దహెగామ్(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దహెగామ్ మండలం కమ్మరపల్లిలో విద్యుదాఘాతానికి గురై తల్లి, కుమార్తె మృతిచెందారు. కమ్మరపల్లికి చెందిన వెంకటమ్మ(35), ఆమె తల్లి పోశక్క(65) ఆదివారం ఉదయం గడ్డి కోసుకొచ్చేందుకు పొలానికి వెళ్లారు.
బోరు మోటారుకు బిగించిన కరెంటు వైరు తెగి గడ్డిలో పడిపోయింది. అది గమనించని వెంకటమ్మ కొడవలితో గడ్డి కోస్తుండగా వైరు తగిలి కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. బిడ్డను కాపాడే ప్రయత్నంలో తల్లి పోశక్క కూడా కరెంట్ షాక్‌తో మృతిచెందింది. వెంకటమ్మ భర్త మారుతి 15 రోజుల క్రితమే మృతిచెందాడు. దీంతో కుమార్తెను ఓదార్చేందుకు ఇంటికి వచ్చిన తల్లి కూడా మృతిచెందింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వెంకటమ్మకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులను పోగొట్టుకున్న చిన్నారులు అనాధలయ్యారు.
విద్యుదాఘాతంతో తల్లి, కుమార్తె మృతి
Published Sun, Apr 17 2016 10:07 AM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
Advertisement
Advertisement