venkatamma
-
మద్యానికి బానిసలై అమ్మలనే చంపేశారు
గండేడ్/ మహమ్మదాబాద్/త్రిపురారం: మద్యానికి బానిసలై కన్న తల్లులనే కడతేర్చారు ఆ కుమారులు. మద్యానికి డబ్బులు ఇవ్వడం లేదన్న కోపంతో ఒకరు, తనకు విడాకులిచ్చిన యువతి మళ్లీ పెళ్లి చేసుకుంటే కుటుంబ సభ్యులు ఆ వేడుకకు వెళ్లారన్న కక్షతో మరో వ్యక్తి మద్యం మత్తులో విచక్షణ మరచి.. జన్మనిచ్చి న అమ్మలనే చంపుకున్నారు. రాడ్డుతో తలపై కొట్టి, కత్తితో గొంతుకోసి.. మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్ మండలం సల్కర్‌పేట్‌కు చెందిన వెంకటమ్మ(55), కోయిల్‌కొండ మండలం కొత్లాబాద్‌కు చెందిన టంకర రాములు పెళ్లయిన తర్వాత ముంబైకి వలస వెళ్లారు. ఈ క్రమంలో కొంతకాలం తర్వాత రాములు మృతిచెందాడు. దీంతో ఆమె కుమారుడు కృష్ణయ్యతో కలసి అక్కడే ఉంటూ మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగించేది. రెండేళ్ల క్రితం అక్కడ ఇంటిని అమ్ముకుని పుట్టినిల్లయిన సల్కర్‌పేట్‌కు చేరుకుంది. అయితే ఆమె కుమారుడు కృష్ణయ్య మద్యానికి బానిసయ్యాడు. మద్యానికి డబ్బుల కోసం తల్లిని వేధించడంతోపాటు ఇల్లు అమ్మిన డబ్బులు ఎక్కడ పెట్టావని నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మద్యానికి డబ్బులు ఇవ్వకపోవడంతో కోపంతో కృష్ణయ్య ఇనుపరాడ్డుతో వెంకటమ్మ తలపై కొట్టాడు. అంతటితో ఆగక కత్తి తీసుకొని గొంతుకోయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లి ఇంటి కొద్దిదూరంలో పడేశాడు. ఆదివారం తెల్లవారుజామున తన మేనమామ రాములుకు ఫోన్ చేసి అమ్మ చనిపోయిందని, ఎవరో చంపేశారని చెప్పా డు. దీంతో రాములు పోలీసులకు సమాచారం అందించారు. డీఎ స్పీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతదేహం పడేసిన ప్రదేశం నుంచి కొద్ది దూరం వరకు గడ్డిపై రక్తం పడి ఉండడంతో, అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూశారు. ఇల్లు కడిగి ఉండడంతో అనుమానం వచ్చి కృష్ణయ్యను గట్టిగా నిలదీయగా డబ్బుల కోసం తానే తల్లిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తల్లిని గొంతుకోసి చంపి, కొడుకు ఆత్మహత్య నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రానికి చెందిన రావిరాల చినవీరయ్య, సాయమ్మ భార్యాభర్తలు. వీరికి శ్రీను, శివకుమార్ అనే కుమారులు, పద్మ అనే కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు శివకుమార్ తల్లిదండ్రుల వద్దే ఉంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాగా, శివకుమార్‌కు అక్క పద్మ కుమార్తె మేఘనతో వివాహం జరిగింది. మద్యానికి బానిసైన శివకుమార్ తరచూ భార్యతో గొడవ పడుతుండడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఇటీవల వీరు విడాకులు తీసుకున్నారు. కాగా, మేఘనకు శనివారం హైదరాబాద్‌లో రెండో వివాహం జరిపించారు. ఈ పెళ్లికి తండ్రి, అన్న హాజరుకావడంతో ఆగ్రహానికి గురైన శివకు మార్ రాత్రి బాగా మద్యం సేవించి ఇంటికి వెళ్లి తల్లితో గొడవ పడ్డాడు.తర్వాత తల్లి నిద్రిస్తుండగా.. కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం భయపడి శివకుమార్ కూడా కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం చినవీరయ్య ఇంటికి తిరిగివచ్చేసరికి భార్య, కుమారుడు రక్తపుమడుగులో పడి ఉండటం గమనించాడు. వీరయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
లాడ్జీలో వివాహిత హత్య! ఆధార్‌కార్డు తీసుకొస్తానని హంతకుడు పరార్!!
రాజన్న: వేములవాడలోని జాతరగ్రౌండ్‌లోని ఓ ప్రైవేట్ లాడ్జీలో ఆదివారం వివాహిత సద్గుల వెంకటవ్వ(46) హత్యకు గురైంది. వివరాలు వేములవాడటౌన్ సీఐ కరుణాకర్ తెలిపిన వివరాలు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌కు చెందిన వెంకటవ్వ వివాహం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటకు చెందిన రాములుతో 20 ఏళ్ల క్రితం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. రెండు రోజుల క్రితం వెంకటవ్వ ఇంటి నుంచి వెళ్లినట్లు భర్త రాములు పోలీసులకు తెలిపారు. భర్త రాములు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. అద్దె గదిలో వివస్త్రగా.. వేములవాడలోని ఓ ప్రైవేట్ లాడ్జీలో శనివారం రాత్రి వెంకటవ్వ పేరుతో గదిని అద్దెకు తీసుకున్నారు. గదిలో వెంకటవ్వతోపాటు మరో వ్యక్తి ఉన్నట్లు లాడ్జీ యజమాని తెలిపారు. అదే రోజు రాత్రి అర్ధరాత్రి సదరు వ్యక్తి లాడ్జీ నుంచి వెళ్లిపోయినట్లు సీసీ కెమెరా ఫుటేజీల్లో రికార్డ్ అయ్యింది. అయితే ఆధార్‌కార్డు ఇవ్వాలని లాడ్జీ యజమాని కోరడంతో తీసుకొస్తానని చెప్పి వెళ్లిన సదరు వ్యక్తి తిరిగిరాలేదు. అనుమానం వచ్చిన లాడ్జీ యజమాని ఆదివారం సాయంత్రం ఆ గదిని పరిశీలించగా.. బెడ్‌పై వెంకటవ్వ శవమై కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వేములవాడటౌన్ సీఐ కరుణాకర్, ఎస్సై రమేశ్ అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. అనుమానితుడి ఫొటో విడుదల.. వేములవాడ ప్రైవేట్ లాడ్జీలో వెంకటవ్వ హత్యకేసులో అనుమానితుడిగా పేర్కొంటున్న వ్యక్తి ఫొటోను పోలీసులు ఆదివారం విడుదల చేశారు. ఆచూకీ తెలిసినవారు వేములవాడ ఠాణా 87126 56413 నంబర్లో సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు. -
TS Crime News: సొంత తల్లినే.. మరొకరితో కలిసి గొంతు కోసి, కాళ్లు నరికేసి.. హత్య!
సంగారెడ్డి: మానవత్వం మంటగలిసింది. మాతృప్రేమ, అప్యాయత అనురాగాలు పంచే కన్నతల్లి పెళ్లి చేయడం లేదనే కోపంతో కొడుకే కాలయముడయ్యాడు. మరొకరితో కలిసి గొంతు కోసి, కాళ్లు నరికేసి కిరాతకంగా హతమార్చాడు. ఈ దారుణ ఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండ మైలారంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత (తెల్లారితే గురువారం) జరిగింది. పది గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించి నిందితులిద్దరినీ జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి వివరాలను గురువారం గజ్వేల్ రూరల్ సీఐ జానకిరాంరెడ్డి, ములుగు ఎస్సై విజయకుమార్ వెల్లడించారు. బండ మైలారం గ్రామానికి చెందిన మిరియాల వెంకటమ్మ(45) భర్త చనిపోగా, చిన్న దుకాణం నడుపుతూ కొడుకు ఈశ్వర్(23)తో కలిసి ఉంటుంది. కూతురు శైలజకు వివాహమైంది. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత గుర్తు తెలియని వ్యక్తులు వెంకటమ్మను హత్యచేశారని కూతురు శైలజకు చిన్నమ్మ ఫోన్‌చేసి చెప్పింది. అక్కడికి చేరుకున్న కూతురు మెడ కోసి, రెండు కాళ్లు నరికేసిన స్థితిలో విగతజీవిగా పడిఉన్న తల్లి మృతదేహాన్ని చూసి బోరుమన్నది. తల్లిని హతమార్చి కాళ్లకున్న వెండి కడియాలు దొంగలించుకుపోయారని ఆమె ములుగు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లితో తరచూ గొడవపడే సోదరుడు ఈశ్వర్, సమీప బంధువు పర్వతం రాము(21)తో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎస్సై విజయ్‌కుమార్ కేసు నమోదు చేయగా రూరల్ సీఐ జానకిరాంరెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. అనుమానితులైన ఈశ్వర్, రాములను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తనకు పెళ్లి చేయడం లేదనే కారణంతోనే కొత్తూరుకు చెందిన రాముతో కలిసి తల్లిని హత్యచేశానని, ఎవరికీ అనుమానం రాకూడదనే కాళ్లు నరికి వెండి కడియాలు దొంగిలించామని ఈశ్వర్ నేరం అంగీకరించాడు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, కాళ్ల కడియాలు స్వాధీనం చేసుకుని కోర్టులో రిమాండ్ చేశామని రూరల్ సీఐ పేర్కొన్నారు. -
‘కరోనా’ అనుమానం.. రోడ్డున పడిన మృతదేహం
ధారూరు/యాలాల: కరోనా.. మనుషుల్లోని మానవత్వాన్ని చంపేస్తోంది. వైరస్ సోకిందంటేనే బాధితులకు ఆమడదూరం పారిపోతున్న మనుషులు.. ఇక, మరణాల విషయంలో కనికరమే చూపట్లేదు. సోమవారం వికారాబాద్ జిల్లా ధారూరు మండలం కెరెళ్లి వద్ద జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. గొం తుపై ఏర్పడిన కణితితో బాధపడుతూ ఓ మహిళ బస్సులో కుప్పకూలి చనిపోయింది. కరోనాతోనే చనిపోయిందనే అనుమానంతో ఆమె మృతదేహాన్ని ఉన్నపళంగా రోడ్డుపై దించేసి డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులు వెళ్లిపోయారు. కరోనా భయంతోనే.. యాలాల మండలం కిష్టాపూర్‌కు చెందిన గడ్డం చిన్న ఆశప్ప భార్య వెంకటమ్మ (40) గొంతుపై కొన్నేళ్లుగా కణితి పెరుగుతోంది. శ్వాస తీసుకునేందుకు, భోజనం చేసేటపుడు ఇబ్బందిపడేది. కొన్ని రోజుల క్రితం ఆమెకు నగరంలోని బసవతారకం ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. అంతకుముందు కరోనా పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది. గొంతు వద్ద కణితి తొలగించేందుకు రూ.2 లక్షలు అవుతాయని వైద్యులు తెలిపారు. దీంతో భార్యను కాపాడుకోవడానికి ఆశప్ప తనకున్న మూడెకరాల్లో ఎకరం అమ్మి ఆపరేషన్ చేయించాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం తెలిసిన వారి వద్ద కొంత అప్పు తీసుకొని ఆశప్ప, వెంకటమ్మ తమ ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆర్టీసీ బస్సులో తాండూరు నుంచి హైదరాబాద్‌కు సోమవారం ఉదయం బయలుదేరారు. 10 గంటలకు ధారూరు దాటాక వెంకటమ్మ శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిపడుతూ చనిపోయింది. కెరెళ్లిలో బస్సు ఆపిన డ్రైవర్, కండక్టర్‌తో పాటు ప్రయాణికులు.. మృతదేహాన్ని కిందకు దించాలన్నారు. తన భార్యకు కరోనా లేదని, గొంతు వద్ద కణితితో చనిపోయిందని ఆశప్ప చెప్పినా వారు వినలేదు. దీంతో మృతదేహాన్ని కిందికి దింపించి వెళ్లిపోయారు. ఆశప్ప రోదిస్తూ విషయాన్ని ఫోన్లో తన అల్లుడితోపాటు కిష్టాపూర్ సర్పంచ్ ప్రవీణ్‌కుమార్‌కు చెప్పాడు. చివరకు ఎలాగో ఓ ఆటో మాట్లాడుకుని మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. రోడ్డు పక్క దిక్కుతోచని స్థితిలో పడి ఉన్న తమ పట్ల ఎవరూ జాలీ, కనికరం చూపలేదని ఆశప్ప విలపిస్తూ చెప్పాడు. -
పూలలో కన్నీరు
మూర పూలకు జానెడు పొట్టకు లంకె. నాలుగు రెక్కలకు నాలుగు వేళ్లకు ముడి. బుట్టనిండా సువాసనే. ఇంట్లో గంజి వాసన కూడా రాదు. పూలమ్మే వాళ్ల జీవితాలు రాళ్లు మోసే వారి కంటే ఘోరంగా ఉన్నాయి. శ్రీరామనవమి పండుగ... ఇళ్లు, గుళ్లు కోలాహలంగా ఉన్నాయి. పూలదండలు వేళ్లాడుతున్నాయి. చుట్టిన దండలు బుట్టల్లో ఉన్నాయి. మరో పక్క విడిపూల గంపలు. గుళ్లో పూజారి మంత్రాలకంటే పూల బుట్టల దగ్గర బేరాలే గట్టిగా వినిపిస్తున్నాయి. ‘‘అవ్వా! రెండు మూరల బంతిపూల దండ ఇస్తావా’’ అన్నాడు వివేక్ ప్యాంట్ బ్యాక్ పాకెట్లో నుంచి పర్సు తీస్తూ. వెంకటమ్మ పూలు మూర కొలిచి వేలిని మెలిపెట్టి తుంచబోతూ ఆగి, ‘‘రెండు మూరలు చాలా నాయనా! దేవుడికా, వాకిలికా’’ అడిగింది. అప్పటికే వివేక్కీ అదే సందేహం... రెండు మూరల బారును చూస్తూ ద్వారబంధానికి సరిపోతుందా, అమ్మను ఎన్ని మూరలని అడగలేదే... అన్నట్లు చూస్తున్నాడు. ‘‘వాకిలికి వేయడానికే’’ అన్నాడు. ‘‘వాకిలికి మూడు మూరలు పడతాయి’’ అని వివేక్ ముఖంలోకి చూస్తూ ఆగింది. ‘‘అలాగే మూడు మూరలివ్వు... ఎంత’’ అడిగాడు వివేక్. ‘‘పాతిక... మూర’’ పాతిక పెద్దగా అంటూ... మూర చిన్నగా పలికింది. మూడు మూరలకూ కలిపి ఏకంగా డెబ్బై అయిదు అంటే పర్సులో డబ్బు పర్సులోనే పెట్టుకుని వెళ్లిపోతాడేమోనని బెరుకు. ‘‘డెబ్బై అయిదు రూపాయలా! బంతిపూలు’’ బంతిపూలు పదాన్ని నొక్కి పలికాడు వివేక్. ‘‘బంతిపువ్వయినా గులాప్పువ్వయినా నా తోటలో పూస్తుందా నాయనా? మార్కెట్లో కొనాలె, దండల్లి అమ్మాలె. అక్కడే కేజీ బంతిపూలు వంద రూపాయిలు పలుకుతున్నాయీరోజు. పండగ గిరాకీ అట్లుంది మరి’’ కన్విన్స్ చేసి కొనిపించాలనే ప్రయత్నం ఆమె మాటల్లో. ‘‘సరే ఇవ్వవ్వా’’ అన్నాడే కానీ వివేక్కి ‘అంత ధర పెట్టి తెచ్చావా, బేరమాడలేదా’ అని అమ్మ కోప్పడుతుందేమోనని భయంగానే ఉంది. ‘‘గులాబీలు ఇవ్వనా’’ వాకిలికి బంతిపూలు వేస్తే దేవుడికి గులాబీలు పెట్టవా? అన్నట్లుందా మాట. ‘‘పది రూపాయలకివ్వు’’ అన్నాడు తనతో తెచ్చిన పెద్ద షాపింగ్ బ్యాగ్ ఓపెన్ చేస్తూ. ‘‘ఈ రోజు పదిరూపాయలకి రావు నాయనా, ఇరవై రూపాయలు, రేపట్నుండి మార్కెట్ అగ్వవుంటది గప్పుడు పదిరూపాయలకిస్తా’’ అంటూ చిన్న పాలిథిన్ కవర్లో గులాబీలు వేసింది. పిల్లాడు గీచి బేరం చేయట్లేదులే అనుకుంటూ మరో గుప్పెడు గులాబీలను అదే కవర్లో కుక్కినట్లు పెట్టింది. ‘‘పూలతోనే బిల్డింగులు కట్టేట్లున్నారు’’ చిరాగ్గా అన్నది ఆ పక్కనే ఉన్న వసంత ఏ బుట్ట దగ్గర ఆగాలో తేల్చుకోలేక అటూ ఇటూ తిరుగుతూ. ‘‘ఈ ఒక్కరోజే వేలాదిరూపాయల వ్యాపారం చేస్తారు. రూపాయి కూడా తగ్గించరు. పండక్కి కొనక చస్తారా అని వాళ్ల ధీమా’’ మరింత విసుగ్గా బదులిచ్చింది మాలతి. వాకిలికి పూలదండ వేసి దేవుడి పటాలన్నింటికీ పూలు అలంకరించాలి, తలలోకి మల్లెలు కొనాలంటే రెండొందలైనా అయ్యేట్లుంది. నిన్న ఆఫీస్ నుంచొస్తూ తెమ్మంటే ఆయనకి పట్టనేలేదు. ఉడికిపోతోంది వసంత. ‘‘అంతేసి మాటెందుకు బిడ్డా! మాకు గిట్టేది మా కష్టమేనమ్మా. ఈ రోజు మార్కెట్లోనే మస్తు గిరాకుంటది. గిట్ల బేరం అడుగుతానికి కూడా ఉండదక్కడ. ఎన్ని కిలోల పూలు కావాలో చెప్పాలె, వాళ్లు చెప్పిన ధరకు తెచ్చుకోవాలె’’ నొచ్చుకుంది వెంకటమ్మ. తమ మాటలు ఆమెను నొప్పించాయని అర్థమైంది మాలతికి. వసంతను మాట్లాడవద్దని గిల్లుతూ ‘‘బంతిపూలు మూర ఇరవైకిస్తావా’’ అన్నది వెంకటమ్మ దృష్టి పూల వైపు మరలడానికి. వసంత మరొక పూల బుట్ట దగ్గరకు నడిచింది. ‘‘అత్తా! ఓ సారి బస్తీలో తిరిగొస్తా, అన్నం పెట్టుకు తిను. పిల్లలొచ్చాక వాళ్లకీ పెట్టు’’ పూల బుట్ట సర్దుకుంటూ అన్నది సుజాత. వెంకటమ్మ గుడి దగ్గర అమ్మగా మిగిలిపోయిన పూలను ఇంటికి తెచ్చింది. ఆ పూలను మళ్లీ వేటికి వాటిని విడిగా సర్దుతోంది సుజాత. ‘‘సర్లేవే సుజాతా, మరీ పొద్దుపోయే దాకా ఉండొద్దు. ఎన్ని అమ్మితే అంతే అమ్మి తొందరగా ఇంటికొచ్చెయ్. బస్తీలో మూలలకెళ్లకు’’ వెంకటమ్మ మాటల్లో భయం. ఆ భయం సుజాతకూ అర్థమవుతోంది. ‘‘అలాగేలే’’ అని బుట్ట చంకన పెట్టుకుని కాలు బయటపెట్టింది. ఎలాగైనా మిగిలిన పూలను రాత్రికి అమ్మకపోతే రేపు కొనేవాళ్లుండరు. గులాబీల రెక్కలు రాలిపోతాయి. బంతిపూలు వాడి ముడుచుకుంటాయి. మూర పదికైనా సరే ఇచ్చేయాలి... అనుకుంటూ వీథిలో నడుస్తూంది. ‘‘అమ్మా! అన్నం తిన్నావా! పిల్లలు తిన్నారా? సుజాత కనిపించదే ఎటెళ్లింది’’ అంటూనే మంచం మీద వాలిపోయాడు యాదగిరి. ‘‘పిల్లలు, నేనూ తిన్నాం కొడకా, సుజాత మిగిలిన పూలు అమ్ముకొత్తానని బస్తీలకెళ్లింది. నువ్వు తిందువు రా మల్లా పొద్దుగాలే మార్కెట్కెళ్లాలె, నీకు నిద్దరుండట్లేదసలే’’ వెంకటమ్మ తల్లి మనసు పడుతున్న తపన. ‘‘సుజాతకు ఎన్ని అమ్ముడుపోతయ్యో ? ఎన్ని పూలు మిగిలి తెస్తదో? రేప్పొద్దున మార్కెట్కెళ్లడానికి ఎన్ని డబ్బులున్నాయమ్మా’’ అంటూ కళ్లు మూసుకున్నాడు. ఇంట్లోకి సుజాత వస్తున్న ఆనవాలుగా పూలవాసన వచ్చింది. యాదగిరిని పూల వాసన తాకింది. అతడి ముక్కుపుటాలు పూల వాసనను గుర్తించడం మానేసి ఎన్నో ఏళ్లయింది. పూలు అందరికీ సువాసననిస్తాయి, పూలతో బతికే వాళ్లకు ఆ వాసనే తెలియదు. ‘‘అమ్మా! ఈ పూలు నేను పెట్టుకుంటా’’ సుజాత తెచ్చిన బుట్టలో నుంచి మల్లెపూల దండ తీసుకున్నది పదేళ్ల లావణ్య. ‘‘పెట్టుకో’’ అంటూ లోపలికెళ్లింది సుజాత. భర్తకు తనకు భోజనాలు వడ్డించుకోవడానికి. కూతురి జడలో పూలు చూస్తే ముచ్చటగానే ఉంది. కానీ ఆ మూర కూడా అమ్ముడైతే పూలు కొన్న డబ్బయినా వచ్చేది. తల్లి ముఖం అభావంగా ఉందని తెలిసే వయసు కాదు లావణ్యది. జడ పొడవునా చుట్టుకున్న మల్లెల దండను జడతోపాటు ముందుకు వేసి బుగ్గకు రాసుకుంటూ సంతోషపడుతోంది. కూతురి సంతోషం చూస్తుంటే... యాదగిరికి నిండుగా విరిసిన పూలతోటను చూసినట్లుంది. ‘‘బిడ్డకు నాలాగ పూలమ్మేవాడు వద్దే సుజాతా, భార్యకు తల నిండా పూలు కొనిపెట్టగలిగినోడితో పెళ్లి చేస్తా’’ అంటూ భోజనానికి కూర్చున్నాడు. సుజాత భోజనం వడ్డిస్తూ యాదగిరి ముఖంలోకి చూసింది ‘మా నాన్న కూడా ఇలాగే అనుకుని ఉంటాడు’ అనుకుందామె మనసులో. పది తిండికి... పది ఇంటికి! మాది మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్. అక్కడ చారెడు పొలం ఉండేది. ఆ తిండి గింజలతో ఏడాదంతా వెళ్లబారేది కాదు. పొలం పనులు చేయడానికి నా మొగునికి ఒంట్లో బలం లేదు. దాంతో హైద్రాబాద్ సిటీకొస్తే తేలిక పనులు చేసుకుని బతకొచ్చనుకున్నాం. మేము సిటీకొచ్చేనాటికి కొడుకు, కూతురు చిన్నపిల్లలు. మేమొచ్చి నలభై ఏళ్లయింది. నా పెనిమిటి మార్కెట్ నుంచి పూలు తెస్తే నేను దండలు కట్టేదాన్ని. రోజూ పొద్దున్నే గుడిమల్కాపూర్ మార్కెట్‌కో, జాంబాగ్ మార్కెట్‌కో పోయి పూలు తెచ్చేటోడు. అప్పట్లో దినాలు బాగానే వెళ్లబారినాయి. ఇప్పుడున్నన్ని ఇంగ్లిష్ పూలు అప్పట్లో లేవు. ఏ పండుగయినా, వేడుకైనా ఈ బంతిపూలు, చేమంతులు, మల్లెలే. ఇప్పుడు అరచెయ్యంత పూలు అక్కడెక్కడో సీమదేశాల్లో పూస్తాయట. మరీ డబ్బున్నోళ్లు ఆ పూలతోనే డెకరేషన్ చేస్తున్రు. మా పూలు పండగలప్పుడే కొంటున్రు. ఈ పూల మీదనే కొడుకుని పదో తరగతి వరకు చదివించినం. కూతురికి పెళ్లి చేసినం. బతుకైతే వెళ్లబారుతోంది. ఇంటద్దెలు కట్టుకుని, నలుగురూ తినాలంటే జరిగే పని కాదని తెలిసింది. ఊర్లో ఉన్న పొలం అమ్మి బోరబండలో 120 గజాల జాగా కొనుక్కున్నాం. అందులో గోడలు లేపి రేకులు దించింనం. ఆ గోడలు లేపి రేకులు వేయడానికి పడిన పాట్లు చిన్నవి కాదు. పూలమ్మిన డబ్బుల్లో పది రూపాయలు ఇంటి కోసం పక్కన పెట్టి, పది రూపాయలు తినడానికి ఖర్చు చేసుకున్నం. కాస్త నిమ్మళించాం అనుకునేంతలో నా పెనిమిటి రాములుకి జబ్బు చేసింది. నాలుగేళ్లయింది క్యాన్సర్‌తో పోయాడు. ఇప్పుడు నా కొడుకు, కోడలు, నేను ముగ్గురం పూలతోనే బతుకుతున్న. రోజుకు మూడు వందలు మిగిలితే ఆ రోజు గుండె నిండినట్లవుతాది. – వెంకటమ్మ, పూలమ్మే మహిళ – వాకా మంజులారెడ్డి -
షిరిడీలో రోడ్డు ప్రమాదం
-
షిరిడీలో రోడ్డు ప్రమాదం
ఇద్దరు నల్లగొండ జిల్లా వాసుల మృతి మర్రిగూడ: షిరిడీలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు.మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రైల్వేస్టేషన్ నుంచి వారు ఆటోలో ఆలయానికి వెళుతుండగా లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. నల్లగొం డ, మర్రిగూడ, నిడమనూరులకు చెందిన మూడు కుటుంబాలు (14మంది) శనివారం షిరిడీకి వెళ్లారు. అక్కడ రైలు దిగి షేరింగ్ ఆటో లో ఆలయానికి బయలు దేరారు. ఎదురుగా వచ్చిన లారీ.. ఆటోను ఢీకొనడంతో మర్రిగూ డ లెంకలపల్లికి చెందిన మంగమ్మ(55), నల్లగొండ వెలుగుపల్లికి చెందిన వెంకటమ్మ (35)లు అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలి నవారికి గాయాలయ్యాయి. -
తుఫాను ఢీకొని మహిళ మృత్యువాత
హైదరాబాద్: సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి సింగరేణి కాలనీ సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ఒక మహిళ చనిపోయింది. చంపాపేట్ సూర్యా నగర్ కాలనీ నుంచి కర్మాన్ ఘాట్‌కు స్కూటీపై వెళ్తున్న వెంకటమ్మ(45) ను వేగంగా వచ్చిన తుఫాను వాహనం ఢీకొనటంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఈ మేరకు తుఫాను వాహన డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
వివాహిత ఆత్మహత్య
కూడేరు : మండల పరిధిలోని ఉదిరిపికొండ తండాలో గురువారం వేకువ జామున వెంకటమ్మ(60) అనే వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ దస్తగిరి తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. వెంకటమ్మకు భర్త రామన్న, కుమారుడు పెన్నోబులేసు , ముగ్గురు కుమార్తెలున్నారు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. అయితే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో మనస్తాపం చెందిన వెంకటమ్మ గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటిపైకప్పుకు తాడుతో ఉరివేసుకుంది. కాసేపటికి ఆమె కోడలు ఇంటికి వచ్చి చూడగా అప్పటికే తాడుకు వేలాడుతూ కన్పించింది. కుటుంబ సభ్యులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
మహిళ ఆత్మహత్య
గుత్తి రూరల్ : కర్నూలు జిల్లా తుగ్గలి మండలం బోడబండ తండాకు చెందిన వెంకటమ్మ(28)అనే మహిళ కడుపునొప్పి తాళలేక గురువారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బోడబండ గ్రామానికి చెందిన వెంకటమ్మ కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధ పడుతుండేది. వైద్యం చేయించినా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కు కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి
పోరుమామిళ్ల: మండలంలోని గానుగపెంటకు చెందిన గోగు వెంకటమ్మ (65)ను మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. గోగు రామ్మూర్తి భార్య వెంకటమ్మ రాత్రి బహిర్భూమికి వెళ్లింది. తిరిగి వచ్చేటప్పుడు వాహనం ఢీ కొనడంతో రోడ్డుపై పడిపోయింది. తల రాయికి తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. 30 ఏళ్లుగా ఆమె గానుగపెంటలో కూతురు దగ్గర ఉంటూ టిఫన్ సెంటర్ నడుపుకుని జీవిస్తున్నట్లు తెలిసింది. ఆమెకు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. అందరికీ వివాహాలయ్యాయి. -
స్కార్పియోను ఢీకొట్టిన బస్సు: మహిళ మృతి
పులిచర్ల: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం కల్లూరులో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పొద్దుటూరు నుంచి చిత్తూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, కనుమ దారిలో చెన్నై విమానాశ్రయం నుంచి వస్తున్న స్కార్పియోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వైఎస్సార్ జిల్లా సుండుపల్లికి చెందిన కోనేటి వెంకటమ్మ(45) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
కర్నూలు జిల్లా రుద్రారం మండలం ఆలమూరులో ఒక యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. గ్రామానికి చెందిన శ్రీరాములు రోగెన్న, పెద్దనాగమ్మ దంపతుల కుమార్తె వెంకటమ్మ(18) ఐదో తరగతి వరకు చదువుకుని, ఇంటి వద్దే ఉంటోంది. తల్లిదండ్రులకు పొలం పనుల్లో సాయపడుతోంది. ఇటీవల ఆమెకు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. ఇదిలాఉండగా, బుధవారం ఆమెను గ్రామానికి చెందిన యువకుడు వేధించాడు. ఈ నేపథ్యంలో ఆమె గ్రామ సమీపంలోని బావిలో మృతదేహమై కనిపించింది. ఈ మేరకు ఆళ్లగడ్డ సీఐ ఓబులేసు సంఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. వెంకటమ్మను ఎవరైనా చంపి బావిలో పడేశారా, లేక ఆత్మహత్యకు పాల్పడిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో తల్లి, కుమార్తె మృతి
దహెగామ్(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దహెగామ్ మండలం కమ్మరపల్లిలో విద్యుదాఘాతానికి గురై తల్లి, కుమార్తె మృతిచెందారు. కమ్మరపల్లికి చెందిన వెంకటమ్మ(35), ఆమె తల్లి పోశక్క(65) ఆదివారం ఉదయం గడ్డి కోసుకొచ్చేందుకు పొలానికి వెళ్లారు. బోరు మోటారుకు బిగించిన కరెంటు వైరు తెగి గడ్డిలో పడిపోయింది. అది గమనించని వెంకటమ్మ కొడవలితో గడ్డి కోస్తుండగా వైరు తగిలి కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. బిడ్డను కాపాడే ప్రయత్నంలో తల్లి పోశక్క కూడా కరెంట్ షాక్‌తో మృతిచెందింది. వెంకటమ్మ భర్త మారుతి 15 రోజుల క్రితమే మృతిచెందాడు. దీంతో కుమార్తెను ఓదార్చేందుకు ఇంటికి వచ్చిన తల్లి కూడా మృతిచెందింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వెంకటమ్మకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులను పోగొట్టుకున్న చిన్నారులు అనాధలయ్యారు. -
చలి తీవ్రతకు వృద్ధురాలి బలి
వరంగల్ జిల్లాలో పెరిగిన చలి తీవ్రతకు ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. మంగపేట మండలం బోరునర్సాపురం గ్రామానికి చెందిన వెంకటమ్మ (80) చలికి తట్టుకోలేక మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. -
కలెక్టర్ ఎదుటే వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం
మహబూబ్‌నగర్: దీర్ఘకాలంగా భూహద్దు సమస్య పరిష్కా రం కావడం లేదని, జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని, కబ్జాదారుల ఆగడాలను భరించలేకపోతున్నామని కలత చెందిన వృద్ధ దంపతులు మహబూబ్‌నగర్ కలెక్టర్ ఎదుటే ఆత్మహత్యకు యత్నిం చారు. బాధితుల కథనం మేరకు.. మద్దూరు మండలం దోరేపల్లికి చెందిన హన్మంత్, వెంకటమ్మ దంపతులకు మూడున్నర ఎకరాల పొలం ఉంది. పక్క పొలానికి చెందిన వ్యక్తి అందులో కొంతభాగాన్ని ఆక్రమించాడు. పొలాన్ని కొలిచి తన భాగాన్ని తనకు ఇప్పించాల్సిందిగా హన్మంత్ నాలుగేళ్లుగా అధికారులకు విన్నవిస్తూ వస్తున్నాడు. పైగా కబ్జాదారుడి వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ ప్రియదర్శినికి తమ సమస్యను చెబుతూనే వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగేందుకు యత్నించారు. అక్కడే ఉన్న సిబ్బంది వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. హన్మంత్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, ఈ ఘటనపై విచారణ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. -
భార్యను కడతేర్చిన భర్త
చిలుకూరు : అనుమానం పెనుభూతమైంది. కల కాలం తోడునీడగా ఉంటూ కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్తే కట్టుకున్న భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటన ఆదివారం చిలుకూరులో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకా రం..చిలుకూరుకు చెందిన దుగ్గెబోయిన శ్రీను అదే గ్రామంలో ఉంటున్న తన అక్క బిడ్డ వెంకటమ్మను (38) వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా కూతురు నాలుగేళ్ల క్రితం మృతి చెందింది. కుమారుడికి ఏడాది క్రితం వివాహం చేశారు. స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న శ్రీను.. కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. అంతేకాకుండా భార్యను అనుమానిస్తుండేవాడు. ఈ క్రమంలో శనివా రం రాత్రి 10 గంటల సమయంలో భార్యతో ఘర్షణ పడ్డాడు. ఆ తర్వాత గొడవ సద్దుమనగడంతో నిద్రకు ఉపక్రమించారు. పక్క గదిలో కుమారుడు నిద్రపోయాడు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో శ్రీను మేల్కొని నిద్రపోతున్న అతని భార్య వెంకటమ్మ మెడపై ఇంట్లో ఉన్న కత్తితో రెండు చోట్ల నరికాడు. దీంతో వెంకటమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. కాసేపటికి నిద్రలేచిన కుమారుడు తల్లి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించాడు. అప్పటికే అతని తండ్రి శ్రీను పరారయ్యాడు. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలియజేయడంతో పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలిని సందర్శించిన పోలీసులు హత్య జరిగిన ప్రదేశాన్ని కోదాడ సీఐ మెగిలయ్య, ఎస్ఐ రామాంజనేయులు సందర్శించారు. సంఘటన స్థలంలో ఉన్న కత్తిని, రక్తం మరకలను పరిశీలించారు. మృతురాలి కుమారుడు సైదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితునిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహానికి కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. పరారీలో ఉన్న నిందితున్ని త్వరలోనే పట్టుకుంటామని ఎస్ఐ తెలిపారు. -
పిట్టల్లా రాలుతున్న అన్నదాతలు
రోజుకు ఒకరిద్దరి చొప్పున ఆత్మహత్య 9 రోజుల్లో 13 మంది బలవన్మరణం మృతుల్లో పత్తిరైతులే ఎక్కువ..! వర్షాభావం, అప్పులబాధలే కారణం సాక్షి, మహబూబ్‌నగర్: పాలమూరు రైతన్నను కరువు వెంటాడుతోంది.. అన్నం పెట్టే అన్నదాత మృత్యుఘోష వినిపిస్తోంది. కాలం కనికరించక.. అప్పులు తీర్చేమార్గం లేక ఇక చావే మార్గమని భావిస్తున్నారు. ప్రాణంగా చూసుకునే పంటచేలల్లోనే తనువుచాలిస్తున్నారు. కేవలం 9 రోజుల వ్యవధిలోనే జిల్లాలో 13 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో ఎక్కువమంది పత్తిరైతులే ఉన్నారు. ఇదిలాఉండగా, మరో నలుగురు రైతులు పంటలకు నీళ్లు పారించే క్రమంలో విద్యుదాఘాతానికి బలయ్యారు. ఖరీఫ్ మొదటి నుంచి వరుణుడు దాగుడుమూతలు ఆడుతున్నాడు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో అన్నదాతను కష్టాలు వెంటాడుతున్నాయి. గతేడాది అధికవర్షాల కారణంగా మెట్టపంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పత్తిరైతులు దారుణంగా దెబ్బతిన్నారు. ఈ ఏడాదైనా అప్పులబాధ నుంచి గ ట్టెక్కుదామని భావించిన రైతన్నకు ఈ సారీ తీవ్ర నిరాశే ఎదురైంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో మొక్కజొన్న, పత్తి పంటలు చేతికిరాకుండాపోయాయి. రుణదాతల నుంచి ఒత్తిళ్లు ఎక్కువకావడంతో అప్పులు తీర్చేమార్గం లేక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఈనెల 26, 27 తేదీల్లో ఉప్పునుంతలలో భార్యాభర్తలు మృతిచెందారు. పంటకోసం తెచ్చిన అప్పులు గుదిబండలా మారడంతో కొట్టం బచ్చయ్య(48) పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంత్యక్రియల అనంతరం అతని భార్య వెంకటమ్మ(38) కుప్పకూలి తనువు చాలించింది. ఈ సంఘటనలు రైతుల మనోవేదనకు అద్దంపడుతున్నాయి. చనిపోయిన రైతులు వీరే.. 21న మల్దకల్ మండలం పెద్దొడ్డి గ్రామానికి చెందిన పాతింటి ఈరన్న(30)అప్పులబాధతో కుంగిపోయి ఆస్పత్రిలో చనిపోయాడు. 22న వంగూరు మండలం తుర్కలపల్లి గ్రామానికి చెందిన లింగం(40) పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 23న మల్దకల్ మండలం దాసరిపల్లిలోని బతుకన్న(32) ఆత్మహత్యకు ఒడిగట్టాడు. అదేరోజు పాన్‌గల్ మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన తెలుగు మద్దిలేటి(30), ధన్వాడ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన వడ్డెన్న మృత్యువాతపడ్డారు. 25న అమ్రాబాద్ మండలం తుర్కపల్లికి చెందిన ఆలూరు పర్వతాలు(35)పురుగుల మందుతాగాడు. అదేరోజున పెద్దమందడి మండలం పెద్ద మునగాల్చేడ్ గ్రామానికి చెందిన చాకలి నాగేష్(35)తనువుచాలించాడు. 26న వీపనగండ్ల మండలం కొప్పునూరు గ్రామానికి చెందిన బడికెల కిష్టన్న (36)మరణించారు. అదేరోజు ఉప్పునుంతలకు చెందిన కొట్టం బచ్చయ్య(48)పురుగుల మందుతాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. 27న ఉప్పునుంతలకు చెందిన కొట్టం వెంకటమ్మ, తన భర్త బచ్చయ్య మరణం తట్టుకోలేక కుప్పకూలి మరణించింది. అదేరోజు అమ్రాబాద్ మండలం తుర్కపల్లికి చెందిన కోరె బాలస్వామి(28)ఆత్మహత్య చేసుకున్నాడు. 28న భూత్పూరు మండలం అమిస్తాపూర్ గ్రామానికి చెందిన బక్కా జగదీష్(60)పురుగుమందుతాగి బలవన్మరణానికి ఒడిగట్టాడు. 29న ఉప్పునుంతల మండలం పెనిమిళ్లలో అప్పులబాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యుదాఘాతంతో.. 20న గద్వాల మండలం కొత్తపల్లికి చెందిన కుర్వరాజు(27)పొలంలో విద్యుదాఘతానికి గురై మరణించాడు. 21న వడ్డేపల్లికి చెందిన కుర్వపెద్ద గోవిందు(45)విద్యుదాఘతానికి గురైమృతిచెందాడు. 22న గట్టు మండలం మర్సన్దొడ్డి పంచాయితీ సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన నాగరాజు(23) విద్యుదాఘాతానికి గురయ్యాడు. 28న మల్దకల్‌కు చెందిన నర్సింహులు(27)విద్యుదాఘాతానికి గురయ్యాడు. కరుణించని వరుణుడు వరుణుడు మొదటి నుంచీ కరుణించడం లేదు. ఈ ఏడాది సెప్టెంబర్ 14 నాటికి 374.8మి.మీ వ ర్షపాతం నమోదుకావాల్సి ఉండగా, కేవలం 329 మి.మీ మాత్రమే కురిసింది. జిల్లాలోని 23 మం డలాల్లో తీవ్రవర్షభావ పరిస్థితులు నెలకొన్నా యి. దీంతో సాధారణ సాగుకంటే అతితక్కువగా పంటలు సాగయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 7,37,582 హెక్టార్లు సాగుచేయాల్సి ఉండగా, ఆశించిస్థాయిలో వానలు కురకపోవడంతో 7,09,583 హెక్టార్లు మాత్రమే సాగయింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో 8,700 హె క్టార్ల మేర మొక్కజొన్న పంట చేతికిరాకుండా పో యింది. ప్రస్తుత కాతదశలో ఉన్న పత్తి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. పక్షం రో జులుగా చినుకులేకపోవడంతో పత్తిచేలు ఎండిపోతున్నాయి. -
అమ్మకు అన్నం పెట్టరట..!
అడ్డాలనాటి బిడ్డలు గడ్డాలనాడుకారన్న నానుడిని నిజం చేశారా తనయులు. కొడుకుల తీరుతో విసిగిపోయిన ఆ మాతృమూర్తి విధిలేని పరిస్థితిలో ఠాణామెట్లెక్కింది. బాధితురాలి కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం మల్లారం గ్రామానికి చెందిన బాషెట్టి వెంకటమ్మ-రాములు దంపతులకు ముగ్గురు కుమారులు. భర్త రాము లు 34 ఏళ్ల క్రితం గల్ఫ్‌లో మృతి చెందాడు. అప్పటినుంచి అన్నీ తానై తనయులను పెంచిపెద్ద చేసింది వెంకటమ్మ. రెండో కుమారుడు సుధాకర్, మూడో కుమారుడు రవి మూడు నెలల క్రితం తల్లిని వైద్యపరీక్షల నిమిత్తమని వేములవాడకు తీసుకువచ్చి.. ఆమె పేరిట ఉన్న ఇంటిని తమ పేరి ట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. విషయం పెద్ద కుమారు డు కమలాకర్‌కు తెలియడంతో అన్నదమ్ముల మధ్య వివా దం మొదలైంది. పలుమార్లు గ్రామపెద్దల సమక్షంలో పం చాయితీ జరిగింది. ఇంటిని పంచుకున్న ఆ ఇద్దరే తల్లిని చూసుకోవాలని కమలాకర్ చేతులెత్తేశాడు. చిన్నోళ్లు ఇద్దరూ తల్లి బాధ్యత తనకొద్దంటే.. తనకొద్దంటూ తప్పిం చుకున్నారు. దీంతో తల్లి ఒంటరిదైంది. తనను కొడుకులు ఆదరించడం లేదని, మీరే ఆధారం చూపించాలని కోరు తూ ఆదివారం ఠాణామెట్లెక్కింది. సీఐ దేవారెడ్డి కొడుకుల ను పిలిపించి కౌన్సెలింగ్ చేస్తున్నారు. - న్యూస్‌లైన్, వేములవాడ