డెంగీ జ్వరంతో కుమార్తె ఉషారాణి మృతి
శాలిగౌరారం (తుంగతుర్తి) : శాలిగౌరారం ఎస్‌ఐ శ్రీరాముల అయోధ్య రెండో కుమార్తె ఆకుల ఉషారాణి(28) డెంగీతో బాధపడుతూ మంగళవారం మృతిచెందింది. నిండు గర్భిణిగా ఉన్న ఉషారాణి హైదరాబాద్‌లో తన తల్లిదండ్రుల వద్ద ఉండగా డెంగీ జ్వరం వచ్చింది. ఆమెను హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం డెంగీ జ్వరం అధికం కావడంతో పాటు ఇన్‌ఫెక్షన్ సోకడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పరిస్థితి విషమించి మంగళవారం మృతిచెందారు. ఉషారాణి మృతదేహాన్ని ఎస్‌ఐ స్వగ్రామమైన అడ్డగూడూరు మండలంలోని చిర్రగూడూరుకు తరలించారు. బంధువులు, స్నేహితుల సందర్శన అనంతరం అంత్యక్రియల కోసం ఉషారాణి మృతదేహాన్ని వారి స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కావలికి తరలించారు. బుధవారం కావలిలో ఉషారాణి అంత్యక్రియలు జరుపనున్నట్లు బాధిత కుటింబీకులు తెలిపారు.
నివాళులర్పించిన మందుల సామేల్..
శాలిగౌరారం ఎస్‌ఐ శ్రీరాముల అయోధ్య కుమార్తె ఉషారాణి మృతదేహాన్ని చిర్రగూడూరులో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ సందర్శించి.. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కన్నీటి పర్యంతమవుతున్న ఎస్‌ఐ అయోధ్యను ఓదార్చి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment