హైదరాబాద్‌సిటీ: కాలేజీకి వెళ్లి వస్తానమ్మా అంటూ ఇంట్లో చెప్పి వెళ్లిన బీటెక్ విద్యార్థిని ఏమైందో ఇప్పటివరకూ మిస్టరీగానే ఉంది. ఈ సంఘటన మల్కాజిగిరి పీఎస్ పరిధిలో జరిగింది. జేఎల్‌ఎస్‌నగర్‌కు చెందిన కృష్ణగౌడ్ కుమార్తె ఉషారాణి (22) అనే విద్యార్థిని సీవీఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ నాల్గో సంవత్సరం చదువుతోంది. ఎప్పటిలానే ఈ నెల 10న కాలేజీకి వెళుతున్నానంటూ చెప్పి వెళ్లిన విద్యార్థిని ఉషారాణి అదృశ్యమైంది. విద్యార్థిని సెల్‌ఫోన్ కూడా స్విచ్‌ఆఫ్ అని వస్తుండటంతో ఆమె జాడ తెలుసుకోవడం కుదరలేదు.
దాంతో కంగారుపడిన విద్యార్థిని తల్లిండ్రులు ఆమె స్నేహితులను, బంధువులను ఆరా తీశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆదివారం విద్యార్థిని తండ్రి కృష్ణగౌడ్ ఎస్‌ఐ మోహన్కు ఫిర్యాదు చేశాడు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అదృశ్యమైన బీటెక్ విద్యార్థిని ఏమైందో!
Published Sun, Jun 12 2016 7:17 PM | Last Updated on Mon, Sep 4 2017 2:20 AM
Advertisement
Advertisement