షిరిడీలో రోడ్డు ప్రమాదం | Road accident in Shirdi | Sakshi
Sakshi News home page

షిరిడీలో రోడ్డు ప్రమాదం

Published Mon, Jun 5 2017 2:08 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

షిరిడీలో రోడ్డు ప్రమాదం - Sakshi

షిరిడీలో రోడ్డు ప్రమాదం

ఇద్దరు నల్లగొండ జిల్లా వాసుల మృతి
మర్రిగూడ: షిరిడీలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు.మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రైల్వేస్టేషన్‌ నుంచి వారు ఆటోలో ఆలయానికి వెళుతుండగా లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

నల్లగొం డ, మర్రిగూడ, నిడమనూరులకు చెందిన మూడు కుటుంబాలు (14మంది) శనివారం షిరిడీకి వెళ్లారు. అక్కడ రైలు దిగి షేరింగ్‌ ఆటో లో ఆలయానికి బయలు దేరారు. ఎదురుగా వచ్చిన లారీ.. ఆటోను ఢీకొనడంతో మర్రిగూ డ లెంకలపల్లికి చెందిన మంగమ్మ(55), నల్లగొండ వెలుగుపల్లికి చెందిన వెంకటమ్మ (35)లు అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలి నవారికి గాయాలయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement