హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 730 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సోమవారం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు వ్యక్తులను అధికారులు సోదాలు చేశారు. వారి వద్ద నుంచి బంగారం లభించగా, వాటికి సంబంధించిన రసీదులు చూపకపోవడంతో సీజ్ చేశారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇద్దరు నిందితులు హైదరాబాద్కు చెందినవారు.