
సాక్షి బెంగళూరు: అక్రమంగా తరలిస్తున్న 2.8 కేజీల బంగారాన్ని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ సుమారు రూ.87.69 లక్షలుగా లెక్కగట్టారు. విమానాశ్రయంలోని శౌచాలయాన్ని శుభ్రపరిచే సిబ్బంది ఈ నెల 4వ తేదీన బాత్‌రూంలోని చెత్తబుట్టలో ఒక పాలిథీన్ బ్యాగ్ ఉండటాన్ని గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. ఆ బ్యాగును తెరిచి చూడగా 2.8 కేజీల బంగారు ఆభరణాలు లభించాయి. దీనిపై కస్టమ్స్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఎవరో అక్రమంగా బంగారాన్ని దేశానికి తీసుకొచ్చి, విమానాశ్రయం నుంచి బయటకు తీసుకెళ్లలేక వదిలేసి ఉంటారని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment