అమెరికాలో ఫేస్బుక్కు చుక్కెదురు | Judge Says Facebook Can Be Sued For Recognizing Faces | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఫేస్బుక్కు చుక్కెదురు

Published Mon, May 9 2016 7:56 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

అమెరికాలో ఫేస్బుక్కు చుక్కెదురు - Sakshi

అమెరికాలో ఫేస్బుక్కు చుక్కెదురు

వాషింగ్ఘన్: ఫేస్‌బుక్ కొత్తగా ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ కోర్టు వివాదంలో చిక్కుకుంది. ఇది వ్యక్తిగత ప్రైవసీని దెబ్బతీస్తోందని ఆరోపిస్తూ ఇలినాయిస్కి చెందిన ముగ్గురు పౌరులు అమెరికా బయోమెట్రిక్ ఇన్ఫర్‌మేషన్ ప్రైవసీ యాక్ట్ కింద ఇలినాయి జిల్లా కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ ఫేస్‌బుక్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు జడ్జీ జేమ్స్ డొనాటో కొట్టివేశారు. వినియోగదారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా వారి ముఖ కవలికలను గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టడం ప్రైవసీ ఉల్లంఘన కిందకే వస్తుంది కనుక, కేసు విచారణయోగ్యమంటూ జడ్జీ ప్రకటించారు.
 
అప్‌లోడ్ చేసిన ఫొటోలు బయోమెట్రిక్ సమాచారం కిందకు రాదని, అందుకనే ఇలినాయిస్ ప్రైవసీ చట్టం ఈ కేసులో వర్తించదంటూ ఫేస్‌బుక్ యాజమాన్యం చేసిన వాదనను కోర్టు కొట్టివేసింది. ఫేస్‌బుక్ చట్టవిరుద్ధంగా యూజర్ల ముఖాల ఫొటోలను సేకరించి డాటా కింద స్టోర్ చేస్తోందని, ఇలా నిక్షిప్తం చేయడం కూడా నేరమేనని  కేసు వేసిన వారు వాదించారు. గత మార్చి నెల నాటి లెక్కల ప్రకారం ఫేస్‌బుక్‌కు యాక్టివ్ యూజర్లు వందకోట్లకుపైగా ఉన్నారు. యూజర్లు గతేడాది కంటే 16 శాతం పెరిగారు. మొత్తం యూజర్లు సరాసరిగా 15 నిమిషాలపాటు ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement