
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ విమానాశ్రయ మండలి నుంచి ‘వాయిస్ ఆఫ్ కస్టమర్’ గుర్తింపు లభించింది. 2020లో ప్రయాణికుల అభిప్రాయాలకు అనుగుణంగా సేవలు అందించినందుకుగాను ఈ గుర్తింపు దక్కిందని ఎయిర్‌పోర్టు వర్గాలు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించాయి. కోవిడ్–19 పరిస్థితుల్లో కాంటాక్ట్‌లెస్ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు దేశంలోనే ఈ–బోర్డింగ్ సదుపాయం కలి్పంచిన తొలి విమానాశ్రయంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఘనత సాధించింది. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించడం అభినందనీయమని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(గెయిల్) సీఈఓ ప్రదీప్ ఫణీకర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment