హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారం పట్టుకున్నారు. సింగపూర్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి దగ్గర నుండి శనివారం అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఓవైపు కస్టమ్స్ అధికారులు బంగారం పెద్ద ఎత్తున సీజ్ చేస్తున్నా మరోవైపు విదేశాల నుంచి బంగారం తరలి వస్తూనే ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు.