అత్యంత రద్దీగల విమానాశ్రయం ఇదేనట!
అత్యంత రద్దీగల విమానాశ్రయం ఇదేనట!
Published Thu, Sep 1 2016 11:58 AM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM
డౌన్ టౌన్ అట్లాంటాకు దక్షిణంగా ఏడు మైళ్ల దూరంలో ఉన్న హార్ట్స్ ఫీల్డ్- జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు(ఏటీఎల్) మరోసారి ప్రపంచంలోనే అత్యంత రద్దీగల విమానాశ్రయాల జాబితాలో టాప్లో నిలిచింది. ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్(ఏసీఐ) విడుదల చేసిన జాబితాల్లో 2015లో 100 మిలియన్ ప్రయాణికులతో ఈ ఎయిర్పోర్ట్ ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. 2014 కంటే 2015లో ప్రయాణికుల ట్రాఫిక్ 5.5 శాతం ఎగిసినట్టు ఏసీఐ వెల్లడించింది.
ఏటీఎల్కు అతిపెద్ద టెనంట్గా సేవలందిస్తున్న డెల్టా ఎయిర్లైన్స్ వల్ల ఈ ఎయిర్పోర్ట్ వృద్ధి మరింత విస్తరిస్తుందని ఏసీఐ పేర్కొంది. గ్లోబల్గా విమాన ప్రయాణికుల రేటు 2015లో 6.1 ఎగిసినట్టు ఏసీఐ తెలిపింది. కాలక్రమేణా ఏవియేషన్ ఇండస్ట్రి వృద్ధి గణనీయంగా పెరుగుతూ ప్రయాణ సదుపాయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని ఏసీఐ వరల్డ్ డైరెక్టర్ జనరల్ ఏంజెలా గిట్నెస్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1,144 ఎయిర్పోర్ట్లోని ప్రయాణికుల ట్రాఫిక్ డేటా అనుగుణంగా ఈ జాబితాను ఏసీఐ రూపొందించింది.
ప్రయాణికులతో అత్యంత రద్దీగల 10 అంతర్జాతీయ విమానాశ్రయాలు...
నెంబర్.1 - హార్ట్స్ ఫీల్ట్-జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు(ఏటీఎల్), ప్రయాణికులు 101,491,106
నెంబర్.2 - బీజింగ్ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు(పీఈకే), ప్రయాణికులు 89,938,628
నెంబర్.3 - దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు(డీఎక్స్బీ) , ప్రయాణికులు 78,010,265
నెంబర్.4 - షికాగో ఓ హేర్ ఇంటర్ నేషనల్ ఎయిర్పోర్ట్(ఓఆర్డీ), ప్రయాణికులు 76,949,504
నెంబర్.5 - టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు(హెచ్ఎన్డీ), ప్రయాణికులు 75,316,718
నెంబర్.6 - హీత్రో ఎయిర్పోర్టు(ఎల్హెచ్ఆర్), ప్రయాణికులు 74,989,795
నెంబర్.7 - లాస్ఏంజెల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు(ఎల్ఏఎక్స్) , ప్రయాణికులు 74,937,004
నెంబర్.8 - హాంగ్కాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు(హెచ్కేజీ), ప్రయాణికులు 68,283,407
నెంబర్.9 - పారిస్ చార్లెస్ డి గల్లె విమానాశ్రయం(సీడీజీ), ప్రయాణికులు 65,766,986
నెంబర్.10 - డాల్లస్/ ఫోర్ట్ వోర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు(డీఎఫ్డబ్ల్యూ), ప్రయాణికులు 64,072,468
Advertisement
Advertisement