కర్నూలు జిల్లా రుద్రారం మండలం ఆలమూరులో ఒక యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. గ్రామానికి చెందిన శ్రీరాములు రోగెన్న, పెద్దనాగమ్మ దంపతుల కుమార్తె వెంకటమ్మ(18) ఐదో తరగతి వరకు చదువుకుని, ఇంటి వద్దే ఉంటోంది. తల్లిదండ్రులకు పొలం పనుల్లో సాయపడుతోంది. ఇటీవల ఆమెకు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు.
ఇదిలాఉండగా, బుధవారం ఆమెను గ్రామానికి చెందిన యువకుడు వేధించాడు. ఈ నేపథ్యంలో ఆమె గ్రామ సమీపంలోని బావిలో మృతదేహమై కనిపించింది. ఈ మేరకు ఆళ్లగడ్డ సీఐ ఓబులేసు సంఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. వెంకటమ్మను ఎవరైనా చంపి బావిలో పడేశారా, లేక ఆత్మహత్యకు పాల్పడిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.