ఫైల్ ఫోటో
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాల్మీకి మంగమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ల స్క్రూటినీ కార్యక్రమం జరిగింది. టీడీపీ నేత వేలూరు రంగయ్య దాఖలు చేసిన నామినేషన్‌లో సరైన వివరాలు, డాక్యూమెంట్లు లేకపోవడంతో ఆయన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.
దీంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి వాల్మీకి మంగమ్మ నామినేషన్ ఒక్కటే ఉండటంతో ఆమె ఏకగ్రీవం లాంఛనం కానుంది. వాల్మీకి మంగమ్మ కు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంతపురం జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పైలా నరసింహయ్య శుభాకాంక్షలు తెలిపారు. వెనుకబడిన వర్గానికి చెందిన తనకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment