Conceive
-
సిగ్గు పడేదేముంది? ఐవీఎఫ్ ద్వారానే పిల్లల్ని కన్నా: ఇషా అంబానీ
ప్రముఖ వ్యాపారవేత్త, భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ కుమార్తె 'ఇషా అంబానీ' (Isha Ambani) ఇటీవల వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఐవీఎఫ్ ద్వారా కవలలకు జన్మనిచ్చినట్లు వెల్లడించారు. తన తల్లి నీతా అంబానీ కూడా ఆకాష్‌కి గర్భం దాల్చినప్పుడు ఈ ప్రక్రియనే ఎంచుకున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.నేను ఐవీఎఫ్‌తో పిల్లలకు జన్మనిచ్చిన విషయాన్ని తొందరగానే వెల్లడించాను. ఎందుకంటే ప్రస్తుతం చాలా మంది ఈ ప్రక్రియనే ఎంచుకుంటున్నారు. ఈ విషయాన్ని చెప్పడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ వేగంగా డెవలప్ అవుతున్న తరుణంలో ఐవీఎఫ్ ఎందుకు ఎంచుకోకూడదు? అని ఇషా అంబానీ అన్నారు.ఇషా అంబానీ 2018లో ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత 2022లో ఆదిత్య, కృష్ణ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. ప్రస్తుతం చాలా జంటలు ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు.ఐవీఎఫ్ అంటే ఏమిటి?ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) అనేది ఒక వైద్య ప్రక్రియ. ఈ ప్రక్రియలో అండాన్ని, శుక్రకణాలను ఫలదీకరణం చేస్తారు. ఆ తరువాత ఫలదీకరణం చేసిందిం రెండు లేదా మూడు పిండాలను స్త్రీల గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఆ పిండాలు గర్బాశయంలోనే పెరుగుతాయి. ఈ పద్దతిలో చాలామందికి ట్విన్స్ జన్మించే అవకాశం ఉంది. -
Mothers Day 2024: ఐవీఎఫ్ అద్భుతాలెన్నో...పెద్దవయసులోనూ గర్భధారణ
గత ఫిబ్రవరి నెలలో హైదరాబాద్‌కి చెందిన ఎర్రమట్టి మంగమ్మ అనే మహిళ పెద్దవయసులోనూ ఐవీఎఫ్ ద్వారా గర్భాన్ని ధరించడం రికార్డ్‌గా నిలిచింది. చట్టపరమైన నిబంధనలకు విరుద్ధం అంటూ దీనిపై వాదోపవాదాలు ఎలా ఉన్నప్పటికీ ఆకాశమే హద్దుగా నిలుస్తున్న ఐవీఎఫ్ చికిత్స సామర్ద్యానికి ఇది అద్దం పడుతుందనేది వాస్తవం. సంతానలేమి సమస్యతో పోరాడుతున్న ఆధునిక మహిళకు ఇన్–విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్)అమ్మ కావాలనే కలను సాకారం చేయడంతో పాటు వయసుకు సంబంధించిన అడ్డంకులు కూడా తొలగిస్తోంది. ప్రీ ఇంప్లాంటేషన్ ద్వారా జన్యు పరీక్షలు వంశపారంపర్య వ్యాధులకు అడ్డుకట్ట వేయడం వంటి మరికొన్ని అదనపు ప్రయోజనాలను జత చేసుకుంటూ ఐవీఎఫ్ అంతకంతకూ మహిళలకు చేరువవుతోందని అంటున్నారు ఫెర్టీ9ఫెర్టిలిటీ సెంటర్ కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ డా.టి.శ్రావ్యా తల్లాపురెడ్డి.వయస్సు నుంచి ఒత్తిడి దాకా...కెరీర్ వేటలో లేటు పెళ్లిళ్లు, గర్భధారణ వాయిదాలు...నగర మహిళకు తప్పనిసరిగా కాగా మధ్య వయసులో గర్భదారణ యత్నాలు బెడిసికొడుతున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం.. అత్యధిక శాతం ఆధునిక మహిళలు 30ఏళ్ల వయసు తర్వాత మాత్రమే పిల్లల గురించి ఆలోచిస్తున్నారని, ఆలస్యంగా తల్లి కావడం ఒక నిబంధనలా మారిందని వెల్లడించింది. అదే విధంగా నగర జీవనంలో కాటేసే కాలుష్యం, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, పని ఒత్తిడి వంటివన్నీ తల్లి కావాలనే ఆశలపై నీళ్లు జల్లుతున్నాయి. ఈ నేపధ్యంలో వీటన్నింటికీ పరిష్కారంగా మారింది ఐవీఎఫ్..పెద్ద వయసులోనూ పిల్లలకు అవకాశం..డబ్లు్యహెచ్ నివేదిక ప్రకారం 17.5% మంది వయోజనులను ప్రభావితం చేసే వంధ్యత్వాన్ని గుర్తించడం ద్వారా, ఐవీఎఫ్ మహిళల సంతానోత్పత్తి అవకాశాలపై మరింత అవగాహనను అందిస్తుంది.ఒంటరులకు...లివ్ ఇన్ కాపురాలకూ..మాతృత్వం పొందే విషయంలో సాంఘిక నిబంధనలతో పాటు అనేక రకాల పరిమితులు అడ్డంకులుగా మారుతున్నాయి. కారణాలేమైనప్పటికీ నగరంలో నివసించే ఒంటరి జీవుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అలాగే పెళ్లి కాకుండా కలిసి జీవిస్తున్న జంటలూ, స్వలింగ దాంపత్యాలు సైతం పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ సంతానకాంక్షను తీరుస్తోంది ఐవీఎఫ్. ఐవీఎఫ్ ద్వారా ప్రీ ఇంప్లాంటేషన్, జన్యు పరీక్ష వంటివి కూడా సాధ్యపడుతుండడంతో మహిళలు వారి పునరుత్పత్తి భవిష్యత్తు గురించి సమాచారం పొందగలుగుతున్నారు. దీని ద్వారా ఎవరైనా సరే ఇంప్లాంటేషన్‌కు ముందు జన్యుపరమైన అపసవ్యతలకు సంబంధించి పిండాలను పరీక్షించవచ్చు, భవిష్యత్ తరాలకు వంశపారంపర్య వ్యాధులను చేర వేసే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. జన్యువులపై ఈ స్థాయి నియంత్రణ ద్వారా మహిళలు వారి కుటుంబాల కోసం వారి విలువలు ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఐవీఎఫ్ సహకరిస్తుంది.ఐవీఎఫ్...అడ్డంకులకు పరిష్కారం..సంతానలేమి సమస్యకు పరిష్కారంగా అందుబాటులోకి వచ్చిన ఐవీఎఫ్ ఇప్పుడు సంతానలేమికి కారణమయ్యే అడ్డంకులను అధిగమించడానికి కూడా సహకరిస్తోంది. జన్యుపరీక్షలతో వంశపారంపర్య వ్యాధులకు చెక్ పెట్టే అవకాశం.. వైవిధ్యభరిత మాతృత్వాలు వంటివి ఐవీఎఫ్ ద్వారా సాధ్యమవుతున్నాయి.– డా.టి.శ్రావ్యా తల్లాపురెడ్డి.సీనియర్ కన్సల్టెంట్, ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ -
త్వరగా బిడ్డ పుట్టాలంటే.. ఈ ఆహారం ట్రై చేయండి!
మన అమ్మమ్మలు, తాతయ్యల కాలంలో పెళ్లి అయిన ఏడాదిలోపు బిడ్డ కడుపున పడాలని కోరుకునేవారు. సాధారణంగా అలా జరిగేది కూడా. కానీ మారిన పరిస్థితులు, ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా చాలామందిలో సంతానోత్పత్తి పెద్ద సమస్యగా మారింది. లైఫ్‌స్టయిల్, చేస్తున్న ఉద్యోగాలు తదితర కారణాల రీత్యా పిల్లలు పుట్టడం ఆలస్యమవుతోంది. అయితే చక్కటి లైంగిక జీవితంతోపాటు, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టడం అవసరం. కొన్ని ఆహారాలు సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడతాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఆ వివరాలు మీకోసం.. తల్లి కావాలనుకునే మహిళలకు పోషకాలు, ఫోలిక్‌యాసిడ్,ఫోలేట్, కాల్షియం ఐరన్ పుష్కలంగా కావాలి. శరీరంలో ఐరన్ లోపం సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఆకు కూరలు తినడం వల్ల పునరుత్పత్తి అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. పాలకూర, తోటకూర, బచ్చలికూర, బ్రోకలీ, బోక్ చోయ్, కొత్తిమీర ఎక్కువగా తీసుకోవాలి. వీటిని ఆలివ్ నూనెలో వేయించుకుని, సైడ్ డిష్‌గా తినండి లేదా సూప్‌లు, సలాడ్లు, క్యాస్రోల్స్ మరియు ఆమ్లెట్లలో యాడ్ చేసుకోవాలి. కాల్షియం పునరుత్పత్తి వ్యవస్థ సజావుగా పని చేసేలా చేస్తుంది. వేగంగా గర్భం దాల్చడానికి కూడా సహాయపడుతుంది. అలాగే పుట్టబోయే బిడ్డకు అవసరమైన కాల్షియం నిల్వలు పెరుగుతాయి. సంతానోత్పత్తి స్థాయిని పెంచడానికి, మహిళలు తమ ఆహారంలో ఆకుకూరలను తప్పనిసరిగా చేర్చుకోవాలి. వీటిలో విటమిన్ "బి", ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇది స్త్రీల సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, విటమిన్ "సి" సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. బీన్స్‌లో లీన్ ప్రొటీన్ అండ్ ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది మహిళల సంతానోత్పత్తిని పెంచుతుంది. శరీరంలో ఐరన్ లోపం సంతానోత్పత్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అరటిపండ్లలో పొటాషియం, విటమిన్ బీ6 ఇందులో తగినంత పరిమాణంల ఉంటాయి.సంతానోత్పత్తి హార్మోన్లను పెంచడంలో అరటిపండు కీలక పాత్ర పోషిస్తుంది. డ్రై ఫ్రూట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ త్వరగా గర్భం దాల్చడానికి తోడ్పడతాయి. విటమిన్ "సి" పుష్కలంగా ఉండే పండ్లను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఫ్రూట్స్ రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు, సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. నారింజ, కివీ, స్ట్రాబెర్రీ వంటి పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. నోట్: పిల్లలు పుట్టాలంటే దంపతుల ఆరోగ్యం చాలా ముఖ్యం. పీరియడ్ సైకిల్‌ను, ఓవులేషన్ పీరియడ్‌ను సరిగ్గా అర్థం చేసుకోని ఆ సమయానికి శారీరక కలయిక చాలా కీలకం. ఒక వేళపిల్లలు పుట్టడం లేట్ అయితే.. నిపుణులైన వైద్యులను సంప్రదించాలి. మహిళలైతే గర్భసంచిలో, ఫాలోపియన్ ట్యూబ్స్‌లో అడ్డంకులను గైనకాలజిస్ట్ అంచనా వేస్తారు. పురుషుల్లో అయితే వీర్య కణాలు, వాటి కదలికలు, సామర్థ్య పరీక్షలుంటాయి. అలాగే సహజంగా పిల్లలు కలగరు అని తెలిసినా ఆందోళన అనవసరం. ఇపుడు అనేక ఆధునిక సాంకేతికలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు మనం పెద్ద మనసు చేసుకోవాలేగానీ ఆదరించే ఆమ్మానాన్నల కోసం అనాథ పసి బిడ్డలు చాలామంది వేచి ఉన్నారనేది గుర్తుంచుకోవాలి! -
వింత కేసు: ముప్పైలో గర్భం దాల్చగా.. 92 ఏళ్ల వయసులో ..
వైద్యులనే అవాకయ్యేలా చేసిన అత్యంత వింత కేసు ఇది. సాధరణంగా మనుషులు గర్భం దాల్చితే తొమ్మిది లేది పదో నెలలో డెలిరీ అవుతుంది. ఇది సహజం. కానీ ఏకంగా 60 ఏళ్లు గర్భాన్ని మోయడం, తొమ్మిది పదుల వయసులో ప్రసవించటమా!. ఇదేం విచిత్రం అనిపిస్తుంది కదూ. అన్నేళ్లు గర్భంలో ఎలా మోసింది. ఆ తల్లి బిడ్డలు బతికే ఉన్నారా? ఇది సాధ్యమేనా? ఎన్నో సందేహాలు వైద్యులను సైతం ఒకింత గందరగోళానికి గురిచేశాయి. ఆమె అన్నేళ్లు ఆ గర్భాన్ని మోస్తూ ఎలా బతికిందా అని డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఈ వింత ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. చైనాకు చెందిన మహిళ హువాంగ్ యిజున్(92) 1948లో 31 ఏళ్ల వయసులో ఉండగా గర్భం దాల్చింది. అయితే ఆ పిండం ఆమె గర్భాశయానికి వెలుపల పెరుగుతోందని, ఇది ఇరువురికి ప్రమాదమని చెప్పారు. వెంటనే ఆమెను వైద్యులు అబార్షన్ చేయించుకోవాల్సిందిగా సూచించారు. ఆ పిండ ఎదగదని అబార్షన్ అవుతుందని చెప్పారు కూడా. ఐతే ఆర్థిక ఇబ్బందులు రీత్యా హువాంగ్ యిజున్ ఆ పిండాన్ని తీయించేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఏదైతే అది అవుతుందని భావించి అలానే ఉండిపోవాలనుకుంది. విచిత్రంగా ఆమెకు ఎలాంటి నొప్పి గానీ గర్భ విచ్ఛతి అయినట్లుగా బ్లీడింగ్ అవ్వలేదు. ఇక ఆమె ఆ గర్భంతో అలానే మోస్తూ వచ్చింది. బతికే ఉంటుందన్న ఆశ, లేక బిడ్డ కడుపలోనే బతుకుతుందో అనుకుందో గానీ అలానే 61 ఏళ్లు గడిపింది. చివరికి తొమ్మిది పదుల వయసులో వైద్యులను ఆశ్రయించింది. వారు ఆమెను చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆమె చెప్పింది నిజేనా అని అన్ని రకాలు పరీక్షలు నిర్వహించగా..వైద్యులంతా ఒక్కసారిగి ఆశ్చర్యపోయారు. ఇదసలు ఊహకే అందని వింత కేసు అన్నారు. ఆమె కడుపులోపల ఆ బిడ్డ చనిపోయి స్లోన్లా మారి అలా ఉండిపోయిందని చెప్పారు. ఇలా జరగడం అత్యంత అరుదని. ఎలాంటి ఇన్ఫెక్షన్ తలెత్తకుండా ఆమె చనిపోయిన పిండతో అలానే ఉండిపోవడం మాత్రం నిజంగా షాకింగ్‌గా ఉందన్నారు. చివరికి వైద్యులు శస్త్ర చికిత్స చేసి ఆ స్టోన్ బేబిని బయటకు తీశారు. వైద్య చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన వింత కేసు ఇది అని అన్నారు. అందుకు సంబంధించన ఫోటోలు, హువాంగ్ యిజున్ కథ నెట్టింట తెగ వైరల్ అవ్వుతోంది. దీంతో నెటిజన్లు 61 ఏళ్లు ప్రెగ్నెన్సీనా! అని ఆశ్చర్యపోతున్నారు. చైనాలో చాలామంది ప్రజలు వైద్య సదుపాయాన్ని పొందలేకపోతున్నురాని చెప్పడానికి ఈ కథే నిదర్శనం. In 1948, Huang Yijun, a 31-year-old Chinese woman, discovered that she was pregnant. She went to the doctor, who informed her that the fetus was growing outside her uterus, specifically in her abdomen, a condition known as ectopic pregnancy. Huang needed to undergo surgery to… pic.twitter.com/ttu8ARl0jj — Historic Vids (@historyinmemes) August 17, 2023 (చదవండి: ఓ మహిళ సజీవ సమాధి అయ్యింది!..సరిగ్గా 11 రోజుల తర్వాత..) -
‘దేవుడి అనుగ్రహం కలగాలంటే బిడ్డను బలివ్వాల్సిందే’
న్యూఢిల్లీ: డాక్టర్లు, సైంటిస్టులు కన్నా బాబాలు, సాధువులపైనే మన జనాలకు నమ్మకం ఎక్కువ. వారు చెప్తే ఎలాంటి కష్టమైన పని అయినా సరే చేస్తారు. ఇందుకు ఉదాహరణగా నిలిచే ఘటనలు కోకొల్లలు. తాజాగా ఇదే కోవకు చెందిన సంఘటన ఒకటి దేశ రాజధానిలో చోటు చేసుకుంది. తనకు బిడ్డలు పుట్టడం లేదనే బాధతో ఓ మహిళ సాధువును సందర్శించింది. అతడి మాటలు నమ్మి.. తన పక్కింట్లో ఉన్న మూడేళ్ల చిన్నారిని బలి ఇచ్చింది. ఆ తర్వాత మృత దేహాన్ని బ్యాగులో కుక్కి పక్కింటి మేడ మీద పడేసింది. చిన్నారి తల్లిదండ్రులు తమ పిల్లాడు కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఢిల్లీకి చెందిన నీలం గుప్తకు 2013లో వివాహం అయ్యింది. కానీ ఇప్పటి వరకు సంతానం కలగలేదు. ఈ క్రమంలో అత్తింటివారు.. బంధువులు నీలం గుప్తను సూటి పోటీ మాటలతో హింసిచేవారు. ఈ బాధ తట్టుకోలేక నీలం గుప్త ఓ సాధువును ఆశ్రయించింది. అతడు ‘‘దేవుడు నీ మీద ఆగ్రహంగా ఉన్నాడు.. అందుకే నీకు ఇంకా బిడ్డలు కలగలేదు. దేవుడికి కోపం తగ్గి.. నీకు బిడ్డలు కలగాలంటే ఓ పిల్లాడిని బలి ఇవ్వాలి’’ అని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన నీలం గుప్త తన ఇంటి పక్కన ఉంటున్న మూడేళ్ల చిన్నారిని బలి ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తన ఇంటి మేడ మీద ఆడుకుంటున్న చిన్నారికి మాయ మాటలు చెప్పి.. తన ఇంట్లోకి తీసుకెళ్లి చంపేసింది. ఆ తర్వాత బాలుడి శవాన్ని బ్యాగులో కుక్కి ఎదురింటి మేడ మీద పడేసింది. తమ బిడ్డ కనిపించకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఈ క్రమంలో వారికి నీలం ఎదురింటి మీద బ్యాగ్ కనిపించింది. తెరిచి చూడగా.. దానిలో చిన్నారి మృతదేహం ఉంది. ఈ క్రమంలో బాలుడి కుటుంబ సభ్యులను, చుట్టు పక్కల వారిని ప్రశ్నించగా.. నీలం పేరు వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆమెను విచారించగా.. ‘‘బిడ్డను బలి ఇస్తే నాకు సంతానం కలుగుతుందని సాధువు తెలిపాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి చిన్నారి మా ఇంటి మేడ మీద ఆడుకోవడం చూశాను. తనను తీసుకెళ్లి దేవుడికి బలి ఇచ్చాను. పిల్లలు లేరనే బాధతోనే ఇలా చేశాను’’ అని చెప్పుకొచ్చింది. పోలీసులు నీలంను అరెస్ట్ చేశారు. చదవండి: ఆస్పత్రి నుంచి పారిపోయి.. శవమై తేలాడు -
ఇదే నిజమైన నేను: సమీరా రెడ్డి
ముంబై : బాలీవుడ్ హీరోయిన్ సమీరా రెడ్డి త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ క్రమంలో తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. గతంలో కంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న సమీర ఫోటోషూట్లతో హల్చల్ చేస్తున్నారు. బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు సమీరా. ఈ వీడియోలో సమీరా మేకప్ లేకుండా అల్లరి చేస్తూ కనిపించారు. వీడియోతో పాటు ‘ఇదే నిజమైన నేను..’ అనే కామెంట్‌ను పోస్ట్ చేశారు. ఈ వీడియోను పోస్ట్ చేయడం వెనుక తన ఆలోచనను ఏంటో కూడా చెప్పుకొచ్చారు సమీరా. ‘ఈ వీడియో పోస్ట్ చేయడం వల్ల నాపై వివర్శలు వస్తాయని నాకు తెలుసు, వాటికి నేను బయపడను. కేవలం నేను మేకప్ లేకుండా ఎలా కన్పిస్తున్నానో చూపించడానికే ఈ పోస్టు చేస్తున్నా’ అని స్పష్టం చేశారు. గతంలో మొదటి గర్భధారణ సమయంలో శరీరాకృతికి సంబధించి సమస్యలు ఎదుర్కొన్న సమీరా అప్పటి ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. ప్రస్తుతం తాను ఎంతో ధృడంగా ఉన్నానని, ప్రతీ ఒక్కరూ తమలోని లోపాలను తెలుసుకొని సరిదిద్దుకోవాలని, నిరంతరం మనల్ని మనం గౌరవించుకోవాలని సూచించారు. సమీరా రెడ్డి 2014లో అక్షయ్ వర్దేను వివాహం చేసుకున్నారు. వీరికి 2015లోనే కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. సినిమా ప్రపంచానికి గుడ్‌బై చెప్పిన సమీరా చివరగా 2013లో కన్నడ చిత్రం ‘వరదనాయక’లో కనిపించారు. View this post on Instagram This is the real me! Almost ready to pop! I know I’ll bounce back and im not afraid of being judged 🙌🏼. I wanted to share how I looked without make up & my morning face 😱 and how it’s important for me to celebrate it ! #imperfectlyperfect Thank you @namratasoni you’ve been amazing . . 🎥 the very talented @varadsugaonkar ⚡️. . #video #positivevibes #socialforgood #positivebodyimage #preggo #pregnant #pregnancy #9monthspregnant #almostthere #naturalmakeup #natural #acceptance #positivity #selflove #makeupfree #momtobe #momtobeagain #bump #bumpstyle #maternityshoot #maternityphotography #feelgood #bodypositive #loveyourself A post shared by Sameera Reddy (@reddysameera) on Jul 10, 2019 at 1:10am PDT -
ఒకే కాన్పులో 17మందికి జన్మనిచ్చిన మహిళ?
యూఎస్‌లో ఓ మహిళ ఒకే కాన్పులో 17మంది మగ శిశువులకు జన్మనిచ్చిందనే ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నమ్మశక్యంగా లేకపోయినా ఒక మహిళ అసాధరణ రీతిలో పొట్టతో కనిపించే ఫోటోలుఫేస్బుక్లో వైరల్ అవుతున్నాయి. అయితే ‘ఇదంతా కల్పితమని,అలాంటి ఘటన ఎక్కడా చోటుచేసుకోలేదని’ ఇండియా టుడేకి చెందిన యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్ (తప్పుడు వార్తలకు వ్యతిరేకం) తేల్చింది. గర్భిణి మహిళ అసాధరణ రీతిలో ఉన్న ఫోటో మార్ఫింగ్ చేయబడిందని, ఈ పోస్ట్‌ను ఫేస్బుక్లో రిచర్డ్ కమరింట డీ షేర్ చేసిందని వారు ధృవీకరించారు. వరల్డ్ న్యూస్ డెలీ రిపోర్ట్ అనే ఓ వెబ్సైట్ దీనికి మూలకారణం అని కనుగొన్నారు. వరల్డ్ న్యూస్ డెలీ రిపోర్ట్ అనేది ఓ వ్యంగ్యాత్మక వెబ్సైట్, కేవలం సరదా కోసం ఇలాంటి కథలు అల్లుతుందని తెలిసింది. ‘ఒకే కాన్పులో ఎక్కువ మంది∙శిశువులను జన్మనిచ్చిన కారణంగా కేథరిన్ వరల్డ్ రికార్డు సాధించిందని’ రిచర్డ్ మే30న ఫేస్బుక్లో షేర్ చేసింది. ఈ న్యూస్‌ను తను ఉమన్ డెలీ మ్యాగజీన్ నుంచి తీసుకుందని తెలిపింది. సదరు మ్యాగజీన్ ఈ లింక్‌ను వరల్డ్ న్యూస్ డెలీ రిపోర్ట్ ద్వారా తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ పోస్ట్‌ను ఇప్పటికే 33,000 మందికి పైగా సోషల్ మీడియా మాధ్యమంలో షేర్ చేశారు. -
అమ్మాయంటే 'ఇల్హా' ఉండాలి!
వీలైతే ప్రతి ఇంట్లో ఒక అమ్మాయి ఇలా ఉండాలి. భలే చెబుతారు! గర్భంలోనే ఉండనివ్వడం లేదు.. ఇంట్లో అమ్మాయి ఉండాలా?! అమ్మాయి పుట్టడమే గగనం. పుట్టాక గౌరవంగా ఎదగడమే భాగ్యం. ఇలాంటి ప్రపంచంలో... కరవు కోరల సోమాలియా గర్భం నుంచిఅమెరికా నాభి పైకి విచ్చుకున్న నల్లకలువ ఇల్హా ఒమర్! అవును.. అమ్మాయింటే ఇలా ఉండాలి! మనమ్మాయీ.. ఇల్హాలా ఉండాలి. ‘‘ఇది రెఫ్యూజీ క్యాంప్‌లోని ఎనిమిదేళ్ల ఓ అమ్మాయి విజయం’’ అంటూ ఉద్విగ్నంగా పలికిన ముప్పైనాలుగు సంత్సరాల ఓ స్త్రీ స్వరం ఆ వెంటనే గాద్గదికమైంది. మాటలను మౌనం చేసింది. ఆనందబాష్పాలను రెప్పల మాటున దాచింది. కొన్ని క్షణాల తర్వాత కళ్లు తెరిచి.. గొంతు సవరించుకుంది. ‘‘ఎన్నికల పేరుతో ఒక డిస్ట్రిక్ట్‌ను ఐక్యం చేయడం మాత్రమే మా ఉద్దేశం కాదు.. గెలుపుతో హౌజ్‌లో స్థానం సంపాదించుకోవడం, చరిత్ర సృష్టించడం మా పంతం కాదు! పాలకుల మీద నమ్మకాన్ని కల్పించడం, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరింపజేయడమే మా లక్ష్యం’’ అంటూ కంచు కంఠాన్ని ఖంగుమనిపించింది. ఆ హాల్లో హాజరైన జనసందోహం చప్పట్ల అభినందన ఆగలేదు. ఆమె ఇల్హా ఒమర్. 2016లో అమెరికాలో మిన్నెసోటా స్టేట్ సెనెట్‌కి ఎన్నికైన మొదటి మహిళ సోమాలి – అమెరికన్ వనిత. డెమోక్రాటిక్ ఫార్మర్ లేబర్ పార్టీ తరపున 60బి డిస్ట్రిక్ నుంచి మిన్నెసోటా సెనెట్లోకి తొలి అడుగులు వేసిన తూర్పు ఆఫ్రికా శివంగి. విజయోత్సవ నిండు సభలోకి ముగ్గురు పిల్లలు, భర్తతో కలిసి వచ్చి∙ఇల్హాను ఆలింగనం చేసుకుంటున్నారు, షేక్‌హ్యాండ్స్‌తో ప్రశంసిస్తున్నారు ఆత్మీయులు, స్నేహితులు, మద్దతుదారులు, శ్రేయోభిలాషులు. అందరికీ అభివాదం తెలుపుతూ హుందాగా వేదికను చేరుకుంది. ‘‘ఈ విజయంతో యువత గొంతును వినిపిస్తున్నానుకుంటున్నా.. అమెరికాలో స్థిరపడిన తూర్పుఆఫ్రికా స్త్రీల గొంతుకగా నిలుస్తాననుకుంటున్నా.. ఈ దేశంలోని మొత్తం ముస్లింల గళంగా ఉంటాను.. అవకాశాల కోసం చూస్తున్న యంగ్మదర్స్కి ప్రతినిధినవుతాను. ఈ గెలుపు.. వైషమ్యానికి ఇక్కడ తావులేదని నిరూసపించింది. మినియాపోలీస్(మిన్నెసోటా రాష్ట్రంలోని నగరం)లోని భిన్నత్వంలో ఏకత్వాన్ని రుజువుచేసింది.. స్టేట్ గవర్నింగ్ బాడీలో ముస్లిం వనితలకూ స్థానముంటుందని నిరూపించిందీ విజయం’’ అని ఇల్హా అంటుంటే మరొక్కసారి చప్పట్లతో ఆ సభమారుమోగింది. గర్వంతో భార్యను గుండెకు హత్తుకున్నాడు ఆమె భర్త అహ్మద్ హిర్సి. ఆనందంతో ముగ్గురు పిల్లలూ ఆ తల్లిని చుట్టేసుకున్నారు! ఆ దృశ్యం చూసిన అక్కడి ప్రతిఒక్కరి కళ్లల్లో సన్నని కన్నీటి తెర.. వేదన, బాధ, సంతోషం కలగలసి తేరుకున్న ఆశల పొర! వేదిక దిగి సరాసరి తన తాతగారి దగ్గరకు వచ్చింది ఇల్హా. తలవంచి గౌరవం ఇచ్చింది. ఆ తాత ఆ పిల్ల తలను పొట్టలో దాచుకున్నాడు. పొగిలి పొగిలి ఏడ్చాడు. తండ్రికీ నమస్కరించింది. దగ్గరకు తీసుకొని తల మీద ముద్దుపెట్టుకున్నాడు తండ్రి. సొమాలియాలో సివిల్ వార్‌కు... రెఫ్యూజీ క్యాంప్‌లోని బాల్యవిహానికి... అమెరికాలో వివక్షకు వ్యతిరేకంగా పోరాడి గెలిచిన ఆ బిడ్డను కళ్లల్లో నింపుకున్నాయి ఆ రెండు తరాలు. తాము నేర్పిన ధైర్యపాఠాలను ఒంటబట్టించుకొని.. రాజకీయ చదరంగంలో పావులు కదపడానిక్కాకుండా సమన్యాయ శాసనాన్ని రాయడానికి వచ్చిన తమ మూడోతరాన్ని చూసి మురిసిపోయారు! ఇది విజయోత్సవ వేడుక.. చట్టసభలో ఇల్హపట్టమహోత్సవ పండుగ! అమెరికాలో ఈ నల్ల కలువ జయసాధనకు పోరు మొదలైంది తూర్పు ఆఫ్రికాలోని సొమాలియాలో! వయా కెన్యా యూఎస్ చేరిన.. ఛేదించిన వైనం వివరంగా... విద్యావంతుల కుటుంబం ఇల్హా 1982లో సొమాలియాలోని మొగదీషులో పుట్టింది. బేధాబోలో పెరిగింది. ఏడుగురు సంతానంలో చివరిది. తండ్రి నూర్ ఒమర్ మహ్మద్. టీచర్. తల్లి యెమెనీ. గృహిణి. ఇల్హా చిన్నప్పుడే అనారోగ్యంతో యెమెనీ చనిపోయింది. తండ్రి, తాత సంరక్షణలో పెరిగారు పిల్లలంతా. అందుకే ఇల్హాకు తాత (అబుకర్) అంత సాన్నిహిత్యం. సొమాలియాలోని నేషనల్ మెరైన్ ట్రాన్స్‌పోర్ట్‌కి డైరెక్టర్‌గా పనిచేసేవారు. ఇల్హా బాబాయ్‌లు, పిన్నిలు సొమాలియా ప్రభుత్వోద్యోగాల్లో ఉన్నారు. ఇల్హాది విద్యావంతుల కుటుంబమే. అల్లకల్లోలం చక్కటి చదువు, ఆటపాటలతో హాయిగా సాగిపోతున్న ఇల్హా జీవితాన్ని 1991లో మొదలైన సివిల్ వార్ అల్లకల్లోలం చేసింది. ఆమె తన కుటుంబంతో సొమాలియాను వదిలి కెన్యాకు వెళ్లాల్సిన పరిస్థితిని కల్పించింది. అప్పటిదాకా విశాలమైన ఇంట్లో సంతోషంగా ఉన్న ఎనిమిదేళ్ల ఇల్హా కెన్యా, మొబాసాలోని రెఫ్యూజీ క్యాంపుల్లో బిక్కుబిక్కుమంట్లూ గడపాల్సి వచ్చింది. రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన కాందీశీకుల జాడ్యం, మౌఢ్యానికి దూరంగానే ఆ కుటుంబం ఉన్నా కొన్ని అంధవిశ్వాసాల ఒత్తిడిని ఎదుర్కోక తప్పలేదు. ఇల్హాతోపాటు ఆమె తోబుట్టువులంతా అక్కడున్న నాలుగేళ్లు చదువుకు దూరంగానే ఉండాల్సి వచ్చింది. ఇల్హా బాల్యవివాహం విపత్తును తప్పించుకోవాల్సి వచ్చింది. ఇల్హా కుటుంబం కెన్యాకు వెళ్లిన రెండేళ్లకు అనుకుంటా.. కెన్యాకే చెందిన ఓ కుటుంబం ఆ క్యాంప్‌లోని మధ్యవర్తి ద్వారా ఇల్హా వివరాలు తెలుసుకొని ఆ పిల్లను తమింటి కోడలు చేసుకోవడానికి లాంఛనాలతో సహా ఇల్హా వాళ్ల డేరా దగ్గరకు వచ్చింది. కోపంతో ఇల్హా తాత దవడలు బిగిసుకున్నాయి. వచ్చిన కుటుంబ పెద్ద చెంప చెళ్లుమనిపించి అక్కడినుంచి వెళ్లగొట్టాడు. కాని ఆ గొడవతో అంతటితో సద్దుమణగలేదు. తెల్లవారి ఆ క్యాంప్ అధికారి అయిన కెన్యాదేశస్తుడిని వెంటబెట్టుకొని వచ్చాడు ఆ ప్రత్యర్థి. అయినా ఆ ముసలాయన అదరలేదు, బెదరలేదు. కిందటి రోజు ఇచ్చిన చెంపదెబ్బ సమాధానమే ఆ రోజూ ఇచ్చాడు. ఆ దెబ్బకు కెన్యా అధికారి తోకముడుచుకొని పారిపోయాడు. అయినా అక్కడ ఉండడం తమ పిల్లలకు క్షేమం కాదని, వాళ్ల ప్రగతికి అవరోధమని గ్రహించిన ఆ పెద్దాయన అమెరికా వెళ్లడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. ప్రజాస్వామ్య పాఠాలు అబుకర్ పెట్టుకున్న అర్జీలు ఫలించి ఆ కుటుంబం 1995లో అమెరికాకు వలస వెళ్లింది. మొదట వర్జీనియాలోని అర్లింగ్టన్లో బస చేశారు. కొన్ని నెలలు మాత్రమే అక్కడ ఉండి ఆ తర్వాత మిన్నెసోటా రాష్ట్రంలోని మినియాపోలీస్ చేరుకున్నారు. దాదాపు నలభైవేల మంది సొమాలియా శరణార్థులుండే రాష్ట్రం అది. అందునా అత్యధికులు మినియాపోలీస్లోనే నివసిస్తున్నారు. ఎత్తయిన అపార్టమెంట్స్, సేడర్ నది ఒడ్డున ఉన్న ఈస్ట్ ఆఫ్రికన్ కాఫీ షాప్స్, మార్కెట్స్‌తో చిన్నసైజు మొగదీషును తలపిస్తుంటుంది అది. అయినా అమెరికా ఆమెకు బ్రహ్మపదార్థంలానే తోచింది. ఇంగ్లీష్ తప్ప తమ మాట వినిపించేదే కాదు. ఒకలాంటి యాసతో వేగంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్న స్థానికులను అబ్బురంగా చూసేది. ఆ పరిశీలనే ఇంగ్లీష్ భాష పట్ల పట్టు వచ్చేలా చేసింది ఆమెకు. మినియాపోలీస్ వెళ్లిన మూడునెలల్లోనే అనర్ఘళంగా ఆగ్లం మాట్లాడే దశకు వచ్చేసింది. అప్పటిదాకా పాజ్‌లో ఉన్న చదువూ మూవ్ అయింది. ఎడిసన్ హైస్కూల్లో చేరింది. ఒక్క చదువే అన్ని నేర్పిస్తుంది అని పిల్లలను వదిలెయ్యలేదు ఇల్హా తండ్రి, తాత. సమాజస్థితిగతులను వివరించేవారు. అందరికంటే చిన్నదవడం వల్లో, విషయాలను త్వరగా ఆకళింపు చేసుకోవడం, వేగంగా స్పందించే గుణం ఉండడం వల్లో ఇల్హా పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించేవాడు అబుకర్. పధ్నాలుగేళ్ల ఇల్హాకు ప్రజాస్వామ్యం, సమకాలీన రాజకీయ పరిస్థితులు, పరిణామాల గురించి చెప్పేవాడు. ఆ అవగాహనతో స్థానికంగా జరిగే మీటింగ్స్‌లో ఇంగ్లిష్‌లో సాగే ఉపన్యాసాలను తాతకు సొమాలియా భాషలో తర్జుమా చేసి చెప్పేది. ఆ స్నేహబంధం, అనుబంధం తర్వాత ఆమె మిన్నెసోటా సెనెట్‌కి సభ్యురాలయ్యే స్ఫూర్తిని పంచింది. శక్తినిచ్చింది. స్టూడెంట్ పాలిటిక్స్ టు మెయిన్‌స్ట్రీమ్ పాలిటిక్స్ హైస్కూల్లో ఉన్నప్పుడే స్టూడెంట్ ఆర్గనైజర్‌గా ఎన్నికైంది. అక్కడితో ఆగలేదు స్కూల్ చదవైపోయి నార్త్ డకోటా స్టేట్ యూనివర్శిటీలో చేరాక ముస్లిం స్టూడెంట్ అసోసియేషన్‌లో చేరింది. విద్యార్థి రాజకీయాల్లో ఎంత చురుకుగా పాల్గొనేదో చదువులోనూ అంతే చురుగ్గా ఉండేది. పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ స్టడీస్ ఐచ్ఛికాలుగా డిగ్రీ చదివింది. తర్వాత లా కూడా చేసింది. అనంతరం కమ్యూనిటీ న్యుట్రిషన్ ఎడ్యూకేటర్‌గా ఉద్యోగం మొదలుపెట్టింది. 2012లో ప్రధాన రాజకీయస్రవంతిలోకి వచ్చింది. ఆ యేడు మిన్నెసోటా చట్టసభకు జరిగిన ఎన్నికల్లో కరీ తరపున ఎన్నకల ప్రచారం చేసింది. అప్పుడు క్షేత్రస్థాయి సమస్యలు, ప్రాక్టికల్ పాలిటిక్స్ అర్థమయ్యాయి ఆమెకు. ఆ అనుభవంతో అండ్రూజాన్సన్ కోసం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొంది. అప్పుడే అండ్రూజాన్స్న్ ఆఫీస్‌లో సీనియర్ పాలసీ ఎయిడ్ కొలువులో చేరింది. ఆ బాధ్యతను మూడేళ్లు నిర్వహించింది. ఆ సమయంలోనే అంటే 2014లో జరిగిన ఓ స్థానిక సమావేశం హింసాత్మకంగా మారింది. గుర్తు తెలియని అయిదుగురు వ్యక్తులు ఇల్హా మీద దాడి చేశారు. ఆమె తీవ్రంగా గాయపడింది. రాజకీయాల నుంచి తప్పుకోవాలనే హెచ్చరికనూ జారిచేశారు. అప్పుడు నిర్ణయించుకుంది ఇల్హా రాజకీయాల్లోనే కొనసాగాలని. ట్రంప్‌కి కౌంటర్‌గా.. 2016లో జరిగిన మినియాపోలీస్ చట్టసభకు డెమోక్రాట్స్ తరపున బరిలోకి దిగింది. తన ప్రత్యర్థి రిపబ్లికన్ అభ్యర్థి అబ్డిమలిక్ అక్సర్ కూడా సొమాలి అమెరికనే. మినియాపోలీస్‌లో మంచి పట్టున్న వ్యక్తే. అయితే హఠాత్తుగా అతని తండ్రి చనిపోవడంతో పోటీ నుంచి విత్‌డ్రా అయ్యాడు. దాంతో ఆ స్థానంలోకి ఫిలిస్ ఖాన్ వచ్చాడు. గట్టి పోటీనే ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటికే ట్రంప్ ముస్లిం వలసలను రానివ్వం అనే ప్రచారం మొదలుపెట్టాడు. ఆ క్యాంపెయిన్‌కి కౌంటర్‌గా తను ప్రచారం మొదలుపెట్టింది ఇల్హా. ఒక దశలో డైరెక్ట్‌గా ట్రంప్‌నే ఢీకొననుందా ఏంటీ ఈ పిల్ల అనుకునేంత ఉధృతం చేసింది ఇల్హా తన కౌంటర్ క్యాంపెయిన్ని. ప్రత్యర్థి ఫిలిస్ ఓటమి ఖాయమైంది. తూర్పు ఆఫ్రికాకిరణంతో మినియాపోలీస్ సెనెట్ వెలిగిపోతోంది. సమస్యల మీద వాడిగా చర్చిస్తూ చల్లటి పరిష్కారాలను అందించే ప్రయత్నం చేస్తోంది ఇల్హా ఒమర్. వ్యక్తిగతం.. వివాదం ఇల్హా తన 19వ యేట(2002) అహ్మద్ హిర్సీతో సహజీవనం మొదలుపెట్టింది. ఆ యేడే పెళ్లి చేసుకోవాలని ఆ జంట నిఖాకోసం దరఖాస్తూ చేసుకుంది. ఎందుకనో అది ముందుకు సాగలేదు. కాని వీళ్ల కాపురం మాత్రం సజావుగానే సాగింది. ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. స్పర్థలతో 2008లో ఇల్హా, హిర్సీ విడిపోయారు. 2009లో ఇల్హా అహ్మద్ నూర్ సయీద్ ఎల్మీని పెళ్లిచేసుకుంది. రెండేళ్లే సాగిన ఈ దాంపత్యం విడాకులతో రద్దయింది. మళ్లీ అహ్మద్ హిర్సీకి దగ్గరైన ఇల్హా 2011లో అతన్ని అధికారికంగా పెళ్లి చేసుకుంది. ‘‘హిర్సీ మళ్లీ నా జీవితంలోకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అన్ని కుటుంబాల్లో ఉన్నట్టే, అందరు భార్యభర్తలకు వచ్చినట్టే మాకూ మనస్పర్థలొచ్చాయి, కలహాలొచ్చాయి. అందరూ సర్దుకుపోయినట్టే మేమూ సర్దుకుపోయాం. ముందుకన్నా ఎక్కువ అండర్‌స్టాడింగ్, కంపార్టబులిటీతో ఉంటున్నాం. కలిసి పిల్లలను పెంచుతున్నాం. నా వ్యక్తిగతంగానే కాదు, రాజకీయ జీవితానికి తోడు,నీడగా ఉంటున్నాడు హిర్సీ’’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఇల్హా. అయితే ఆమె వ్యక్తిగత జీవితంలోని ఈ సంఘటనను మినియాపోలీస్ ఎన్నికలప్పుడు ప్రత్యర్థి పార్టీ వివాదంగా మార్చి ఆమెను పరాభవం తద్వారా పరాజయం పాలుచెయ్యాలని చూసింది. ధైర్యంగా ఎదుర్కొని పరాభవాన్ని విజయానందంగా మలచుకుంది ఇల్హా ఒమర్. మిన్నెసోటాలో ఉన్న ఆఫ్రికన్సే కాదు అమెరికన్స్కూ ఇల్హా ఒమర్ ఓ ఆశాకిరణం! వాళ్ల కలలను సాకారం చేసే దేవత. ప్రజాస్వామ్యం విలువలు కాపాడుతూ దాని గౌరవాన్ని పెంచే నేత! స్త్రీలు.. పిల్లల కోసం 2015 నుంచి స్త్రీల సంక్షేమం కోసం పనిచేయడం మొదలుపెట్టింది ఇల్హా. తూర్పు ఆఫ్రికా మహిళల నాయకత్వం కోసం, రాజకీయాల్లో వాళ్ల భాగస్వామ్యం కోసం పనిచేసే ‘పాలసీ అండ్ ఇనీషియేటివ్స్ ఆఫ్ ది విమెన్ ఆర్గనైజేషన్, విమెన్ నెట్వర్క్’ కి డైరెక్టర్‌గా చేరింది. ఇదే కాకుండా విద్య, పౌరహక్కులు, మానవహక్కులు, పేదరికం, పర్యావరణ సమస్యలు, యానిమల్ వెల్ఫేర్, ఆర్థిక స్వావలంబన వంటి అంశాల్లోనూ విస్తృత సేవలందించింది. గంటకు పదిహేను డాలర్లు కనీస వేతనం ఇవ్వాలనే పోరాటానికి మద్దతు తెలిపింది. 125 డాలర్ల కంటే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల్లోని పిల్లలకు ఉచితంగా ట్యూషన్లు చెప్పే ఏర్పాటు చేసింది. స్టూడెంట్ లోన్స్ ఇప్పించింది. ఇవన్నీ రాజకీయాల్లో రాణించడానికి చేసిన ఎత్తుగడలు కావు. ఆఫ్రికా శరణార్థుల బాధలను, ఇబ్బందులను చూసి చలించిపోయి మానవతాధృక్పథంతో అందించిన సేవాకార్యక్రమాలు. – శరాది -
శీలం ఖరీదు రూ.లక్ష
గజ్వేల్: బాలికను గర్భవతిని చేయడమే కాకుండా భ్రూణ హత్యకు పాల్పడి శీలానికి వెల కట్టిన ఉదంతం మెదక్ జిల్లా గజ్వేల్ మండలం మక్తమాసాన్పల్లిలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. తొగుట సీఐ వెంకటయ్య కథనం మేరకు.. గ్రామానికి చెందిన పెంజర్ల శివాజీ (16) కుటుంబీకులకు చెందిన పొలంలోకి పది నెలల క్రితం అదే గ్రామానికి చెందిన బాలిక (17) చిక్కుడుకాయ ఏరడానికి పనికి వెళ్లింది. ఈ సందర్భంగా శివాజీ మాయమాటలతో ఆమెను లోబర్చుకున్నాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. ఫిబ్రవరి 23, 24 తేదీలలో పెద్దమనుషులు ఈ వ్యవహారంపై పంచాయితీ నిర్వహించారు. బాలిక శీలానికి రూ. లక్ష వెల కట్టి అబార్షన్ చేయించుకోవాలని సూచించారు. ఆ తర్వాత శివాజీ సోదరుడు రాజు, బావ మేస్త్రీ శ్రీను, సోదరి రాణెమ్మలు కలసి గజ్వేల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో అబార్షన్ చేయించారు. విషయం బయటపడడంతో శివాజీ, రాజు, శ్రీను, రాణెమ్మ, డాక్టర్ సాంబశివరావులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.