ఎయిర్పోర్ట్లో జంట నుంచి బుల్లెట్లు స్వాధీనం
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో శనివారం బుల్లెట్లు కలకలం సృష్టించాయి. కెనడా వెళ్తున్న ఓ జంట నుంచి దాదాపు 19 బుల్లెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ రోజు ఉదయం కెనడా వెళ్లేందుకు సదరు జంట విమానాశ్రయానికి చేరుకున్నారు. కస్టమ్స్ అధికారులు వారిని తనిఖీ చేస్తున్న క్రమంలో జంటకు సంబంధించిన లగేజీలో బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. దాంతో బుల్లెట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.