అప్పుడే పుట్టిన మగ శిశువును నిర్దాక్షిణ్యంగా ముళ్లపొదల్లో పడేసి వెళ్లారు.
అప్పుడే పుట్టిన మగ శిశువును నిర్దాక్షిణ్యంగా ముళ్లపొదల్లో పడేసి వెళ్లారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్టూరు మండలం తాటివారిపాలెంలో జరిగింది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో శనివారం అర్ధరాత్రి శిశువు ఏడుపు వినిపించడంతో కాలనీకి చెందిన తొట్టెంపూడి ముక్కోటి, మంగమ్మ దంపతులు ఇంటి పరిసరాల్లో గాలించగా ముళ్లపొదల్లో పసివాడు కనిపించాడు. శిశువును ఆదివారం ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం చిలకలూరిపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. తమకు 25 సంవత్సరాలుగా సంతానం లేదని, ఈ బిడ్డ తమకు దేవుడిచ్చిన వరమని తామే పెంచుకుంటామని ఆ దంపతులు తెలిపారు.