పటికే నగదు పంపీ పంపీ విసిగిపోయిన రమేశ్‌కు అనుమానం వచ్చి ఆర్బీఐ కార్యాలయానికి వెళ్లి విచారించగా, ఇదంతా ఫ్రాడ్, ఎవరో నిన్ను తెలివిగా మోసగించారని వారు స్పష్టంచేశారు. బాధితుడు రమేశ్ లబోదిబోమంటూ శనివారం అశోకనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ క్రైం పోలీసుల సహాయంతో వంచకురాలి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. -
30 కిలోల బంగారాన్ని మింగేశారు
సాక్షి, చెన్నై: ‘మీ ఇల్లు బంగారం గానూ’ అంటూ ఆశ్చర్యపోవడం అనాదిగా వస్తోంది. అయితే మధురై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 20 మంది ప్రయాణికులకు స్కానింగ్ తీసి ‘ మీ కడుపు బంగారం గానూ’ అంటూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. దుబాయ్ నుంచి ఆదివారం రాత్రి మధురై విమానాశ్రయానికి వచ్చే విమానంలో భారీ ఎత్తున బంగారం అక్రమ రవాణా సాగుతున్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్, కస్టమ్స్ అధికారులకు సమాచారం వచ్చింది. ఆ విమానం నుంచి దిగిన 60 మంది ప్రయాణికులను తనిఖీ చేసి స్కానింగ్‌లు సైతం తీయగా వీరిలోని 20 మంది కడుపులో బంగారాన్ని దాచిపెట్టుకుని ఉన్నట్లు గుర్తించారు. చిన్నపాటి పాలిథిన్ కవర్లో 30 కిలోల బరువులున్న బంగారు బిస్కెట్లను పెట్టి మింగేసినట్లు అధికారులు తెలుసుకున్నారు. ఈ 20 మంది ప్రయాణికులను సోమవారం ఉదయం ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి ఎనిమా ఇచ్చి బంగారు బిస్కెట్లను బైటకు తీయించారు. వీరిలో కొందరు మహిళలు కూడా ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. మధురై విమానాశ్రయంలో 30 కిలోల బంగారు పట్టుబడటం ఇదే ప్రధమనని ఆయన అన్నారు. -
ఏపీ ఫైబర్ గ్రిడ్‌కు ఊహించని షాక్!
-
మలద్వారం, ఉదరంలో బంగారు బిస్కెట్లు.!
-
మలద్వారం, ఉదరంలో బంగారు బిస్కెట్లు.!
విశాఖపట్నం: బంగారు బిస్కెట్లు స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని విశాఖపట్నం కస్టమ్స్ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. కొలంబో నుంచి ఆదివారం విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన శ్రీలంక వాసి అబ్దుల్ మహ్మద్ రజాక్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు విచారణ చేపట్టగా.. అతని మలద్వారంలో నాలుగు, ఉదరంలో మరి కొన్ని బంగారు బిస్కెట్లు ఉన్నట్లు తేలింది. దీంతో అతన్ని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం 800 గ్రాముల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బెంగళూరులో 20 కేజీల బంగారం పట్టివేత
బనశంకరి (బెంగళూరు): దుబాయ్ నుంచి బెంగళూరుకు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరిని కెంపేగౌడ అంతర్జాతీయ విమాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 20 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 18వ తేదీన దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల బ్యాగ్‌లను తనిఖీ చేయగా అందులో 20 కేజీల బంగారు బిస్కెట్లతోపాటు కొంత నగదు బయటపడింది. దీంతో వాటని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని ఇద్దరు నింధితులను అరెస్ట్ చేశారు. కాగా, పట్టుబడిన బంగారం విలువ రూ.6 కోట్ల ఉంటుందని అధికారులు తెలిపారు. -
ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం
-
బూట్లలో బంగారం బిస్కెట్లు
► రూ.58 లక్షల విలువైన బంగారం స్వాధీనం ► బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఒకరి అరెస్ట్ బెంగళూరు : ఎవరికీ అనుమానం రాకూడదని వేసుకున్న బూట్లలో బంగారాన్ని దాచాడు. కానీ అలా వేసుకున్న బూట్లతో సరిగ్గా నడవలేక దొరికిపోయాడు. మంగళవారం వీఎం ఫహాద్ (37) అనే ప్రయాణికుడు ఎయిర్ ఇండియా విమానంలో దుబాయ్ నుంచి బెంగుళూరుకు వచ్చాడు. కెంపెగౌడ విమానాశ్రయంలో దర్జాగా దిగిన ఆ యువకుడు విమానాశ్రయంలో అటుఇటుగా నడుస్తున్నప్పుడు కస్టమ్స్ అధికారులకు ఎందుకో అనుమానం వచ్చింది. అతడి నడక తీరులో తేడా కనిపించడంతో అనుమానంతో ఆ ప్రయాణికుడిని తనిఖీ చేశారు. తేడాతో నడుస్తున్నందున ముందుగా అతడు వేసుకున్న బూట్లను విప్పించగా... ఆశ్చర్యం... దాచిన బంగారం బయటపడింది. అయితే ఆ ప్రయాణికుడు ఏకంగా 58 లక్షల రూపాయల విలువ చేసే బంగారు బిస్కెట్లను బూట్లతో దాచి తరలిస్తున్నాడు. తులాల్లో కాదు ఏకంగా రెండు కిలోల బంగారు బిస్కెట్లను బూట్లతో ఉంచినట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దాంతో అధికారులు ఫహాద్ నుంచి బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. ఫహాద్ గోవాకు చెందిన వ్యక్తి అని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. నిందితుడు తరలిస్తున్న బిస్కెట్ల ధర మార్కెట్ లో సుమారు 58.60 లక్షల రూపాయల విలువ ఉంటుందని వారు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. -
అరటన్ను బంగారం, అర కేజీ వజ్రాలు స్వాధీనం
ఢాకా: బంగ్లాదేశ్ అధికారులు ఓ ప్రముఖ బంగారు వ్యాపారికి చెందిన అర టన్ను(500 కేజీలు) పసిడిని, అరకేజీ వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. అపన్ జ్యువెల్లర్స్‌కు చెందిన ఐదు షాపుల్లో గత నెలలో దాడులు చేసి వీటిని పట్టుకున్నట్లు కస్టమ్స్ అధికారులు ఆదివారం వెల్లడించారు. బంగారం విలువ రూ.201 కోట్లు. అపన్ జ్యువెల్లర్స్ యజమాని కొడుకు ఓ కేసులో తొలుత అరెస్టయ్యాడు. తన గురించి పోలీసుల వద్ద అతను గొప్పలు చెప్పుకోవడంతో అనుమానమొచ్చిన అధికారులు దాడులు చేసి బంగారం, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. -
కడియాల వెనుక కథేంటి?
- పసిడిని కడియాల రూపంలో తెచ్చిన ఇద్దరు మహిళలు - అనుమానంతో అదుపులోకి తీసుకున్న కస్టమ్స్.. అక్రమ రవాణాగా నిర్ధారణ - ఇద్దరి నుంచి 784 గ్రాముల బంగారం స్వాధీనం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు మహిళలు షికాగో, షార్జా నుంచి వచ్చారు. చాలా నీట్‌గా ఉన్న వీరి చేతులకు ఉన్న కడియాలు మాత్రం నాటుగా కనిపించాయి. అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకోగా... అది అక్రమ రవాణాగా తేలింది. మొత్తం 784 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఆ ఇద్దరినీ విచారిస్తోంది. ఇది వ్యవస్థీకృత వ్యవహారం కాదని, ఇరువురూ సొంత అవసరాలకే తీసుకువస్తున్నారని కస్టమ్స్ అధికారులు భావిస్తున్నారు. నగరానికి చెందిన ఓ మహిళ కొన్నాళ్ల క్రితం అమెరికాలోని షికాగో వెళ్లింది. తిరిగి వస్తూ తనతో పాటు బంగారం తెచ్చుకోవాలని భావించింది. దీంతో అక్కడ 385 గ్రాముల బంగారం ఖరీదు చేసింది. ఇందులో ఒక గోల్డ్ కాయిన్ మినహా మిగతా బంగారాన్ని ఆరు కడియాల రూపంలోకి మార్చింది. నాలుగు రోజుల క్రితం బంగారం ఖరీదు చేయడానికి షార్జాకు వెళ్లిన మరో నగర మహిళ అక్కడ 399 గ్రాముల బంగారం కొనుగోలు చేసింది. దీన్ని మూడు కడియాల రూపంలోకి మార్పించింది. వీరిద్దరూ ఆ కడియాలను ధరించి శుక్రవారం వేర్వేరు విమానాల్లో శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. విదేశాల నుంచి బంగారం తెచ్చుకునేవారు ఆ విషయాన్ని కస్టమ్స్ అధికా రులకు తెలిపి, 35 శాతం సుంకం చెల్లించాలి. ఈ ఇద్దరు మహిళలూ ఆ సుంకం తప్పించుకోవడం కోసం బంగారు కడియాలను ఆభరణాల మాదిరిగా ధరించి తీసుకువచ్చారు. విమానాశ్రయంలో వీరు ధరించిన కడియాలను చూసిన కస్టమ్స్ అధికారులకు అనుమానం కలిగింది. అవి 24 క్యారట్ బంగారంతో చేసినవి కావడంతో పాటు ఆభరణాల మాదిరిగా ఎలాంటి డిజైన్ లేకుండా పూర్తి నాటు పద్ధతిలో ఉండటంతో కస్టమ్స్ అధికారులకు ఈ అనుమానం వచ్చింది. దీంతో ఇరువురినీ అదుపులోకి తీసుకోగా అక్రమ రవాణా వ్యవహారం బయటపడింది. ఇరువురి నుంచి కస్టమ్స్ అధికారులు రూ.22.5 లక్షల విలువైన 784 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో పూర్తి వివరాల కోసం ఆరా తీస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. -
ఎయిర్‌పోర్ట్‌లో కేజీ బంగారం స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు శుక్రవారం ముగ్గురు వ్యక్తుల నుంచి 1.23 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అమెరికా, అబుదాబి నుంచి వచ్చి న ఈ ముగ్గురిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న బంగా రం విలువ మార్కెట్లో రూ. 36.09 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. పసిడిని రవాణా చేసిన విధానం, తీసుకువచ్చిన ప్యాసింజర్ల ప్రొఫైలింగ్ ఆధారంగా ఇది వ్యవస్థీకృత స్మగ్లింగ్ కాకపోవచ్చని, వ్యక్తిగత అవసరాల కోసమే తెచ్చుకుని ఉండవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా నుంచి అబుదాబి మీదుగా వచ్చే విమానం లో శంషాబాద్ చేరుకున్న ఓ వ్యక్తి 342 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని 8 కడియాల రూపంలో తీసుకువచ్చాడు. అబుదాబి నుంచి వచ్చిన విమానంలో దిగిన ఇద్దరిలో ఒకరు 387 గ్రాముల బంగారాన్ని రెండు గొలుసుల రూపంలోనూ, మరొకరు 507 గ్రాముల బంగారాన్ని గాజుల రూపంలోనూ తీసుకొచ్చారు. -
‘ఠీవీ’గా పసిడి స్మగ్లింగ్
- టీవీలో ఆరు, సెల్‌ఫోన్ బాక్సు లోపల రెండు బంగారం బిస్కెట్లు - జెడ్డా నుంచి తీసుకొచ్చిన క్యారియర్ సాక్షి, హైదరాబాద్: ఎల్ఈడీ టీవీ, సెల్‌ఫోన్ బాక్సు ల్లో కేజీ బంగారం తీసుకువచ్చిన హైదరాబాదీని శుక్రవారం కస్టమ్స్ అధీనంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు పట్టుకున్నారు. నగరానికి చెందిన ఓ వ్యక్తి శుక్రవారం జెడ్డా నుంచి బహ్రెయిన్ మీదుగా వచ్చే గల్ఫ్ ఎయిర్ విమానంలో శంషాబాద్ చేరుకున్నాడు. తనతో ఎల్ఈడీ టీవీని తీసుకువచ్చాడు. ఇతడిని క్యారియర్‌గా వాడుకుంటూ జెడ్డాలో టీవీ, సెల్‌ఫోన్ బాక్స్ అప్పగించిన ప్రధాన స్మగ్లర్లు వాటిలో 8 బంగారం బిస్కెట్లను దాచారు. టీవీలో సర్క్యూట్ బోర్డుకు కింది భాగంలో ఆరు బిస్కెట్లను కార్బన్ పేపర్లో చుట్టి దాచిపెట్టారు. అలా చేస్తే కస్టమ్స్ అధికారులు స్కానింగ్ చేసినప్పుడు అది పసిడిగా గుర్తించలేరు. అయితే ఎల్ఈడీ టీవీలో పెద్ద బిస్కెట్ల సైజులో హెవీ మెటల్స్ ఉండవని, అదీ çసర్క్యూట్ బోర్డ్ కింది భాగంలో అసలే ఉండవని భావించిన అధికారులు దాన్ని విప్పిచూడగా ఆరు బిస్కెట్లు బయటపడ్డాయి. దీంతో ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు అతడి లగేజ్‌ని తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలోనే సెల్‌ఫోన్ బాక్సు లోపలి భాగంలో సెల్‌ఫోన్ కింద ఉంచిన మరో రెండు బిస్కెట్లు దొరికాయి. మొత్తం స్వాధీనం చేసుకున్న పసిడి విలువ మార్కెట్లో రూ.27.83 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. తనకు ఈ రెండు వస్తువుల్నీ జెడ్డా విమానాశ్రయంలో కొందరు అప్పగించారని, హైదరాబాద్ చేరిన తర్వాత తమ వారు వచ్చి తీసుకువెళ్తారని చెప్పిన నేపథ్యంలోనే వాటిని తీసుకువచ్చానని కస్టమ్స్ విచారణలో హైదరాబాదీ బయటపెట్టాడు. దీంతో అసలు సూత్రధారుల కోసం అధికారులు ఆరా తీస్తున్నారు. -
ఒకే ఫ్లైట్‌లో ఇద్దరు నగర స్మగ్లర్లు!
2 కిలోల బంగారంతీసుకువచ్చిన వృద్ధురాలు 366 గ్రాములు తెచ్చిన మరో మహిళ అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు ఒకే విమానంలో హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు స్మగ్లర్లను బుధవారం రాత్రి పట్టుకున్నారు. వీరి నుంచి రూ.70.98 లక్షలు విలువైన 2.366 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి జెడ్డా నుంచి సౌదీ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో ఇద్దరు మహిళలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. వీరిలో ఒకరైన 60 ఏళ్ల వృద్ధురాలు విమానాశ్రయంలో అనుమానాస్పదంగా సంచ రించడాన్ని కస్టమ్స్ అధీనంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు గుర్తించారు. అదుపులోకి తీసుకొని తనిఖీలు చేయగా... వస్త్రాల్లో దాచుకున్న రెండు కేజీల బంగారం బయటపడింది. వృద్ధురాలిని క్యారియర్‌గా వాడుకున్న సూత్రధారులు ఒక్కోటి కేజీ బరువున్న బిస్కెట్‌ను మూడేసి ముక్కలు చేసి జెడ్డాలో అప్పగించారని బయటపడింది. దీన్ని హైదరాబాద్ చేరిస్తే కొంత మొత్తం కమీషన్ ఇస్తానంటూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్యారియర్ ఫొటోను వాట్సాప్ ద్వారా ఇక్కడున్న రిసీవర్లకు సూత్రధారులు పంపారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన వెంటనే తమ వాళ్లే వచ్చి బంగారం తీసుకుని నగదు చెల్లిస్తా రంటూ వృద్ధురాలికి చెప్పారు. ఈ రిసీవర్ల కోసం వెతుకుతున్న నేపథ్యంలోనే వృద్ధురాలు కస్టమ్స్ అధికారులకు చిక్కారు. ఇదే విమానంలో వచ్చిన మరో మహిళ సైతం తన దుస్తుల్లో 366 గ్రాముల బంగారం దాచుకుని వచ్చింది. నగరానికే చెందిన ఈమెను సైతం అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఈ మహిళ వ్యక్తిగతంగానే బంగారం తీసుకు వస్తున్నట్లు అనుమా నిస్తున్నారు. వృద్ధురాలికి బంగారం ఇచ్చిన సూత్రధారులు, ఇక్కడ దాన్ని తీసుకునే రిసీవర్ల కోసం కస్టమ్స్ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. -
డస్ట్‌బిన్‌లో అంత బంగారం దొరికిందా..?
ముంబై: విమానాశ్రయాల్లో బంగారం పట్టుబడటం కొత్తేం కాదు. కాకపోతే ఈసారీ డస్టబిన్లో దొరికింది. ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డస్ట్‌బిన్‌లో పెద్ద మొత్తంలో బంగారం లభ్యమయింది. సాధారణ తనిఖీల్లో భాగంగా ఎయిర్‌పోర్టు కస్టమ్స్ ఇంటలిజెన్స్ విభాగం అధికారులు సోదాలు చేపట్టారు. పురుషుల టాయిలెట్‌లోని డస్ట్‌బిన్‌లో సుమారు 2.3కిలోల బంగారు ఆభరణాలు, కడ్డీలను అధికారులు గుర్తించారు. వీటి విలువ రూ.70లక్షల వరకు ఉంటుందని చెప్తున్నారు. వీటిని అక్రమంగా దేశంలోకి తీసుకువచ్చేందుకు గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నించి ఉంటారని, అది వీలుకాకపోవడంతో అక్కడే వదిలేసి ఉంటారని భావిస్తున్నారు. సీసీ ఫుటేజిలను పరిశీలించిన అనంతరం కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
ఎయిర్‌పోర్టులో రూ.8లక్షల బంగారం స్వాధీనం
శంషాబాద్(రంగారెడ్డి జిల్లా): శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. బహ్రెయిన్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి ప్యాంటులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జేబులో అక్రమంగా బంగారాన్ని తరలించడాన్ని గుర్తించారు. రూ.8 లక్షల విలువ చేసే 250 గ్రాముల బంగారాన్ని సీజ్ చేసి, కేసు నమోదు విచారణ చేపట్టారు. -
బంగారానికే రంగులు వేసి..
ఢిల్లీ : ఇంధిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వైర్లలా కనిపించేలా బంగారం పై రంగులు వేసి తీసుకురావాలని నిందితులు ప్రయత్నించారు. అయితే కస్టమ్స్ అధికారులు జరిపిన తనిఖీల్లో దాదాపు వెయ్యి గ్రాముల బంగారాన్ని గుర్తించి సీజ్ చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
అట్టపెట్టె..అరకిలో బంగారం..!
ఫాయిల్స్ రూపంలోకి మార్చి తెచ్చిన స్మగ్లర్ స్కానింగ్‌కు చిక్కకుండా కార్బన్స్ వినియోగం కేరళవాసిని పట్టుకున్న కస్టమ్స్ అధికారులు సాక్షి, హైదరాబాద్: దుబాయ్, సౌదీ నుంచి బంగారాన్ని విమాన మార్గంలో అక్రమంగా తరలించే ముఠాలు నానాటికీ తెలివి మీరు తున్నాయి. శంషాబాద్ విమానాశ్రయంలో 3 రోజుల క్రితం జెడ్డా నుంచి ‘రెక్టమ్ కన్సీల్మెంట్’ద్వారా వచ్చిన 2 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం మరువకముందే.. మరో కొత్త పంథా వెలుగులోకి వచ్చింది. మస్కట్ నుంచి వస్తున్న కేరళ వాసి దాదాపు అర కేజీ బంగారాన్ని ఫాయిల్స్ రూపంలోకి మార్చి అట్టపెట్టె గోడల్లో అమర్చి తీసుకు వస్తూ గురువారం కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. ఈ తరహాలో స్మగ్లింగ్ శంషా బాద్‌లో చిక్కడం అరుదని అధికారులు చెబుతున్నారు. ఒమర్ ఎయిర్లైన్స్ఫ్లైట్ లో(నం.డబ్ల్యూవై–325) ఓ వ్యక్తి శంషా బాద్‌కి చేరుకున్నాడు. టికెట్ రేటు తక్కు వగా ఉన్న నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చానని చెప్పిన ఇతడి వ్యవహారంపై ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కు సమాచా రం అందింది. బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్నాడనే అనుమానంతో సదరు వ్యక్తితో పాటు అతడి లగేజ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇతగాడు తన వస్త్రాల్ని ఓ అట్టపెట్టె (కార్టన్బాక్స్)లో పెట్టుకు రావడం అధికా రుల అనుమానాలకు బలాన్నిచ్చింది. ఆ పెట్టెను స్కానింగ్ చేయగా.. ఎలాంటి అను మానాస్పద వస్తువు కనిపించలేదు. దాన్ని తెరిచి చూడగా అందులో వస్త్రాలే కనిపిం చాయి. సాధారణంగా ఇలాంటి కార్టన్ బాక్సుల గోడల లోపలి వైపు ముడతల వంటి డిజైన్ ఉంటుంది. కానీ ఆ బాక్సు గోడలు ఆ రకంగా ఉండకపోవడంతో అధికారులు ఆ బాక్సును తెరిచి పరిశీ లించారు. బంగారాన్ని ఫాయిల్స్ రూపం లోకి మార్చి, ఆ గోడలకు అమర్చడంతో పాటు దానిపై అట్టతోనే మరో పొర ఏర్పా టు చేశారని వెల్లడైంది. ఫాయిల్స్‌కు అటు ఇటు మందంగా ఉన్న కార్బన్ పేపర్స్ పెట్టినందునే స్కానింగ్‌లో చిక్కలేదని గుర్తించారు. బాక్సు 4 గోడలకు ఉన్న 4 ఫాయిల్స్ 467గ్రా. బరువుందని, దీని ధర రూ.13.64 లక్షలుగా నిర్ధారించారు. దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కేజీ స్మగ్లింగ్ చేస్తే రూ. 3 లక్షల లాభం.. దేశంలో పసిడికి ఉన్న డిమాండ్‌కు తగ్గట్టు ఉత్పత్తి జరగట్లేదు. ఈ కారణంగానే దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. ఆయా దేశాల నుంచి పసిడిని కొనుగోలు చేసిన వారు అధికారికంగా ఇక్కడకు తీసుకురావాలన్నా పరోక్ష పన్ను విధానంతో లాభసాటి కావట్లేదు. అంతర్జాతీయ మార్కెట్లో 10 గ్రాముల పసిడికి ఉన్న ఖరీదును ప్రతి 15 రోజులకు సరాసరి తీసుకుని ఆ మొత్తంపై 10 శాతం దిగుమతి సుంకం చెల్లించేలా కేంద్రం నిబంధనలు రూపొందించింది. దీంతో కనీసం రూ.మూడు వేల వరకు పన్ను పడుతోంది. ఈ లెక్కన కేజీ బంగారం దేశీయ మార్కెట్లో కొనుగోలు చేయడానికి రూ.27 లక్షల నుంచి రూ.29 లక్షల వరకు అవుతుండగా.. దుబాయ్ తదితర దేశాల్లో గరిష్టంగా రూ.25 లక్షలకే దొరుకుతుంది. దీంతో అన్ని ఖర్చులూ పోయినా.. స్మగ్లర్లకు కనిష్టంగా రూ.3 లక్షల లాభం ఉంటోంది. -
ఎయిర్‌పోర్టులో రూ.34 లక్షల బంగారం స్వాధీనం
శంషాబాద్(రంగారెడ్డి జిల్లా): శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆదివారం ఓ వ్యక్తి నుంచి రూ.34 లక్షలు విలువచేసే 1192 గ్రాముల ఆరు బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. జెద్దా నుండి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో మర్మావయంలో దాచుకుని బంగారం తీసుకువస్తుండగా కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. రూ.34 లక్షల విలువచేసే బంగారు బిస్కెట్లు లభ్యమవ్వడంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
తణుకులో బంగారు బిస్కెట్లు స్వాధీనం
తణుకు: పెద్ద నోట్ల రద్దు తర్వాత బంగారు వ్యాపారులపై కస్టమ్స్ అధికారులు నిఘా పెంచారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఓ బంగారు వ్యాపారి ఇంట్లో సోదాలు నిర్వహించిన కస్టమ్స్ అధికారులు 6 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న బిస్కెట్ల విలువ సుమారు రూ. 17,80,000 ఉంటుందని అధికారులు తెలిపారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో గోల్డ్ సీజ్
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 730 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు వ్యక్తులను అధికారులు సోదాలు చేశారు. వారి వద్ద నుంచి బంగారం లభించగా, వాటికి సంబంధించిన రసీదులు చూపకపోవడంతో సీజ్ చేశారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇద్దరు నిందితులు హైదరాబాద్‌కు చెందినవారు. -
ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత
శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద శుక్రవారం కస్టమ్స్ అధికారులు బంగారం పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన అతని వద్ద 320 గ్రాముల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం అతడిని పోలీసులకు అప్పగించారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం స్వాధీనం
శంషాబాద్ (హైదరాబాద్): శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రంయలో తనిఖీలు నిర్వహిస్తున్న కస్టమ్స్ అధికారులు అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 320 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద అక్రమ బంగారం గుర్తించిన ఎయిర్పోర్ట్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
కెన్యా దంపతుల నుంచి కేజీన్నర బంగారం సీజ్
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కెన్యాకు చెందిన దంపతుల నుంచి కేజీన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా దుబాయి నుంచి ఈ రోజు ఉదయం హైదరాబాద్ వచ్చిన వీరి వద్ద బంగారం ఉండటాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అయితే వారి వద్ద బంగారానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో దంపతులను అదుపులోకి తీసకుని, బంగారాన్ని సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
షూలో మూడు కిలోల బంగారం..
శంషాబాద్(హైదరాబాద్): బూట్లలో దాచుకుని అక్రమంగా రవాణా చేస్తున్న మూడు కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మంగళవారం అర్ధరాత్రి దుబాయి నుంచి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో వచ్చిన హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రయాణికుడి తీరును అనుమానించిన అధికారులు అతడిని పూర్తిగా తనిఖీ చేశారు. అతడు వేసుకున్న షూ లోపలి భాగంలో మూడు కిలోల బరువున్న బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. వాటి విలువ రూ.75 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కోచీలో భారీగా బంగారం పట్టివేత
-
1.3 కిలోల బంగారం స్వాధీనం
హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సింగపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల లగేజీనీ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పూణేకిచెందిన ప్రయాణికుల వద్ద 1.3 కిలోల బంగారాన్ని అధికారులు గుర్తించారు. బంగారానికి సంబంధించిన ఎటువంటి రసీదులు లేకపోవడంతో వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రయాణికుల వివరాలు తెలియాల్సి ఉంది. -
583 గ్రాముల బంగారం స్వాధీనం
హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికురాలి నుంచి కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం దుబాయి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల లగేజీనీ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఓ మహిళ వద్ద 583 గ్రాములు బంగారాన్ని అధికారులు గుర్తించారు. బంగారానికి సంబంధించిన ఎటువంటి రసీదులు లేకపోవడంతో మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రయాణికురాలి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎయిర్‌పోర్ట్‌లో జంట నుంచి బుల్లెట్లు స్వాధీనం
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో శనివారం బుల్లెట్లు కలకలం సృష్టించాయి. కెనడా వెళ్తున్న ఓ జంట నుంచి దాదాపు 19 బుల్లెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ రోజు ఉదయం కెనడా వెళ్లేందుకు సదరు జంట విమానాశ్రయానికి చేరుకున్నారు. కస్టమ్స్ అధికారులు వారిని తనిఖీ చేస్తున్న క్రమంలో జంటకు సంబంధించిన లగేజీలో బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. దాంతో బుల్లెట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. -
583 గ్రాముల బంగారం స్వాధీనం
శంషాబాద్ : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికురాలి నుంచి కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం మస్కట్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల లగేజీనీ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఓ మహిళ వద్ద 583 గ్రాములు బంగారాన్ని అధికారులు గుర్తించారు. బంగారానికి సంబంధించిన ఎటువంటి రసీదులు లేకపోవడంతో మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రయాణికురాలి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎయిర్‌పోర్ట్‌లో 2.7 కేజీల బంగారం పట్టివేత
శంషాబాద్ : రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు వేర్వేరు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు 2.7 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారుల కథనం ప్రకారం.. గురువారం ఉదయం బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతడి లగేజీ నుంచి 2.3 కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో కౌలాలంపూర్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి లోదుస్తుల్లో 400 గ్రాముల బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
700 గ్రాముల బంగారం పట్టివేత
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సింగపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుడిని లగేజీనీ అధికారులు తనిఖీ చేశారు. అందులో 700 గ్రాముల బంగారు బిస్కెట్టు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అనంతరం ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాగా వరంగల్ జిల్లాలోని కాజీపేట జంక్షన్ లో గురువారం ఉదయం 14 కిలోల బంగారాన్ని జీఆర్పీ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తనిఖీల సందర్భంగా రెండు బ్యాగుల్లో అనుమాస్పదంగా ఇద్దరు వ్యక్తులు కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించారు. బ్యాగులో ప్యాకింగ్ ఉన్న 147 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. వాటి విలువ రూ.4 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. బంగారాన్ని హైదరాబాద్ బేగంపేటలోని బ్రింక్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ బజ్జూరి బులియన్ నుంచి తీసుకువస్తున్నట్టు విచారణలో తేలింది. అయితే బ్రింక్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ నుంచి 16 కిలోల బంగారం డెలివరీ చలాన్ లో ఉందని, కానీ నిందితుల దగ్గర 14.700 కిలోల మాత్రమే ఉన్నాయని పోలీసులు తెలిపారు. పట్టబడిన బంగారం, రసీదులలో తేడా ఉండటంతో బజ్జూరి బులియన్ వారిని పిలిపించి , బంగారాన్ని సీజ్ చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. -
700 గ్రాముల బంగారం పట్టివేత
హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికురాలి నుంచి కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారాన్ని సీజ్ చేశారు. గురువారం దుబాయి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికురాలి లగేజీని అధికారులు తనిఖీ చేశారు. అందులో 700 గ్రాముల బంగారు బిస్కెట్లు ఉన్నట్లు వారు కనుగొన్నారు. అనంతరం ప్రయాణికురాలని అదుపులోకి తీసుకుని, బంగారాన్ని సీజ్ చేశారు. -
600 గ్రాముల బంగారం పట్టివేత
హైదరాబాద్ : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారాన్ని సీజ్ చేశారు. శుక్రవారం ఉదయం సింగపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుడి లగేజీని అధికారులు తనిఖీ చేశారు. అందులో 600 గ్రాముల బంగారు బిస్కెట్లు ఉన్నాయి. దాంతో అతడిని అదుపులోకి తీసుకుని, బంగారాన్ని సీజ్ చేశారు. -
ఎయిర్‌పోర్టులో అరకిలో బంగారం సీజ్
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారం పట్టుకున్నారు. సింగపూర్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి దగ్గర నుండి శనివారం అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఓవైపు కస్టమ్స్ అధికారులు బంగారం పెద్ద ఎత్తున సీజ్ చేస్తున్నా మరోవైపు విదేశాల నుంచి బంగారం తరలి వస్తూనే ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. -
లోదుస్తుల్లో 2 కేజీల బంగారం
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఆయూబ్ అనే ప్రయాణికుడు లోదుస్తుల్లో బిస్కెట్లు తీసుకువస్తూ కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో పట్టుపడ్డాడు. అతని వద్ద నుంచి సుమారు 2 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. ఆయూబ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరకిలో బంగారం స్వాధీనం
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గురువారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు జరిపారు. ఈ నేపథ్యంలో మస్కట్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద సోదాలు జరిపారు. అతన్ని నుంచి అరకిలో బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
4.3 కిలోల బంగారం స్వాధీనం
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఇద్దరు వ్యక్తుల నుంచి కస్టమ్స్ అధికారులు 4.3 కేజీల బంగారాన్ని స్వాధీ నం చేసుకున్నారు. శుక్రవారం తెల్లవారు జామున ఎయిర్ అరేబియా విమానం షార్జా నుంచి హైదరాబాద్‌కు చేరుకుంది. అధికారులు ఓ ప్రయాణికుడి సీటు కింద తనిఖీ చేసి 2.8 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గురువారం తెల్లవారుజామున కౌలాలంపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న చెన్నై వాసి షబ్బీర్.. మైక్రోవొవెన్లో దాచి తీసుకొచ్చిన కిలోన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
మూడు కిలోల బంగారం పట్టివేత
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విమానంలో సీటు కింద అమర్చి బంగారాన్ని తరలించాలని ప్రయత్నించగా ఆ వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. మైక్రో ఓవెన్లో కిలో బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు నిన్న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
మైక్రో ఓవెన్ లో బంగారం ..
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు గురువారం ఉదయం తనిఖీలు నిర్వహంచారు. ఈ సందర్భంగా మైక్రో ఓవెన్లో బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన షబ్బీర్ అనే ప్రయాణికుడి వద్ద నుంచి కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షబ్బీర్ స్వస్థలం చెన్నై. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ల కలకలం
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం బుల్లెట్లు దొరికిన ఘటన కలకలం రేపింది. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఢిల్లీ వెళుతున్న సునీల్ అనే ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు ఉన్నట్లు కనుగొన్నారు. అతడిని అదుపులోకి తీసుకుని 9 ఎంఎం బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా సునీల్ ఢిల్లీ నుంచి చికాగో వెళుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కస్టమ్స్ విభాగం సహకరించాల్సిందే!
హైదరాబాద్: శేషాచలం అడవుల్లో లభించే అరుదైన ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలంటే కచ్చితంగా కస్టమ్స్ విభాగం సహకారం అవసరమని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఉదంతాల ఆధారంగా ఎర్రచందనం ఎక్కువగా దుంగల రూపంలో ఓడల ద్వారా విదేశాలకు అక్రమంగా ఎగుమతి అవుతున్నట్లు నిర్థారిస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు సహా అనేక పోర్టుల ద్వారా జరుగుతున్న ఈ స్మగ్లింగ్‌ను అడ్డుకోవాలంటే కస్టమ్స్, ఓడరేవులు సహా ఇతర విభాగాలతో సమన్వయం చేసుకుని పని చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ త్వరలో ప్రభుత్వానికి సమగ్ర నివేదికలు, సిఫార్సులతో కూడిన లేఖ రాయాలని పోలీసు అధికారులు యోచిస్తున్నారు. ఈ ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేయడమే తెలిసిన స్మగ్లర్లకు దానితో విదేశాల్లో ఏం చేస్తున్నారనేది స్పష్టంగా తెలియడంలేదు. దీనిపై ఆరాతీసిన పోలీసులకు పలు విషయాలు తెలిశాయి. చైనా, జపాన్ సహా అనేక మధ్య ఆసియా దేశాల్లో ఎర్రచందనానికి ఎంతో డిమాండ్ ఉంది. దీన్ని లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఔషధంగా అక్కడి వారు వినియోగిస్తున్నారు. ఎర్రచందనంతో చేసిన పాత్రల్లో నీరుపోసి, నిర్ణీత సమయం నిలువ ఉంచి తాగితే మంచి ఫలితాలు ఉంటాయని వారు భావిస్తుంటారు. అక్కడి కొన్ని దేశాల్లో ధనవంతుల ఇళ్లల్లో పెళ్లి జరగాలంటే ఎర్రచందనం తప్పనిసరి. దీంతో తయారు చేసిన షామిచాన్ అనే వాయిద్య పరికరాన్ని కానుకగా ఇవ్వడం ఆ దేశాల్లో ఆనవాయితీగా వస్తోంది. వీటన్నింటికీ మించి ఎర్రచందనంలో రేడియో ధార్మికతను తట్టుకునే శక్తి ఉందని, అందుకే న్యూక్లియర్ సంబంధ పరికరాల్లో దీని పొడిని పూతగా పూస్తారని చెబుతున్నారు. ఈ విధంగా డిమాండ్ ఉండటంతో దుంగల్ని వివిధ పేర్లతో పోర్టుల ద్వారా ఆయా దేశాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. -
రూ.2 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు స్వాధీనం
చెన్నై: విదేశాల నుంచి అక్రమ బంగారాన్ని తరలిస్తున్న ఘటనలు దేశంలో రోజూ ఏదో మూలన చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అక్రమ బంగార రవాణపై ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నాకొంతమంది యధేచ్చగా నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. తాజాగా రూ.2 కోట్ల విలువైన బంగారం బిస్కెట్లును చెన్నై ఎయిర్ పోర్టులో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత రాత్రి సింగపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద భారీగా బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారుల తనిఖీలో బయటపడింది. తమిళనాడులోని పుదుకొట్టాయ్ గ్రామానికి చెందిన ఫైరోజ్ ఖాన్ అనే ప్రయాణికుడు దాదాపు 6 కేజీల బంగారు బిస్కెట్లను తీసుకొస్తూ కస్టమ్స్ కు చిక్కాడు. ప్రస్తుతం ఆ బంగారానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. -
మహిళ నుంచి కిలో బంగారం స్వాధీనం
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. ఓవైపు కస్టమ్స్ అధికారులు బంగారం పెద్ద ఎత్తున సీజ్ చేస్తున్నా మరోవైపు విదేశాల నుంచి బంగారం తరలి వస్తూనే ఉంది. తాజాగా సోమవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఓ మహిళ వద్ద నుంచి కిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి హైదరాబాద్ వచ్చిన ఆమె నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకుని, విచారిస్తున్నారు. -
ఎయిర్‌పోర్టులో విదేశీ నకిలీ కరెన్సీ పట్టివేత!
శంషాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు విదేశీ నకిలీ కరెన్సీ పట్టుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ కథనం ప్రకారం.. సోమవారం ఉదయం నగరానికి చెందిన యువకుడు ఆది శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. కస్టమ్స్ తనిఖీల్లో అతడి వద్ద దుబాయ్‌కి చెందిన దీర్హామ్లతో పాటు సౌదీకి చెందిన నకిలీ రియాల్లు ఉన్నట్లు అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. భారత కరెన్సీలో వీటి విలువ సుమారు రూ. 74 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. కాగా, నకిలీ కరెన్సీ పట్టుకున్న వివరాలను విమానాశ్రయవర్గాలు అధికారికంగా వెల్లడించలేదు. -
ఎన్నికలతో బంగారం స్మగ్లింగ్‌కు లింకు
-
విమానాశ్రయంలో కిలోన్నర బంగారం పట్టివేత
స్పీకర్లు, టాల్కం పౌడర్ డబ్బాల్లో తీసుకొచ్చిన నిందితులు శంషాబాద్, న్యూస్‌లైన్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో ఇద్దరు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు కిలోన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేరళ రాష్ట్రానికి చెందిన అబ్దుల్ నజీర్, హైదరాబాద్ వాసి గులాంజిలానీ శుక్రవారం ఉదయం ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఈకే 526 విమానంలో దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. నజీర్ కారుకు ఉపయోగించే నాలుగు స్పీకర్లు, జిలానీ మూడు టాల్కమ్ పౌడర్ డబ్బాలు తీసుకొచ్చాడు. వీరి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో అధికారులు అదుపులోకి తీసుకొని పరిశీలించారు. స్పీకర్లతో పాటు పౌడర్ డబ్బాలో ఉన్న సుమారు రూ. 43లక్షలు విలువ చేసే 1.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
బంగారం లాంటి ఐడియా
తక్కువ ధరకు బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే ఇంకెందుకు ఆలస్యం ఎడారి దేశంలో అడుగు పెట్టండి. చక్కగా మూడు, నాలుగు రోజులపాటు అక్కడ పర్యాటక ప్రాంతాలను తిలకించండి. వస్తూ.. వస్తూ బంగారు ఆభరణాలను కొనుగోలు చేయండి. ఇక్కడకు తెచ్చి విక్రయించండి. లాభాలు గడించండి. లాభానికి లాభం.. ఉల్లాసానికి ఉల్లాసం. ఇది జిల్లాలోని పలువురు స్వర్ణ వ్యాపారుల నయా టెక్నిక్. తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్:ఇటీవల జిల్లాలోని కొందరు బంగారం వ్యాపారులు తరచూ కుటుంబ సమేతంగా దుబాయ్ వెళ్లివస్తున్నారు. ఎందుకని ఆరా తీస్తే ఓ వ్యాపార రహస్యం బయటపడింది. మన మార్కెట్ కన్నా దుబాయ్‌లో బంగారం ధర కాసు (8 గ్రాములు)కు సుమారు రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు తక్కువగా ఉంది. పైగా అక్కడి నుంచి ఆభరణాలు తెచ్చుకునేందుకు పెద్దగా ఆంక్షలేమి లేవు. ఇది బంగారు వ్యాపారులకు వరంగా మారింది. దీనికి తోడు దుబాయ్ టూర్ ప్యాకేజీలు అనుకూలంగా ఉన్నాయి. కేవలం ఓ వ్యక్తి రూ. 50 వేలతో మూడు నుంచి నాలుగు రోజులపాటు దుబాయ్‌లో ఎంచక్కా తిరిగి రావొచ్చు. ఈ పరిస్థితులను వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ విమానం ఎక్కేస్తున్నారు. మూడు, నాలుగు రోజులపాటు అక్కడ విహరించి వస్తూ ఒక్కొక్కరూ సుమారు మూడు వందల గ్రాముల వరకు బంగారు ఆభరణాలను వెంట తెచ్చుకుంటున్నారు. వీటికి వాల్యూబుల్ గూడ్స్ పేరుతో ఆరు నుంచి ఏడు వేల వరకు ఎక్సైజ్ సుంకాన్ని చెల్లిస్తున్నారు. చిట్కాలూ పాటిస్తున్నారు దుబాయ్ బంగారు ఆభరణాలను ఇక్కడ అదే రూపంలో విక్రయించడం లేదా కరిగించి కొత్త ఆభరణాలు తయారుచేస్తూ లాభాలు గడిస్తున్నారు. ఇలా చేయడం వలన ఒక వ్యక్తికి ఖర్చులు పోను రూ.50 వేల వరకు మిగులుతుందని అంచనా. నలుగురు కుటుంబసభ్యులు వెళ్లి వస్తే సుమారు రూ. 2 లక్షల వరకు మిగులుతుం ది. ఇందుకు వ్యాపారులు చిట్కాలను పాటిస్తున్నారు. దుబాయ్ వెళ్లేటపుడు గిల్ట్ నగలు వేసుకుని తిరిగి ప్రయాణంలో బంగారు ఆభరణాలతో వస్తున్నారు. ఆభరణాలు తెచ్చుకునేందుకు ఆంక్షలు లేకపోగా బిస్కెట్ రూపంలో తీసుకురావడానికి వీలులేదు. అయితే కొందరు దురాశకు పోయి బిస్కెట్లను తీసుకువస్తూ దొరికిపోతున్నారు. -
ప్రయాణికులకు బంగారు ‘కస్టమ్స్’
-
ప్రయాణికులకు బంగారు ‘కస్టమ్స్’
న్యూఢిల్లీ: బంగారం దొంగ రవాణా అవుతున్న తీరు కస్టమ్స్ అధికారులకే కళ్లు తిరిగేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో బంగారం స్మగ్లింగ్ నిరోధానికి మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం గురువారం నిర్ణరుుంచింది. ప్రయూణికుల బ్యాగేజీలకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే భారతీయులను బంగారం తీసుకురావడానికి నిధులెలా వచ్చారుు? టిక్కెట్లు ఎలా కొన్నారంటూ అధికారులు నిలదీయనున్నారు. ప్రయూణికులకిచ్చే బ్యాగేజీ రశీదులో బంగారు బిస్కెట్లపై ముద్రించిన సీరియల్ నంబర్లు, ఒక్కొక్కటిగా ఆభరణాల జాబితాను కూడా పొందుపరచనున్నట్లు రెవెన్యూ విభాగం సర్క్యులర్ తెలిపింది. బంగారం దిగుమతి సౌకర్యం దుర్వినియోగం కాకుండా చూడటమే ఈ చర్యల పరమార్ధమని పేర్కొంది. తమ తరఫున బంగారాన్ని దిగుమతి చేసుకునేందుకు కొన్ని అసాంఘిక శక్తులు అర్హులైన ప్రయూణికులను వాడుకుంటున్నట్టుగా కస్టమ్స్ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారుు. -
లో దుస్తుల్లో బంగారు తీగలు
శంషాబాద్‌లో ఓ వ్యక్తి నుంచి 467 గ్రాములు పట్టివేత మరో వ్యక్తి నుంచి 465 గ్రాముల ఆభరణాలు స్వాధీనం శంషాబాద్, న్యూస్‌లైన్: దుబాయ్ నుంచి లో దుస్తుల్లో బంగారు తీగలు తెచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 467 గ్రాముల బంగారు తీగలు స్వాధీనం చేసుకున్నారు. మరో ప్రయాణికుడు అనుమతి లేకుండా తీసుకొచ్చిన 465గ్రాముల బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల కథనం ప్రకారం.. కేరళకు చెందిన మహ్మద్ ఇక్బాల్(28) ఏఐ 952 విమానంలో దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతడి లగేజీలో పన్నెండు బ్రాలు కనిపించడంతో వాటిని నిశితంగా పరిశీలించారు. వాటిల్లో 24 తెలుపు రంగు తీగలను గుర్తించారు. ఇక్బాల్ బంగారు తీగలకు వెండి పూత పూసి లో దుస్తుల్లో చొప్పించాడని గుర్తించారు. 467 గ్రాముల బరువున్న ఆ బంగారు తీగలను స్వాధీనం చేసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అదే విమానంలో వచ్చిన షేక్ జలీల్ సుమారు 465 గ్రాముల బరువున్న ఆభరణాలను ధ రించాడు. వాటికి సంబంధించి అతడి వద్ద ఎలాంటి రశీదులు లేకపోవడంతో వాటిని కూడా స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. రెండు ఘటనల్లో సుమారు రూ.28 లక్షలు విలువ చేసే 932 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. -
మన బంగారం..మహా ప్రియం!
భారతీయులకు బంగారమంటే మహా మోజు. ఇది ఏ స్థాయి మోజంటే... ఎంత ధరైనా కొనటానికి వెనకాడరు. ఎక్కువ డబ్బులు చేతికొచ్చినా, ఇంట్లో ఏ శుభకార్యం వచ్చినా బంగారం కొని తీరాల్సిందే. ఈ మక్కువను ఆసరా చేసుకుని ఇటు ప్రభుత్వం, అటు వ్యాపారులూ రెండువైపులా బాదేస్తుండటమే అన్నిటికన్నా ఘోరం. రెండు వైపులా చేస్తున్న అదనపు ‘‘వసూళ్లు’’ ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసా? అక్షరాలా ఇరవై శాతం. ఆ వివరాలివిగో... బంగారం ఎక్కడ కొన్నా బంగారమే. ఏ దేశంలో కొన్నా బంగారమే. అలాంటపుడు ధర కూడా ఒకేలా ఉండాలి. కానీ మన దేశంలో మాత్రం అలా లేదు. అంతర్జాతీయంగా లభిస్తున్న ధరకంటే 20 శాతం అధికంగా ఉంది. దీన్లో కొంత ప్రభుత్వమే ‘దిగుమతి సుంకం’ పేరిట లాగేస్తుండగా.. మరికొంత ‘ప్రీమియం’ అంటూ వ్యాపారులు లాగేస్తున్నారు. పుత్తడి ట్రేడింగ్ ధరకు ప్రామాణికంగా తీసుకునే న్యూయార్క్, లండన్ మార్కెట్లలో ఈ శుక్రవారంనాటి ధర ఔన్సుకు (31.8 గ్రాములు) 1228 డాలర్లు. అంటే మన కరెన్సీలో డాలర్‌కు రూ.62 చొప్పున లెక్కిస్తే మొత్తం రూ.76,136 అవుతుంది. ఈ లెక్కన ఒక గ్రాముకు రూ.2,395. మరి 10 గ్రాముల ధర రూ.23,950 కావాలి కదా? మరి మన మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీలో ఎంత పలుకుతోందో తెలుసా? సాక్షాత్తూ 28,930 రూపాయలు. ఎందుకిలా...? దిగుమతి సుంకం పెంచేశారు... 2011-2012 సంవత్సరాల్లో మన దేశం ఇబ్బడిముబ్బడిగా బంగారాన్ని దిగుమతి చేసుకుంది. దీంతో కరెంటు ఖాతా, వాణిజ్యలోటు బాగా పెరిగిపోయాయి. దీన్ని నియంత్రించడానికంటూ ప్రభుత్వం దిగుమతి సుంకాల్ని అమాంతం పెంచేసింది. మూడేళ్ల క్రితం 10 గ్రాములకు రూ.300 నిర్ణీత సుంకం వుండేది. అటు తర్వాత సుంకాన్ని దిగుమతి ధరలో 2 శాతంగా మార్చారు. దాన్నిపుడు 10 శాతానికి పెంచారు. ప్రస్తుతం అది రూ.2,400 వరకూ (ఇది ప్రపంచ మార్కెట్లో ధరను బట్టి పక్షం రోజులకోసారి మారుతుంది) ఉంది. సుంకం పెంపుతో పాటు దిగుమతులపై ప్రభుత్వం పలు నియంత్రణలు కూడా విధించింది. ఇంతకుముందులా ఇక్కడ అమ్మడానికి ఎంతకావాలంటే అంత పుత్తడిని దిగుమతి చేసుకోకూడదు. ఆభరణ తయారీదారులు దిగుమతుల్లో తిరిగి 20 శాతం ఎగుమతి చేసే షరతుపైనే ఈ అనుమతి లభిస్తుంది. బ్యాంకుల దిగుమతులు, అమ్మకాలను రిజర్వుబ్యాంకు నిలుపుచేసింది. మనం వినియోగించే బంగారంలో ఇక్కడ ఉత్పత్తయ్యేది 2 శాతమే. రీసైకిల్ చేసిన పాత బంగారం కొంత మార్కెట్లోకి వస్తుంది. 80% వరకూ దిగుమతులపై ఆధారపడాల్సిందే. వ్యాపారులదీ అదే బాట... ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచింది సరే. అలా చూసుకున్నా 10 గ్రాములు రూ.26,350కి దొరకాలి. కానీ దానిపై వ్యాపారులు అధికారికంగానే మరో రూ.2,500 వడ్డిస్తున్నారు. ఎందుకంటే మార్కెట్లో కొరత ఏర్పడింది కాబట్టి, డిమాండ్ ఉంది కాబట్టి ప్రీమియం ధరకు అమ్మాల్సివస్తుందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఇప్పుడు పసిడికి మునుపటంత డిమాండేమీ లేదు. అలాంటపుడుకొరత ప్రశ్న ఎక్కడిదనేది కొనుగోలుదార్ల ప్రశ్న. కొంపముంచిన రూపాయి... నిజానికి రూపాయి గనక ఇంత దారుణంగా పతనం కాకపోయి ఉంటే దిగుమతి సుంకం, వ్యాపారుల ప్రీమియం అన్నీ కలిపినా 10 గ్రాముల ధర పాతికవేల లోపే ఉండాలి. కానీ ఏడాదిన్నరగా రూపాయి క్షీణించిన ప్రభావం... పెట్రోల్, డీజిల్, వంటనూనెల వంటి దిగుమతి సరుకులతో పాటు అన్నిటికన్నా ఎక్కువగా పసిడిపై పడింది. దాంతో బంగారం గరిష్టస్థాయి 1920 డాలర్ల నుంచి 35% పతనమైనా... మన దగ్గర గరిష్ట ధర రూ.35,000తో పోలిస్తే 17 శాతమే తగ్గింది. 2010 మే నెలలో డాలరుతో మన రూపాయి విలువ రూ.45.57 దగ్గర ఉంది. అప్పట్లో ప్రపంచ మార్కెట్లో పుత్తడి ధర ఔన్సుకు 1,200 డాలర్లుండేది. అంటే మన కరెన్సీలో 10 గ్రాముల విలువ రూ.17,550. మధ్యలో హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నా ఇంచుమించు ఇప్పుడు కూడా అంతర్జాతీయంగా బంగారం ధర అలాగే ఉంది. కానీ రూపాయి పతనం, ప్రభుత్వ సుంకం, వ్యాపారుల ప్రీమియం... అన్నీ కలిసి మన బంగారం 10 గ్రాముల ధరను రూ.28,930 వద్ద నిలబెట్టాయి. ఔరా! మనదెంత దురదృష్టమో కదా!! ఎన్నారైలు విదేశాల నుంచి తెస్తే.. సరే! ఇక్కడ బంగారం కొంటే 10% దిగుమతి సుంకం, మరో 10% వ్యాపారుల ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. మరి విదేశాలకెళ్లినవారు అక్కడి నుంచి పుత్తడి తెచ్చుకోవచ్చా? దీనిపై ఏమైనా ఆంక్షలున్నాయా? దీన్ని చూసినపుడు... ఎన్నారైలు ఇక్కడికి వచ్చేటపుడు ఆభరణాల రూపంలో పురుషులైతే రూ.50,000, మహిళలైతే రూ.1,00,000 వరకు విలువ చేసే బంగారాన్ని తీసుకురావచ్చు. దీనిపై ఎలాంటి సుంకాలూ ఉండవు. అంటే నలుగురుండే కుటుంబమైతే గరిష్టంగా 3-4 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని ఆభరణాల రూపంలో తేవొచ్చన్నమాట. కాకపోతే ఇది పర్యాటకులు, ఇతరులకు వర్తించదు. ఏడాదికిపైగా విదేశంలో నివాసం ఉన్న ఎన్నారైలకు మాత్రమే వర్తిస్తుంది. అంటే ఒకవేళ రూ.3 లక్షల విలువైన బంగారం తెచ్చుకుంటే ఇక్కడి ధరల ప్రకారం రూ.50వేల వరకూ లాభం పొందినట్లన్న మాట. ఈ లాభం పొందటానికి చాలామంది గల్ఫ్‌దేశాల్లో ఉంటున్న తమ స్నేహితులు, బంధుమిత్రుల ద్వారా బంగారం తెప్పించుకుంటున్నారు. దీంతో దుబాయ్‌లో గడిచిన ఐదారు నెలలుగా బంగారు ఆభరణాల అమ్మకాలు 50-60% వరకూ పెరిగాయట. ఇక ముడి రూపంలో దిగుమతి చేసుకునే బంగారంపై మాత్రం 9-13% దిగుమతి సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ‘‘ఈ సుంకం చెల్లించి 1 కిలో ముడి బంగారాన్ని తెచ్చుకోవచ్చు. కాకపోతే అలా తెస్తున్న వారు విదేశాల్లో కనీసం 6 నెలలు ఉండాలి. ఈ లెక్కన చూసినపుడు ప్రీమియం రూపంలో కిలోపై దాదాపు రూ.2.5 లక్షలు లబ్ధి కలుగుతుంది’’ అని బులి యన్ రంగ నిపుణుడొకరు చెప్పారు. ఈ ఆంక్షల వల్ల ఇటీవల పరిమితిని మించి ఆభరణాలను ధరించి వస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్న కేసులూ పెరుగుతున్నట్లు కస్టమ్స్ అధికారులు చెపుతున్నారు.