mangamma
-
Mothers Day 2024: ఐవీఎఫ్ అద్భుతాలెన్నో...పెద్దవయసులోనూ గర్భధారణ
గత ఫిబ్రవరి నెలలో హైదరాబాద్‌కి చెందిన ఎర్రమట్టి మంగమ్మ అనే మహిళ పెద్దవయసులోనూ ఐవీఎఫ్ ద్వారా గర్భాన్ని ధరించడం రికార్డ్‌గా నిలిచింది. చట్టపరమైన నిబంధనలకు విరుద్ధం అంటూ దీనిపై వాదోపవాదాలు ఎలా ఉన్నప్పటికీ ఆకాశమే హద్దుగా నిలుస్తున్న ఐవీఎఫ్ చికిత్స సామర్ద్యానికి ఇది అద్దం పడుతుందనేది వాస్తవం. సంతానలేమి సమస్యతో పోరాడుతున్న ఆధునిక మహిళకు ఇన్–విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్)అమ్మ కావాలనే కలను సాకారం చేయడంతో పాటు వయసుకు సంబంధించిన అడ్డంకులు కూడా తొలగిస్తోంది. ప్రీ ఇంప్లాంటేషన్ ద్వారా జన్యు పరీక్షలు వంశపారంపర్య వ్యాధులకు అడ్డుకట్ట వేయడం వంటి మరికొన్ని అదనపు ప్రయోజనాలను జత చేసుకుంటూ ఐవీఎఫ్ అంతకంతకూ మహిళలకు చేరువవుతోందని అంటున్నారు ఫెర్టీ9ఫెర్టిలిటీ సెంటర్ కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ డా.టి.శ్రావ్యా తల్లాపురెడ్డి.వయస్సు నుంచి ఒత్తిడి దాకా...కెరీర్ వేటలో లేటు పెళ్లిళ్లు, గర్భధారణ వాయిదాలు...నగర మహిళకు తప్పనిసరిగా కాగా మధ్య వయసులో గర్భదారణ యత్నాలు బెడిసికొడుతున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం.. అత్యధిక శాతం ఆధునిక మహిళలు 30ఏళ్ల వయసు తర్వాత మాత్రమే పిల్లల గురించి ఆలోచిస్తున్నారని, ఆలస్యంగా తల్లి కావడం ఒక నిబంధనలా మారిందని వెల్లడించింది. అదే విధంగా నగర జీవనంలో కాటేసే కాలుష్యం, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, పని ఒత్తిడి వంటివన్నీ తల్లి కావాలనే ఆశలపై నీళ్లు జల్లుతున్నాయి. ఈ నేపధ్యంలో వీటన్నింటికీ పరిష్కారంగా మారింది ఐవీఎఫ్..పెద్ద వయసులోనూ పిల్లలకు అవకాశం..డబ్లు్యహెచ్ నివేదిక ప్రకారం 17.5% మంది వయోజనులను ప్రభావితం చేసే వంధ్యత్వాన్ని గుర్తించడం ద్వారా, ఐవీఎఫ్ మహిళల సంతానోత్పత్తి అవకాశాలపై మరింత అవగాహనను అందిస్తుంది.ఒంటరులకు...లివ్ ఇన్ కాపురాలకూ..మాతృత్వం పొందే విషయంలో సాంఘిక నిబంధనలతో పాటు అనేక రకాల పరిమితులు అడ్డంకులుగా మారుతున్నాయి. కారణాలేమైనప్పటికీ నగరంలో నివసించే ఒంటరి జీవుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అలాగే పెళ్లి కాకుండా కలిసి జీవిస్తున్న జంటలూ, స్వలింగ దాంపత్యాలు సైతం పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ సంతానకాంక్షను తీరుస్తోంది ఐవీఎఫ్. ఐవీఎఫ్ ద్వారా ప్రీ ఇంప్లాంటేషన్, జన్యు పరీక్ష వంటివి కూడా సాధ్యపడుతుండడంతో మహిళలు వారి పునరుత్పత్తి భవిష్యత్తు గురించి సమాచారం పొందగలుగుతున్నారు. దీని ద్వారా ఎవరైనా సరే ఇంప్లాంటేషన్‌కు ముందు జన్యుపరమైన అపసవ్యతలకు సంబంధించి పిండాలను పరీక్షించవచ్చు, భవిష్యత్ తరాలకు వంశపారంపర్య వ్యాధులను చేర వేసే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. జన్యువులపై ఈ స్థాయి నియంత్రణ ద్వారా మహిళలు వారి కుటుంబాల కోసం వారి విలువలు ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఐవీఎఫ్ సహకరిస్తుంది.ఐవీఎఫ్...అడ్డంకులకు పరిష్కారం..సంతానలేమి సమస్యకు పరిష్కారంగా అందుబాటులోకి వచ్చిన ఐవీఎఫ్ ఇప్పుడు సంతానలేమికి కారణమయ్యే అడ్డంకులను అధిగమించడానికి కూడా సహకరిస్తోంది. జన్యుపరీక్షలతో వంశపారంపర్య వ్యాధులకు చెక్ పెట్టే అవకాశం.. వైవిధ్యభరిత మాతృత్వాలు వంటివి ఐవీఎఫ్ ద్వారా సాధ్యమవుతున్నాయి.– డా.టి.శ్రావ్యా తల్లాపురెడ్డి.సీనియర్ కన్సల్టెంట్, ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ -
ఇంత దారుణంగా.. వివాహితను హత్య చేసిందెవరు?
సాక్షి, సంగారెడ్డి: వివాహిత హత్యకు గురైన సంఘటన గుమ్మడిదల మండలంలో ఆలస్యంగా బుధవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా శ్రీరంగపురం మండలం తాటిపాముల గ్రామానికి చెందిన ముడావత్ శివనాయక్, మంగమ్మ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. ఏడాది క్రితం వలసవచ్చి హైదరాబాద్‌లోని బాలానగర్ సమీపంలో నివాసం ఉంటున్నారు. అతను డ్రైవర్, ఆమె అడ్డా కూలీగా పనులు చేసుకుంటున్నారు. గత నెల 28న మంగమ్మ ఎప్పటిలాగే కూలీ పని కోసం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె అదృశ్యంపై భర్త బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా గురువారం రాత్రి గుమ్మడిదల మండలం నల్లవల్లి అటవీ ప్రాంతంలో ఫారెస్టు అధికారులు విధులు నిర్వహిస్తున్న సమయంలో చెట్ల పొదల్లో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. అదే విషయాన్ని పోలీసులకు చెప్పారు. వారు శివనాయక్‌కు గుర్తించిన ఆ మహిళ మృతదేహం ఒక్కసారి చూడాలని సూచించారు. దానికి అతను అంగీకరించి అక్కడికి వెళ్లి పరిశీలించగా అది భార్య మృతదేహమేనని గుర్తుపట్టాడు. అయితే ఐదురోజుల క్రితం దుండగులు హత్య చేసి అటవీ ప్రాంతంలో పడేసి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. అప్పటికే మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపారు. ఇవి చదవండి: 'కార్మిక కుటుంబాల్లో.. తీరని శోకం!' ఈ ప్రమాదాలు ఇంకెన్నాళ్లు? -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వాల్మీకి మంగమ్మ ఏకగ్రీవ ఎన్నిక
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాల్మీకి మంగమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ల స్క్రూటినీ కార్యక్రమం జరిగింది. టీడీపీ నేత వేలూరు రంగయ్య దాఖలు చేసిన నామినేషన్లో సరైన వివరాలు, డాక్యూమెంట్లు లేకపోవడంతో ఆయన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి వాల్మీకి మంగమ్మ నామినేషన్ ఒక్కటే ఉండటంతో ఆమె ఏకగ్రీవం లాంఛనం కానుంది. వాల్మీకి మంగమ్మ కు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంతపురం జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పైలా నరసింహయ్య శుభాకాంక్షలు తెలిపారు. వెనుకబడిన వర్గానికి చెందిన తనకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు -
మంగమ్మకు ఎమ్మెల్సీ!
అనంతపురం: హిందూపురం పార్లమెంట్ మాజీ సభ్యులు దివంగత సానిపల్లి గంగాధర్ సతీమణి సానిపల్లి మంగమ్మకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ స్థానం కేటాయించింది. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆమె పేరు ప్రకటించారు. దీంతో మంగమ్మ కుటుంబీకులు, సన్నిహితులు, వాలీ్మకి కులస్తులు, వైఎసార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. మంగమ్మ కుటుంబ నేపథ్యం.. కళ్యాణదుర్గం మండలం శీబావి గ్రామానికి చెందిన మంగమ్మది సాధారణ మధ్య తరగతి కుటుంబం. 1979లో పెనుకొండ మండలం మునిమడుగు గ్రామానికి చెందిన సానిపల్లి గంగాధర్‌తో వివాహమైంది. గంగాధర్ 1987లో గుట్టూరు సింగిల్‌విండో అధ్యక్షులుగా పని చేశారు. అప్పటికే యంగ్ ఇండియా సంస్థలో క్రియాశీలకంగా పనిచేసిన గంగాధర్ రాజకీయ చైతన్యాన్ని ఆ సంస్థ అధ్యక్షుడు బేడీ గుర్తించారు. రాజీవ్గాందీతో మాట్లాడి 1989లో హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇప్పించారు. అప్పట్లో ఎంపీగా గెలిచిన గంగాధర్... పార్లమెంట్ మధ్యలోనే రద్దవడంతో సభ్యత్వాన్ని కోల్పోయారు. మళ్లీ 1991 నుంచి 1996 ప్రారంభం వరకు ఎంపీగా కొనసాగారు. 1996లో రామచంద్రారెడ్డి చేతిలో ఓటమి చవి చూశారు. 1998లో అదే రామచంద్రారెడ్డిపై గెలిచారు. ఆతర్వాత ఏడాదికే అంటే 1999లో వచ్చిన ఎన్నికల్లో బీకే పార్థసారథి చేతిలో ఓడిపోయారు. అనంతరం గంగాధర్ అనారోగ్యంతో మరణించారు. ఆయన సతీమణి సానిపల్లి మంగమ్మ తమకు రాజకీయంగా అండగా నిలిచిన వైఎస్ రాజశేఖరరెడ్డి వెంట నడిచారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్సీపీలో చేరి పెనుకొండ నియోజకవర్గ సమన్వయ కర్తగా, సీఈసీ సభ్యులుగా వైఎస్సార్ సీపీ అభివృద్ధికి పాటుపడ్డారు. నమ్ముకుని వెంట నడిచిందుకు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఏకంగా ఎమ్మెల్సీ సీటు కేటాయించడంతో మంగమ్మ కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. స్వగ్రామంలో సంబరాలు కళ్యాణదుర్గం: మంగమ్మను స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యరి్థగా ప్రకటించగానే ఆమె స్వగ్రామం కళ్యాణదుర్గం మండలం శీబావిలో సంబరాలు అంబరాన్నంటాయి. కుటుంబ సభ్యులు రామచంద్ర, మల్లరాయుడు, శివాజీ, అశోక్, సర్వోత్తమలతో పాటు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు గోళ్ల మోహన్‌రెడ్డి, కో ఆప్షన్ అబ్దుల్ రెహమాన్, తిప్పే‹Ù, రామాంజి, వడ్డే రామాంజి, నాగేంద్ర, తిమ్మప్ప, పోతే‹Ù, ప్లహ్లాద తదితరులు అనంతపురం ప్రధాన రహదారిపై బాణాసంచా పేల్చారు. స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. తమ ఆడపడుచుకు సముచిత స్థానం కల్పించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బీ–ఫారం అందుకునేందుకు తన సోదరి మంగమ్మతో కలిసి అశ్వర్థ, స్థానికులు విజయవాడకు బయలుదేరి వెళ్లారు. -
అయ్యా.. ఇక మాకు దిక్కెవరు?
సాక్షి, ప్రొద్దుటూరు క్రైం: ‘అయ్యా.. మాకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు.. కుటుంబ పెద్దదిక్కైన నా భర్త చనిపోతే ఇక మాకు దిక్కెవరు?’ అని తమిళనాడు రాష్ట్రానికి చెందిన మంగమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. నవంబర్ 26న ప్రొద్దుటూరు మండలంలోని బొజ్జవారిపల్లె క్రాస్ వద్ద తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఐషర్ వాహనంలో నుంచి కింద పడి మృతి చెందాడు. అటవీ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. 27న పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బందికి అప్పగించారు. అయితే వాట్సప్, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా తన భర్త మృతి చెందాడని తెలుసుకున్న తమిళనాడు ధర్మపురి జిల్లా, సిత్తేరి గ్రామానికి చెందిన మంగమ్మ ప్రొద్దుటూరుకు వచ్చారు. మృతి చెందిన వ్యక్తి తన భర్త బాలకృష్ణన్ అని తెలిపారు. ఆమెతో పాటు మరో ఆరుగురు బంధువులు ఉన్నారు. వారు మంగళవారం రూరల్ పోలీసులను కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. చదవండి: (మహిళను నమ్మించి.. పది నిమిషాల్లో వస్తానని చెప్పి..) అటవీ శాఖ అధికారులపై మంగమ్మ ఆరోపణలు.. ప్రొద్దుటూరులో స్థిరపడి, బాగా తెలుగు మాట్లాడగలిగే తమిళనాడుకు చెందిన వ్యక్తిని పిలిపించి మంగమ్మ బంధువులతో పోలీసు అధికారులు మాట్లాడించి వివరాలు తెలుసుకున్నారు. బాలకృష్ణన్‌తో పాటు తమిళనాడులో రామన్ అనే వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఆమె బంధువులు పోలీసులకు తెలిపారు. మరో ముగ్గురి ఆచూకీ తెలియలేదన్నారు. అటవీ శాఖ అధికారుల వద్దకు వెళ్తే కనీసం వారు మాట్లాడలేదని, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని మంగమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త చావుకు అటవీశాఖ అధికారులే కారణమని ఆరోపించారు. కాగా, ఈ విషయమై అటవీ అధికారులను సంప్రదించగా, డీఆర్వో గుర్రప్ప స్పందిస్తూ ఈ కేసు విషయమై తమ దగ్గరకు ఎవరూ రాలేదని, తమను ఎవరూ సంప్రదించలేదని చెప్పారు. -
ప్రధాని మోదీకి వృద్ధురాలి ఆశీస్సులు
చెన్నై : గత కొన్ని రోజుల క్రితం కోవైకు వచ్చిన ప్రధాని మోదీ ఢిల్లీకి వెళుతున్న సమయంలో విమానాశ్రయంలో కొందరు ముఖ్య ప్రముఖులను కలిశారు. అందులో ఓ నిండు నూరేళ్ల వృద్ధురాలు ఉన్నారు. ఆమెకు మోదీ నమస్కరించి ఆశీర్వాదం అందుకున్నారు. ఆమె 105 ఏళ్ల రంగమ్మాళ్. ఇప్పటికీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటున్న ఈమె 70 ఏళ్లుగా పొలంలో సంప్రదాయ వ్యవసాయం చేస్తున్నారు. దీంతో ఈమెకు ఈ ఏడాది దేశంలో ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును ప్రకటించారు. కోయంబత్తూరు మేట్టుపాళయం సమీపంలోగల తేక్కంపట్టికి చెందినవారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ఈమె అవ్వ సంరక్షణలో పెరిగింది. ఆమె నుంచే జీవితాన్ని, వ్యవసాయాన్ని నేర్చుకుంది. వ్యవసాయమే శ్వాసగా బతుకుతున్నారు. పాఠశాల విద్య ఎరుగదు. అయితే, దేశ రాజకీయ, ప్రపంచ విషయాలు తెలుసుకునేందుకు వార్తాపత్రికలు చదివేలా కొంత విద్య అభ్యసించింది. భర్త రామస్వామి ఇదివరకే మృతిచెందారు. సంప్రదాయ వ్యవసాయం ద్వారా ఈ దంపతులు ప్రఖ్యాతులు సాధించారు. -
ఆమె ధైర్యమే గెలిపించింది
తిరుపతి తుడా: కరోనాను జయించడానికి మందులతో పాటు, మానసిక ధైర్యం కూడా ప్రధానమని వైద్యులు చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణగా నిలిచింది తిరుపతికి చెందిన 101 ఏళ్ల సి.మంగమ్మ. శతాధిక వయసులోనూ కరోనాను ధీటుగా ఎదుర్కొన్న ఆమె ఇప్పుడు అందరికీ ఒక ధైర్యాన్నిస్తోంది. మంగమ్మ స్విమ్స్ శ్రీపద్మావతి వైద్యశాలలో కరోనా నుండి కోలుకుని శనివారం ఇంటికి చేరింది. ఈ వయసులోనూ ఆమె ధైర్యంగా కనిపించిందని, ఆమె ప్రాణాలు నిలబడడానికి వైద్యంతో పాటు ఆమె గుండె ధైర్యమే కారణమని ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ రామ్ తెలిపారు. -
పగలు హైడ్రామా.. రాత్రికి చెక్
మాచర్ల చైర్పర్సన్ మార్పు ఒప్పందంపై శుక్రవారం హైడ్రామా నడిచింది. తొలుత వైస్ చైర్పర్సన్ వర్గీయులు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. చైర్పర్సన్ మంగమ్మ రాజీనామా చేయాలని నినదించారు. సాయంత్రం వరకూ సాగిన ఈ తంతుకు రాత్రికి తెర పడింది. స్థానిక టీడీపీ నేత చైర్‌పర్సన్‌కు రూ.2 కోట్ల చెక్కును అందజేసి రాజీనామా చేయించినట్లు తెలిసింది. గుంటూరు, మాచర్ల: పురపాలక సంఘ చైర్మన్ మంగమ్మ రాజీనామా చేయాలని, వైస్ చైర్మన్ షేక్ షాకీరూన్కు పదవి ఇవ్వాలని టీడీపీ ముస్లిం నాయకులు, కార్యకర్తలు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ముస్లిం నాయకులు అబ్దుల్ జలీల్, సుభాని, మదార్, కరిముల్లా, ముటుకూరు సుభాని ఆధ్వర్యంలో రెండు గంటలపాటు బైఠాయించారు. ‘మా తో ఆడుకుంటారా.. ముస్లింలంటే లెక్క లేదా.. మీ మీటింగ్లేంటి’ అంటూ కేకలు వేశారు. ఈ సమయంలో మున్సిపల్ చైర్మన్ మంగమ్మ మెప్మా ప్రాజెక్టు కార్యాలయంలోనే ఉన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చలమారెడ్డి, మాజీ చైర్మన్ కూనిశెట్టితోపాటు పలువురు ముస్లిం నాయకులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. తమకు ఒప్పందం ప్రకారం శుక్రవారం పదవి ఇస్తామన్నారని తెలిపారు. ఈ సమయంలో అర్బన్ సీఐ సాంబశివరావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మెప్మా గదిలో ఉన్న చైర్పర్సన్ మంగమ్మతో మంతనాలు జరిపారు. అనంతరం బయటకు వెళుతుండగా ముస్లింలు అడ్డగించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ముస్లింలకు, పోలీసులకు తోపులాట జరిగింది. అనంతరం ముస్లింలు బస్టాండ్ వరకు ర్యాలీగా వచ్చి నినాదాలు చేశారు. వైస్ చైర్మన్ షాకీరూన్ ఆధ్వర్యంలో రెండు గంటల సేపు బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో జరిగింది. పోలీసులు మంతనాలు జరపగా తిరిగి పురపాలక సంఘ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే చైర్మన్ మాత్రం తాను 25వ తేదీన రాజీనామా చేస్తున్నానని చెబుతూ పురపాలక సంఘ కమిషనర్‌కు లెటర్ అందించింది. కమీషనర్ రంగారావు అనారోగ్యరీత్యా సెలవు పెట్టడంతో ఆయనపై ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ పదవి మార్పిడికి సంబంధించి రాత్రి 9.30 గంటలకు తెరపడింది. టీడీపీకి చెందిన కీలక నేత నుంచి రూ. 2 కోట్లకు సంబంధించి చెక్కులు తీసుకున్న తరువాత తన పదవికి రాజీనామా చేస్తూ మంగమ్మ కమిషనర్ రంగారావుకు లేఖ అందించారు. శనివారం వైస్ చైర్మన్ షేక్ షాకిరూన్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. తొలుత జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి మందలించడంతో టీడీపీ చెందిన ఓ కీలక నేత తన బ్యాంకు అకౌంట్ సంబంధించిన రూ. 2 కోట్ల చెక్కును చైర్మన్ వర్గీయులకు అందజేసినట్లు విశ్వసనీయ సమాచారం. చైర్మన్ తనకు సంబంధించిన బిల్లులు క్లియర్ చేసుకున్నాక ఈ చెక్కులు సంబంధిత నాయకుడుకు అందజేయాలి. ఈ ఒప్పందంతో చైర్మన్ రాజీనామా చేసినట్లు తెలిసింది. -
అత్త కాళ్లు నరికిన కోడలు
-
అత్త కాళ్లు నరికిన కోడలు
కూతురి పేరిట ఇల్లు రిజిస్ట్రేషన్ చేసినందుకు ఆగ్రహం చౌటుప్పల్: ఓ కోడలు తన అత్త రెండు కాళ్లు నరికింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. చౌటుప్పల్‌లోని బంగారిగడ్డ కాలనీలో నివసించే ముచ్చెర్ల రాములు, మంగమ్మ (60) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చిన్న కుమార్తె సుజాతకు వికలత్వం ఉంది. ఇటీవల తన పేరిట చౌటుప్పల్‌లో ఉన్న రెండు ఇళ్లలో ఒక ఇంటిని కుమార్తె సుజాత పేరిట రిజిస్ట్రేషన్ చేసింది. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న కోడలు జయశ్రీ.. నిత్యం అత్తతో గొడవపడేది. ఈ క్రమంలో ఆదివారం సైతం వివాదం నెలకొంది. ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. ఆవేశంతో కోడలు జయశ్రీ అత్తను రోకలిబండతో కొట్టి ఇంట్లో ఉన్న గడ్డపారను తీసుకువచ్చి రెండు కాళ్లను నరికింది. మంగమ్మ కేకలు వేయడంతో స్థానికులు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
షిరిడీలో రోడ్డు ప్రమాదం
-
షిరిడీలో రోడ్డు ప్రమాదం
ఇద్దరు నల్లగొండ జిల్లా వాసుల మృతి మర్రిగూడ: షిరిడీలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు.మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రైల్వేస్టేషన్ నుంచి వారు ఆటోలో ఆలయానికి వెళుతుండగా లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. నల్లగొం డ, మర్రిగూడ, నిడమనూరులకు చెందిన మూడు కుటుంబాలు (14మంది) శనివారం షిరిడీకి వెళ్లారు. అక్కడ రైలు దిగి షేరింగ్ ఆటో లో ఆలయానికి బయలు దేరారు. ఎదురుగా వచ్చిన లారీ.. ఆటోను ఢీకొనడంతో మర్రిగూ డ లెంకలపల్లికి చెందిన మంగమ్మ(55), నల్లగొండ వెలుగుపల్లికి చెందిన వెంకటమ్మ (35)లు అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలి నవారికి గాయాలయ్యాయి. -
బిచ్చమెత్తి గణపతి లడ్డూను దక్కించుకున్నారు..!
రోజూ బిక్షాటన చేసిన సొమ్మును దాచుకున్న చెంచు జాతికి చెందిన గిరిజన దంపతులు వినాయకుడి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన లడ్డూను వేలంలో దక్కించుకున్న సంఘటన బుధవారం వరంగల్ జిల్లా కురవిలో చోటుచేసుకుంది. చెంచు కాలనీకి చెందిన గడ్డం వెంకన్న, మంగమ్మ దంపతులు వినాయకుడి చేతిలోని లడ్డూను వేలం ద్వారా రూ.26, 116కు తీసుకున్నారు. అప్పుడప్పుడూ కూలీ పనులకు వెళ్తున్నప్పటికీ ఈ దంపతుల ప్రధాన జీవనాధారం భిక్షాటనే. అత్యంత భక్తి ప్రపత్తులతో లడ్డూను దక్కించుకోవడం పట్ల పలువురు అభినందించారు. అనంతరం మేళతాళాల మధ్య గణపయ్యను భద్రచాలం గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు తరలివెళ్లారు. -
ముళ్ల కంపల్లో పసికందు
అప్పుడే పుట్టిన మగ శిశువును నిర్దాక్షిణ్యంగా ముళ్లపొదల్లో పడేసి వెళ్లారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్టూరు మండలం తాటివారిపాలెంలో జరిగింది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో శనివారం అర్ధరాత్రి శిశువు ఏడుపు వినిపించడంతో కాలనీకి చెందిన తొట్టెంపూడి ముక్కోటి, మంగమ్మ దంపతులు ఇంటి పరిసరాల్లో గాలించగా ముళ్లపొదల్లో పసివాడు కనిపించాడు. శిశువును ఆదివారం ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం చిలకలూరిపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. తమకు 25 సంవత్సరాలుగా సంతానం లేదని, ఈ బిడ్డ తమకు దేవుడిచ్చిన వరమని తామే పెంచుకుంటామని ఆ దంపతులు తెలిపారు. -
అమ్మంటే మంగమ్మలా ఉండాలి
గోపాలపట్నం : ఆమె పేరులోనే ఉంది అమ్మ. గర్భం నుంచి ప్రసవించిన లెక్కలేనంత మంది బిడ్డల్ని తల్లికంటే ముందు లోకానికి పరిచయం చేసిన అమృత వల్లి. ఎందరో తల్లులకు పునర్జన్మనిచ్చిన దేవతామూర్తి. ఆంధ్రుల హక్కు...విశాఖ ఉక్కు...అంటూ విశాఖలో ఆందోళన కారులు కేజీహెచ్‌ని సైతం మూయించేసిన రోజుల్లో నేనున్నానంటూ ఉత్తరాంధ్ర తల్లులకు పురుడుపోసిన మహాతల్లి. ఉత్తరాంధ్రలో ఏ బస్సెక్కినా, ఆటో ఎక్కినా, చివరికి రిక్షా ఎక్కినా ఆమె పేరు చెబితే తెలియని వారుండరు. పరిచయం అక్కర్లేని అమ్మ. ఆమే డాక్టర్ మంగమ్మ. మాతృదినోత్సవం సందర్భంగా డాక్టర్ మంగమ్మ గురించి... నేపథ్యమిదీ... చిత్తూరి సుబ్రహ్మణ్య మంగమ్మ ఎక్కడి వారో కాదు. ఆమె స్వస్థలం విశాఖ సిటీ వన్టౌనే. రెండో ప్రపంచయుద్ధం సమయంలో విశాఖ మొత్తం అంధకారం అయిన రోజుల్లో దీపంబుడ్డిలతో బీఎస్సీ చదువుకున్నారు. వివాహ అనంతరం భర్త రమణ ప్రోత్సాహంతో ఎంబీబీఎస్, డీజీవో చదివారు. కేజీహెచ్‌లో హానరీ గైనకాలజిస్టుగా ఆమె విశేష అనుభవం సాధించారు. నగరంలో నర్సింగ్‌హోం అంటే విచిత్రంగా చూసిన 1958 రోజుల్లో కేజీహెచ్ ఎదురుగా ఆమె తొలిసారిగా నర్సింగ్ హోం ఏర్పాటు చేశారు. అదే డాక్టర్ మంగమ్మ నర్సింగ్ హోమ్. మంగమ్మకు ఐదుగురు సంతానంలో కొడుకు శ్రీనివాస్, కుమార్తెలు సంధ్యారాణి, సుజాత గైనకాలజిస్టులు కాగా, ఇంకా మనవలతో కలిపి 13మంది వైద్యుల్ని తయారు చేశారు. కిడ్నీ, గుండె తదితర పేరొందిన వైద్యులుగా వారు సేవలందిస్తున్నారు. ఆపద్భాంధవి... విశాఖ ఉక్కు...ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖలో ఆందోళనలు అట్టుడికిపోయిన రోజుల్లో కేజీహెచ్‌లో ఎమర్జెన్సీవార్డులు సైతం మూతపడ్డాయి. ఆ సమయంలో ఉత్తరాంధ్రలో ఎందరో గర్భిణులకు అండగా నేనున్నానంటూ లేపాక్షి భవనంలో 15 రోజుల పాటు ఉచితంగా డెలివరీలు చేశారు. మూడు దశాబ్దాలుగా ఆమె సత్యసాయి వైద్యకేంద్రం పేరుతో ప్రహ్లాదపురం సమీప శ్రీనివాసనగర్‌లో గర్భిణులకు ఉచితంగా వైద్యసేవలందిస్తున్నారు. బాబా ప్రశంసలు... భగవాన్సత్యసాయిబాబాకి భక్తురాలయిన డాక్టర్ మంగమ్మ ఒకసారి దర్శించి బాబాతో మాట్లాడి దైవం చెంతకు తీసుకెళ్లాని కోరితే... నీవేదైవస్వరూపిణిగా ఎందరికో సేవ చేస్తున్నావు..దైవున్నే నీసొంతం చేసుకున్నావు....ఇక నీకెం దుకు ఇంకో దైవం...అని బాబా ప్రశంసించారంటే ఆమె గొప్పతనాన్ని అంచనావేయాలి. అమ్మ సంస్కృతికి అద్దంపట్టాలి అమ్మంటే బిడ్డల్ని కనేయడమే కాదు. భారతీయ సంస్కృతిని నేర్పాలి. మనల్నిమనం సంస్కరించుకోవడంతో పాటు ఇతరుల బాగోగులు పట్టించుకోవాలి. మాటసాయం, చదువుకి సహకరించడం, వైద్యం అందించడం...ఇవీ సేవలంటే. నాకిపుడు 85 ఏళ్లు వచ్చినా ప్రజలు ఇంటికొచ్చి మరీ పలకరిస్తుంటారు. ఇంతకంటే ఏం కావాలి. -డాక్టర్ మంగమ్మ -
ఇద్దరు మహిళా దొంగల అరెస్ట్
మదనపల్లె: బస్సుల్లో ప్రయాణిస్తున్నవారితో పరిచయం చేసుకొని చాకచక్యంగా వారి వద్ద నుంచి బ్యాగులను దొంగలించడంతో పాటు బంగారు దుకాణాలకు కొనుగోలు దారులుగా వెళ్లి యజమాని దృష్టి మరల్చి చోరీలను పాల్పడుతున్న ఇద్దరు మహిళా దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లె పోలీసులు శనివారం వారిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 2 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని కలికిరి గ్రామానికి చెందిన రాణి(30) మంగమ్మ(50) అనే ఇద్దరు మహిళలు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. -
అతడిపై పది కేసులు..!
5న ఔటర్‌పై ప్రమాదంలో మృతి ఆ వ్యక్తిపై 10 కేసులున్నట్లు పోలీసుల వెల్లడి చీటింగ్, యువతులను నమ్మించి పెళ్లి చేసుకోవడం వెంకట్రావు ప్రవృత్తి.. శంషాబాద్ రూరల్: పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలను మాయమాటలతో వలలో వేసుకోవడం.. ఆ తర్వాత మోసం చేయడం అతని ప్రవృత్తి.. ఈ నెల 5న తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అతని పూర్తి వివరాలను పోలీసులు మంగళవారం వెల్లడిం చారు. సీఐ ఉమామహేశ్వర్రావు తెలిపిన వివరాలు .. ప్రకాశం జిల్లా కొండేపి మండలం దాసరిపాలెంకు చెందిన గుడిపాటి వెంకట్రావు(36) అలియాస్ చంద్రశేఖర్‌రెడ్డి అలియాస్ చందుకు 18 ఏళ్ల కిందట తన అక్క రమణమ్మ కూతురు మంగమ్మతో పెళ్లి జరిగింది. ఇతనికి ఇద్దరు కుమారులు. 11 ఏళ్ల కిందట భార్యా,పిల్లలను వదిలేసి వచ్చాడు. జల్సాలకు అలవాటు పడిన వెంకట్రావు డబ్బున్న వారితో పరిచయాలు పెంచుకోవడం, వ్యాపారంలో భాగస్వాములు కావాలని చెప్పి వారి నుంచి డబ్బులు కాజేయడం హాబీగా పెట్టుకున్నాడు. అంతేకాదు పేదింటి యువతులను మాయ మాటలతో తన వలలో వేసుకునేవాడు. యువతి కుటుంబాన్ని తీసుకుని తీర్థ యాత్రలకు వెళ్లి వారికి తనపై మంచి అభిప్రాయం ఏర్పడేలా నమ్మిస్తాడు. తర్వాత యువతిని పెళ్లి చేసుకుని కొన్నాళ్లు సంసారం సాగిస్తాడు. తర్వాత మరో యువతిని వలలో వేసుకుంటాడు. ఇలా యువతులను ప్రలోభపెట్టి వ ంచించడం వంటి 10 కేసుల్లో వెంకట్రావు నిందితుడు. ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, కడప, గుంటూరు ప్రాంతాల్లో ఇతనిపై కేసులు ఉన్నాయి. 2005లో ఒంగోలులో మొదటి సారి ఇతనిపై కేసు నమోదయింది. పోలీసుల కళ్లుగప్పి.. ఓ కేసులో ఈ ఏడాది జూలై 1న కడప సెంట్రల్ జైలు నుంచి ఇతన్ని ఒంగోలు కోర్టుకు తీసుకెళ్తున్నారు. కడప బస్టాప్‌లో పోలీసుల కళ్లుగప్పి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఈ సంఘటనలో నలుగురు ఆర్మ్డ్ రిజర్వు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సంజీవ రావు, తులసి దంపతులను ఓ సారి బస్సులో ప్రయాణిస్తూ పరిచయం చేసుకున్నాడు. రాజమండ్రిలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వామ్యం కావాలని, అందుకు డబ్బులు తీసుకుని రావాలని ఈ ఏడాది సెప్టెంబరు 18న ఈ దంపతులను అక్కడికి రప్పించాడు. అక్కడ వారిని బెదిరించి తులసి వద్ద బంగారు నగలు, వారి షిఫ్ట్ కారు ఏపీ 04- ఏఆర్ 9015( ఔటర్‌పై ప్రమాదానికి గురైన కారు)ను లాక్కున్నాడు. దీంతో తులసి రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదు అయింది. ప్రమాదానికి ముందు.. ఔటర్‌పై జరిగిన ప్రమాదానికి ముందు ఇతను ఓ అమ్మాయిని మాయమాటలతో నమ్మించి తనతో పెట్టుకున్నాడు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు ప్రాంతంలోని తిరుపతమ్మ ఆలయం వద్ద ఉండే ఉపాధ్యాయుడు నాగేశ్వర్రావుకు కొన్ని గదులు ఉన్నాయి. వెంకట్రావు ఈ ఆలయానికి తరచూ వచ్చేవాడు. ఈ క్రమంలో అతను నాగేశ్వర్రావుకు చెందిన గదుల్లో అద్దెకు ఉండేవాడు. అతనితో పరిచయం పెంచుకున్న వెంకట్రావు షిరిడి టూర్ ప్లాన్ చేశాడు. సంజీవరావు నుంచి లాక్కున్న షిఫ్ట్ కారు నంబరును ఏపీ 20-ఏఆర్ 5959గా మార్చాడు. నాగేశ్వర్రావుతో పాటు అతని భార్య సురేఖ, కూతురు సుశ్వేత, మేన కోడలు రత్నకుమారి, తనతో ఉండే యువతిని తీసుకుని వెంకట్రావు ఈ నెల 2న ఇదే కారులో షిరిడి వెళ్లాడు. అక్కడి నుంచి 4న తిరుగు ప్రయాణంలో పెనుగంచిప్రోలు వెళ్లడానికి శంషాబాద్‌లోని ఔటర్ మీదుగా వస్తున్నారు. 5న తెల్లవారుజామున పెద్దగోల్కొండ వద్ద ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొంది. డ్రైవింగ్ చేస్తున్న వెంకట్రావు తీవ్ర గాయాలై సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న శంషాబాద్ పోలీసులు మృతుడి వివరాలను సేకరించారు. ఈ నెల 6న అతని మృతదేహాన్ని అక్క రమణమ్మకు అప్పగించారు. అనంతరం దర్యాప్తు జరపగా కడప జైలులోని రికార్డుల్లో నమోదైన ఆనవాళ్ల ఆధారంగా మృతదేహం వెంకట్రావుదని నిర్ధారించారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
మల్లారెడ్డిగూడెం(మేళ్లచెర్వు) :ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించేందుకు మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న దంపతులను లారీ రూపంలో మృత్యువు కబళించింది. మండలంలోని జోగుకుంట సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. స్థాని కులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన మోర్తాల గోవిందరెడ్డి, మంగమ్మ దంపతులు మిర్యాలగూడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మంగమ్మ తండ్రిని పరామర్శించేందుకు ఉదయం ఇంటి నుంచి తమ మోటార్‌సైకిల్‌పై బయలుదేరారు. మండల పరిధిలోని జోగుకుం ట సమీపంలోకి రాగానే ఎదురుగా వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో గోవిందరెడ్డి(48) అక్కడికక్కడే మృతిచెందగా, మంగమ్మ(44)కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే మంగమ్మను 108 వాహనంలో కోదాడ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెం దింది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రులు ప్రమాదంలో మృతిచెదడంతో వారిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. మృతుల ఇంటివద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అంతకుముందు విషయం తెలుసుకుని ఘటన స్థలాన్ని ఎస్ఐ సుమన్ పరిశీలిం చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని అదుపులోకి తీసుకుని డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మహిళ సజీవదహనం
తిరుమలంపాలెం(ద్వారకాతిరుమల), న్యూస్‌లైన్ : ఇంట్లో వంట చేస్తూ కాసేపు మంచంపై విశ్రమించిన మహిళను ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయి. రక్షించండంటూ ఆమె కేకలు పెడుతున్నా.. మంటలు చుట్టూ వ్యాపించడంతో ఇంట్లోకి వెళ్లేందుకు ఎవరూ సాహసించక ఆమె సజీవ దహనమైంది. ఈ ఘటన బుధవారం ఉదయం ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుమలంపాలెంకు చెందిన మేకల మంగమ్మ(45) భర్త ఏడేళ్ల క్రితమే చనిపోవడంతో తల్లితో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. 20 ఏళ్ల క్రితం ఆమెకు గ్రామానికి చెందిన ఈరుళ్లుతో వివాహం కాగా ఏడాదికే విడాకులు పొందారు. అనంతరం ఏలూరు సమీపంలోని మాదేపల్లికి చెందిన కాశితో ఆమెకు పెళ్లైంది. వీరికి పిల్లలు లేరు. ఏడేళ్ల క్రితం కాశి మృతిచెందగా తిరిగి ఆమె తిరుమలంపాలెంలోని పుట్టిం టికి చేరుకుంది. ఏడాది క్రితం తండ్రి రుద్రబోయిన రెడ్డియ్య అనారోగ్యంతో మృతిచెందడంతో తల్లి గంగమ్మతో కలిసి ఉంటోంది. బుధవారం ఉద యం 6.30 గంటల సమయంలో తల్లిని గ్రామంలోనే ఉంటున్న మృతురాలి సోదరి నెరుసు ఉల్లూరు ఇంటికి పంపి గురువారం బలివే వెళదామని చెప్పి రమ్మంది. తల్లి వెళ్లగానే 7 గంటల సమయంలో మంగమ్మ వంట చేస్తూ.. మంచంపై కాసేపు విశ్రమించింది. కొద్ది నిమిషాల్లోనే మంటలు తాటాకింటికి చుట్టూ వ్యాపించడంతో బయటకు రాలేని పరిస్థితిలో ఆమె సజీవ దహనమైంది. ఎస్సై కర్రి సతీష్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పొయ్యిలో నిప్పురవ్వలు ఎగసిపడటంతో ప్రమాదం జరిగిందా.. లేక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా అన్నది తెలియరాలేదు. -
మాస్టారు క్లాసే మలుపు తిప్పింది
ఖమ్మం జిల్లా కొత్తగూడెం సమీపంలోని సర్వారం మా సొంతూరు. నాన్న బద్రు, అమ్మ మంగమ్మ. ఎనిమిది సంతానంలో నేనే పెద్ద. మాది పేద కుటుంబం. వ్యవసాయమే ప్రధాన వృత్తి కావడంతో అమ్మనాన్నలకు చేదోడువాదోడుగా పొలం పనులు చేసే వాడిని. అరక దున్నడం, మోట కొట్టడం, చేనుకు నీళ్లు పెట్టడం చేసేవాణ్ని. పస్తులైనా ఉంటాం కానీ చదువు మానొద్దన్నారు.. సర్వారంలోనే 3వ తరగతి వరకు చదివా. ఆ తర్వాత కొత్తగూడెంలోని సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్లో చేరా. రోజు 4కి.మీ. నడిచి బడికి వెళ్లేవాడిని. ఏడో తరగతి వరకు అక్కడే చదివా. ఆ తర్వాత... చదువు మానేద్దామనే ఆలోచన వచ్చింది. తల్లిదండ్రులు క ష్టపడుతున్న తీరు నన్ను కలచివేసింది. చదువు ఆపేసి వారికి ఆసరాగా నిలుద్దామని నిర్ణయించుకున్నా. ఈ విషయాన్ని అమ్మనాన్నకు చెప్పాను. ‘మేం మూడు పూటలు పస్తులుండైనా నిన్ను చదివిస్తాం. కానీ నీవు మాత్రం చదువు ఆపకూడద’ని తేల్చి చెప్పారు. ప్రాథమిక విద్యనభ్యసించినవారికీ చదువు విలువ తెలుసు. తమలా నీవు కష్టపడకూడదని... చదువుతోనే సమాజంలో గుర్తింపు ఉంటుందని విడమరిచి చెప్పడంతో వారి మాటను కాదనలేకపోయా. హాస్టల్ బాట పట్టా.. రామవరం ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో పదో తరగతిలో చేరా. అక్కడే హాస్టల్లో ఉంటూ టెన్త్ పూర్తి చేశా. అప్పటివరకు నేను యావరేజి స్టూడెంట్‌నే. పది పూర్తయిందో లేదో మరోసారి చ దువు మానేయ్యాలనే ఆలోచన మదిని తొలిచింది. ఇరుగు పొరుగువారు వారించడంతో పాల్వంచలోని జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్(బైపీసీ)లో చేరా. అప్పటివరకు తెలుగు మాధ్యమంలో చదివిన నేను ఇంటర్లో ఇంగ్లిష్ మీడియం ఎంచుకున్నా. కాలేజీ ప్రిన్సిపాల్ ప్రభావతి మాత్రం ఇంగ్లిష్ మీడియంలో చేర్చుకునేందుకు తొలుత అభ్యంతరం వ్యక్తంచేశారు. బాగా చదువుతానని అంగీకారపత్రాన్ని నాతో రాయించుకొని ఇంగ్లిష్ మీడియంలో చేర్చుకున్నారు. ప్రిన్సిపాల్ ప్రభావతి మేడమ్‌కు ఇచ్చిన మాట ప్రకారం ఇంటర్లో ప్రతిభ చాటా. ప్రభాకర్‌రావు మాస్టారు క్లాస్‌తోనే.. ఇంటర్లో ఉన్నప్పుడు ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. టెన్త్ ఉత్తీర్ణుడిని కాగానే ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో నిరుద్యోగిగా పేరు నమోదు చేయించుకున్నా. సింగరేణికాలరీస్లో మజ్దూర్ కొలువు కోసం కాల్ లెటర్ వచ్చింది. ఇంకేం ఇంటర్వ్యూకు బయలుదేరా. నా అదృష్టం బాగుండి ఆ ఇంటర్వ్యూ వాయిదా పడింది. ఈ విషయం మా బాటనీ లెక్చరర్ ప్రభాకర్‌రావుకు తెలిసింది. ఆయన నాకు తీసుకున్న క్లాస్ నా జీవితాన్నే మలుపు తిప్పింది. ‘అక్షరజ్ఞానం లేని వారు కూడా కూలీ ఉద్యోగానికి వెళ్లొచ్చు. చదువుకునేవారే వెళ్లక్కర్లలేదు. హాయిగా చదువుకొని డాక్టరయ్యేందుకు ప్రయత్నించు’ అని ఆయన చెప్పిన మాటలు నాలో కసిని పెంచాయి. అమ్మకిచ్చిన మాట కోసం.. అధ్యాపకుడి ప్రేరణతో అప్పటివరకు యావరేజి స్టూడెంట్‌గా ఉన్న నేను కాలేజీలో టాపర్‌గా మారాను. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఐఏఆర్ఐలో ఎమ్మెస్సీ చేశా. కస్టమ్స్ ఆఫీసర్, డీఎస్పీగా ఉద్యోగాలు వచ్చినా... నా చూపంతా కలెక్టర్ పోస్టుపైనే ఉండేది. అమ్మానాన్నల కోరిక కూడా అదే. అమ్మకిచ్చిన మాట ప్రకారం సివిల్స్‌కు ప్రిపేరయ్యా. మొదటిసారే ఐఆర్‌టీఎస్‌కు సెలెక్టయ్యా. ఈ పోస్టుతో ప్రజలకు సేవ చేసే వీలుండదని భావించి గ్రూప్-1 రాశా. డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యా. పొదుపు విప్లవం సృష్టించాం.. క ర్నూలు జిల్లా ఆదోనిలో ఆర్డీవోగా తొలి పోస్టింగ్. ఆ తర్వాత పశ్చిమగోదావరిలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా... నల్గొండ జిల్లాలో డీఆర్వో, డ్వామా పీడీ, డీఆర్డీఏ పీడీ, సహాయ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ, నా సర్వీసులో తృప్తినిచ్చింది మాత్రం పశ్చిమగోదావరి, నల్గొండ జిల్లాల్లో పనిచేస్తున్నప్పుడే. పొదుపు సంఘాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. పావలా వడ్డీ పథకంపై మహిళలను సంఘటితం చేశాం. ఇది జాతీయ స్థాయిలో నాకు పేరు తెచ్చిపెట్టింది. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా పురస్కారం లభించింది. ఇది మరిచిపోలేని అనుభవం. ఇష్టమైన ప్రదేశం.. నాకు నచ్చిన హాలీడే స్పాట్ కులు మనాలీ, కాశ్మీర్. సెలవులొస్తే శీతల ప్రాంతాల్లో సేద తీరేందుకు ఇష్టపడతా. వీలున్నప్పుడల్లా సొంతూరు సర్వారం వెళ్లి వస్తా. ఆదివారాల్లో కొద్ది సమయం చిత్ర లేఖనానికి కేటాయిస్తా. యువతకిదే నా సందేశం.. మా రోజులు సౌకర్యాల్లేవు. అవకాశాల గురించి చెప్పే నాథుడేలేరు. ఇప్పుడు అన్నీ మన ముంగిట్లోకి వచ్చాయి. యువతలో పోటీతత్వం కూడా పెరిగింది. అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగితే విజయాలు మన సొంతమవుతాయి. టెన్షన్‌కు గురికాకుండా లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయండి. గమ్యాన్ని సులువుగా చేరుకోవచ్చు. కళలంటే ప్రాణం.. నటన అంటే ఇష్టం. స్కూల్‌డేస్ నుంచే స్టేజిపై నాటకాలు ప్రదర్శించా. ఢిల్లీ తెలుగు సంఘం ఆధ్వర్యంలో పలు ప్రదర్శనలిచ్చా. కేవలం నాటకాలే కాదు సినిమా రంగంలోనే ప్రవేశం ఉంది. స్నేహితుడా, శౌర్యం తదితర సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేశా. ప్రభుత్వ అధికారిని కావడంతో పరిమితులు దాటకుండా వెండితెరపై నటించా. నా హాబీ కేవలం యాక్టింగ్‌కే పరిమితం కాలేదు. పాటలు కూడా అద్భుతంగా పాడుతా. పలు ఈవెంట్లలోనూ పాడాను. మిమిక్రీ కూడా చేస్తానండి! నా ఫ్యామిలీ.. భార్య కళావతి సివిల్ సర్జన్. ఇలా నేను డాక్టర్ కాలేదన్న కోరిక నెరవేరింది. కూతురు సోనిక, కుమారుడు అభిలాష్. సోనిక బెంగళూరులో బహుళ జాతి సంస్థలో పనిచేస్తుండగా.. కుమారుడు అక్కడే ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నారు.