మృతిచెందిన కేదారిశెట్టి అప్పలరాజు, కుమార్తె దేవి
సాక్షి, రౌతులపూడి (తూర్పుగోదావరి): తండ్రి మృతిని తాళలేక కుమార్తె అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందిన ఘటన రౌతులపూడి మండలంలోని గిడజాంలో గురువారం చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన కేదారిశెట్టి అప్పలరాజు(60) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం కోసం బుధవారం రాత్రి రౌతులపూడిలో ఆసుపత్రికి తీసుకుని వెళ్లి తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు. తండ్రి మృత దేహాన్ని గిడజాంలోని తమ స్వగృహానికి తీసుకురాగానే కుమార్తె దేవి (25) తండ్రి మృతదేహాన్ని పట్టుకుని తీవ్రంగా రోదించి ... గుండెపోటుతో కుప్పకూలిపోయింది. తండ్రీ, కుమార్తెల మృత దేహాలను చూసి శోకసముద్రంలో మునిగిపోయారు. రెండు మృత దేహాలు పక్కపక్కనే రెండు పాడెలపై తీసుకెళ్లి దహన సంస్కారాలు చేయటం గ్రామాన్ని కంటతడి పెట్టించింది. మృతుడు అప్పలరాజు మేనల్లుడు వీరికి తలకొరివి పెట్టడంతో దహన సంస్కారాలు ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment