birth to babies
-
కేరింతల దేవాలయం
కోవిడ్ కాలంలో మామూలు తలనొప్పి వస్తేనే లోపలికి రానివ్వడం లేదు. మామూలు డెలివరీ కేసులను కూడా వెనక్కు పంపిస్తున్నారు. మరి కోవిడ్ పాజిటివ్ గర్భిణుల సంగతి ఏం కాను? ముంబైలోని నాయర్ హాస్పిటల్ వారి పట్ల దేవాలయంగా మారింది. మంగళవారం ఉదయానికి అక్కడ 500 కోవిడ్ పాజిటివ్ తల్లులు సురక్షితంగా పిల్లలకు జన్మనిచ్చారు. మంగళవారం (జూలై 21) ఉదయం 10.04 గంటలకు ముంబైలోని నాయర్ హాస్పిటల్‌లోని ప్రసూతి వార్డు కరతాళధ్వనులతో మారుమోగిపోయింది. అప్పుడే జన్మించిన పసికందును చేతుల్లోకి తీసుకున్న డాక్టర్ అనురూప నాయక్ పెదాల మీద ఒక సంతృప్తికరమైన చిరునవ్వు కనిపించింది. దానికి కారణం ఆ పసికందు ఆ హాస్పిటల్లో కోవిడ్ పాజిటివ్ తల్లులకు జన్మించిన పిల్లల వరుసలో 500వ వాడు కావడమే. ఈ లాక్డౌన్ కాలం లో తల్లుల ఇక్కట్లను తీర్చి వారి ఒడిలో పిల్లలను ఉంచుతున్న ఆ హాస్పిటల్, అందులోని సిబ్బంది ప్రశంసలకు పాత్రమవుతున్నారు. కోవిడ్ వ్యాప్తి తర్వాత మార్చి– ఏప్రిల్ కాలానికి చాలా స్థానిక క్లినిక్స్, నర్సింగ్ హోమ్‌లు మూత పడ్డాయి. గర్భిణులకు ప్రసవాలు సందిగ్ధంలో పడ్డాయి. ఇక కోవిడ్ సోకిన గర్భిణుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఈ నేపథ్యంలో ముంబైలోని బి.వై.ఎల్. నాయర్ చారిటబుల్ హాస్పిటల్ కోవిడ్ పాజిటివ్ వచ్చిన తల్లుల ప్రసవాలకు ముందుకు వచ్చింది. దానికంటే ముందు అది స్పెషల్ కోవిడ్ హాస్పిటల్‌గా మారినా గైనకాలజీ డిపార్ట్మెంట్ కోవిడ్ పాజిటివ్ తల్లులకు తమ అవసరాన్ని గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లతో రంగంలో దిగింది. అక్కడ కోవిడ్ లేని తల్లుల కోసం ఒక లేబర్ రూమ్, కోవిడ్ ఉన్న తల్లుల కోసం ఒక లేబర్ రూమ్ విడిగా ఏర్పాటు చేశారు. ‘ఒక తల్లి నుంచి మరో తల్లికి కోవిడ్ వ్యాప్తి చెందకుండా చూడటం మా ముఖ్య లక్ష్యం’ అని ఆ హాస్పిటల్ పీడియాట్రిక్స్ హెడ్ డాక్టర్ సుష్మ మలిక్ చెప్పారు. గత మూడు నెలలుగా నాయర్ హాస్పిటల్లో 723 కోవిడ్ పాజిటివ్ గర్భిణులు చికిత్స పొందారు. వీరిలో 656 మంది డిశ్చార్జ్ అయ్యారు. వీరిలో ప్రసవాలు జరిగిన 500 మందిలో 467 మంది తమ పిల్లలతో ఇంటికి చేరుకున్నారు. ఈ మొత్తం కోవిడ్ పాజిటివ్ ప్రసవాల్లో ఎనిమిది జతల కవలలు. ఒక ట్రిప్లెట్ కూడా ఉన్నారు. 191 సిజేరియన్లు అవసరమైనా వెనుకంజ వేయకుండా చేశారు. పుట్టిన అందరు పిల్లల్లో కేవలం 10 మంది పిల్లలకే కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత వారు నెగెటివ్ అయ్యారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధి సమయంలో మాతృభిక్ష పెడుతున్న ఈ డాక్టర్లు ఉన్నది హాస్పిటల్ అనడానికి వీల్లేదు. అది దేవాలయమే. -
ఒకే కాన్పులో 17మందికి జన్మనిచ్చిన మహిళ?
యూఎస్‌లో ఓ మహిళ ఒకే కాన్పులో 17మంది మగ శిశువులకు జన్మనిచ్చిందనే ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నమ్మశక్యంగా లేకపోయినా ఒక మహిళ అసాధరణ రీతిలో పొట్టతో కనిపించే ఫోటోలుఫేస్బుక్లో వైరల్ అవుతున్నాయి. అయితే ‘ఇదంతా కల్పితమని,అలాంటి ఘటన ఎక్కడా చోటుచేసుకోలేదని’ ఇండియా టుడేకి చెందిన యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్ (తప్పుడు వార్తలకు వ్యతిరేకం) తేల్చింది. గర్భిణి మహిళ అసాధరణ రీతిలో ఉన్న ఫోటో మార్ఫింగ్ చేయబడిందని, ఈ పోస్ట్‌ను ఫేస్బుక్లో రిచర్డ్ కమరింట డీ షేర్ చేసిందని వారు ధృవీకరించారు. వరల్డ్ న్యూస్ డెలీ రిపోర్ట్ అనే ఓ వెబ్సైట్ దీనికి మూలకారణం అని కనుగొన్నారు. వరల్డ్ న్యూస్ డెలీ రిపోర్ట్ అనేది ఓ వ్యంగ్యాత్మక వెబ్సైట్, కేవలం సరదా కోసం ఇలాంటి కథలు అల్లుతుందని తెలిసింది. ‘ఒకే కాన్పులో ఎక్కువ మంది∙శిశువులను జన్మనిచ్చిన కారణంగా కేథరిన్ వరల్డ్ రికార్డు సాధించిందని’ రిచర్డ్ మే30న ఫేస్బుక్లో షేర్ చేసింది. ఈ న్యూస్‌ను తను ఉమన్ డెలీ మ్యాగజీన్ నుంచి తీసుకుందని తెలిపింది. సదరు మ్యాగజీన్ ఈ లింక్‌ను వరల్డ్ న్యూస్ డెలీ రిపోర్ట్ ద్వారా తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ పోస్ట్‌ను ఇప్పటికే 33,000 మందికి పైగా సోషల్ మీడియా మాధ్యమంలో షేర్ చేశారు. -
ఆడపిల్లలు పుట్టారని ఆత్మహత్య
కర్నూలు: తనకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని మనస్తానికిగురైన శ్రీదేవి అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండ్లెం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, పోలీసుల తెలిపిన వివరాల మేరకు...ఆత్మకూరు మండలం వడ్ల రామాపురం గ్రామానికి చెందిన శ్రీదేవికి మండ్లెం గ్రామానికి చెందిన శ్రీనివాసులుతో 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వివాహమైన 11 ఏళ్ల వరకు పిల్లలు కాకపోవటంతో నిత్యం ఆమె మదనపడిపోయేది. అయితే ఐదేళ్ల క్రితం సుమలత అనే ఆడబిడ్డకు ఆమె జన్మనిచ్చింది. తరువాత నాలుగు నెలల క్రితం ఆమె మరో ఆడబిడ్డ పుట్టింది. ఇద్దరూ ఆడపిల్లలు కావటంతో ఆమె మనస్తాపంతో తాను చనిపోతానని, తనకు మనసు బాగోలేదని తీవ్ర మనోవేదన కు గురయ్యేదని భర్త శ్రీనివాసులు తెలిపారు. దీనికితోడు నెలరోజుల క్రితం ఆమె తల్లి మృతి చెందటంతో మరింత మనోవేదన గురయ్యేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారిన తర్వాత ఐదు గంటల ప్రాంతంలో మిద్దెపై నుంచి కిందికి వచ్చి.. బాత్రూంలోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పుపెట్టుకుంది. మంటలు రావటంతో మిద్దెపై నిద్రిస్తున్న శ్రీనివాసులు ఇంట్లోకి వచ్చి చూశాడు. మంటల్లో కాలిపోతున్న భార్యను కాపాడుకునేందుకు గట్టిగా కేకలు వేయటంతో చుట్టుపక్కలవాళ్లు వచ్చారు. మంటలు అర్పగా..అప్పటికే శరీరం పూర్తిగా కాలిపోయిన శ్రీదేవి అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న నందికొట్కూరు సీఐ శ్రీనాథ్‌రెడ్డి, ఎస్సై టి.సుబ్రమణ్యం సంఘటనా ప్రాంతానికి చేరుకొని మృతురాలి అన్న బాలస్వామి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.