
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి వద్ద నుంచి 9.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 3.46 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. నాలుగు ఇస్త్రీ పెట్టెల్లో బంగారాన్ని తరలిస్తుండగా అనుమానం వచ్చిన అధికారులు తనిఖీలు నిర్వహించగా వీ-ఆకారంలో ఉన్న బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకొని బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment