Daughter died
-
హమాస్ దాడుల్లో కూతురు మాయం.. అమెరికా వ్యాపారి కన్నీటిగాథ
జెరూసలేం: ఇజ్రాయెల్‌లో నోవా వేడుకపై హమాస్ పాశవిక దాడి ఎందరో జీవితాల్లో చీకట్లు నింపింది. అయినవారిని పోగొట్టుకున్న బంధువుల ఆర్తనాదాలు ఆకాశాన్నంటుతున్నాయి. తమవారు ఎమయ్యారో..? చనిపోతే మృతదేహాలు ఎక్కడున్నాయో..? తెలియక అయోమయంలో కన్నీరుపెడుతున్నారు. ఈ క్రమంలో కూతురుని పొగొట్టుకున్న ఓ అమెరికా వ్యాపారి ధీనగాథ సదరు పాఠకుల హృదయాలను కలచివేస్తోంది. వాల్డ్‌మాన్ ఇజ్రాయెల్ ఆధారిత అమెరికా వ్యాపారి. కంప్యూటర్ నెట్వర్క్ బహుళజాతి సరఫర సంస్థ మెల్లనాక్స్ వ్యవస్థాపకుడు వాల్డ్‌మెన్. ఆయన కూతురు డేనియల్(24), ఆమె ప్రియుడు నోమ్ షాయ్‌తో కలిసి అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో జరిగిన నోవా వేడుకకు హాజరైంది. ఈ క్రమంలోనే హమాస్ దళాలు దాడులు జరిపాయి. విషయం తెలుసుకున్న వాల్డ్‌మెన్.. కూతురు జాడ కోసం ఇజ్రాయెల్ చేరుకున్నారు. తన కూతురును హమాస్ దళాలు బందీగా పట్టుకెళ్లి ఉంటాయని భావించిన వాల్డ్‌మెన్.. చనిపోయినవారి జాబితాలో తన కూతురు కూడా ఉందని తెలుసుకుని కుంగిపోయారు. తన వద్ద ఉన్న ఆపిల్ వాచ్‌తో కూతురు ఫోన్‌ను ట్రాక్ చేయగా.. అక్టోబర్ 11న దిగ్బ్రాంతికర విషయాలు ఆయనకు తెలిశాయి. డేనియల్‌కు సంబంధించిన కారు, వారి వస్తువులు మొదట దర్శనమిచ్చాయి. అక్కడ తన కూతురు, ఆమె ప్రియున్ని హమాస్ దళాలు చంపిన తీరు అతి క్రూరంగా ఉందని ఆయన వెల్లడించారు. కనీసం ఐదుగురు ఉగ్రవాదులు తన కూతురు ఉన్న కారును చుట్టుముట్టి దాడి చేశారని వెల్లడించారు. కారులో తప్పించుకునే ప్రయత్నంలో ఈ దాడి జరిగిందని వెల్లడించారు. డేనియల్, ఆమె ప్రియుడు నోమ్ షాయ్ త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని కన్నీరు పెట్టుకున్నారు. ఇటీవలే ఇద్దరూ తమ కుక్కతో కలిసి కొత్త ఫ్లాట్‌లోకి మారారని చెప్పారు. హమాస్ దాడులను ఖండించిన ఆయన.. డేనియల్, నోమ్ షాయ్‌కి ఒకే దగ్గర అంత్యక్రియలు జరిగినట్లు తెలిపారు. ఇదీ చదవండి: 'ఇక్కడి నుంచి తీసుకెళ్లండి..' హమాస్ బందీలో యువతి ఆవేదన -
విషాదం: బిడ్డను గమనించని తండ్రి.. వాహనాన్ని ముందుకు నడపడంతో
గీసుకొండ: అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురు.. పొరపాటున తండ్రి నడిపించే గూడ్స్ వాహనం కిందపడి తనువు చాలించింది. ఈ ఘటన గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్ కాలనీలో మంగళవారం జరిగింది. బొలెరో గూడ్స్ వాహనం డ్రైవర్‌గా పనిచేస్తున్న వల్లెపు రమేశ్‌కు కూతురు చందన (5), కుమారుడు ఉన్నారు. రమేశ్ ఉదయం ఇంటి నుంచి గూడ్స్ వాహనాన్ని వరంగల్ కూరగాయల మార్కెట్‌కు తీసుకుని వెళ్లడానికి సిద్ధమవుతుండగా.. దివ్యాంగురాలైన చందన పాకుకుంటూ ఆ వాహనం వెనుక టైరు వద్దకు చేరింది. కూతురుని గమనించని తండ్రి వాహనాన్ని ముందుకు నడపడంతో టైరు కిందపడి చందన అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ దేవేందర్ తెలిపారు. (చదవండి: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఢీకొట్టిన లారీ) -
ప్రాణం తీసిన ప్రహరీ గోడ
సాక్షి, చెన్నై : చల్లగాలి కోసం ఇంటి బయట మంచి మీద కూర్చుని ఉన్న తండ్రి, ఇద్దరు కుమార్తెలను ప్రహరీ గోడ ప్రాణం తీసింది. ఓ ఖాళీ స్థలం కోసం నిబంధనలకు విరుద్ధంగా మరీ ఎత్తులో నిర్మించి ఉన్న ప్రహరీ గోడ నేలమట్టం కావడంతో పీక్కన్ కరణైలో విషాదం చోటు చేసుకుంది. చెన్నై శివారులోని తాంబరం సమీపంలోని పీక్కన్ కరణై ముత్తమిళ్ వీధి శ్రీనివాస నగర్‌కు చెందిన రాజాంగం(60) పెయింటర్. ఆయనకు కుమార్తెలు కళ(40), సుమిత్ర(32) ఉన్నారు. ఆదివారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఉక్కపోత కారణంగా ఇంట్లో ఉన్న మంచాన్ని తీసుకొచ్చి బయట వేసుకున్నారు. మంచం మీద కూర్చుని తండ్రి, కుమార్తెలు మాట్లాడుకుంటుండగా హఠాత్తుగా ఆ ఇంటికి అనుకుని ఉన్న ఎత్తయిన ప్రహరీ గోడ నేలమట్టం అయ్యింది. క్షణాల్లో ఆ ప్రహరీ గోడ నేలమట్టం కావడం, ఆ శిథిలాల కింద తండ్రి, కుమార్తెలు చిక్కుకున్నారు. ఇంట్లో ఉన్న ఇతర కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. పక్కింట్లో ఉన్న వాళ్లతో కలిసి శిథిలాల కింద పడి ఉన్న వారిని రక్షించే యత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, 108 వర్గాలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకుని ఉన్న వారిని అతికష్టం మీద బయటకు తీశారు. ముగ్గుర్ని చికిత్స నిమిత్తం క్రోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మార్గం మధ్యలో రాజంగం మరణించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుమిత్ర సోమవారం వేకువజామున చికిత్స ఫలించక మరణించింది. ఆమె మరణించిన కాసేపటికి కళ కూడా విగత జీవిగా మారింది. ప్రహరీ గోడ నేలమట్టం కావడంతో తండ్రి, కుమార్తెలు మరణించిన సమాచారం ఆ పరిసర వాసుల్ని విషాదంలోకి నెట్టింది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా ఖాళీస్థలంలో ఎత్తయిన ప్రహరీ నిర్మించి ఉండటంతోనే అది నేల మట్టమైనట్టు విచారణలో తేలింది. ఖాళీగా ఉన్న స్థలాలను కాపాడుకునేందుకు ఆయా స్థలాల యజమానాలు, అనేక చోట్ల ఎత్తయిన ప్రహరీ గోడలను పీక్కన్ కరణ్‌లో నిర్మించి వదిలి పెట్టి ఉన్నారని, వాటిని పర్యవేక్షించే వాళ్లు లేక అవి శిథిలావస్థకు చేరుతున్నాయని, తరచూ ›ప్రమాదాలు తప్పడం లేదని ఆ పరిసర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
తండ్రి మరణించిన కొన్నిక్షణాలకే.
సాక్షి, రౌతులపూడి (తూర్పుగోదావరి): తండ్రి మృతిని తాళలేక కుమార్తె అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందిన ఘటన రౌతులపూడి మండలంలోని గిడజాంలో గురువారం చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన కేదారిశెట్టి అప్పలరాజు(60) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం కోసం బుధవారం రాత్రి రౌతులపూడిలో ఆసుపత్రికి తీసుకుని వెళ్లి తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు. తండ్రి మృత దేహాన్ని గిడజాంలోని తమ స్వగృహానికి తీసుకురాగానే కుమార్తె దేవి (25) తండ్రి మృతదేహాన్ని పట్టుకుని తీవ్రంగా రోదించి ... గుండెపోటుతో కుప్పకూలిపోయింది. తండ్రీ, కుమార్తెల మృత దేహాలను చూసి శోకసముద్రంలో మునిగిపోయారు. రెండు మృత దేహాలు పక్కపక్కనే రెండు పాడెలపై తీసుకెళ్లి దహన సంస్కారాలు చేయటం గ్రామాన్ని కంటతడి పెట్టించింది. మృతుడు అప్పలరాజు మేనల్లుడు వీరికి తలకొరివి పెట్టడంతో దహన సంస్కారాలు ముగించారు. -
ప్రముఖ సింగర్ దంపతులకు తీవ్రగాయాలు, కుమార్తె మృతి
దైవ దర్శనానికి వెళ్లిన ప్రముఖ వయోలినిస్ట్, మ్యుజీషియన్ బాలభాస్కర్ కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన కుమార్తె తేజస్వి (2) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. బాలభాస్కర్, ఆయన భార్య లక్ష్మితో సహా డ్రైవర్ అర్జున్ తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే బాలభాస్కర్ దంపతుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తిరువనంతపురం శివారు ప్రాంతం పల్లిప్పురమ్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. త్రిస్సూర్‌లో ఓ దేవాలయాన్ని దర్శించుకొని తిరిగి వెళ్తుండగా.. వారు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. కాగా సంగీత దర్శకుడిగా కరియర్‌ను ప్రారంభించిన బాలభాస్కర్ స్టేజీ షోలతో గాయకుడిగా, వయోలినిస్ట్‌గా మరింత పాపులర్ అయ్యారు. 12 ఏళ్ళ వయస్సులో తన సంగీత వృత్తిని ప్రారంభించిన మలయాళ చిత్రపరిశ్రమలో అతి చిన్నవయసున్న సంగీత దర్శకుడిగా ఖ్యాతి గడించారు. ‘మాంగల్య పల్ల’కు అనే చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా మారిన బాలభాస్కర్.. ఆ తరువాత ‘మోక్షం’, ‘కన్నదిక్కదవతు’ అనే చిత్రాలకు సంగీతం అందించారు. వయోలినిస్ట్‌గా ఉస్తాద్ జాఖీర్ హుస్సేన్, శివమణి, లూయిస్ బాంక్స్, హరిహరన్, ఫాజల్ ఖురేషి తదితర ప్రముఖులతో కలిసి పనిచేశారు. -
తండ్రి,కుమార్తెకు ఒకేసారి అంత్యక్రియలు
డెంకాడ : మండలంలోని మోదవలసలో తండ్రీ, కుమార్తెలకు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. అనారోగ్యంతో కుమార్తె మరణించడంతో తట్టుకోలేక చిన్నారి తండ్రి కూడా పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గ్రామంలో నివాసముంటున్న కానూరి సత్యశ్రీధర్, సుజాత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఉదయశ్రీ కాగా రెండో కుమార్తె గౌతమిశ్రీ. కొద్ది రోజులుగా గౌతమిశ్రీకి ఆరోగ్యం బాగోలేకపోవడంతో శనివారం ఉదయం మృతి చెందింది. వ్యక్తిగత పనిమీద పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం వెళ్లిన తండ్రి శ్రీధర్‌కు కుటుంబ సభ్యులు విషయం తెలియజేశారు. కుమార్తె మరణం వార్త విన్న శ్రీధర్ తీవ్ర మనస్తాపానికి గురై పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తండ్రీ,కుమార్తెల మృతదేహాలకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలా ఉంటే సత్యశ్రీధర్ భార్య సుజాత, పెద్ద కుమార్తె ఉదయశ్రీ రోదించిన తీరు చూపరులను కలిచివేసింది. -
తనయ వెంటే తండ్రి
డెంకాడ(నెల్లిమర్ల): ఆ కుమార్తె అంటే ఆయనకు పంచ ప్రాణం. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఆమె ఆటపాటలు చూసి మురిసిపోయాడు. ఆమెకు అనారోగ్యం అయితే తానే దగ్గరుండి ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నాడు. నిరంతరం ఆమే జీవితం అనుకున్నాడు. ఎలాగైనా ఆమెను ఆరోగ్యవంతురాలిని చేయాలనుకున్నా డు. కానీ విధి వక్రీకరించింది. ఆ చిన్నారి వాంతులు, విరేచనాలతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఆ తండ్రి కన్నీరు మున్నీరయ్యాడు. తన ముద్దుల కూతురు చనిపోయిందంటూ కుటుంబ సభ్యులకు... స్నేహితులకు ఫోన్లో చెప్పి బోరున ఏడ్చాడు. ఇంక తాను బతకడం వృథా అని... ఆమె వద్దకే వెళ్లిపోతున్నాననీ, ఎవరూ బాధపడవద్దని చెప్పాడు. అనుకున్నట్టుగానే పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన డెంకాడ మండలం మోదవలసలో సంచలనం సృష్టించింది. ప్రేమ వివాహం చేసుకుని... తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన కానూరి సత్యశ్రీధర్(33) డెంకాడ మండలంలోని మోదవలస గ్రామానికి చెందిన సుజాతను పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు ఉదయశ్రీ, గౌతమిశ్రీ(7) అనే ఇద్దరు కుమార్తెలు. వీరు కొంత కాలం విశాఖలో ఉండేవారు. మూడేళ్ల క్రితమే మోదవలసకు వచ్చేసి, చిన్నచిన్న సివిల్ కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూæ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. సత్యశ్రీధర్ పనినిమిత్తం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం వెళ్లారు. శనివారం ఉదయం చిన్నకుమార్తె గౌతమిశ్రీ మరణించిందన్న విషయం కుటుంబ సభ్యులద్వారా తెలుసుకున్నారు. హుటాహుటిన బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరారు. చిన్న కూతురిపై వల్లమాలిన అభిమానం గౌతమిశ్రీ అంటే సత్యశ్రీధర్కు విపరీతమైన అభిమానం. ఆమె మరణం ఆయన్ను తీవ్రంగా కలచివేసింది. మండపేటలో ఉంటున్న తన కుటుంబ సభ్యులకు కుమార్తె మరణ సమాచారాన్ని అందించారు. తన స్నేహితుడికి ఫోన్ చేసి తన ముద్దుల కుమార్తె ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిందనీ, ఆమెతోనే నేనూ వెళ్లిపోతాను బాధపడవద్దు అంటూ బాధపడుతూ చెప్పాడు. మార్గ మధ్యలో విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఒడ్డిమెట్ట వద్ద జాతీయ రహదారి సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీధర్ ఫోన్లో చెప్పిన చివరి మాటలతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు, స్నేహితులు సెల్‌ఫోన్ నంబరు ఆధారంగా నెట్వర్క్ సెర్చ్ చేస్తూ ఒడ్డిమెట్ట సమీపంలో సిగ్నల్ చూపించడంతో అక్కడకు చేరుకుని వెతికారు. జాతీయరహదారి సమీపంలో శ్రీధర్ పురుగుల మందు తీసుకొని ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని గుర్తించారు. విషయం స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ సింహాచలం సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి రాకకోసం ఎదురుచూసి... ఎంతో గారాబంగా చూసుకుంటున్న కుమార్తె గౌతమిశ్రీ మృతదేహం వద్దకు ఆందోళనతో, ఆవేదనతో సత్యశ్రీధర్ వస్తాడని మోదవలసలో ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులకు సమయం దాటినా రాకపోవడంతో ఆందోళన మొదలైంది. తీరా చూస్తే సాయంత్రం 5 గంటల ప్రాంతంలో శ్రీధర్ చనిపోయాడంటూ పిడుగులాంటి వార్త కుటుంబ సభ్యులకు చేరింది. ఒకపక్క చిన్నారి మృతదేహం... మరో పక్క కుటుంబ పెద్ద మృతి చెందాడన్న వార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు గొల్లుమన్నారు. గ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది. ఈ సంఘటనతో గౌతమిశ్రీ అంత్యక్రియలూ నిలిచిపోయాయి. -
వరకట్నం వేధింపులకు తల్లీకూతురు బలి
అడ్డగూడూరు(తుంగతుర్తి) : వరకట్నం వేధింపులకు తల్లీకూతురు బలయ్యారు. ఈ విషాద సంఘటన బుధవారం అడ్డగూడూరు మండలం చిర్రగూడూరు గ్రామంలో జరిగింది. ఎస్ఐ శివనాగప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. చిర్రగూడూరు గ్రామానికి చెందిన శ్రీరాముల అశోక్‌కు గుండాల మండలం పాచిళ్ల గ్రామానికి చెందిన ఉమ(29)తో 2013లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెల సంతానం. వీరిలో పెద్దమ్మాయి మిల్కీ, చిన్నమ్మాయి అశ్విత(8నెలలు). కొంతకాలంగా అశోక్ వరకట్నం తేవాలని భార్యను వేధిస్తున్నాడు. బుధవారం ఉదయం భార్యాభర్త నడుమ తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం ఇంట్లో ఉమ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. చిన్నకుమార్తె అశ్వితకు కూడా మంటలు వ్యాపించడంతో 90శాతం కాలిపోయారు. వెంటనే గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం 108 వాహనంలో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తల్లీకూతురు మరణించినట్టు తెలిపారు. ఉమ తల్లిదండ్రులు మాత్రం అశోక్ వరకట్నం కోసం తమ కూతురు, మనుమరాలిపై కిరోసిన్ పోసి హత్య చేశాడని తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శాలిగౌరారం ఎస్ఐకి పుత్రికాశోకం
డెంగీ జ్వరంతో కుమార్తె ఉషారాణి మృతి శాలిగౌరారం (తుంగతుర్తి) : శాలిగౌరారం ఎస్ఐ శ్రీరాముల అయోధ్య రెండో కుమార్తె ఆకుల ఉషారాణి(28) డెంగీతో బాధపడుతూ మంగళవారం మృతిచెందింది. నిండు గర్భిణిగా ఉన్న ఉషారాణి హైదరాబాద్‌లో తన తల్లిదండ్రుల వద్ద ఉండగా డెంగీ జ్వరం వచ్చింది. ఆమెను హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం డెంగీ జ్వరం అధికం కావడంతో పాటు ఇన్ఫెక్షన్ సోకడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పరిస్థితి విషమించి మంగళవారం మృతిచెందారు. ఉషారాణి మృతదేహాన్ని ఎస్ఐ స్వగ్రామమైన అడ్డగూడూరు మండలంలోని చిర్రగూడూరుకు తరలించారు. బంధువులు, స్నేహితుల సందర్శన అనంతరం అంత్యక్రియల కోసం ఉషారాణి మృతదేహాన్ని వారి స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కావలికి తరలించారు. బుధవారం కావలిలో ఉషారాణి అంత్యక్రియలు జరుపనున్నట్లు బాధిత కుటింబీకులు తెలిపారు. నివాళులర్పించిన మందుల సామేల్.. శాలిగౌరారం ఎస్ఐ శ్రీరాముల అయోధ్య కుమార్తె ఉషారాణి మృతదేహాన్ని చిర్రగూడూరులో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ సందర్శించి.. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కన్నీటి పర్యంతమవుతున్న ఎస్ఐ అయోధ్యను ఓదార్చి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. -
కూతురి మృతిని తట్టుకోలేక తల్లి ఆత్మహత్య
హిందూపురం అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కూతురు మరణాన్ని తట్టుకోలేకపోయిక ఓ కన్నతల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అనంతపురం జిల్లా హిందూపురం ముద్దిరెడ్డిపల్లెలో ఆదివారం జరిగింది. అనారోగ్యం కారణంగా ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో కూతురు చనిపోవడాన్ని జీర్ణించుకోలేని ఓ తల్లి ఉరేసుకుని బలవన్మరణం చెందింది. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విద్యుదాఘాతంతో తల్లి, కుమార్తె మృతి
దహెగామ్(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దహెగామ్ మండలం కమ్మరపల్లిలో విద్యుదాఘాతానికి గురై తల్లి, కుమార్తె మృతిచెందారు. కమ్మరపల్లికి చెందిన వెంకటమ్మ(35), ఆమె తల్లి పోశక్క(65) ఆదివారం ఉదయం గడ్డి కోసుకొచ్చేందుకు పొలానికి వెళ్లారు. బోరు మోటారుకు బిగించిన కరెంటు వైరు తెగి గడ్డిలో పడిపోయింది. అది గమనించని వెంకటమ్మ కొడవలితో గడ్డి కోస్తుండగా వైరు తగిలి కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. బిడ్డను కాపాడే ప్రయత్నంలో తల్లి పోశక్క కూడా కరెంట్ షాక్‌తో మృతిచెందింది. వెంకటమ్మ భర్త మారుతి 15 రోజుల క్రితమే మృతిచెందాడు. దీంతో కుమార్తెను ఓదార్చేందుకు ఇంటికి వచ్చిన తల్లి కూడా మృతిచెందింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వెంకటమ్మకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులను పోగొట్టుకున్న చిన్నారులు అనాధలయ్యారు. -
దొంగ అనుకుని కూతుర్ని కాల్చేసింది...
వాషింగ్టన్: తనపై ఎవరో దాడికి యత్నిస్తున్నారని భావించి ఓ తల్లి జరిపిన కాల్పుల్లో ఆమె కూతురు(27) చనిపోయింది. అమెరికాలోని ఫ్లోరిడాలో రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెయింట్ క్లౌడ్ పోలీస్ స్టేషన్ అధికారి డినైస్ రాబర్ట్స్ కథనం ప్రకారం... ఓ మహిళ నిద్రిస్తుండగా ఇంట్లోకి ఎవరో వచ్చారు. అయితే, దొంగ ప్రవేశించారన్న భావనతో తొందరపడి ఓ మహిళ ఫైరింగ్ చేసింది. అయితే, బుల్లెట్ తగిలి గాయపడ్డ యువతిని చూసి ఆ తల్లి కన్నీరుమున్నీరైంది. తన ముద్దుల తనయను తానే కాల్చి చంపాలనుకున్నానా అని ఆశ్చర్యానికి లోనైంది. వెంటనే తేరుకుని కూతుర్ని ఆసుపత్రికి తీసుకెళ్లింది. కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే కూతురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కాల్పులు జరిపిన సమయంలో ఆమె కాస్త నిద్రమత్తులో ఉందని, ఎవరో వస్తున్నట్లు చప్పుడైందని నిందితురాలు గుర్తించిందని పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి ఎవరన్నది ఆమె పోల్చుకోలేక పోవడంతో పాటు తనకు దగ్గర్లో ఉన్న తుపాకీతో ఓ రౌండ్ కాల్పులు జరపింది. అనంతరం బుల్లెట్ గాయాలయిన యువతి దగ్గరికెళ్లి చూడగా ఆమె కాల్చించి తన కూతురేనని గ్రహించి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లింది. కానీ, ఇంతలో జరగాల్సిన నష్టం జరిగిపోయిందని తెలుస్తోంది. అనుకోకుండా జరిపిన కాల్పులని, ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు రాబర్ట్స్ వివరించారు. మీడియా మిత్రులు యువతి తల్లిదండ్రుల పేర్లు ప్రచురించవద్దని కోరారు. ఆ యువతి తండ్రి గతంలో అండర్ కవర్ ఆఫీసర్‌గా చేశాడని, ఆమె తల్లి డిస్పాచింగ్ చేసే ఓ సంస్థలో పనిచేస్తుందని వెల్లడించారు. -
తల్లీకూతుళ్లపై హత్యాయత్నం, చిన్నారి మృతి
నల్లగొండ: చిన్నారి సహా తల్లిపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ కాళికామాత గుడి వద్ద ఓ ఇంట్లో గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో చిన్నారి మృతిచెందగా, తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం తల్లిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అయితే భర్తపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తల్లి మరణం తట్టుకోలేక కూతురు మృతి
చింతపల్లి: నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లి మరణాన్ని ఆ కూతురు తట్టుకోలేక‘పోయింది’. కళ్లెదుటే విగతజీవిగా పడి ఉన్న మాతృమూర్తి మృతదేహంపై పడి తనూ కూడా ప్రాణాలొదిలింది.. ఈ ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లిలో గురువారం చోటు చేసుకుంది. చక్కని బక్కమ్మ(80)కు ఇద్దరు కుమారులు, కూతురు అంజమ్మ (60) ఉన్నారు. బక్కమ్మ తన పెద్ద కుమారుడు అంజయ్య వద్ద ఉంటోంది. కాగా, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బక్కమ్మ గురువారం మృతిచెందింది. విషయం తెలుసుకున్న అంజమ్మ.. తల్లి అంత్యక్రియలలో పాల్గొనేందుకు అత్తింటి నుంచి స్వగ్రామానికి వచ్చింది. తల్లి మృతదేహంపై పడి బోరున విలపిస్తూ ప్రాణాలు విడిచింది.