జెరూసలేం: ఇజ్రాయెల్‌లో నోవా వేడుకపై హమాస్ పాశవిక దాడి ఎందరో జీవితాల్లో చీకట్లు నింపింది. అయినవారిని పోగొట్టుకున్న బంధువుల ఆర్తనాదాలు ఆకాశాన్నంటుతున్నాయి. తమవారు ఎమయ్యారో..? చనిపోతే మృతదేహాలు ఎక్కడున్నాయో..? తెలియక అయోమయంలో కన్నీరుపెడుతున్నారు. ఈ క్రమంలో కూతురుని పొగొట్టుకున్న ఓ అమెరికా వ్యాపారి ధీనగాథ సదరు పాఠకుల హృదయాలను కలచివేస్తోంది.
వాల్డ్‌మాన్ ఇజ్రాయెల్ ఆధారిత అమెరికా వ్యాపారి. కంప్యూటర్ నెట్‌వర్క్ బహుళజాతి సరఫర సంస్థ మెల్లనాక్స్ వ్యవస్థాపకుడు వాల్డ్‌మెన్. ఆయన కూతురు డేనియల్(24), ఆమె ప్రియుడు నోమ్ షాయ్‌తో కలిసి అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో జరిగిన నోవా వేడుకకు హాజరైంది. ఈ క్రమంలోనే హమాస్ దళాలు దాడులు జరిపాయి. విషయం తెలుసుకున్న వాల్డ్‌మెన్.. కూతురు జాడ కోసం ఇజ్రాయెల్ చేరుకున్నారు. తన కూతురును హమాస్ దళాలు బందీగా పట్టుకెళ్లి ఉంటాయని భావించిన వాల్డ్‌మెన్.. చనిపోయినవారి జాబితాలో తన కూతురు కూడా ఉందని తెలుసుకుని కుంగిపోయారు.
తన వద్ద ఉన్న ఆపిల్ వాచ్‌తో కూతురు ఫోన్‌ను ట్రాక్ చేయగా.. అక్టోబర్ 11న దిగ్బ్రాంతికర విషయాలు ఆయనకు తెలిశాయి. డేనియల్‌కు సంబంధించిన కారు, వారి వస్తువులు మొదట దర్శనమిచ్చాయి. అక్కడ తన కూతురు, ఆమె ప్రియున్ని హమాస్ దళాలు చంపిన తీరు అతి క్రూరంగా ఉందని ఆయన వెల్లడించారు. కనీసం ఐదుగురు ఉగ్రవాదులు తన కూతురు ఉన్న కారును చుట్టుముట్టి దాడి చేశారని వెల్లడించారు.
కారులో తప్పించుకునే ప్రయత్నంలో ఈ దాడి జరిగిందని వెల్లడించారు. డేనియల్, ఆమె ప్రియుడు నోమ్ షాయ్ త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని కన్నీరు పెట్టుకున్నారు. ఇటీవలే ఇద్దరూ తమ కుక్కతో కలిసి కొత్త ఫ్లాట్‌లోకి మారారని చెప్పారు. హమాస్ దాడులను ఖండించిన ఆయన.. డేనియల్, నోమ్ షాయ్‌కి ఒకే దగ్గర అంత్యక్రియలు జరిగినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: 'ఇక్కడి నుంచి తీసుకెళ్లండి..' హమాస్ బందీలో యువతి ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment