![Capture gold in plane toilet - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/14/GOLD1.jpg.webp?itok=0OIOxCXD)
శంషాబాద్: కస్టమ్స్ తనిఖీలకు భయపడిన ఓ ప్రయాణికుడు తాను పట్టుబడుతానేమోననే ఆందోళనతో విదేశాల నుంచి తీసుకొచ్చిన బంగారాన్ని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టాయిలెట్‌లో వదిలివెళ్లాడు. ఆదివారం వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. 1,866 గ్రాముల బరువు కలిగిన పదహారు బంగారు బిస్కెట్లు ఇందులో బయటపడ్డాయి. వీటి విలువ రూ.60,94,122 ఉంటుందని అధికారులు నిర్ధారించారు. అయితే, విమానం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం తెలియరాలేదు. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment