Airports Council International
-
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అరుదైన గుర్తింపు
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ విమానాశ్రయ మండలి నుంచి ‘వాయిస్ ఆఫ్ కస్టమర్’ గుర్తింపు లభించింది. 2020లో ప్రయాణికుల అభిప్రాయాలకు అనుగుణంగా సేవలు అందించినందుకుగాను ఈ గుర్తింపు దక్కిందని ఎయిర్‌పోర్టు వర్గాలు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించాయి. కోవిడ్–19 పరిస్థితుల్లో కాంటాక్ట్‌లెస్ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు దేశంలోనే ఈ–బోర్డింగ్ సదుపాయం కలి్పంచిన తొలి విమానాశ్రయంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఘనత సాధించింది. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించడం అభినందనీయమని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(గెయిల్) సీఈఓ ప్రదీప్ ఫణీకర్ పేర్కొన్నారు. -
అత్యంత రద్దీగల విమానాశ్రయం ఇదేనట!
డౌన్ టౌన్ అట్లాంటాకు దక్షిణంగా ఏడు మైళ్ల దూరంలో ఉన్న హార్ట్స్ ఫీల్డ్- జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు(ఏటీఎల్) మరోసారి ప్రపంచంలోనే అత్యంత రద్దీగల విమానాశ్రయాల జాబితాలో టాప్‌లో నిలిచింది. ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్(ఏసీఐ) విడుదల చేసిన జాబితాల్లో 2015లో 100 మిలియన్ ప్రయాణికులతో ఈ ఎయిర్పోర్ట్ ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. 2014 కంటే 2015లో ప్రయాణికుల ట్రాఫిక్ 5.5 శాతం ఎగిసినట్టు ఏసీఐ వెల్లడించింది. ఏటీఎల్‌కు అతిపెద్ద టెనంట్గా సేవలందిస్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్ వల్ల ఈ ఎయిర్పోర్ట్ వృద్ధి మరింత విస్తరిస్తుందని ఏసీఐ పేర్కొంది. గ్లోబల్‌గా విమాన ప్రయాణికుల రేటు 2015లో 6.1 ఎగిసినట్టు ఏసీఐ తెలిపింది. కాలక్రమేణా ఏవియేషన్ ఇండస్ట్రి వృద్ధి గణనీయంగా పెరుగుతూ ప్రయాణ సదుపాయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని ఏసీఐ వరల్డ్ డైరెక్టర్ జనరల్ ఏంజెలా గిట్నెస్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1,144 ఎయిర్‌పోర్ట్‌లోని ప్రయాణికుల ట్రాఫిక్ డేటా అనుగుణంగా ఈ జాబితాను ఏసీఐ రూపొందించింది. ప్రయాణికులతో అత్యంత రద్దీగల 10 అంతర్జాతీయ విమానాశ్రయాలు... నెంబర్.1 - హార్ట్స్ ఫీల్ట్-జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(ఏటీఎల్), ప్రయాణికులు 101,491,106 నెంబర్.2 - బీజింగ్ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(పీఈకే), ప్రయాణికులు 89,938,628 నెంబర్.3 - దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(డీఎక్స్‌బీ) , ప్రయాణికులు 78,010,265 నెంబర్.4 - షికాగో ఓ హేర్ ఇంటర్ నేషనల్ ఎయిర్పోర్ట్(ఓఆర్డీ), ప్రయాణికులు 76,949,504 నెంబర్.5 - టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(హెచ్ఎన్డీ), ప్రయాణికులు 75,316,718 నెంబర్.6 - హీత్రో ఎయిర్‌పోర్టు(ఎల్హెచ్ఆర్), ప్రయాణికులు 74,989,795 నెంబర్.7 - లాస్ఏంజెల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(ఎల్ఏఎక్స్) , ప్రయాణికులు 74,937,004 నెంబర్.8 - హాంగ్‌కాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(హెచ్కేజీ), ప్రయాణికులు 68,283,407 నెంబర్.9 - పారిస్ చార్లెస్ డి గల్లె విమానాశ్రయం(సీడీజీ), ప్రయాణికులు 65,766,986 నెంబర్.10 - డాల్లస్/ ఫోర్ట్ వోర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(డీఎఫ్‌డబ్ల్యూ), ప్రయాణికులు 64,072,468 -
ఉత్తమ సేవలు..అత్యుత్తమ గుర్తింపు!
రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ అవార్డు సేవా ప్రమాణాలపై {పశంసలు సిటీబ్యూరో ప్రయాణికులకు నాణ్యమైన, అత్యుత్తమ సేవలందజేయడంలో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ క్రమంలో ప్రపంచంలోని అనేక విమానాశ్రయాలతో పోటీపడుతూ అవార్డుల పంట పండించుకుంటోంది. గత సంవత్సరం ‘రోల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఎయిర్‌పోర్టు క్వాలిటీ సర్వీసు’ అవార్డును సొంతం చేసుకున్న ఆర్జీఐఏ ఈ ఏడాది అంతర్జాతీయ విమానాశ్రయాల సంస్థ (ఎయిర్‌పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్) నిర్వహించిన ఎయిర్‌పోర్టు సేవా ప్రమాణాల సర్వేలో మొదటి మూడు స్థానాల్లో నిలిచింది. ఎయిర్‌పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్ ప్రతి ఏటా ప్రయాణికుల సదుపాయాలు, భద్రత, తదితర అంశాలలో సేవా ప్రమాణాల సర్వేను నిర్వహిస్తుంది. ఈ సర్వేలో గత ఆరేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా 300 ఎయిర్‌పోర్టులతో పోటీపడుతూ ఆర్జీఐఏ మొదటి మూడు ర్యాంకుల్లో నిలవడం విశేషం. ఈ ఏడాది 50 లక్షల నుంచి కోటీ 50 లక్షల మందికి ప్రయాణ సదుపాయాన్ని అందజేసే విమానాశ్రయం కేటగిరీ కింద ఈ అవార్డును సొంతం చేసుకుంది. ఎయిర్‌పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్ 2009లో నిర్వహించిన సర్వేలో 4.44 శాతం స్కోరు నమోదు కాగా, 2014 లో అది 4.82 కు పెరిగింది. ఏటేటా ప్రపంచమంతటా కొత్త విమానాశ్రయాలు ప్రారంభమవుతున్నాయి. పాతవి ఆధునీకరించుకుంటున్నాయి. అయినప్పటికీ నాణ్యతా ప్రమాణాల్లో జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఈ పోటీని ధీటుగా ఎదుర్కొని నిలవడం అతి పెద్ద విజయం. కోటికి చేరువైన ప్రయాణికులు... శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దేశ, విదేశీ ప్రయాణికుల రద్దీ సైతం అనూహ్యంగా పెరిగింది. ఈ ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి వరకు సుమారు 87 లక్షల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయం సేవలను వినియోగించుకున్నారు. మార్చి ఆఖరు నాటికి ఈ సంఖ్య కోటికి చేరుకోవచ్చునని జీఎమ్మార్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ప్రయాణికులో 64 లక్షల మంది దేశీయ ప్రయాణికులు కాగా, మిగతా 22 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు ఉన్నారు. ఐదు దేశీయ, 15 అంతర్జాతీయ విమానసర్వీసులు ప్రయాణికులకు సేవలందజేస్తున్నాయి. కోల్కత్తా, చెన్నై, విశాఖ,ముంబయి, బెంగళూరు వంటి దేశంలోని 27 ప్రధాన నగరాలకు, దుబాయ్, మస్కట్, లండన్, అబుదాబి, సింగపూర్ వంటి 20 అంతర్జాతీయ నగరాలకు ఇక్కడి నుంచి సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఇది సమష్టి విజయం గత ఆరేళ్లుగా ఈ అవార్డును అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ విజయంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంది. జీఎమ్మార్ భాగస్వామ్య సంస్థలు, వివిధ కేటగిరీలలో పని చేసే ఉద్యోగుల కృషి వల్లే ఇది సాధ్యమవుతోంది.రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అగ్రగామిగా అభివృద్ధి చెందాలనేది మా ఆకాంక్ష. - ఎస్జీకె కిషోర్, సీఈవో, ఆర్జీఐఏ