recognition
-
‘ఏ’ గ్రేడ్‌లో ప్రభుత్వ కళాశాలలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నత విద్యా రంగంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. ప్రైవేటు కళాశాలకు దీటుగా ప్రవేశాలు కలి్పస్తూ ‘ఫ్యూచర్ రెడీనెస్’ కాన్సెప్‌్టతో భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దుతూ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి. ‘నేషనల్ అసెస్మెంట్, అక్రిడిటేషన్ కౌన్సిల్’ (న్యాక్) గుర్తింపు సాధనలో ముందంజలో నిలుస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాక ముందు వరకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలంటే అందరికీ చిన్న చూపే. పాతికేళ్ల క్రితం ఒక వెలుగు వెలిగిన కాలేజీలు కూడా ఆ తర్వాత ప్రాభవం కోల్పోయి దైన్య స్థితికి చేరాయి. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వంలో వీటిని పట్టించుకున్న పాపాన పోలేదు. పాతబడిపోయిన భవనాలు, సరైన సౌకర్యాలు లేని తరగతి గదులు, పనికిరాని లే»ొరేటరీలు, బోధన సిబ్బంది లేమి వంటి సమస్యలతో వీటిలో చేరాలంటేనే భయపడే పరిస్థితి. న్యాక్ అక్రిడిటేషన్ సాధించే కాలేజీల సంఖ్య నామమాత్రమే. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నత విద్యారంగంలో ముఖ్యంగా ప్రభుత్వ విద్యలో విప్లవాత్మక చర్యలు చేపట్టారు. ప్రైవేటు కాలేజీలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలను రూపుదిద్దారు. దీంతో ప్రభుత్వ కాలేజీలు మళ్లీ నూతనంగా కనిపిస్తున్నాయి. ఉన్నత విలువలను సంతరించుకొని, విద్యా బోధనలో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. దీంతో న్యాక్ అక్రిడిటేషన్ పొంది, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్న కాలేజీల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. 2019 నాటికి కేవలం 18 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు మాత్రమే న్యాక్ సర్టిఫికెట్ ఉంటే.. ప్రస్తుతం వాటి సంఖ్య 61కి చేరడం ‘ప్రభుత్వ చదువుల అభివృద్ధికి’ నిదర్శనం. రాజమండ్రి (అటానమస్), నగరి, విశాఖపట్నం (మహిళా), రేపల్లె, ఒంగోలు (మహిళా) ప్రభుత్వ కళాశాలలకు, ఎయిడెడ్‌లో ఏలూరులోని మహిళా సెయింట్ థెరిస్సా కళాశాల, నర్సాపురం వైఎన్ డిగ్రీ కళాశాలకు ఏకంగా ఏ–ప్లస్ గ్రేడ్ లభించింది. గిరిజన ప్రాంతాల్లో ప్రవేశాలు భేష్.. ఈ నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ డిగ్రీ విద్యలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. 168 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉంటే ఇందులో 2020 తర్వాత 15 కొత్త కళాశాలలు వచ్చాయి. ఈ విద్యా సంవత్సరంలో ఏకంగా 55 శాతానికి పైగా సీట్లు భర్తీ అయ్యాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ఉన్నత విద్య సంపూర్ణంగా అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా అరకు డిగ్రీ కళాశాలలో 100 శాతం, పాడేరులో 99.70 శాతం, చింతపల్లిలో 97 శాతం, గుమ్మలక్ష్మీపురంలో 92 శాతం ప్రవేశాలు నమోదవడం విశేషం. వీటితో పాటు రాజమండ్రి, గుంటూరు, నెల్లూరులోని ప్రభుత్వ అటానమస్ కళాశాలలకు యూజీసీ ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ‘కాలేజీ విత్ పొటెన్షియల్ ఫర్ ఎక్సలెన్స్ (సీపీఈ)’ గుర్తింపు సైతం లభించింది. అనంతపురం, కడప అటానమస్ కళాశాలలు ‘డీబీటీ’ స్టార్‌గా ఎంపికయ్యాయి. ఏప్రిల్ నాటికి ‘సెంచరీ’ న్యాక్ గుర్తింపునకు దరఖాస్తు చేసుకోవాలంటే యూ జీసీ (2ఎఫ్/12బీ స్టేటస్) గుర్తింపు తప్పనిసరి. రాష్ట్రంలో కేవలం 57 కళాశాలలకు మాత్రమే యూజీసీ స్టేటస్ లేదు. వీటిల్లో కొత్తగా పెట్టిన కాలేజీలకు సొంత భవనాలు నిర్మిస్తున్నారు. ఎయిడెడ్ నుంచి ప్రభుత్వంలోకి వచ్చినవి, అరకొర సిబ్బంది కొరత, అడ్మిషన్లు.. ఇలా చిన్న సాంకేతిక లోపాలు, కారణాలతో యూజీసీ స్టేటస్‌కు దూరంగా ఉన్నాయి. ఈ కళాశాలలను అభివృద్ధి చేస్తూనే మిగిలిన 109 కళాశాలల్లో ఏప్రిల్ నాటికి వంద కళాశాలలకు న్యాక్ గుర్తింపు తీసుకొచ్చేలా ‘కళాశాల విద్య’ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ‘ఇప్పటికే 61 కళాశాలలకు న్యాక్ గ్రేడ్ సాధించాం. మరో రెండు కళాశాలలకు రిజల్ట్ పెండింగ్‌లో ఉంది. ఇంకా 13 కళాశాలలు న్యాక్ బృందం పరిశీలన కోసం ఎదురు చూస్తున్నాయి. 14 కళాశాలలు న్యాక్ గుర్తింపు కోసం సమగ్ర సమాచార నివేదికను రూపొందించాయి. 17 కళాశాలలు సమాచారాన్ని తయారు చేస్తున్నాయి. ప్రతి కళాశాలను మా అకడమిక్ ఆఫీసర్లతో కూడిన టీమ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. డేటాను స్వయంగా విశ్లేషిస్తూ న్యాక్ బృందం అభ్యంతరం చెప్పకుండా జాగ్రత్తపడుతోంది’ అంటూ ఓఎస్డీ డాక్టర్ కె.విజయ్ బాబు చెప్పారు. వీటితో పాటు 56 ప్రైవేటు ఎయిడెడ్ కళాశాలల్లో 18 కళాశాలలకు న్యాక్ గుర్తింపు ఉండగా.. త్వరలోనే మిగిలిన వాటికీ తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. -
ఐఐఎం వైజాగ్‌కు అరుదైన అవార్డు
సాక్షి, విశాఖపట్నం: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం (ఐఐఎంవీ) మరో అరుదైన అవార్డు దక్కించుకుంది. న్యూఢిల్లీలోని డా.బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం నిర్వహించిన ఇంటర్నేషనల్ పబ్లిక్ రిలేషన్స్ ఫెస్టివల్–2023లో ఐఐఎంవీకు అవార్డు ప్రకటించారు. మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహిస్తూ స్టార్టప్‌లకు చేయూతనందిస్తున్నందుకు గాను పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అందించిన ప్రతిష్ఠాత్మక అవార్డును ఐఐఎంవీ ప్రతినిధి ఎంఎస్ సుబ్రహ్మణ్యం అందుకున్నారు. ఐఐఎంవీలో మహిళా స్టార్టప్స్‌ని ప్రోత్సహించేందుకు ఐఐఎంవీ ఫీల్డ్(ఇంక్యుబేషన్ అండ్ స్టార్టప్స్)ను ఏర్పాటు చేశారు. ఇందులో మొదటి బ్యాచ్‌లో 20 మంది మహిళా పారిశ్రామికవేత్తలు సాగించిన విజయాలకు సంబంధించిన వివరాలతో ‘బ్రేకింగ్ బౌండరీస్’ అనే పుస్తకాన్ని ముద్రించారు. ఈ పుస్తకం ప్రీమియర్ బిజినెస్ స్కూల్ అవార్డును సొంతం చేసుకుంది. అవార్డు సాధించడంపై ఐఐఎంవీ డైరెక్టర్ ప్రొ.ఎం చంద్రశేఖర్ అభినందనలు తెలిపారు. ఐఐఎంవీ ఫీల్డ్‌లో 90 మందికిపైగా మహిళా పారిశ్రామికవేత్తలు తమ స్టార్టప్స్‌ను అభివృద్ధి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
హైదరాబాద్‌కు యునెస్కో గుర్తింపు తెస్తాం
రాయదుర్గం: హైదరాబాద్‌కు యునెస్కో ద్వారా వరల్డ్ హెరిటేజ్ సిటీగా గుర్తింపు తెచ్చేందుకు కృషిచేస్తున్నామని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ చెప్పారు. నగరంలో ఎన్నో చారిత్రక ప్రదేశాలు, నిర్మాణాలు ఉన్నాయని, ఎన్నింటినో గుర్తించి, ఆధునీకరించామని, భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. శనివారం నగరంలోని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో రాయదుర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. నగరంలో క్రీడారంగానికి ప్రాధాన్యత ఇస్తూ 2036 నాటికి ఒలింపిక్స్ హౌజ్ నిర్మిస్తామని, ఇప్పటికే ఉన్న ఉప్పల్, ఎల్బీ స్టేడియాలను మరింత ఆధునీకరించి, కొత్త స్టేడియాలను, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను నిర్మిస్తామన్నారు. నగరంలో తాగునీటి సరఫరాను మెరుగుపరుస్తున్నామని, వచ్చే పదేళ్లలో 24 గంటలపాటు తాగునీరు అందేలా చేయాలని, వచ్చే అయిదేళ్ల కాలంలో రోజువారీగా తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నగరాన్ని తొమ్మిదిన్నరేళ్లలో భూతల స్వర్గం చేశామని చెప్పమని, కానీ చిత్తశుద్ధితో కష్టపడి ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేశామని చెప్పగలనన్నారు. ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసేలా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు కూడా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీకి మరో ఇద్దరు అదనపు కమిషనర్లు హైదరాబాద్ అభివృద్ధి కోసం జీహెచ్ఎంసీలో మరో ఇద్దరు కమిషనర్లను నియమించాలనే ప్రతిపాదన ఉందని కేటీఆర్ చెప్పారు. చెరువులు పరిరక్షణ, పర్యవేక్షణ, సుందరీకరణకు ఒక ప్రత్యేక కమిషనర్, పార్కులు, హరిత పరిరక్షణకు మరో ప్రత్యేక కమిషనర్‌ను నియమించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలో కాలుష్య రహిత రవాణా కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, మెట్రోను రానున్న కాలంలో 415 కి.మీ.కు విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. లింకురోడ్ల నిర్మాణం చేపట్టి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చేస్తున్నామని, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈ ప్లాన్ చాలా బాగుందని మెచ్చుకున్నారన్నారు. -
Telangana Cabinet Meeting: కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలివీ..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ను ప్రభుత్వంలో విలీనం చేయాలని.. 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసేందుకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధ్యక్షతన ఆర్అండ్బీ, రవాణా, కార్మిక, సాధారణ పరిపాలన శాఖల కార్యదర్శులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆగస్టు 3 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో ఈ మేరకు బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో.. వివిధ పనులు, కార్యక్రమాల కోసం తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేసింది. వరద మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. సోమవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. సుమారు 50కిపైగా అంశాలపై సుదీర్ఘంగా 6 గంటల పాటు చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు సహచర మంత్రులతో కలసి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. రవాణా, ఆర్థిక శాఖల మంత్రులు, ఆర్టీసీ చైర్మన్‌తోపాటు కార్మికుల నుంచి వచి్చన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని.. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించామని తెలిపారు. ఆరీ్టసీని కాపాడేందుకు, ప్రజారవాణాను విస్తృతం చేయడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని చెప్పారు. వరద తక్షణ సాయంగా రూ.500 కోట్లు రాష్ట్రంలో పది రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు, వరదలతో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించిందని.. తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించిందని కేటీఆర్ తెలిపారు. ముఖ్యంగా భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, నిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, కొత్తగూడెం తదితర 10 జిల్లాల్లో ఆర్అండ్బీ/ పంచాయతీరాజ్ రోడ్లు, చెరువులు, కాల్వలు, పంట పొలాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని.. యుద్ధప్రాతిపదికన తాత్కాలిక మరమ్మతులకు ఈ నిధులను వినియోగించాలని ఆదేశించినట్టు వివరించారు. ఇక వివిధ జిల్లాల్లో పునరావాస కేంద్రాలకు తరలించిన 27వేల మంది ముంపు బాధితులకు సురక్షితమైన పునరావాసం కల్పించాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. వరదల్లో మృతిచెందిన 40 మందికిపైగా వివరాలను సేకరించి, వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలని ఆదేశించినట్టు చెప్పారు. వరదలతో పొలాల్లో పేరుకుపోయిన ఇసుక మేటలు, ఇతర సమస్యలపై సమగ్రమైన నివేదిక అందించాలని కలెక్టర్లను కేబినెట్ ఆదేశించిందని.. రైతులకు విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖకు సూచించిందని వివరించారు. ఖమ్మం పొడవునా ప్రవహిస్తున్న మున్నేరువాగు వరద నుంచి పట్టణానికి రక్షణకోసం వరద గోడలు నిర్మించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వారి సేవలు భేష్.. వరద ముప్పును సైతం లెక్కచేయకుండా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం ధైర్య సాహసాలతో విధులు నిర్వహించిన విద్యుత్ శాఖ లైన్‌మన్, హెల్పర్‌తోపాటు ముందుచూపుతో 40మంది విద్యార్థులను కాపాడిన ఉపాధ్యాయుడు మీనయ్యను ఈ పంద్రాగస్టు సందర్భంగా సన్మానించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వారి సేవలను సీఎం కేసీఆర్ స్వయంగా ప్రస్తావించి కొనియాడారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అనాథల కోసం ప్రత్యేక పాలసీ రాష్ట్రంలోని అనాథ పిల్లలను ‘చిల్డ్రన్ ఆఫ్ ది స్టేట్’గా గుర్తిస్తూ.. వారి సంరక్షణ, ఆలనా పాలన చూసుకోవడానికి పకడ్బందీగా ‘అనాథ బాలల పాలసీ’ని రూపొందించాలని శిశుసంక్షేమ శాఖను కేబినెట్ ఆదేశించింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం అనాథ పిల్లలకు తల్లిదండ్రులుగా నిలుస్తుందని.. ఆశ్రయం క ల్పిం చి, ప్రయోజకులుగా మార్చి, వారికంటూ ఓ కుటుంబం ఉన్నట్టుగా సంరక్షిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. కేబినెట్ తీసుకున్న మరిన్ని కీలక నిర్ణయాలివీ.. రాష్ట్రవ్యాప్తంగా 6 వేల మంది బీడీ టేకేదారులకు ఆసరా పెన్షన్ ఇవ్వాలని కార్మిక శాఖను కేబినెట్ ఆదేశించింది. వరంగల్‌లోని మామునూరులో విమానాశ్ర యం నిర్మాణానికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా కోరిన మేరకు 253 ఎకరాల భూమి ని సేకరించాలని కేబినెట్ నిర్ణయించింది. బీదర్ తరహాలో ఇక్కడ విమానాశ్రయం నిర్వహించాలని, ఇకపై కుంటిసాకులు చెప్పవద్దని అథారిటీకి మంత్రి కేటీఆర్ సూచించారు. శంషాబాద్ విమానాశ్రయానికి ప్రయాణీకుల రద్దీ పెరిగిన నేపథ్యంలో.. ఇతర నగరాల తరహాలో హైదరాబాద్‌లోనూ రెండో ఎయిర్‌పోర్టు అవసరమని మంత్రివర్గం అభిప్రాయపడింది. పుణె, గోవాలలో రక్షణ రంగ విమానాశ్రయాలను పౌర విమానాశ్రయాలుగా విని యోగిస్తున్న తరహాలోనే హకీంపేట ఎయిర్‌పోర్ట్‌ను పౌర విమానయాన సేవలకు వినియో గించాలని రక్షణ శాఖకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రక్షణ, పౌరవిమానయాన శాఖలకు ప్రతిపాదనలు పంపిస్తామని కేటీఆర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న కాపు, బలిజ వంటి కాపు అనుబంధ కులాల కోసం ‘సౌత్ ఇండియా సెంటర్ ఫర్ కాపు కమ్యూనిటీ’ నిర్మాణానికి స్థలం కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో ఎనిమిది వైద్య కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనితో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ ఆశయం సాకారమైందని కేటీఆర్ చెప్పారు. మహబూబాద్ జిల్లా కేంద్రంలో హార్టికల్చర్ క ళాశాల ఏర్పాటుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. వరదల్లో చనిపోయినవారిలో రైతు బీమా ఉన్న వారికి రూ.5 లక్షల సొమ్ము ఆటోమెటిగ్గా వస్తుందని, మరో రూ.4లక్షలు ఎక్స్‌గ్రేషియాగా చెల్లిస్తామని కేటీఆర్ తెలిపారు. -
మన వర్సిటీలు ప్రపంచంలో మేటి
న్యూఢిల్లీ: విద్యా రంగంలో కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లలో అమల్లోకి తీసుకొచి్చన విధానాలు, తీసుకున్న నిర్ణయాలతో భారతీయ విశ్వవిద్యాలయాలకు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మన వర్సిటీలు ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతున్నాయని చెప్పారు. శుక్రవారం ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2014లో క్యూఎస్ గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో కేవలం 12 భారతీయ యూనివర్సిటీలు చోటు దక్కించుకున్నాయని, ఇప్పుడు వాటి సంఖ్య 45కు చేరుకుందని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, ఎన్ఐటీల సంఖ్య పెరిగిందని చెప్పారు. నవ భారత నిర్మాణంలో అవి విశిష్టమైన పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఇటీవల జరిగిన తన అమెరికా పర్యటనను మోదీ ప్రస్తావించారు. మన దేశ యువత పట్ల ప్రపంచానికి విశ్వాసం పెరిగిందన్నారు. అమెరికాతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నామని, వీటివల్ల అంతరిక్షం, సెమీ కండక్టర్లు, కృత్రిమ మేధ వంటి కీలక రంగాల్లో మన దేశ యువతకు నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. మన విద్యా వ్యవస్థకు ఘన చరిత్ర మైక్రాన్, గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు భారత్‌లో పెట్టుబడులు భారీగా పెట్టబోతున్నాయని, మనదేశ ఉజ్వల భవిష్యత్తుకు ఇదొక సూచిక అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ యూనివర్సిటీ అంటే కేవలం ఒక విద్యాలయం కాదని, ఒక ఉద్యమమని వ్యాఖ్యానించారు. ప్రాచీన కాలంలో నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలు సంతోషానికి, సౌభాగ్యానికి వనరులుగా నిలిచాయని చెప్పారు. భారతీయ విద్యావ్యవస్థకు ఘన చరిత్ర ఉందన్నారు. విదేశీయుల నిరంతర దాడుల వల్ల భారతీయ విద్యావ్యవస్థ కుప్పకూలిందని, తద్వారా అభివృద్ధి ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం అనంతరం వర్సిటీలు నైపుణ్యం కలిగిన యువతను దేశానికి అందించాయని, అభివృద్ధికి పాటుపడ్డాయని మోదీ ప్రశంసించారు. ‘యుగే యుగే భారత్’ మ్యూజియం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో గిరిజన ప్రదర్శనశాలలు(మ్యూజియమ్స్) ఏర్పాటు చేశామని, ఢిల్లీలోని ‘ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం’ ద్వారా స్వతంత్ర భారత్ అభివృద్ధి ప్రయాణాన్ని తెలుసుకోవచ్చని నరేంద్ర మోదీ చెప్పారు. ‘యుగే యుగే భారత్’ పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద హెరిటేజ్ మ్యూజియాన్ని ఢిల్లీలో నిర్మిస్తున్నామని తెలిపారు. మన స్టార్టప్ కంపెనీల సంఖ్య లక్ష మార్కును దాటిందన్నారు. 2014లో కేవలం వందల సంఖ్యలోనే స్టార్టప్‌లు ఉండేవన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ కంప్యూటర్ సెంటర్, ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీ భవనాలు, నార్త్ క్యాంపస్ అకడమిక్ బ్లాక్ నిర్మాణానికి ప్రధాని పునాదిరాయి వేశారు. ఢిల్లీ యూనివర్సిటీ 1922 మే 1న ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ వర్సిటీలో 86 డిపార్ట్మెంట్లు, 90 కాలేజీలు ఉన్నాయి. మెట్రో రైలులో మోదీ ప్రయాణం ప్రధాని మోదీ శుక్రవారం ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన మెట్రో రైలులో వచ్చారు. రైలులో విద్యార్థులతో సరదాగా సంభాíÙంచారు. అనంతరం ఢిల్లీ యూనివర్సిటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తన మెట్రో రైలు ప్రయాణ అనుభవాన్ని పంచుకున్నారు. ఓటీటీల్లో ప్రసారమవుతున్న కొత్త వెబ్ సిరీస్‌ల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నానని చెప్పారు. ఏ వెబ్ సిరీస్ బాగుంది? ఏ రీల్స్ బాగున్నాయో వారు చెప్పగలరని పేర్కొన్నారు. మాట్లాడేందుకు విద్యార్థుల వద్ద ఎన్నో అంశాలు ఉన్నాయన్నారు. సైన్స్ నుంచి ఓటీటీల్లోని కొత్త వెబ్ సిరీస్‌ల దాకా చాలా విషయాలను వారితో మాట్లాడొచ్చని వెల్లడించారు. ఏ ఒక్క అంశాన్నీ వారు వదిలిపెట్టరని వ్యాఖ్యానించారు. భూగోళంపై ఉన్న అన్ని అంశాలను విద్యార్థులు చక్కగా చర్చించగలరని ట్వీట్ చేశారు. -
బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలి : రఘునందన్ రావు
-
Banjara Hills: డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దుపై గందరగోళం.. నిర్ణయమెటో?
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దుపై విద్యాశాఖ అధికారులు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. విద్యా సంవత్సరం మధ్యలో పాఠశాల గుర్తింపు రద్దు చేయడంతో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళనకు గురైన తల్లిదండ్రులు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచారు. వీరి ఆందోళనకు విద్యార్థి సంఘాల నుంచి మద్దతు పెరిగింది. మరోవైపు పాఠశాల యాజమాన్యం కూడా గుర్తింపు రద్దు అంశంపై విద్యాశాఖ అధికారులతో భేటీకి సిద్ధమైంది. జరిగిన ఘటన సహించరానిదైనప్పటికీ పాఠశాల గుర్తింపు రద్దు సమంజసం కాదని విద్యావేత్తలు సైతం పేర్కొంటున్నారు. దీంతో విద్యాశా«ఖ పాఠశాలకు ఎన్ఓసీ విత్‌డ్రాపై తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. పాఠశాలను తెరిపించాల్సిందే.. డీఏవీ పబ్లిక్ స్కూల్ గుర్తింపు రద్దును వెనక్కు తీసుకొని స్కూల్‌ను తెరవాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిమాండ్ పెరిగింది. అవసరమైతే ప్రభుత్వం స్కూల్‌ను స్వాధీనం చేసుకోవాలని, పాఠశాలలో సీసీ కెమెరాలు, కమిటీని ఏర్పాటు చేసి పూర్తి రక్షణ కల్పించి స్కూల్ కొనసాగించాలని కోరుతున్నారు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఇచ్చి ఆప్షన్ల ప్రకారం మరో పాఠశాలలో చేరడం తల్లిదండ్రులకు ఎంతమాత్రం ఇష్టం లేదన్నారు. ఇది తల్లిదండ్రులపై ఆర్థిక భారంతో పాటు దూరాభారం కూడా అవుతుందని వారంటున్నారు. బ్యాలెట్ బాక్స్ ద్వారా అభిప్రాయాలు బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్‌ను కొనసాగించాలంటూ సఫీల్‌గూడలోని డీఏవీ స్కూల్లో ఓ బ్యాలెట్ బాక్సు ఏర్పాటు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ కొనసాగాలని అభిప్రాయాలతో ఈ బ్యాలెట్ బాక్సులో వేస్తున్నారు. ఢిల్లీ నుంచి స్కూల్ యాజమాన్యం రెండు రోజుల్లో న్యూఢిల్లీ నుంచి డీఏవీ స్కూల్ ప్రధాన కార్యాలయం అధికారులు హైదరాబాద్‌కు రానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై తల్లిదండ్రులతో సమావేశం కానున్నారు. విద్యాశాఖ అధికారులతో సైతం సమావేశమై వినతి పత్రం సమరి్పంచనుంది. విద్యాశాఖ మంత్రి, కమిషనర్లను బుధవారం తల్లిదండ్రులు కలిసి డీఏవీ స్కూల్ ఇక్కడే కొనసాగించాలని వినతిపత్రం సమర్పించనున్నారు. మూసివేత వద్దు పాఠశాల మూసివేత నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ, ఐద్వా, డీవైఎఫ్ఐ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీల కార్యదర్శులు కె.అశోక్‌రెడ్డి, కె.నాగలక్ష్మి, జావిద్‌లు మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. స్కూల్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని యథావిధిగా నడపాలని కోరారు. మంత్రి సబితారెడ్డికి వినతిపత్రం సమర్పిస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు -
APSSDC: ఏపీఎస్ఎస్డీసీకి జాతీయ గుర్తింపు.. ఎందుకంటే?
సాక్షి, అమరావతి: నైపుణ్యాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) అమలు చేస్తోన్న కొత్త విధానాలకు జాతీయ గుర్తింపు లభించింది. కర్ణాటకలో జరుగుతున్న 2వ ఇండిగ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న నూతన స్కిల్ విధానాలను అభినందిస్తూ అవార్డు వచ్చినట్లు ఏపీఎస్ఎస్డీసీ సోమవారం ప్రకటన విడుదల చేసింది. చదవండి: AP: ఎస్ఎల్బీసీ నివేదిక.. వారికి భారీగా రుణాలు 5 రాష్ట్రాలకు చెందిన 20కిపైగా యూనివర్సిటీ విద్యార్థులు, 20 రంగాలకు చెందిన పరిశ్రమలు పాల్గొన్న ఈ సమ్మిట్‌లో న్యూ ఆక్టివిటీస్ అండ్ క్యాస్కేడింగ్ స్కిల్ సిస్టమ్ గురించి ఏపీఎస్ఎస్డీసీ ప్రెజెంటేషన్ ఇచ్చింది. దానికి అవార్డు లభించడంపై ఏపీఎస్ఎస్డీసీ ఎండీ ఎస్ సత్యనారాయణ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. -
మాస్కా మజాకా.. ఈ కార్టూన్ చూడండి.. భాష అక్కర్లేదు..
ఇరాన్ కార్టూనిస్ట్ ఆయత్ నదేరి యానిమేటర్, యానిమేషన్ డైరెక్టర్ కూడా. ఇదంతా ఒక ఎత్తయితే టీచర్‌గా ఆయత్‌కు మంచి పేరు ఉంది. ఇస్ఫాహన్ యూనివర్శిటీ ఆఫ్ ది ఆర్ట్స్‌లో ఆయన చెప్పే పాఠాలు ఎన్నో కుంచెలకు పదును పెట్టాయి. క్యారికేచర్ గ్రామ్, తాష్ ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపకుడైన ఆయత్‌కు కార్టూన్ ఐడియాలు ఎలా వస్తాయి? చదవండి: ఇదో చెత్త ప్రశ్న.. ఇంటర్వ్యూలో యువతి షాకింగ్ రిప్లై.. వీడియో వైరల్ ‘ప్రయాణంలో’ అని చెబుతారు ఆయన. ఆయత్‌కు నచ్చిన ఇరాన్ కార్టూనిస్ట్ మాసూద్. ఏడు సోలో ఎగ్జిబిషన్స్ చేసిన ఆయత్ ఎన్నో అవార్డ్లు అందుకున్నాడు. తన తొలి కార్టూన్ ‘పర్యావరణం’ అనే అంశంపై వేశాడు. అది తనకు బాగా గుర్తింపు తీసుకొచ్చింది. తాజాగా వేసిన ఈ కార్టూన్ చూడండి. భాష అక్కర్లేదు. ప్రపంచంలో ఏ మూలకు తీసుకువెళ్లినా అర్ధమవుతుంది. కరోనాకు మాస్కే మందు, మాస్కే తిరుగులేని ఆయుధం. -
కాకినాడ మళ్లీ కేక.. అరుదైన గుర్తింపు..
కాకినాడ(తూర్పుగోదావరి): స్మార్ట్‌సిటీ కాకినాడ మరో అరుదైన గుర్తింపును దక్కించుకుంది. ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించే కార్యకలాపాల నిర్వహణకు గాను ఈ గుర్తింపు దక్కింది. వివిధ వర్గాల ప్రజల మధ్య మంచి వాతావరణాన్ని కల్పించడం, పిల్లల్లో పోటీతత్వాన్నిపెంచడం, సామాజిక అంశాలపై యువతలో చైతన్యం పెంపొందించడం వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ నుంచి కాకినాడ స్మార్ట్‌సిటీకి మంగళవారం సమాచారం అందింది. చదవండి: మసాజ్ సెంటర్ల పేరుతో చీకటి కార్యకలాపాలు.. కళ్లు బైర్లుకమ్మే అంశాలు ఈ ప్రక్రియకు దేశంలోని పలు నగరాలను ఎంపిక చేయగా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క కాకినాడకు మాత్రమే చోటు లభించింది. ప్రజల అభిరుచులకు అనుగుణంగా వివిధ రకాల తినుబండారాలను హైజనిక్‌గా ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయడం, అజాదికా అమృత్ మహోత్సవ్ పేరుతో విద్యార్థుల మధ్యపోటీ పెట్టడం, సైకత శిల్పాల తయారీ, డ్రాయింగ్ పోటీలు సహా అనేక కార్యక్రమాల నిర్వహణ ద్వారా కాకినాడ స్మార్ట్‌సిటీ ప్రత్యేక గుర్తింపును సాధించగలిగింది. ఈ తరహా కార్యకలాపాలను నిర్వహించి అన్ని వర్గాల ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంచేలా చేసిన కృషికి ఈ గౌరవాన్ని దక్కించుకోగలిగింది. ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంమరోసారి కాకినాడ స్మార్ట్‌సిటీని మంచిస్థానంలో నిలబెట్టిందని కమిషనర్ స్వప్నిల్‌దినకర్‌పుండ్కర్ చెప్పారు. -
52 వేల స్టార్టప్స్‌లకు డీపీఐఐటీ ప్రయోజనాలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది జులై నాటికి దేశంలో సుమారు 52,732 స్టార్టప్స్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) గుర్తింపు, ప్రయోజనాలు పొందాయి. దేశంలో స్టార్టప్స్ల ఆవిష్కరణలు, బలమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కేంద్రం స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ (ఎస్ఐఎస్ఎఫ్ఎస్) కింద ఇప్పటివరకు 9 ఇంక్యుబేటర్లకు రూ.30 కోట్లు మంజూరు చేసినట్లు వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ లోకసభకు రాతపూర్వక సమాధానంలో తెలిపారు. దేశంలో పరిశ్రమల అనుమతుల కోసం సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. దీంతో పెట్టుబడిదారులు వివిధ వాటాదారుల నుంచి అనుమతులు పొందడానికి పలు ఆఫీసులను సందర్శించాల్సిన అవసరాన్ని, సమయాన్ని తగ్గిస్తుందని తెలిపారు. -
రామప్పకు యునెస్కో గుర్తింపుపై సీఎం కేసీఆర్ హర్షం
సాక్షి, హైదరాబాద్: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపుపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో, సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాకతీయ రాజులు రామప్ప ఆలయాన్ని అత్యంత సృజనాత్మకంగా కట్టారన్నారు. తెలంగాణ చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం తేవడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. యునెస్కో గుర్తింపు రావడం ఆనందంగా ఉంది: కేటీఆర్ రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో యునెస్కో గుర్తింపు పొందిన తొలి ప్రదేశం రామప్ప ఆలయం అని తెలిపారు. యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నించిన వారిందరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా (వరల్డ్ హెరిటేజ్ సైట్ ) యునెస్కో గుర్తించడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. @UNESCO pic.twitter.com/ljfJvQ7691 — Telangana CMO (@TelanganaCMO) July 25, 2021 -
సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రతిష్ఠాత్మకమైన WASC గుర్తింపు
కాలిఫోర్నియా: భారతీయ భాషలు, కళలకు నెలవైన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రతిష్ఠాత్మకమైన WASC(Western Association of Schools and Colleges) గుర్తింపు లభించింది. గత శతాబ్ద కాలంలో అమెరికాలో భారతీయులచే ఇటువంటి విశ్వవిద్యాలయం నెలకొల్పబడటం ప్రథమం. విశ్వవిద్యాలయానికి WASC గుర్తింపు లభించడం ప్రప్రథమం. కాలిఫోర్నియా రాష్ట్రంలో పేరొందిన స్టాన్ ఫోర్డ్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ, లాస్ఎంజిల్స్ విశ్వవిద్యాలయాలకు ఉన్న గుర్తింపు ప్రస్తుతం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి లభించింది. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ.. భారతీయ భాషలకు, కళలకు అంతర్జాతీయ స్థాయిలో పట్టంగట్టి, ప్రతిభగల విద్యార్థులకు బోధన చేయటానికి ఈ గుర్తింపు ఆవశ్యకమని, ఈ అపూర్వ ఘట్టాన్ని అందరితో పంచుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఆచార్య పప్పు వేణుగోపాల్‌రావు మాట్లాడుతూ.. ఈ గుర్తింపుతో విశ్వవిద్యాలయం మరిన్ని భారతీయ కళలు,భాషలు, ఆయా రంగాల్లో పరిశోధనలు చేయటానికి సహకరిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. విశ్వద్యాలయ ప్రొవోస్ట్, చీఫ్ అకడెమిక్ ఆఫీసర్,చమర్తిరాజు మాట్లాడుతూ.. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతుందని చెప్పటానికి ఈ గుర్తింపు తొలిమెట్టని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ ఆర్థిక, పరిపాలనా విభాగం వైస్ ప్రెసిడెంట్, కొండుభట్ల దీనబాబు మాట్లాడుతూ.. WASC గుర్తింపు విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఎన్నోబాటలు వేస్తుందని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం కాలిఫోర్నియారాష్ట్రం, మిల్పిటాస్ నగరంలో 2016లో స్థాపించబడింది. 2017లో కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు సంపాదించి భారతీయ కళలు, భాషల్లో విద్యాబోధనను ప్రారంభించింది. ప్రస్తుతం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో కూచిపూడి నాట్యం, భరత నాట్యం, కర్ణాటక సంగీతం, తెలుగు సంస్కృత భాషా విభాగాలు ఉన్నాయి. డిప్లమా మొదలుకొని మాస్టర్స్ డిగ్రీల వరకు విద్యాబోధన జరుగుతుంది. మరిన్ని వివరాలు https://www.universityofsiliconandhra.org/ వెబ్ సైట్లో లభిస్తాయని ఫణి మాధవ్ కస్తూరి తెలిపారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అరుదైన గుర్తింపు
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ విమానాశ్రయ మండలి నుంచి ‘వాయిస్ ఆఫ్ కస్టమర్’ గుర్తింపు లభించింది. 2020లో ప్రయాణికుల అభిప్రాయాలకు అనుగుణంగా సేవలు అందించినందుకుగాను ఈ గుర్తింపు దక్కిందని ఎయిర్‌పోర్టు వర్గాలు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించాయి. కోవిడ్–19 పరిస్థితుల్లో కాంటాక్ట్‌లెస్ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు దేశంలోనే ఈ–బోర్డింగ్ సదుపాయం కలి్పంచిన తొలి విమానాశ్రయంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఘనత సాధించింది. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించడం అభినందనీయమని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(గెయిల్) సీఈఓ ప్రదీప్ ఫణీకర్ పేర్కొన్నారు. -
1,456 ప్రైవేటు జూనియర్ కాలేజీలకు షాక్!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని 1,456 ప్రైవేటు జూనియర్ కాలేజీలకు ఈసారి అనుబంధ గుర్తింపు లభించే పరిస్థితి లేకుండాపోయింది. అగ్నిమాపక శాఖ తమ నిబంధనలను మార్పు చేయడంతో వాటిన్నింటికి ఆ శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) ఇచ్చే పరిస్థితి లేదు. ఫైర్ ఎన్వోసీ లేకుండా ఇంటర్మీడియట్ బోర్డు కాలేజీలను నడిపేందుకు అనుబంధ గుర్తింపును జారీ చేసే పరిస్థితి లేదు. దీంతో ఆయా కాలేజీల పరిస్థితి గందరగోళంలో పడింది. దీనిపై ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం సాయంత్రం అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామ్‌చంద్రన్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్‌తో ఉన్నత స్థాయి కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. అందులో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. దీంతో సమావేశం అర్ధంతరంగానే ముగిసింది. అయితే రాష్ట్రంలో 1,586 కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కాలేజీలుంటే అందులో కేవలం 130 కాలేజీలు మాత్రమే అగ్నిమాపక శాఖ తాజా నిబంధనల ప్రకారం ఉండటంతో వాటికి మాత్రమే ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపునిచ్చే అవకాశముంది. మిగతా 1,456 కాలేజీలకు అనుబంధ గుర్తింపు లభించే అవకాశం లేకుండా పోయింది. అసలేం జరిగిందంటే.. రాష్ట్రంలో 15 మీటర్ల కంటే తక్కువ ఎత్తున్న విద్యా సంస్థల భవనాలకు ఫైర్ ఎన్వోసీ అవసరం లేదని, అంతకంటే ఎక్కువ ఎత్తున్న భవనాలకే ఫైర్ ఎన్వోసీ అవసరమని అగ్నిమాపక శాఖ 2017లో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ గతేడాది హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ కేసులో వాదనల సందర్భంగా అంతకుముందు ఉన్న ఉత్తర్వులను సవరిస్తున్నామని, 6 మీటర్లలోపు ఎత్తు మాత్రమే ఉన్న భవనాలకు ఎన్వోసీ ఇస్తామని, అంతకంటే ఎత్తున్న భవనాలకు ఎన్వోసీ ఇవ్వబోమని ఉత్తర్వులను సవరించింది. ఈ మేరకు 2020 ఫిబ్రవరి 22న సవరణ ఉత్తర్వులను జారీ చేసింది. అదే విషయాన్ని హైకోర్టుకు తెలియజేసింది. అయితే 2020–21 విద్యా సంవత్సరంలో కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో ఫైర్ ఎన్వోసీ లేకుండాపోయింది. 1,456 కాలేజీలు 6 మీటర్లకంటే ఎక్కువ ఎత్తున్నవే. వాటికి అగ్నిమాపక శాఖ ఫైర్ ఎన్వోసీ జారీ చేయలేదు. దీంతో యాజమాన్యాలు బోర్డు అధికారులకు, విద్యాశాఖ మంత్రికి పలుమార్లు విన్నవించారు. దీంతో మంత్రి మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు చేరే ఆ కాలేజీలకు ఫైర్ ఎన్వోసీ లేకుండా, అనుబంధ గుర్తింపు ఇవ్వకుండా కొనసాగించడం ఎలా అన్న దానిపై చర్చించారు. అయితే తాము ఏమీ చేయలేమని, నిబంధనలను మార్పు చేసి హైకోర్టుకు విషయాన్ని చెప్పినందున ఆ నిబంధనలను ఇప్పుడు సవరించడం కుదరదని, నిబంధనల మేరకు ఉన్నవాటికే ఎన్వోసీ జారీ చేస్తామని అగ్నిమాపక శాఖ పేర్కొంది. కావాలనుకుంటే తమ ఉత్తర్వులను కోర్టులో సవాల్ చేయడం, లేదా కాలేజీలను ఫైర్ ఎన్వోసీ నుంచి మినహాయిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చుకొని ముందుకు సాగవచ్చని సూచించింది. అయితే ఫైర్ ఎన్వోసీ నుంచి మినహాయిస్తూ తాము ఉత్తర్వులు ఇవ్వలేమని, అలా ఇస్తే ఇరుక్కుంటామని విద్యాశాఖ కార్యదర్శి చిత్రా రామ్‌చంద్రన్ పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో సమస్యకు పరిష్కారం లభించలేదు. దీనిపై సీఎంతో చర్చిస్తానని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుందామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నట్లు సమాచారం. -
తెలంగాణ అటవీ కళాశాలకు ‘ఏ+’ కేటగిరీ
సాక్షి, హైదరాబాద్: అటవీ విద్యా బోధన, పరిశోధనలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు గాను తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్సీఆర్ఐ)ను ఏ ప్లస్ కేటగిరీ విద్యాసంస్థగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అటవీ కాలేజీలు, ప్రమాణాలు, వసతులను అధ్యయనం చేసిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ఐసీఎఫ్ఆర్ఈ), తెలంగాణ కాలేజీకి అత్యంత ప్రాధాన్యత గుర్తింపునిచ్చింది. ప్రభుత్వ కృషికి తగిన ఫలితం లభించిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. అటవీశాఖ అధికారులు, కాలేజీ యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అడవులు, పర్యావరణ రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అటవీ విద్యను ప్రోత్సహించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక అటవీ కళాశాల ఏర్పాటును ప్రోత్సహించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. 2015లోనే కాలేజీ స్థాపన.. తమిళనాడు మెట్టుపలాయం అటవీ కాలేజీకి దీటుగా తీర్చిదిద్దాలన్న కేసీఆర్ ఆదేశాలతో 2015లో కాలేజీ స్థాపన.. 2016లో బీఎస్సీ ఫారెస్ట్రీ మొదటి బ్యాచ్ నాలుగేళ్ల కోర్సుతో ప్రారంభమైంది. ఈ ఏడాదే ఫైనలియర్ విద్యార్థులు తమ కోర్సు పూర్తి చేసుకుంటున్నారు. ముందుగా దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో మొదలైన కాలేజీ.. గతేడాది డిసెంబర్లో హైదరాబాద్ శివారు ములుగులోని సొంత క్యాంపస్‌లోకి మారింది. అత్యంత అధునాతన సౌకర్యాలు, వసతులతో ఏర్పాటైన కొత్త క్యాంపస్ ముఖ్యమంత్రి చేతుల మీదుగానే ప్రారంభమైంది. విజయవంతంగా మొదటి బ్యాచ్ బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సును పూర్తి చేసుకుంటున్న అటవీ కళాశాల ఈ ఏడాది నుంచి రెండేళ్ల ఎంఎస్సీ ఫారెస్ట్రీతో పాటు, మూడేళ్ల పీహెచ్డీ ఫారెస్ట్రీ కోర్సులను కూడా ప్రారంభిస్తోంది. తొలినాళ్లలో ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా బీఎస్సీ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగింది. ఆ తర్వాత ఎంసెట్ కౌన్సెలింగ్ ఆధారంగా ప్రస్తుతం అడ్మిషన్లు జరుగుతున్నాయి. బోధనలో ఉన్నత ప్రమాణాలు పాటించటంతో పాటు బ్రిటిష్ కొలంబియా, అబర్న్ యూనివర్సిటీలతో అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇటీవలే ఓ విద్యార్థినికి అబర్న్ యూనివర్సిటీ ఉచితంగా ఎంఎస్సీ సీటును ఆఫర్ చేసింది. తాజాగా ఏ ప్లస్ గుర్తింపు సాధించడంతో తెలంగాణ ఫారెస్ట్ కాలేజీకి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు మరింతగా వచ్చే అవకాశముంది. ప్రభుత్వం, ఇతర సంస్థల సహకారంతో అటవీ కాలేజీ విద్య, పరిశోధనా రంగాల్లో అభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతోంది. -
రైతుబంధుకు యూఎన్వో గుర్తింపు
సాక్షి,బాన్సువాడ: రైతుల అభివృద్ధి కోసం ప్రపంచంలో అమలు చేస్తున్న 20 వినూత్న పథకాలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతుబంధు, రైతుబీమా పథకాలను ఐక్యరాజ్య సమితి గుర్తించడం గర్వకారణమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇది తెలంగాణకు, రాష్ట్ర రైతాంగానికి దక్కిన గొప్ప గౌరవమన్నారు. శనివారం పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతు సంక్షేమం అనే గొప్ప ఆశయంతో ఈ రెండు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రపంచానికి ఆదర్శమని అన్నారు. రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడి తలెత్తుకొని తిరగాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. అందుకే వ్యవసాయానికి అవసరమైన కరెంట్‌ను 24 గంటలు ఉచితంగా, నాణ్యతతో సరఫరా చేస్తున్నామన్నారు. ఎరువులు, విత్తనాలకు కొరత లేకుండా చేశామని చెప్పారు. పెట్టుబడికి రైతుబంధు ద్వారా ఆర్థిక వెన్నుదన్ను ఇస్తున్నామన్నారు. రైతులకు సలహాలు ఇవ్వడానికి ప్రతి 5000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తీర్ణ అధికారిని నియమించామని అన్నారు. మద్దతు ధరతో పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతుల కోసం భారీగా గోదాములు నిర్మించామన్నారు. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5లక్షల బీమాతో ధీమా కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అమలు చేస్తున్న పథకాలతో ఇప్పటికే రాష్ట్రంలోని రైతులకు భరోసా వచ్చిందని పోచారం అన్నారు. తమ వెనక ప్రభుత్వం ఉంది అనే బలం వచ్చిందని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర రైతులకు ఇంకా మంచి రోజులు రాబోతున్నాయన్నారు. -
ఎంఐఎం గుర్తింపు రద్దు చేయాలంటూ పిటిషన్
ఢిల్లీ: ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో శివసేన తెలంగాణ అధ్యక్షుడు తిరుపతి నరసింహ మురారి పిటిషన్ దాఖలు చేశారు.ఆర్టికల్ 226 కింద ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గుర్తింపును రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. లౌకిక వాదానికి వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ పనిచేస్తోందంటూ ఎంఐఎం సిద్ధాంతాల జాబితాను ఢిల్లీ హైకోర్టుకు మురారి సమర్పించారు. -
ఆదిలాబాద్ రిమ్స్‌కు ఎమ్సీఐ అనుమతి నిరాకరణ
-
రిజిస్ట్రార్‌పై దాడి ఎఫెక్ట్
సాక్షి, కర్నూలు(గాయత్రీ ఎస్టేట్) : రాయలసీమ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.అమర్నాథ్పై దాడి ఘటన పట్ల ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. బీఈడీ కళాశాలల స్టాఫ్ అప్రూవల్ విషయంలో ఈనెల 5న రిజిస్ట్రార్‌పై ఎస్కే యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ రత్నప్ప చౌదరి, కర్నూలు ఎస్ఎల్వీ బీఈడీ కళాశాల కరస్పాండెంట్ తిరుపతయ్య దాడి చేసిన విషయం తెలిసిందే. వీరిపై కర్నూలు తాలుకా పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. దాడికి యత్నించినవారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, బోధన, బోధనేతర సిబ్బంది మూడు రోజుల పాటు విశ్వవిద్యాలయాన్ని బంద్ చేసి ఆందోళనలు చేపట్టారు. దాడి జరిగి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో పలు సందేహాలకు వ్యక్తమయ్యాయి. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం వర్సిటీ ఘటనపై చర్యలకు పూనుకుంది. ఈమేరకు శనివారం మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎస్కేయూ, ఆర్యూ ఇన్చార్జ్ వీసీలకు పలు ఆదేశాలు జారీ చేశారు. రిజిస్ట్రార్‌పై దాడికి యత్నించిన ఎస్కేయూ అసోసియేట్ ప్రొఫెసర్ రత్నప్ప చౌదరిని సస్పెండ్ చేయాలని, ఎస్ఎల్వీ బీఈడీ కళాశాల కరస్పాండెంట్ తిరుపతయ్య కళాశాల అఫిలియేషన్‌ను రద్దు చేయాలని ఆదేశించారు. శుభపరిణామం ఆర్యూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అమర్నాథ్పై దాడి ఘటనపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించడం శుభపరిణామమని ఆర్యూ విద్యార్థి జేఏసీ కన్వీనర్ శ్రీరాములు, ఏబీవీపీ రాష్ట్ర నాయకులు సూర్య పేర్కొన్నారు. దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవటం వర్సిటీ విద్యార్థి, బోధన, బోధనేతర సిబ్బంది విజయమన్నారు. -
కొత్తరకం మూలకణాల గుర్తింపు!
మన పేగుల్లో కొత్త రకం మూలకణాలు కొన్ని ఉన్నట్లు జూరిక్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కణాలు తమ పరిసరాల్లోని మూలకణాలను చైతన్యవంతం చేసేందుకు ఉపయోగపడతాయని వీరు అంటున్నారు. పేగుల్లోపలి పొర ఎప్పటికప్పుడు కొత్తగా మారేందుకు కూడా ఈ కణాలే కారణం. ఈ కణాలు మూలకణాలను ప్రేరేపించకపోతే పొర నశించిపోతుంది. అవసరమైన దాని కంటే ఎక్కువసార్లు ప్రేరేపిస్తే పేగు కేన్సర్ లక్షణాలు కనిపిస్తాయి. కొత్తగా గుర్తించిన ఈ విషయాలన్నీ పేగు కేన్సర్, మంట/వాపు చికిత్సలకు ఉపయోగపడుతుందని అంచనా. మన పేగుల్లోపలి పొర నిర్దిష్ట కాలం తరువాత నశించిపోయి కొత్త పొర ఏర్పడుతూంటుందని మనం చదువుకుని ఉంటాం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రతిరోజూ దాదాపు వెయ్యి కోట్ల కొత్త కణాలు పాతవాటి స్థానంలో వచ్చి చేరుతూంటాయి. శరీరం పోషకాలను శోషించుకునేందుకు ఈ పొరే కారణం. పొర నశించిపోయింది, కొత్త పొర ఏర్పాటు చేయాలన్న సంకేతాలు మూలకణాల్లాంటి కణాలు అందిస్తాయని, ఇవి పేగుల్లో అక్కడక్కడ ఉండే చిన్న ముడుతల్లో ఉంటాయని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త కోనార్డ్ బాస్లర్ అంటున్నారు. ఎలుకలపై తాము జరిపిన ప్రయోగాల్లో ఈ కణాలు ఏం చేస్తాయో తెలిసిందని, నిర్దిష్ట ప్రోటీన్ రూపంలో ఈ కణాల నుంచి అందే సంకేతాలు పేగుల్లోపలి పొరను పునరుజ్జీవింప చేస్తుందని వివరించారు. -
మత్స్య సంపదను గుర్తించే వ్యవస్థ
పణజీ: సముద్రజలాల్లో మత్స్య సంపద ఎక్కువగా ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించే వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి(సీఎస్ఐఆర్)– నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ(ఎన్ఐవో) డైరెక్టర్ సుశీల్ కుమార్ తెలిపారు. ఇందుకోసం ఉపగ్రహ ఛాయాచిత్రాలతోపాటు నీటి అడుగున పరికరాలను అమర్చి పరిశోధన చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లోని భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం(ఇన్కాయిస్) అందించే సమాచారంపైనే ఇప్పటి వరకు మత్స్యకారులు ఆధారపడుతున్నారని, ఇది కొన్ని ప్రాంతాల్లోనే సాయపడుతోంది చెప్పారు. సముద్ర నీటిలో ఒక నెల కంటే ముందుగానే మత్స్య సంపద రాకను అంచనా వేయటంతోపాటు ఏ ప్రాంతంలో ఎలాంటి మత్స్య సంపద ఉంటుందో తెలియజెప్పే విధానాన్నీ రూపొందిస్తున్నామన్నారు. దీంతో ప్రభుత్వం మత్స్యకారులకు సాయపడే విధానాన్ని రూపొందించే వీలంటుంది. -
మీ ఫేసే.. మీ పాస్వర్డ్
శాన్ఫ్రాన్సిస్కో : హ్యాకింగ్.. కొంతకాలంగా విపరీతంగా వినిపిస్తున్న పదం. ఇంటర్నెట్ టెక్నాలజీ ఎంత పెరిగిందో.. అంతేస్థాయిలో ప్రమాదాలు పెరిగాయి. వీటిని నిరోధించడంతో పాటు.. తన యూజర్లకు సెక్యూరిటీ పెంచేలా ఫేస్బుక్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఫేషియల్ రికగ్నిషన్ (ముఖాన్ని గుర్తించడం) ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఫీచర్ వల్ల యూజర్ల అకౌంట్‌ను ఇతరులు యాక్సిస్ చేయడం సాధ్యం కాదు. యూజర్లు.. తమ ఫేస్‌ను బయోమెట్రిక్ ద్వారా పాస్‌వర్డ్‌గా సెట్ చేసుకుంటే.. ఇతరలెవరూ.. దానిని హ్యాక్ చేయడం కానీ.. యాక్సిస్ చేయడం కానీ సాధ్యం కాదని ఫేస్బుక్ అధికారులు చెబుతున్నారు. ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉందని ఫేస్బుక్ అధికారులు తెలిపారు. కొత్త ఫీచర్ వల్ల.. ఫేక్ అకౌంట్లను గుర్తించడంతో పాటు.. వేల సంఖ్యలో నిరుపయోగంగా ఉన్న అకౌంట్లను గుర్తించడం సాధ్యమవుతుందని ఫేస్బుక్ అధికారులు చెబుతున్నారు. యూజర్ కాకుండా తనకు అత్యంత ముఖ్యమైన వ్యక్తులు ఆకౌంట్‌ను ఓపెన్ చేయాలనుకుంటే.. యూజర్ ముందుగానే సదరు వ్యక్తి ఫొటోను అప్లోడ్ చేసి ట్రస్ట్ ఫ్రెండ్స్ జాబితాలో చేర్చాలని చెప్పారు. వారు అకౌంట్‌ను ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తే.. మీ ఫోన్‌కు ఒక ఎటీపీ వస్తుంది.. మీరు దానిని అతనితో షేర్ చేసుకుంటే లాగిన్ అవ్వచ్చని అధికారులు తెలిపారు. కొత్త ఫీచర్ వల్ల నిరుపయోగంగా ఉన్న అకౌంట్లు, ఫేక్ ఐడీలను గుర్తించడం సాధ్యమవుతుందని.. అంతేకాక హ్యాకింగ్‌ను నిరోధించవచ్చని అధికారులు అంటున్నారు. అన్ని అనుకూలిస్తే.. ఈ కొత్త ఫీచర్ 2018 మే నాటికి యూజర్లకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. -
తిరుపతి స్లేట్ ది స్కూల్‌కు సీబీఎస్ఈ గుర్తింపు
-
స్వర్ణకు సలామ్
పెనుమంట్ర (ఆచంట): పెనుమంట్ర మండలం మార్టేరులో రూపుదిద్దుకుని రైతులకు సిరులు కురిపిస్తున్న స్వర్ణ రకం వరి వంగడం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. హరిత విప్లవం ద్వారా దేశంలో ఆహార భద్రతకు దోహదపడిన వరి వంగడాలపై ఇటీవల ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా 1980 దశకం ముందు నుంచి అధిక దిగుబడిని, రైతులకు పంట భరోసాను ఇచ్చిన మార్టేరు స్వర్ణ రకం కేంద్ర ప్రభుత్వ అధికారుల లెక్కల్లో అగ్రగామిగా నిలిచింది. మొత్తంగా 1980కి ముందు నుంచి రైతునేస్తాలుగా గుర్తింపు పొందిన 51 రకాల విత్తనాలను జాతీయ స్థాయిలో ప్రముఖమైనవిగా అధికారులు గుర్తించారు. వీటిలో వరికి సంబం«ధించి స్వర్ణతో పాటు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీలోనే రూపుదిద్దుకున్న ‘మసూరి’ వంగడం కూడా జాతీయస్థాయిలో గుర్తింపు పొందాయి. ఈ జాబితాలో మొక్కజొన్నలో డీహెచ్ఎం 101 రకం కూడా ఉంది. ల్యాండ్‌మార్కు రకంగా.. న్యూఢిల్లీలో 1941లో ఏర్పాౖటెన బ్రీడర్స్ ఇండియన్ సొసైటీ సంస్థ దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచిన ప్రముఖ విత్తన రకాలపై పరిశోధన చేస్తోంది. సంస్థను నెలకొల్పి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణ, మసూరి రకాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ పరిధిలో ‘ల్యాండ్‌మార్కు’ రకాలుగా బ్రీడర్స్ ఇండియన్ సొసైటీ గుర్తించింది. ఢిల్లీలో అవార్డు ప్రధానం జాతీయస్థాయిలో స్వర్ణ రకం గుర్తింపు పొందిన క్రమంలో మార్టేరు వరిపరిశోధనా స్థానంకు పురస్కారం దక్కింది. ఢిలీల్లోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ప్రాంగణంలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో జాతీయ స్థాయిలో ప్రముఖ శాస్త్రవేత్తలు ఆర్ఎస్ పరోడ, డాక్టర్ గురుగోవింద్ కుష్, డాక్టర్ పీఎల్ గౌతమ్, డాక్టర్ జీఎస్ సంధు, డాక్టర్ వీఎల్ చోప్రా చేతుల మీదుగా మార్టేరు వ్యవసాయ పరిశోధనా సంస్థ ప్రధాన డైరెక్టర్ డాక్టర్ పీవీ సత్యనారాయణ పురస్కారం అందుకున్నారు. మా సంస్థకు గర్వకారణం దేశంతో పాటు విదేశాల్లోనూ స్వర్ణ రకం సాగులో ఉండటం మా సంస్థకు గర్వకారణం. మార్టేరులో ఈ రకాన్ని సృష్టించిన శాస్త్రవేత్తలకు ప్రజలు, రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారి స్ఫూర్తితో ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనువైన రకాలను, పెట్టుబడి తగ్గించి చేయగల విత్తనాలను, మారుతున్న ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణమైన వంగడాల తయారీకి శాస్త్రవేత్తలతో కలిసి నిరంతరం కృషి చేస్తున్నాం. – డాక్టర్ పీవీ సత్యనారాయణ, వ్యవసాయ పరిశోధనా స్థానం డైరెక్టర్, మార్టేరు