అనంతపురం: హిందూపురం పార్లమెంట్ మాజీ సభ్యులు దివంగత సానిపల్లి గంగాధర్ సతీమణి సానిపల్లి మంగమ్మకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ స్థానం కేటాయించింది. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆమె పేరు ప్రకటించారు. దీంతో మంగమ్మ కుటుంబీకులు, సన్నిహితులు, వాలీ్మకి కులస్తులు, వైఎసార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.
మంగమ్మ కుటుంబ నేపథ్యం..
కళ్యాణదుర్గం మండలం శీబావి గ్రామానికి చెందిన మంగమ్మది సాధారణ మధ్య తరగతి కుటుంబం. 1979లో పెనుకొండ మండలం మునిమడుగు గ్రామానికి చెందిన సానిపల్లి గంగాధర్‌తో వివాహమైంది. గంగాధర్ 1987లో గుట్టూరు సింగిల్‌విండో అధ్యక్షులుగా పని చేశారు. అప్పటికే యంగ్ ఇండియా సంస్థలో క్రియాశీలకంగా పనిచేసిన గంగాధర్ రాజకీయ చైతన్యాన్ని ఆ సంస్థ అధ్యక్షుడు బేడీ గుర్తించారు. రాజీవ్‌గాందీతో మాట్లాడి 1989లో హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇప్పించారు. అప్పట్లో ఎంపీగా గెలిచిన గంగాధర్... పార్లమెంట్ మధ్యలోనే రద్దవడంతో సభ్యత్వాన్ని కోల్పోయారు.
మళ్లీ 1991 నుంచి 1996 ప్రారంభం వరకు ఎంపీగా కొనసాగారు. 1996లో రామచంద్రారెడ్డి చేతిలో ఓటమి చవి చూశారు. 1998లో అదే రామచంద్రారెడ్డిపై గెలిచారు. ఆతర్వాత ఏడాదికే అంటే 1999లో వచ్చిన ఎన్నికల్లో బీకే పార్థసారథి చేతిలో ఓడిపోయారు. అనంతరం గంగాధర్ అనారోగ్యంతో మరణించారు. ఆయన సతీమణి సానిపల్లి మంగమ్మ తమకు రాజకీయంగా అండగా నిలిచిన వైఎస్ రాజశేఖరరెడ్డి వెంట నడిచారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీలో చేరి పెనుకొండ నియోజకవర్గ సమన్వయ కర్తగా, సీఈసీ సభ్యులుగా వైఎస్సార్ సీపీ అభివృద్ధికి పాటుపడ్డారు. నమ్ముకుని వెంట నడిచిందుకు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఏకంగా ఎమ్మెల్సీ సీటు కేటాయించడంతో మంగమ్మ కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.
స్వగ్రామంలో సంబరాలు
కళ్యాణదుర్గం: మంగమ్మను స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యరి్థగా ప్రకటించగానే ఆమె స్వగ్రామం కళ్యాణదుర్గం మండలం శీబావిలో సంబరాలు అంబరాన్నంటాయి. కుటుంబ సభ్యులు రామచంద్ర, మల్లరాయుడు, శివాజీ, అశోక్, సర్వోత్తమలతో పాటు స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు గోళ్ల మోహన్‌రెడ్డి, కో ఆప్షన్ అబ్దుల్ రెహమాన్, తిప్పే‹Ù, రామాంజి, వడ్డే రామాంజి, నాగేంద్ర, తిమ్మప్ప, పోతే‹Ù, ప్లహ్లాద తదితరులు అనంతపురం ప్రధాన రహదారిపై బాణాసంచా పేల్చారు. స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. తమ ఆడపడుచుకు సముచిత స్థానం కల్పించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బీ–ఫారం అందుకునేందుకు తన సోదరి మంగమ్మతో కలిసి అశ్వర్థ, స్థానికులు విజయవాడకు బయలుదేరి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment