నేడు మదర్స్ డే
గత ఫిబ్రవరి నెలలో హైదరాబాద్‌కి చెందిన ఎర్రమట్టి మంగమ్మ అనే మహిళ పెద్దవయసులోనూ ఐవీఎఫ్ ద్వారా గర్భాన్ని ధరించడం రికార్డ్‌గా నిలిచింది. చట్టపరమైన నిబంధనలకు విరుద్ధం అంటూ దీనిపై వాదోపవాదాలు ఎలా ఉన్నప్పటికీ ఆకాశమే హద్దుగా నిలుస్తున్న ఐవీఎఫ్ చికిత్స సామర్ద్యానికి ఇది అద్దం పడుతుందనేది వాస్తవం.
సంతానలేమి సమస్యతో పోరాడుతున్న ఆధునిక మహిళకు ఇన్–విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్)అమ్మ కావాలనే కలను సాకారం చేయడంతో పాటు వయసుకు సంబంధించిన అడ్డంకులు కూడా తొలగిస్తోంది. ప్రీ ఇంప్లాంటేషన్ ద్వారా జన్యు పరీక్షలు వంశపారంపర్య వ్యాధులకు అడ్డుకట్ట వేయడం వంటి మరికొన్ని అదనపు ప్రయోజనాలను జత చేసుకుంటూ ఐవీఎఫ్ అంతకంతకూ మహిళలకు చేరువవుతోందని అంటున్నారు ఫెర్టీ9ఫెర్టిలిటీ సెంటర్ కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ డా.టి.శ్రావ్యా తల్లాపురెడ్డి.
వయస్సు నుంచి ఒత్తిడి దాకా...
కెరీర్ వేటలో లేటు పెళ్లిళ్లు, గర్భధారణ వాయిదాలు...నగర మహిళకు తప్పనిసరిగా కాగా మధ్య వయసులో గర్భదారణ యత్నాలు బెడిసికొడుతున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం.. అత్యధిక శాతం ఆధునిక మహిళలు 30ఏళ్ల వయసు తర్వాత మాత్రమే పిల్లల గురించి ఆలోచిస్తున్నారని, ఆలస్యంగా తల్లి కావడం ఒక నిబంధనలా మారిందని వెల్లడించింది. అదే విధంగా నగర జీవనంలో కాటేసే కాలుష్యం, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, పని ఒత్తిడి వంటివన్నీ తల్లి కావాలనే ఆశలపై నీళ్లు జల్లుతున్నాయి. ఈ నేపధ్యంలో వీటన్నింటికీ పరిష్కారంగా మారింది ఐవీఎఫ్..
పెద్ద వయసులోనూ పిల్లలకు అవకాశం..
డబ్లు్యహెచ్ నివేదిక ప్రకారం 17.5% మంది వయోజనులను ప్రభావితం చేసే వంధ్యత్వాన్ని గుర్తించడం ద్వారా, ఐవీఎఫ్ మహిళల సంతానోత్పత్తి అవకాశాలపై మరింత అవగాహనను అందిస్తుంది.
ఒంటరులకు...లివ్ ఇన్ కాపురాలకూ..
మాతృత్వం పొందే విషయంలో సాంఘిక నిబంధనలతో పాటు అనేక రకాల పరిమితులు అడ్డంకులుగా మారుతున్నాయి. కారణాలేమైనప్పటికీ నగరంలో నివసించే ఒంటరి జీవుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అలాగే పెళ్లి కాకుండా కలిసి జీవిస్తున్న జంటలూ, స్వలింగ దాంపత్యాలు సైతం పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ సంతానకాంక్షను తీరుస్తోంది ఐవీఎఫ్.
ఐవీఎఫ్ ద్వారా ప్రీ ఇంప్లాంటేషన్, జన్యు పరీక్ష వంటివి కూడా సాధ్యపడుతుండడంతో మహిళలు వారి పునరుత్పత్తి భవిష్యత్తు గురించి సమాచారం పొందగలుగుతున్నారు. దీని ద్వారా ఎవరైనా సరే ఇంప్లాంటేషన్‌కు ముందు జన్యుపరమైన అపసవ్యతలకు సంబంధించి పిండాలను పరీక్షించవచ్చు, భవిష్యత్ తరాలకు వంశపారంపర్య వ్యాధులను చేర వేసే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. జన్యువులపై ఈ స్థాయి నియంత్రణ ద్వారా మహిళలు వారి కుటుంబాల కోసం వారి విలువలు ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఐవీఎఫ్ సహకరిస్తుంది.
ఐవీఎఫ్...అడ్డంకులకు పరిష్కారం..
సంతానలేమి సమస్యకు పరిష్కారంగా అందుబాటులోకి వచ్చిన ఐవీఎఫ్ ఇప్పుడు సంతానలేమికి కారణమయ్యే అడ్డంకులను అధిగమించడానికి కూడా సహకరిస్తోంది. జన్యుపరీక్షలతో వంశపారంపర్య వ్యాధులకు చెక్ పెట్టే అవకాశం.. వైవిధ్యభరిత మాతృత్వాలు వంటివి ఐవీఎఫ్ ద్వారా సాధ్యమవుతున్నాయి.
– డా.టి.శ్రావ్యా తల్లాపురెడ్డి.సీనియర్ కన్సల్టెంట్, ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment