ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): పాదరక్షల్లో బంగారం దాచి తీసుకొచ్చిన ఆరుగురిని మీనంబాక్కం విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం అర్ధరాత్రి శ్రీలంక నుంచి శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ప్రత్యేక విమానం వచ్చింది. చెన్నైకి చెందిన ఆరుగురు ప్రయాణికులు ఒక బృందంగా వచ్చారు.
అధికారులకు వారిపై అనుమానం రావడంతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇద్దరు ప్రయాణికుల పాదరక్షల్లో బంగారం, నలుగురి లోదుస్తుల్లో 928 గ్రాముల బంగారాన్ని గుర్తించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment