USHA RANI
-
‘కార్తీక దీపం’నటికి చేదు అనుభవం.. డీఎస్పీ అంటూ ఫోన్ చేసి..
దేశంలో ఆన్లైన్ మోసాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్ల ద్వారా పెరుగుతున్న ఆన్లైన్ లావాదేవీలను ఆసరాగా చేసుకుని రూ.కోట్లు కొట్టేస్తున్నారు కేటుగాళ్లు. పోలీసులు, బ్యాంకులు, ఇతర సంస్థలు మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో ప్రజల్లో కొంత మార్పు వచ్చింది. ఓటీపీ(వన్ టైమ్ పాస్వర్డ్)వివరాలను అపరిచితులతో షేర్ చేసుకోవడం లేదు. దీంతో సైబర్ నేరగాళ్లు నయా పంథాను ఎంచుకుంటున్నారు. బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల పేర్లు చెప్పకుండా..ఏకంగా పోలీసుల పేర్లతో మోసానికి పాల్పడుతున్నారు. తాజాగా ‘కార్తీక దీపం ’సీరియల్ నటి ఉషా రాణి సైబర్ నేరగాళ్ల నుంచి తృటిలో తప్పించుకుంది. ఓ కేటుగాడు డీఎస్పీని అంటూ ఫోన్ చేసి ఓటీపీ వివరాలు అడిగితే.. తెలివిగా వ్యవహరించి ఆన్లైన్ మోసానికి చెక్ పెట్టింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ..జాగ్రత్తగా ఉండాలని అభిమానులకు సూచించింది. వీడియోలో ఆమె ఇలా చెప్పుకొచ్చింది.’నాకు ఒక ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉంది. అందులో మొత్తం రూ.5 లక్షల వరకు షాపింగ్ చేసుకోవచ్చు. దానిని మా అబ్బాయి బయటకు తీసుకెళ్లి ఎక్కడో పోగొట్టుకున్నాడు. వాడు తరచు ప్యాంట్ జేబులో పెట్టి మర్చిపోతుంటాడు. ఈ సారి కూడా ఎక్కడో పెట్టే ఉంటాడులే అనుకొని బ్లాక్ చేయకుండా వదిలేశా. ఆ కార్డు అమోజాన్‌కి లింక్ అయి ఉండడంతో నా షాపింగ్‌కి కూడా ఇబ్బంది కాలేదు. పని జరుగుతుంది కదా అని నేను లైట్ తీసుకున్నాను.కొన్నిరోజుల తర్వాత నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి నుంచి ఒక వ్యక్తి చాలా గంభీరమైన గొంతుతో ‘నేను డీఎస్పీని మాట్లాడుతున్నాను. మీరు ఉషారాణి కదా.. మీ నంబర్ ఒక ఫ్రాడ్ కేసుకు లింక్ అయి ఉంది. ఆ కేసును క్యాన్సిల్ చేసేందుకు ఒక ఓటీపీ వస్తుంది. దానిని షేర్ చేయండి అని అడిగాడు. అయితే నేను కాసేపు ఆలోచించాను. ఆ వెంటనే తేరుకుని అసలు ఓటీపీలు చెప్పకండి అని మీరే అంటారు కదా.. మళ్లీ ఓటీపీ ఎందుకు అడుగుతున్నారు? అని అడిగాను. నేను ఆఫీస్ కే వచ్చి ఓటీపీ చెప్తాను అనడంతో.. అతను ఫోన్ కట్ చేశాడు. కాసేపటికి వాట్సాప్ కి ఒక బిల్లు కూడా పెట్టారు. అందులో మా ఇంటి అడ్రెస్, ఫోన్ నంబర్, అన్నీ వివరాలు ఉన్నాయి. దీంతో నేను వెంటనే అలెర్ట్ అయ్యాను. దీనిని ఇలాగే వదిలేస్తే పెద్ద ప్రమాదం జరుగుతుందని గ్రహించాను. వెంటనే బ్యాంకుకు వెళ్లి ఆ క్రెడిట్ కార్డును బ్లాక్ చేయించాను. జాగ్రత్తగా ఉండండి.మోసపోకండి’ అని ఉషారాణి చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Usha Rani (@usharani_actor) -
బిడ్డ మరణం తట్టుకోలేక ఆగిన తల్లి గుండె
దేవరాపల్లి (అనకాపల్లి జిల్లా): కళ్ల ముందే కన్న కూతురు మరణించడంతో తల్లడిల్లిన ఆ తల్లి గుండె ఆగిపోయింది. అప్పటి వరకు తనతో కలిసి ఉన్న కుమార్తె, భార్య నిముషాల వ్యవధిలో ప్రాణాలు విడవడంతో వారి మృతదేహాల వద్ద కన్నీటిపర్యంతమైన భర్తను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. ఈ హృదయ విదారక ఘటన అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే... విశాఖపట్నం ద్వారకానగర్‌కు చెందిన నిమ్మకాయల శ్రీనివాసరావు మూడేళ్ల కిందట దేవరాపల్లికి బతుకు తెరువు కోసం వచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సమీపంలోని అపార్టుమెంట్లో భార్య ఉషారాణి (51), మానసిక దివ్యాంగురాలైన కుమార్తె సాయి మేఘన (18)తో నివాసం ఉంటున్నారు. సాయి మేఘన తరచూ ఫిట్స్‌తో బాధపడుతుండేది. ఎప్పటి మాదిరిగానే మంగళవారం ఉదయం సాయి మేఘనకు ఫిట్స్ రావడంతో ఇంటిలో పడిపోయింది. తల్లిదండ్రులు ఆమెను ఎంత లేపినా లేవకపోవడంతో అనుమానం వచ్చి అదే అపార్టుమెంట్లో నివాసం ఉంటున్న వైద్యుడిని పిలిచారు. ఆయన వచ్చిచూసి సాయి మేఘన మృతి చెందినట్లు చెప్పారు. అప్పటి వరకు బాగానే ఉన్న తన కుమార్తె చనిపోయిందన్న విషయం తెలిసి ఆ మాతృమూర్తి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. కూతురు మరణవార్తను బంధువులకు ఫోన్లో చెబుతూనే ఉషారాణి గుండెపోటుకు గురై పక్కనే ఉన్న సోఫాలో కుప్పకూలిపోయింది. ఈ హటాత్ఫరిణామాన్ని చూసిన వారంతా ఆమె స్పృహ తప్పి పడిపోయిందని భావించి ముఖంపై నీళ్లు చల్లి పైకి లేపేందుకు ప్రయత్నించారు. ఆమె ఎంతకీ లేవకపోవడంతో అనుమానం వచ్చి మరలా వైద్యుడ్ని పిలిచారు. ఆయన వచ్చి చూసి గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. భార్య, కుమార్తె తనను ఒంటరి చేసి వెళ్లిపోయారని, తాను ఎవరి కోసం బతకాలని నిమ్మకాయల శ్రీనివాసరావు వారి మృతదేహాల వద్ద గుండెలవిసేలా రోదించిన తీరు పలువురి హృదయాలను కలిచివేసింది. నిముషాల వ్యవధిలోనే తల్లీ కుమార్తె మరణించడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంగళవారం సాయ ంత్రం తల్లీ కూతుళ్లకు అంత్యక్రియలు నిర్వహించారు. -
ఇంతై.. ‘ఇంతి’oతై..
ఈమె పేరు కొండా ఉషారాణి.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కికి చెందిన ఈమెకు తన 13వ ఏట వివాహమైంది. పెళ్లయిన మూడున్నరేళ్లకే భర్త చనిపోవడంతో తల్లితో పాటు తనకున్న ఇద్దరు పిల్లలను పెంచుకునేందుకు పొగాకు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా చేరింది. వచ్చే జీతం సరిపోకపోవడంతో రుణం తీసుకొని ఇంట్లోనే బట్టల దుకాణం ప్రారంభించింది. అయితే దొంగలు పడి బట్టలన్నీ దోచుకెళ్లారు. దీంతో కొన్నాళ్లు దిగాలు పడ్డ ఉషారాణి తన బిడ్డలను పోషించుకోవడానికి పడి లేచిన కెరటంలా నిలబడింది. కంపెనీల నుంచి బయో ఎరువులను తీసుకొని మార్కెటింగ్‌కు శ్రీకారం చుట్టింది. 10 ఏళ్ల పాటు ఊరూరా తిరుగుతూ వాటిని అమ్ముతూ కుటుంబానికి ఆసరాగా నిలిచింది. అంతేకాకుండా గోశాల నుంచి సేకరించిన గోమూత్రం, పేడ వ్యర్థాలతో స్వయంగా బయో ఎరువులు తయారు చేస్తూ రైతులకు విక్రయించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత సొంతంగా పాడి గేదెలను కొనుగోలు చేసి బయో ఎరువుల తయారీ యూనిట్ పెట్టింది. తాను స్వయంశక్తితో నిలదొక్కుకోవడమే కాకుండా పది మందికి ఉపాధి కల్పిస్తోంది. అంతటితో ఆగకుండా తనకున్న 1.40 ఎకరాలతో పాటు మరో ఆరెకరాలు కౌలుకు తీసుకొని ప్రకృతి సాగు చేపట్టింది. వరితో పాటు మిరప, మునగ, పసుపు, కాలీఫ్లవర్ పంటలను సాగు చేస్తోంది. ఇటీవల స్త్రీ (శాస్త్ర, సాంకేతిక, పరిశోధన, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం) అవార్డును అందుకుంది. మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లా.. రెండో అబ్బాయి పుట్టిన మూడు నెలలకే భర్త చనిపోయారు. ఏం చేయాలో పాలుపోలేదు. జీవితం ఎన్నో పాఠాలు నేర్పింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. అయినా మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లా – కొండా ఉషారాణి, మహిళా రైతు, నూతక్కి, గుంటూరు జిల్లా -
పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు నేత ఉషారాణి
-
భూముల రీసర్వేకు రూ.987.46 కోట్లు
సాక్షి, అమరావతి: అత్యాధునిక టెక్నాలజీతో రాష్ట్రవ్యాప్తంగా భూములను సమగ్రంగా రీసర్వే చేసేందుకు ప్రభుత్వం రూ.987.46 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు పరిపాలన ఆమోదం తెలుపుతూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం’ అని వ్యవహరించనున్నారు. ఈనెల 5వతేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ పేరు ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం వ్యవసాయ భూములు, గ్రామ పంచాయతీలు, పట్టణాల్లోని స్థలాలు రీసర్వే ప్రాజెక్టు పరిధిలోకి వస్తాయి. డ్రోన్లు, కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ (కార్స్) నెట్‌వర్క్‌తో చేపట్టనున్న రీసర్వే ప్రాజెక్టుకు రూ.987.46 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం ప్రారంభమవుతుంది. మూడు దశల్లో రీ సర్వే పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు. సుపరిపాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అత్యంత ప్రాధాన్య కార్యక్రమాల్లో భూముల సమగ్ర రీసర్వే ప్రాజెక్టు ప్రధానమైనది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వంద శాతం కచ్చితమైన కొలతలలో రాష్ట్రవ్యాప్తంగా భూములను రీ సర్వే చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. భూ రికార్డులను స్వచ్ఛీకరించడంతోపాటు ట్యాంపర్డ్ ఫ్రూఫ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్స్ టెక్నాలజీ ద్వారా వీలైనంత తక్కువ ధరకు పరికరాలు కొనుగోలు చేయనున్నారు. ఇందుకోసం బడ్జెట్లో ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించింది. -
సీనియర్ నటి ఉషారాణి కన్నుమూత
సినిమా: సీనియర్ నటి ఉషారాణి(65) ఆదివారం కన్ను మూశారు. ఇటీవల అనారోగ్యానికి గురై చెన్నైలోని ఒక ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం మృతి చెందారు. ఈమె మలయాళ దర్శకుడు శంకర్ నాయార్ను 1971లో వివాహం చేసుకున్నారు. తమిళంతో పాటు మలయాళంలో 200 పైగా సినిమాల్లో నటించారు. చివరిగా తమిళంలో 2004లో మైలాటం చిత్రంలో నటించారు. భౌతిక కాయానికి పోరూర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతిపై దక్షిణ భారత నటీనటుల సంఘం సంతాపం ప్రకటించింది. -
వైఎస్సార్ జగనన్న కాలనీలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి.. ఇళ్లు కట్టించే కాలనీలకు వైఎస్సార్ జగనన్న కాలనీలు అని పేరు ఖరారు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి శుక్రవారం జీవో జారీ చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య కార్యక్రమమైన ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 25 లక్షల మందికి ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. సంతృప్త స్థాయిలో కులం, జాతి, మతంతో సంబంధం లేకుండా అర్హులందరికీ నివాస స్థల పట్టాలు ఇచ్చి ఇళ్లు నిర్మించనుంది. మిషన్ మోడ్‌లో స్థలాలు ఇచ్చి.. ఇళ్లు నిర్మించేందుకు విధివిధానాలు రూపొందించి అర్హులను ఎంపిక చేసింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్, జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి.’ అని జీవోలో పేర్కొన్నారు. -
నిరసిస్తే.. పోలీసుల పచ్చపాతం
సాక్షి, పులివెందుల: పోలీసులు తమ పక్షపాత ధోరణిని మరోసారి బయటపెట్టుకున్నారు. యురేనియం టెయిలింగ్ పాండ్ సమస్యను తీర్చాలని సమస్యను పరిష్కరించాలని ధర్నా చేసిన ఎంపీపీ లింగాల ఉషారాణి, ఎంపీటీసీ శ్రీరామిరెడ్డి మరో 30 మందిపై కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి... యురేనియం టెయిలింగ్ పాండ్ సమస్యను తీర్చాలని కొన్ని నెలలుగా యురేనియం అధికారులను ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వేముల ఎంపీపీ లింగాల ఉషారాణి, ఇతర ప్రజాప్రతినిధులు, రైతులు కోరుతున్నప్పటికీ యురేనియం అధికారులు ఆ సమస్యను తీర్చకుండా రైతులకు మభ్యపెట్టే మాటలు చెబుతూ కాలయాపన చేస్తూ వస్తున్నారు. రెండు నెలలక్రితం ఎంపీ ఢిల్లీలో సీఎండీ అస్నాని కలిసి టెయిలింగ్ పాండ్ వల్ల ఇక్కడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తేగా, ఆయన ఇటీవల ఈ ప్రాంతాన్ని సందర్శించారు. అప్పుడు నెలరోజుల్లోపు పరిష్కారం చూపుతానని, మళ్లీ ఇక్కడ పర్యటిస్తానని బాధిత రైతులకు హామీ ఇచ్చి ఇప్పటివరకూ ఆ సమస్యను పరిష్కరించలేదు. ఈ నేపథ్యంలో సోమవారం ఎంపీపీ ఉషారాణి రైతులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. కానీ నాలుగు రోజుల క్రితం మండలానికే చెందిన టీడీపీ నాయకుడు యురేనియం ప్రాజెక్టు వద్ద యురేనియం అధికారులు, ఉద్యోగులను ప్రాజెక్టు లోపలికి వెళ్లకుండా అడ్డుకొని దాదాపు వందమందితో ధర్నా చేశారు. అంతచేసినా పోలీసులు టీడీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. కేవలం అధికారపార్టీలో ఉన్నారు కాబట్టే వారిపై కేసులు నమోదు చేయకుండా వదిలేశారని, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేయడం వల్లే తమపై కేసులు నమోదు చేసి పక్షపాతం చూపుతున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని యురేనియం బా«ధిత రైతులు పేర్కొంటున్నారు. టెయిలింగ్ పాండ్ వల్ల ఇప్పటికే తమ పంటలు పండక తాగునీరు, సాగునీరు కలుషితమై మండలంలోని ఐదు గ్రామాల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటుంటే ఒక ప్రజాప్రతినిధిగా ఎంపీపీ ప్రజల కోసం ధర్నా చేశామని, ఇంతమాత్రానికే కేసులు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కూడా ఈ ప్రభుత్వం హరించేస్తుందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
8 కిలోల కణితి తొలగింపు
సాక్షి,తణుకు : తణుకులోని సాయిశ్వేత సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో ఓ మహిళకు అరుదైన శస్త్రచికిత్స చేసి సుమారు 8 కిలోల బరువున్న కణితిని తొలగించారు. తాడేపల్లిగూడెంకు చెందిన మహిళ అనారోగ్యంగా ఉండటంతో వైద్యురాలు డాక్టర్ ఉషారాణిని సంప్రదించింది. స్కానింగ్ చేసి కడుపులో కణితి ఉందని గుర్తించారు. డాక్టర్ ఉషారాణి, సత్యనారాయణలతో పాటు మత్తు వైద్యనిపుణులు నారాయణరావు పర్యవేక్షణలో శస్త్రచికిత్స నిర్వహించి కణితిని తొలగించారు. 15 ఏళ్ల క్రితమే గర్భసంచిని తొలగించే ఆపరేషన్ జరిగిందని, అప్పటి నుంచి శరీరం పెరుగుతోందనే ఉద్దేశంతోనే రోగి నిర్లక్ష్యం వహించిందని వైద్యురాలు చెప్పారు. -
శాలిగౌరారం ఎస్ఐకి పుత్రికాశోకం
డెంగీ జ్వరంతో కుమార్తె ఉషారాణి మృతి శాలిగౌరారం (తుంగతుర్తి) : శాలిగౌరారం ఎస్ఐ శ్రీరాముల అయోధ్య రెండో కుమార్తె ఆకుల ఉషారాణి(28) డెంగీతో బాధపడుతూ మంగళవారం మృతిచెందింది. నిండు గర్భిణిగా ఉన్న ఉషారాణి హైదరాబాద్‌లో తన తల్లిదండ్రుల వద్ద ఉండగా డెంగీ జ్వరం వచ్చింది. ఆమెను హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం డెంగీ జ్వరం అధికం కావడంతో పాటు ఇన్ఫెక్షన్ సోకడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పరిస్థితి విషమించి మంగళవారం మృతిచెందారు. ఉషారాణి మృతదేహాన్ని ఎస్ఐ స్వగ్రామమైన అడ్డగూడూరు మండలంలోని చిర్రగూడూరుకు తరలించారు. బంధువులు, స్నేహితుల సందర్శన అనంతరం అంత్యక్రియల కోసం ఉషారాణి మృతదేహాన్ని వారి స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కావలికి తరలించారు. బుధవారం కావలిలో ఉషారాణి అంత్యక్రియలు జరుపనున్నట్లు బాధిత కుటింబీకులు తెలిపారు. నివాళులర్పించిన మందుల సామేల్.. శాలిగౌరారం ఎస్ఐ శ్రీరాముల అయోధ్య కుమార్తె ఉషారాణి మృతదేహాన్ని చిర్రగూడూరులో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ సందర్శించి.. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కన్నీటి పర్యంతమవుతున్న ఎస్ఐ అయోధ్యను ఓదార్చి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. -
ఐపీఎస్ అధికారి భార్య ఆత్మహత్య
- హైదరాబాద్ అడిషనల్ సీపీ శివప్రసాద్ సతీమణి ఉషారాణి బలవన్మరణం హైదరాబాద్: తెలంగాణ పోలీసు శాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తోన్న శివప్రసాద్ భార్య ఉషారాణి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లోని ప్రకాశ్‌నగర్‌లో గల తమ నివాసంలో ఉషారాణి ఉరివేసుకున్నారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు సాయంత్రం 5 గంటలకు ఆమెను కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేరేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఉషారాణి కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఉషారాణి పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆమె భర్త శివప్రసాద్ హైదరాబాద్‌లో సీఏఆర్ అడిషనల్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. భార్య మృతితో విషాదంలో కూరుకుపోయిన శివప్రసాద్‌కు పలువురు నేతలు, అధికారులు ఓదార్చారు. -
బాబుకు ఆడబిడ్డలుంటే తెలిసొచ్చేది
- ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా - విద్యార్థులు పిట్టల్లా రాలుతున్నా పట్టించుకోరా? సాక్షి, హైదరాబాద్: ‘చంద్రబాబుకు ఆడబిడ్డలు లేరు కాబట్టి వారి విలువేంటో, వారి బాధేంటో తెలియడంలేదు. ఆడపిల్లల తల్లిదండ్రుల ఆందోళన, ఆక్రందన, ఆవేదన అర్థం కావడంలేదు. కానీ, చంద్రబాబును కన్నదొక మహిళ. సంసారం చేసేది ఒక మహిళ. కోడలు కూడా మహిళేనన్న సంగతిని ఆయన గుర్తించాలి. మహిళలకు రక్షణ ఇవ్వలేని సీఎం రాష్ట్రంలో ఉన్నా లేకపోరుునా ఒకటే’ అని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ధ్వజమెత్తారు. చంద్రబాబుకు బీచ్ ఫెస్టివల్, బీర్ పార్లర్లపై ఉన్న శ్రద్ధ ఆడపిల్లల జీవితాలు కాపాడటంలో లేదని మండిపడ్డారు. ఆమె శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులకు, మహిళలకు రక్షణ కల్పించలేని చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిలో ఉంటే ఎంత? ఊడితే ఎంత? అని ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలో ఉషారాణి అనే ఇంజినీరింగ్ విద్యార్థిని చనిపోరుు ఒక రోజైనా గడవక ముందే అదే జిల్లాలో చైతన్య కళాశాలలో చదువుతున్న లోక్‌నాథ్ చౌదరి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం దారుణమన్నారు.ఆయన పాలనలో మహిళలపై అఘారుుత్యాలు, అత్యాచారాలు, అరాచకాలు, విద్యార్థుల ఆత్మహత్యల్లో నెంబర్ ఒన్ అరుుందని విమర్శించారు. కుల గజ్జి, పార్టీ గజ్టి, దోపిడీదారుల గజ్జితో ప్రభుత్వ పెద్దలు నిందితులను కాపాడటం వల్లనే విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. తొలి తప్పు జరిగినపుడే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు. విద్యార్థుల ఆత్మహత్యలపై ఐఏఎస్ అధికారి చక్రపాణి, పద్మావతీ మహిళా యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్ రత్నకుమారితో ఏర్పాటైన కమిటీ నివేదిక ఏమైందో తెలపాలని ఆమె డిమాండ్ చేశారు. మంత్రివర్గంలో రావణాసురులు చంద్రబాబు మంత్రివర్గంలో రావణాసురులున్నారని రోజా మండిపడ్డారు. గంటా శ్రీనివాసరావు, నారాయణ, కామినేని శ్రీనివాస్... ఇలా అందరూ ఆడవారి జీవితాలతో చెలగాటం ఆడుతున్న వారేనని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తహశీల్దారు వనజాక్షిని ఈడ్చి దౌర్జన్యం చేస్తే చర్య తీసుకోలేదన్నారు. ఉషారాణితో పాటు విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించాల్సిన గంటా విదేశాల్లో వినోదం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఉషారాణి ర్యాగింగ్‌కు గురవుతోందని సాక్షాత్తూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ... గంటాను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ర్యాగింగ్ చేసే వారికి టీసీలు ఇచ్చి పంపాలని, లైంగిక వేధింపులకు పాల్పడిన అధ్యాపకులను పోలీసులకు అప్పగించాలని, ఆత్మహత్యలపై వేసిన కమిటీ ఇచ్చిన నివేదికను బయట పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. -
బాబుకు ఆడబిడ్డలుంటే తెలిసొచ్చేది
-
అదృశ్యమైన బీటెక్ విద్యార్థిని ఏమైందో!
హైదరాబాద్‌సిటీ: కాలేజీకి వెళ్లి వస్తానమ్మా అంటూ ఇంట్లో చెప్పి వెళ్లిన బీటెక్ విద్యార్థిని ఏమైందో ఇప్పటివరకూ మిస్టరీగానే ఉంది. ఈ సంఘటన మల్కాజిగిరి పీఎస్ పరిధిలో జరిగింది. జేఎల్‌ఎస్‌నగర్‌కు చెందిన కృష్ణగౌడ్ కుమార్తె ఉషారాణి (22) అనే విద్యార్థిని సీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ నాల్గో సంవత్సరం చదువుతోంది. ఎప్పటిలానే ఈ నెల 10న కాలేజీకి వెళుతున్నానంటూ చెప్పి వెళ్లిన విద్యార్థిని ఉషారాణి అదృశ్యమైంది. విద్యార్థిని సెల్‌ఫోన్ కూడా స్విచ్ఆఫ్ అని వస్తుండటంతో ఆమె జాడ తెలుసుకోవడం కుదరలేదు. దాంతో కంగారుపడిన విద్యార్థిని తల్లిండ్రులు ఆమె స్నేహితులను, బంధువులను ఆరా తీశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆదివారం విద్యార్థిని తండ్రి కృష్ణగౌడ్ ఎస్ఐ మోహన్‌కు ఫిర్యాదు చేశాడు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పతాకావిష్కరణ సమయంలో పెట్రోల్ పోసుకొన్న టీచర్
పాఠశాల ఆవరణలో ఆత్మహత్యాయత్నం బొబ్బిలి : హెచ్.ఎం. తనను వేధిస్తున్నారంటూ ఒక టీచర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం పతాకావిష్కరణ సమయంలో ఆమె స్కూల్ ఆవరణలోనే ఇందుకు యత్నించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వేణుగోపాల ప్రాథమిక పాఠశాలలో శనివారం ఈ సంఘటన జరిగింది. ఆ పాఠశాల హెచ్ఎం లక్ష్ముంనాయుడుకు, ఎస్జీటీ ఉషారాణిల మధ్య్ల విభేదాలున్నాయి. అవి పెచ్చుమీరి ఆమె ఆత్మహత్యయత్నం చేసే వరకూ వచ్చింది. పతాకావిష్కరణకు సిద్ధమవుతున్న సమయంలో ఉషారాణి శరీరంపై పెట్రోలు పోసుకున్నారు. అక్కడున్న సిబ్బంది అప్రమత్తమై ఆమె నుంచి పెట్రోల్ క్యాన్‌ను లాగేసుకొన్నారు. అక్కడకు వచ్చిన పిల్లలంతా పరుగులు తీశారు. పతాకావిష్కరణ కూడా ఆగిపోయింది. ఉన్నతాధికారుల ఉత్తర్వులు మేరకు తాను రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణాకార్యక్రమాలకు వెళుతుంటే హెచ్ఎం కక్షసాధింపునకు పాల్పడుతున్నారని, తనను చెడ్డగా చిత్రీకరించడానికి ప్రయత్నాలు చేస్తూ, మానసికంగా హింసిస్తున్నారని ఉషారాణి వాపోయారు. -
'అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వండి'
వేముల (వైఎస్సార్ జిల్లా): వేముల మండలంలో అర్హులైనవారందరికీ పింఛన్లు మంజూరుచేయాలని వైఎస్సార్ జిల్లా వేముల మండలప్రజాపరిషత్ అధ్యక్షురాలు ఉషారాణి ఎంపీడీవోకు సూచించారు. సోమవారం జరిగిన మండల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పింఛన్లు అందక ఇబ్బందిపడుతున్నారని, అర్హులైన వారందరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. -
పట్టు రైతులందరికీ డ్రిప్
మడకశిర : పట్టురైతులందరికీ దరఖాస్తు చేసుకున్న వెంటనే డ్రిప్ సౌకర్యం కల్పించాలని తమ శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర పట్టుపరిశ్రమ శాఖ కమిషనర్ వి.ఉషారాణి తెలిపారు. అది కూడా ఏపీఎంఐపీ నియమనిబంధనల ప్రకారం కాకుండా పట్టుపరిశ్రమ శాఖ నియమనిబంధనల ప్రకారం మంజూ రు చేస్తామని తెలిపారు. గురువారం మడకశిరలోని శ్రీయాదవ కల్యాణమంటపంలో కేంద్ర పట్టుమండలి, రాష్ట్ర పట్టుపరిశ్రమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పట్టురైతు సమ్మేళనాన్ని కేంద్ర పట్టుమండలి డెరైక్టర్ శివప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో కమిషనర్‌తోపాటు హిందూపురం ఎంపీ నిమ్మల క్రిష్టప్ప, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఈరన్న పాల్గొన్నారు. కమిషనర్ ఉషారాణి మాట్లాడుతూ జిల్లాలో 30 వేల ఎకరాల విస్తీర్ణంలో మల్బరీ సాగు అవుతోందన్నారు. ఇంత వరకు అందులో 10వేల ఎకరాలకు మాత్రమే డ్రిప్ సౌకర్యం ఉందన్నారు. మిగిలిన 20వేల ఎకరాలకు రైతులు దరఖాస్తు చేసుకున్న వెంటనే డ్రిప్ సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో పట్టుపరిశ్రమ శాఖ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లోకాస్ట్ రేషం షెడ్ల నిర్మాణంపై అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం తమ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు తమిళనాడు రాష్ట్రానికి వెళ్లినట్లు తెలిపారు. పట్టు రైతులకు అనుకూలంగా ఉంటే లోకాస్ట్ షెడ్ల నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో పట్టు రైతుల అభివృద్ధికి ప్రస్తుతం రూ.2కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నాయన్నారు. వీటితో పట్టు రైతుల అభివృద్ధికి వివిధ కార్యక్రమాలను చేపడతామన్నారు. డ్రిప్ సౌకర్యానికి వందశాతం సబ్సిడీ ఇస్తే ఈ కార్యక్రమం విజయవంతం కాదన్నారు. ఏ పథకమైనా రైతుల భాగస్వామ్యం ఉంటేనే విజయవంతం అవుతుందని తెలిపారు. పట్టు రైతులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకుని అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా అభివృద్ధి సాధించాల్సి ఉంటుందన్నారు. నాణ్యమైన పట్టుగూళ్లను ఉత్పత్తి చేస్తే ధర కూడా ఆశించిన స్థాయిలో లభిస్తుందన్నారు. కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో తక్కువ నీటితో మల్బరీ సాగు చేస్తే రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉందన్నారు. చదువుకున్న రైతులు వ్యవసాయం వైపు దృష్టిపెడితే నష్టాలు తగ్గడానికి అవకాశం ఉందన్నారు. కేంద్ర పట్టుమండలి డెరైక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ పట్టు రైతులు నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకుని పట్టుగూళ్ల ఉత్పత్తిలో అధిక దిగుబడి సాధించాలని కోరారు. హిందూపురం ఎమ్పీ నిమ్మల క్రిష్టప్ప మాట్లాడుతూ ప్రోత్సహిస్తే మన దేశంలో చైనా, జపాన్ల కన్నా పట్టుపరిశ్రమ మరింత అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తి పెరిగినా పట్టుగూళ్ల నాణ్యత మెరుగుపడాలన్నారు. ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ మన దేశంలో మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకం విధానం తెలుసుకోవడానికి అభివృద్ధి చెందిన జపాన్ దేశస్తులు కూడా వస్తుండటం మనకు గర్వకారణమన్నారు. ఎమ్మెల్యే ఈరన్న మాట్లాడుతూ పట్టు రైతులకు ప్రస్తుతం అందిస్తున్న సబ్సిడీని మరింత పెంచాలని కోరారు. ఈ సమావేశంలో కేంద్రపట్టుమండలి జాయింట్ డెరైక్టర్ సత్యనారాయణరాజు, పట్టుపరిశ్రమ శాఖ జాయింట్ డెరైక్టర్ అరుణకుమారి, స్థానిక అసిస్టెంట్ డెరైక్టర్ శషాంక్రెడ్డి, పట్టుపరిశ్రమ శాఖ శాస్త్రవేత్తలు, కేంద్ర పట్టుమండలి, పట్టుపరిశ్రమశాఖ అధికారులు, జపాన్ బృందం, నియోజకవర్గంలోని పట్టు రైతులు పాల్గొన్నారు. -
తండ్రికి తనయ తలకొరివి
అంబాజీపేట : నిండు జీవితాన్ని గడిపి, పండుటాకులా రాలిపోయిన ఆయనకు తలకొరివి పెట్టడానికి కొడుకులు లేకపోవడం ఓ లోటని అంతా భావించారు. అయితే.. పెద్ద కుమార్తె ఆ కర్తవ్యాన్ని పూర్తి చేసి తండ్రి రుణం తీర్చుకుంది. అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు మాజీ సర్పంచ్ యనమదల శ్రీరామమూర్తి(93) బుధవారం కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. జిల్లా ఎక్సైజ్ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్న పెద్ద కుమార్తె హేమ సీతామహాలక్ష్మి తానే అంత్యక్రియలు నిర్వహించి, తలకొరివి పెట్టింది. మిగిలిన ఇద్దరు కుమార్తెలు మణికుమారి, ఉషారాణి అంత్యక్రియల్లో పాలు పంచుకున్నారు. శ్రీరామమూర్తి 1956లో పుల్లేటికుర్రులో మొట్టమొదటి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. రెండుసార్లు ఆ పదవిని చేపట్టిన ఆయన గ్రామాభివృద్ధికి పాటు పడ్డారు. స్వాతంత్య్ర సమరంలోనూ పాల్గొన్నట్టు బంధువులు తెలిపారు. ఆయన మృతి పట్ల సర్పంచ్ కాండ్రేగుల గోపాలకృష్ణ, ఎంపీపీ దాసరి వీరవెంకట సత్యనారాయణ, బీజేపీ నాయకులు కుడుపూడి సూర్యనారాయణ సంతాపం వ్యక్తం చేశారు. -
ఉషారాణికి న్యాయం చేయాలి
మక్కువ : నిశ్చితార్థం జరిగిన తర్వాత ఎక్కువ కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని చెబుతున్న ఏఆర్ కానిస్టేబుల్ గోవిందపై చర్యలు తీసుకుని బాధితురాలు ఉషారాణికి న్యాయం చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి డిమాండ్ చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా శనివారం స్థానిక పోలీ స్ స్టేషన్ ఎదుట ఐద్వా, సీపీఎం, రైతు సంఘం, సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ రామభద్రపురం మండలం తారాపురం గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ తుమరాడ... మక్కువ గుళ్లమజ్జి వీధికి చెందిన చోడవరపు ఉషారాణిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని పెద్దల సమక్షంలో నిచ్చితార్థం చేసుకున్నాడని, ఇప్పుడు పెళ్లికి ముఖం చాటేయడం దారుణమన్నారు. ఈ విషయమై బాధితురాలు గతంలో ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ నెల 22న మక్కువ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులకు విన్నవించుకుందని తెలిపారు. అయినా గోవింద, ఆయన కుటుంభసభ్యులపై పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోలేదన్నారు. ఈ నెల 26న సాలూరు సీఐ దేముళ్లు కానిస్టేబుల్ గోవింద తల్లిదండ్రులను స్టేషన్‌కు రప్పిస్తామని చెప్పినా ఇంతవరకు తీసుకురాలేదన్నారు. సీపీఎం నేత చింతల తవిటినాయుడు, రైతు సంఘం జిల్లాకార్యదర్శి కొల్లిగంగునాయుడు, సీఐటియూ నాయకుడు కె.శ్రీనువాసరావు లు మాట్లాడుతూ సీఐ వచ్చి హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో ఏఎస్ఐ గౌరీశంకర్ సంఘటన స్థలానికి వెళ్లి ప్రజాసంఘాల నాయకులు, బాధితురాలితో మాట్లాడారు. గోవిందపై కేసు నమోదు చేసి గాలిస్తున్నామని చెప్పారు. అనంతరం బాధితులు సీఐ దేముళ్లతో మాట్లాడాలని కోరడంతో ఏఎస్ఐ వెంటనే సీఐకు ఫోన్ చేసిన విషయం తెలిపా రు. గోవింద తల్లిదండ్రులను స్టేషన్‌కు రమ్మని పిలిచామని సీఐ తెలిపారు. దీంతో బాధితురాలు, ప్రజాసంఘాల నాయకులు ఆందోళన విరమించారు. -
పాత విధానంలో పరీక్షలు
విజయనగరం అర్బన్ : పదో తరగతి పరీక్షల విధానంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఈ ఏడాదికి పాత పద్ధతిలోనే నిర్వహించాలని పాఠశాల విద్య కమిషనర్ ఉషారాణిఆదేశాలు జారీచేశారు. గురువారం సాయంత్రం నిర్వహిం చిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆమె ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. హిందీ పరీక్షకు 35 మార్కుల ఉత్తీర్ణత అర్హతను పెంచుతూ మిగిలిన పరీక్షలన్నీ పాత పద్ధతిలోనే ఈ ఏడాదికి నిర్వహించాలని స్పష్టం చేశారు. దీంతో కొన్ని రోజు లుగా పదో తరగతి పరీక్షల విధానంపై నెలకొన్నసందిగ్ధం వీడింది. విద్యా సంవత్సరం ప్రారంభమై 40 రోజులు పూర్తయినా ఇంతవరకూ 9, 10 వ తరగతుల విద్యార్థులకు ఇంతవరకు ఫార్మేటివ్-1 (యూనిట్) పరీక్షలు నిర్వహించలేదు. పాత పద్ధతిలో పరీక్షలు జరపాలా? కొత్త విధానంలో నిర్వహించాలా అనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఈ విద్యాసంవత్సరం నుంచి పదో తరగతి సిలబస్ పూర్తిగా మారింది. నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) పద్ధతిలో పాఠ్యపుస్తకాలు ఇచ్చారు. దీని ప్రకారం టెన్త్ విద్యార్థులకు ఫార్మేటివ్ (యూనిట్ టెస్ట్‌లు), సమ్మేటివ్-1(క్వార్టియర్లీ), -2(అర్ధ సంవ త్సర), -3(సంవత్సరాంత) పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలి. ఇందులో గతంలో లాగా 11 పేపర్లు కాకుండా 9 పేపర్లు మాత్రమే ఉంటాయి. కానీ ఇప్పుడీ విధానంలో కాకుండా పాత పద్ధతిలోనే పరీక్షలు నిర్వహిస్తారు. తొమ్మిదిలో కొత్తది.. పదికి వచ్చిన ఆ విద్యార్థులకు పాత పరీక్ష గత ఏడాది నూతన సిలబస్ పాఠ్యపుస్తకాలు వచ్చిన 9వ తరగతి విద్యార్థులకు తొలిసారిగా నూతన పద్ధతిలోనే ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలు జరిగాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది పదోతరగతికి వచ్చిన ఆ బ్యాచ్ విద్యార్థులకు నూతన పద్ధతిలో పరీక్షలు జరిపించాలని కొందరి అభిప్రాయం. అయితే తాజా నిర్ణయం మేరకు 10వ తరగతి విద్యార్థులకు 8వ తరగతిలో రాసిన విధంగానే పాత పద్ధతిలో పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో పాఠ్యపుస్తకాల కొత్త సిలబస్‌తో పాత పద్ధతిలో పరీక్షలు జరపాలనే నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షలు ఆలస్యం సాధారణంగా అన్ని తరగతులకు ఫార్మేటివ్-1 పరీక్షలు జూలై 31లోపు నిర్వహిస్తారు. ఈ మేరకు జిల్లా పరీక్షల నిర్వహణ మండలి (డీసీఈబీ) నుంచి ఆదేశాలు కూడా వెళ్లాయి. ఈ పరీక్షలకు ఉపాధ్యాయులే ప్రశ్నపత్రాలు తయారు చేసుకుంటారు. అయితే కొత్త పాఠ్యపుస్తకాలు కావడంతో ప్రశ్నపత్రాల మోడల్స్‌ను ఉన్నతాధికారులు ఇవ్వాల్సి ఉంది. ప్రశ్నపత్రాల మోడల్స్ ఎప్పుడిస్తారో అధికారులు స్పష్టత ఇవ్వకపోవడం వల్ల ఇప్పట్లో పరీక్షలు జరిగే అవకాశం కనిపించడంలేదు. మరో వైపు బడిపిలుస్తోంది, ప్రాథమికోన్నత స్థాయి ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పరీక్షలు 15 రోజుల లోపు ప్రారంభించే అవకాశం కనిపించడం లేదని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు. మరోవైపు ఇప్పటికే జరగాల్సిన 1 నుంచి 8వ తరగతి విద్యార్థుల ఫార్మేటివ్-1 పరీక్షలు కూడా జరగలేదు. ఈ పరీక్షలపై రాజీవ్ విద్యామిషన్ అధికారులు నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఇంతవరకూ పరీక్షా పత్రాల తయారీగాని, పరీక్షల షెడ్యూల్గాని ప్రకటించలేదు. -
రుచించని మధ్యాహ్న భోజనం
పథకంపై పర్యవేక్షణ లోపం చైల్డ్‌రైట్స్ సెల్‌కు ఫిర్యాదుల వెల్లువ డీఈవోపై విద్యాశాఖ డెరైక్టర్ ఫైర్ విశాఖపట్నం : విశాఖ ఏజెన్సీలో ఎక్కువుగా డ్రాప్ఔట్స్ ఎందుకు ఉంటున్నారు? మధ్యాహ్న భోజన పథకంపై ఎందుకు పర్యవేక్షణ చేపట్టడం లేదు? పాఠశాలల తనిఖీలు ఎందుకు నిర్వహించడం లేదు? చైల్డ్‌రైట్స్ సెల్‌కు ఎక్కువుగా ఈ జిల్లా నుంచే ఎందుకు ఫిర్యాదులు వస్తున్నాయంటూ రాష్ట్ర విద్యాశాఖ డెరైక్టర్, ఎస్ఎస్ఏ పి.డి.ఉషారాణి విశాఖ డీఈఓ వెంకటకృష్ణారెడ్డిని ప్రశ్నించారు. మధ్యాహ్నభోజన పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని, భోజనంలో నాణ్యత లేదని వచ్చిన ఫిర్యాదులపై ఆమె డీఈఓను ప్రశ్నించారు. విజయనగరం, విశాఖ జిల్లాల్లో మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకలు ఎక్కువగా జరుగుతున్నాయని చైల్డ్‌రైట్స్ సెల్‌కు ఆయా జిల్లాల విద్యార్థులే ఫిర్యాదులు చేశారని ఆమె తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం ఉత్తరాంధ్ర విద్యాశాఖాధికారుల సమీక్షా సమావేశం జరిగింది. అవకతవకలకు పాల్పడిన మండల విద్యాశాఖాధికారులతో పాటు ఆయా పాఠశాలల హెచ్ఎంలకు త్వరలోనే షోకాజ్ నోటీసులివ్వనున్నట్లు ఉషారాణి వెల్లడించారు. మధ్యాహ్నభోజన పథకంలో సమస్యలున్న వారు చైల్డ్‌రైట్స్ సెల్ 18004253525 నెంబరుకు సంప్రదించాలన్నారు. విద్యారంగంలో విశాఖ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో అన్ని మండలాల ఎంఈఓలకు నెట్ సదుపాయం కల్పించామన్నారు. జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ మాట్లాడుతూ ప్రతిపాఠశాలలోనూ మరుగుదొడ్లు నిర్వహణ సరిగా జరగడంలేదని మరుగుదొడ్ల నిర్వహణపై మూడు వారాల్లో సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వాలన్నారు. సమస్యలు ఏకరువు పెట్టిన ఎమ్మెల్యేలు ప్రభుత్వ పాఠశాలల్లో పనితీరు, మౌలిక వసతులు లేకపోవడంపై ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా మాట్లాడారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ విద్యాహక్కు చట్టాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయడం లేదన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో డొనేషన్లు నియంత్రించాలన్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే వి. అనిత ప్రసంగిస్తూ మధ్యాహ్న భోజన పథకం వ్యవస్థలో మార్పులు తీసుకురావాలన్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ గాజువాకలో ఉన్న జెడ్పీ హైస్కూళ్లను మున్సిపల్ పరిధిలోకి తేవాలన్నారు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేవాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో చాలా పాఠశాలల్లో మంచినీటి సదుపాయం లేదన్నారు. ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యావిధానాన్ని చాలెంజ్‌గా తీసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ విద్యా విధానాన్ని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ లాలం భవానీతో పాటు మూడు జిల్లాల విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, డిప్యూటీ డీఈవోలు, సర్వశిక్షా అభియాన్ పీవోలు పాల్గొన్నారు. ఏజెన్సీలో టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు విశాఖ ఏజెన్సీలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను స్థానికంగా ఉంటున్న బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులతో భర్తీ చేయాలని ఐటీడీఏ పీఓకు సూచించినట్లు ఎస్ఎస్ఏ ప్రాజెక్టు డెరైక్టర్ ఉషారాణి తెలిపారు. సమీక్షా సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ వీరి నియామానికి సంబంధించిన నిధులను ఐటీడీఏ పీవోకు ఇచ్చినట్లు తెలిపారు. విద్యుత్ శాఖ సీఎండీపై గంటా గరంగరం తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ శేషగిరిబాబుపై రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉత్తరాంధ్ర జిల్లాల విద్యాశాఖా అధికారుల సమావేశంలో మంత్రి మాట్లాడుతున్న సమయంలో కరెంట్ పోయింది. పదినిమిషాలు పవర్ రాకపోవడంతో మంత్రి గంటాతో పాటు నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, అధికారులు కొంత ఇబ్బందికి గురయ్యారు. దీంతో మంత్రి గంటా విద్యుత్ సంస్థ సీఎండీకి ఫోన్ చేసి వేళాపాళా లేకుండా కరెంట్ ఎలా తీస్తారని ప్రశ్నించారు. ఈ రోజు జిల్లా పరిషత్‌లో సమీక్షా సమావేశం జరుగుతోందని తెలియదా.. రోజూ పత్రికలు చదవరా ..అంటూ శేషగిరిబాబుపై మండిపడ్డారు. -
ప్రశాంతంగా డీసెట్
కర్నూలు (విద్య): డీఎడ్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన డైట్‌సెట్-2014(డీసెట్) ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు రావాలని అధికారులు ఆదేశించడంతో అభ్యర్థులు మారుమూల గ్రామాల నుంచి ఉదయం 9 గంటలకంతా పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఉర్దూ మీడియానికి సంబంధించి పరీక్ష కేంద్రాలను డోన్‌లో ఏర్పాటు చేయడంతో పలువురు ముస్లిం మైనార్టీ మహిళా అభ్యర్థినులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కర్నూలులో 73, డోన్‌లో 10 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 92.2శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. తెలుగు మీడియంలో 17,944 మందికి గాను 16,522 మంది, ఉర్దూ మీడియంలో 931 మందికి 880 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నగరంలోని టౌన్ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖాధికారి కె.నాగేశ్వరరావు సందర్శించారు. అలాగే కర్నూలులో రాష్ట్ర పరిశీలకులు, డిప్యూటీ డెరైక్టర్(ట్రైనింగ్) ఉషారాణి, మోడల్ స్కూల్స్ డిప్యూటీ డెరైక్టర్ విజయలక్ష్మి పలు కేంద్రాలను పరిశీలించారు. -
ట్రాఫిక్ నిబంధనలు పాటించండి
గుమ్మడిపూండి, న్యూస్‌లైన్: ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని పొన్నేరి డీఎస్పీ ఉషారాణి సూచించారు. పొన్నేరి పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం ట్రాఫిక్ నిబంధనలపై కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత మోటార్ వాహనాల వాడకం పెరిగిందని, అతివేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు ప్రమాదాలకు ప్రధాన కారణమన్నారు. అందుకే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. చిన్న వయస్సు పిల్లలు సైతం మోటార్ సైకిల్స్ నడుపుతూ ఎలాంటి ట్రాఫిక్ నిబంధనలు తెలియక ప్రమాదాల బారిన పడుతున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకొంటే ప్రమాదాలను నివారించవచ్చునని తెలిపారు. అనంతరం పొన్నేరి అంబేద్కర్ సెంటర్, బస్టాండ్ సెంటర్, పళవేర్కాడు, బస్టాండ్, అన్నా విగ్రహం సెంటర్, రైల్వేస్టేషన్ రోడ్డుల్లో పోలీసులు కరపత్రాలను పంచారు. అలాగే షాపులు, హోటల్స్, అంగళ్లవద్ద కరపత్రాలు ప్రజలకు ఇచ్చి ట్రాఫిక్ నిబంధనలను వివరించారు. ఈకార్యక్రమంలో పొన్నేరి సిఐ రమేష్‌కుమార్, ఎస్ఐ రాజేంద్రన్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.