
యూఎస్‌లో ఓ మహిళ ఒకే కాన్పులో 17మంది మగ శిశువులకు జన్మనిచ్చిందనే ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నమ్మశక్యంగా లేకపోయినా ఒక మహిళ అసాధరణ రీతిలో పొట్టతో కనిపించే ఫోటోలుఫేస్‌బుక్‌లో వైరల్ అవుతున్నాయి. అయితే ‘ఇదంతా కల్పితమని,అలాంటి ఘటన ఎక్కడా చోటుచేసుకోలేదని’ ఇండియా టుడేకి చెందిన యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్ (తప్పుడు వార్తలకు వ్యతిరేకం) తేల్చింది. గర్భిణి మహిళ అసాధరణ రీతిలో ఉన్న ఫోటో మార్ఫింగ్ చేయబడిందని, ఈ పోస్ట్‌ను ఫేస్‌బుక్‌లో రిచర్డ్ కమరింట డీ షేర్ చేసిందని వారు ధృవీకరించారు. వరల్డ్ న్యూస్ డెలీ రిపోర్ట్ అనే ఓ వెబ్‌సైట్ దీనికి మూలకారణం అని కనుగొన్నారు. వరల్డ్ న్యూస్ డెలీ రిపోర్ట్ అనేది ఓ వ్యంగ్యాత్మక వెబ్‌సైట్, కేవలం సరదా కోసం ఇలాంటి కథలు అల్లుతుందని తెలిసింది.
‘ఒకే కాన్పులో ఎక్కువ మంది∙శిశువులను జన్మనిచ్చిన కారణంగా కేథరిన్ వరల్డ్ రికార్డు సాధించిందని’ రిచర్డ్ మే30న ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ఈ న్యూస్‌ను తను ఉమన్ డెలీ మ్యాగజీన్ నుంచి తీసుకుందని తెలిపింది. సదరు మ్యాగజీన్ ఈ లింక్‌ను వరల్డ్ న్యూస్ డెలీ రిపోర్ట్ ద్వారా తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ పోస్ట్‌ను ఇప్పటికే 33,000 మందికి పైగా సోషల్ మీడియా మాధ్యమంలో షేర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment