
ప్రయాణికులకు బంగారు ‘కస్టమ్స్’
న్యూఢిల్లీ: బంగారం దొంగ రవాణా అవుతున్న తీరు కస్టమ్స్ అధికారులకే కళ్లు తిరిగేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో బంగారం స్మగ్లింగ్ నిరోధానికి మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం గురువారం నిర్ణరుుంచింది. ప్రయూణికుల బ్యాగేజీలకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే భారతీయులను బంగారం తీసుకురావడానికి నిధులెలా వచ్చారుు? టిక్కెట్లు ఎలా కొన్నారంటూ అధికారులు నిలదీయనున్నారు.
ప్రయూణికులకిచ్చే బ్యాగేజీ రశీదులో బంగారు బిస్కెట్లపై ముద్రించిన సీరియల్ నంబర్లు, ఒక్కొక్కటిగా ఆభరణాల జాబితాను కూడా పొందుపరచనున్నట్లు రెవెన్యూ విభాగం సర్క్యులర్ తెలిపింది. బంగారం దిగుమతి సౌకర్యం దుర్వినియోగం కాకుండా చూడటమే ఈ చర్యల పరమార్ధమని పేర్కొంది. తమ తరఫున బంగారాన్ని దిగుమతి చేసుకునేందుకు కొన్ని అసాంఘిక శక్తులు అర్హులైన ప్రయూణికులను వాడుకుంటున్నట్టుగా కస్టమ్స్ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారుు.