b tech student
-
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
పటాన్చెరు టౌన్: బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ çఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ ప్రవీణ్‌రెడ్డి కథనం ప్రకారం.. ఏపీలోని అనంతపురంలో విద్యుత్ శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్న నాగరాజు రెండో కూతురు వర్ష (19) పటాన్చెరు మండలంలోని గీతం విశ్వవిద్యాలయంలో బీటెక్ చదువుతోంది.అక్కడే బాలికల హాస్టల్లో ఉంటోంది. శుక్రవారం మధ్యాహ్నం ఆమె తన గదిలోకి వెళ్లి బెడ్‌షీట్‌తో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. కొద్దిసేపటి తర్వాత తోటి విద్యార్థినులు తలుపు కొట్టినా తీయకపోవడంతో వాచ్‌మన్ వచ్చి తలుపు పగులగొట్టి లోపలకు వెళ్లి చూడగా.. వర్ష ఫ్యాన్‌కు వేలాడుతూ కన్పించింది. -
సంగారెడ్డి: గీతం యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో బీటెక్ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. యూనివర్సిటీ భవనం అయిదవ అంతస్తు నుంచి దూకి రేణు శ్రీ(18) అనే యువతి శుక్రవారం బలవన్మరణానికి పాల్పడింది. యూనివర్సిటీలో చేరిన మూడు నెలల్లోనే విద్యార్థిని ఆత్మ హత్య చేసుకోడానికి గల కారణాలు తెలియల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పటాన్చెరు ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా రేణు శ్రీ కుటుంబం మాదాపూర్‌లో నివసిస్తోంది. కూతురు ఆత్మహత్య విషయం తెలుసుకొని హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్ధిని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణల విచారిస్తున్నారు. యువతి ఆత్మహత్య చేసుకుంటుండగా తోటి విద్యార్ధులు వీడియో తీయగా.. వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. గీతం యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న రేణుశ్రీ అనే యువతి బిల్డింగ్ 6వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. pic.twitter.com/mqA7ChvkBn— Telugu Scribe (@TeluguScribe) January 5, 2024 Video Credits: Telugu Scribe చదవండి: TS: గుండెపోటుతో టెన్త్ విద్యార్థి మృతి -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థుల దుర్మరణం
హైదరాబాద్: వారంతా బీటెక్ విద్యార్థులు.. వీకెండ్ కావడంతో సరదాగా గడుపుదామని వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ చూసేందుకు వచ్చారు.. తిరుగు పయనంలో రోడ్డు ప్రమాదం ఇద్దరిని బలితీసుకోగా.. మరో ఇద్దరిని ఆస్పత్రిపాలు చేసింది. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆలూరు బస్‌స్టేజీ సమీపంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్ కొంపల్లి ప్రాంతంలోని సెయింట్‌మారి్టన్ ఇంజనీరింగ్ కళాశాలలో చప్పిడి సోని (19), మండవ ప్రదీప్‌కుమార్ (19), అఖిల్, ఆర్యవర్ధన్ బీటెక్ సెకండియర్ పూర్తిచేసుకొని మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. నలుగురు కలిసి శనివారం వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌ను సరదాగా చూసేందుకు కారులో వచ్చారు. రాత్రి అక్కడే బస చేసిన వారు ఆదివారం ఉదయం తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో చేవెళ్ల మండలం ఆలూరు బస్‌స్టేజీ సమీపంలోకి రాగానే అతివేగంగా వస్తున్న వీరి కారు ఒక్కసారిగా అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. కారు వెనుకసీట్లో కూర్చొని ఉన్న సోని, ప్రదీప్‌కుమార్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ముందు సీట్లో ఉన్న అఖిల్, ఆర్యవర్దన్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు గమనించి అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారులో ఇర్కుపోయిన మృతదేహాలను బయటకు తీసి అంబులెన్స్‌లో చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. అఖిల్, ఆర్యవర్దన్‌కు ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యకోసం నగరంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. సరదాగా వెళ్లిన పిల్లలు విగతజీవులుగా మారడం చూసి వారు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పిల్లల చదువు కోసం.. పిల్లల చదువు కోసమని తల్లిదండ్రులు ఆంధ్రపదేశ్‌లోని ఆయా జిల్లాల నుంచి వచ్చి నగరంలో స్థిరపడ్డారు. చప్పిడి సోని తండ్రి మధుసూదన్‌రెడ్డిది కడప జిల్లా. అక్కడ మంచి ఉద్యోగం చేసే ఆయన పిల్లల చదువుకోసమని హైదరాబాద్‌లోని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో చేరి కర్మాన్‌ఘాట్‌లో నివాసం ఉంటున్నాడు. అన్నింట్లోనూ తమ కూతురు ముందుండేదని ఇలా జరుగుతుందనుకోలేదని బోరున విలపించారు. మండవ ప్రదీప్‌కుమార్ తండ్రి వెంకటశేషయ్యది ప్రకాశం జిల్లా ఒంగోలు. ఒక్కడే కొడుకు కావడంతో అతని చదువుకోసం హైదరాబాద్‌కు వచ్చి కేపీహెచ్‌బీ కాలనీ ధర్మారెడ్డి కాలనీలో ఉంటున్నారు. ఒక్కగానొక్క కుమారుడు బాగా చదివి కుటుంబానికి ఆసరా అవుతాడనుకుంటే అనంతలోకాలకు వెళ్లిపోవటంతో కుటుంబసభ్యులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. గాయపడిన అఖిల్‌ది అమీన్పూర్. సంగారెడ్డి జిల్లా పీవీఆర్కాలనీలో ఉంటున్నాడు. తండ్రి కారు తీసుకొని స్నేహితులతో కలిసి అనంతగిరికి వెళ్లారు. -
మిర్యాలగూడకు చెందిన బీటెక్ విద్యార్థి మిస్సింగ్ విషాదాంతం
-
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి దుర్మరణం
వారిది నిరుపేద కుటుంబం. పొలం కౌలుకు చేస్తూ.. నాలుగు గేదెలను సాకుతూ జీవనం సాగిస్తున్నారు. కొడుకును బాగా చదివించి విదేశాలకు పంపాలనేది వారి కల. అందుకోసం అప్పు తెచ్చి మరీ వరంగల్‌లో బీటెక్ చదివిస్తున్నారు. కానీ వారి కలను రోడ్డు ప్రమాదం మింగేసింది. మంగళవారం ఇంటికి వస్తానని ఫోన్ చేసిన కుమారుడు.. విగతజీవిగా వస్తున్నాడని తెలిసి ఆ తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. సాక్షి, మామునూరు/జనగామ: ఖమ్మం జాతీయ రహదారిపై వాహనాన్ని ఓవర్‌టెక్ చేయబోతూ ఎదురుగా వస్తున్న వాటర్ ట్యాంకర్‌ను ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బీటెక్ విద్యార్థి వినీత్‌రెడ్డి(22) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈఘటన సోమవారం రాత్రి ఖిలా వరంగల్ మండలం మామునూరు శివారు పంజాబ్ డాబా ఎదురుగా జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రఘునాథపల్లి మండలం నిడిగొండ శివారు తూర్పుగడ్డకు చెందిన గాదె సునీల్‌రెడ్డి, అనురాధ దంపతుల కుమారుడు వినీత్‌రెడ్డి. సొంతభూమి లేకపోవడంతో కౌలుకు తీసుకుంటూ వ్యవసాయం చేస్తున్నాడు. నాలుగు గేదెలను సాకుతూ పాలు పోస్తూ ఉపాధి పొందుతున్నారు. వినీత్‌రెడ్డిని బాగా చదివించి విదేశాలకు పంపాలనేది తల్లిదండ్రుల కోరిక. వినీత్ రంగశాయిపేటలో అద్దె గదిలో ఉంటూ బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సీఎస్ఈ చదువుతున్నాడు. 15 రోజుల క్రితం ఇంటికి వచ్చి వెళ్లాడు. రోజువారిగానే సోమవారం ఉదయం కళాశాలకు వెళ్లి తిరిగి రాత్రి 8.40 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై రూమ్‌కు బయల్దేరాడు. మామునూరు పోలీస్‌స్టేషన్ దాటిన తర్వాత పంజాబ్ నేషనల్ డాబా సమీపంలోకి రాగానే లారీని ఓవర్టేక్ చేయబోతూ ఎదురుగా వచ్చే వాటర్ ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న మామునూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందజేసి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. అనంతరం జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఎగిరిపడ్డ హెల్మెట్ వినీత్‌రెడ్డి హెల్మెట్ పెట్టుకుని బైక్‌పై వస్తున్నాడు. బలంగా ఢీకొనడంతో తలకు ఉన్న హెల్మెట్ ఎగిరి దూరంలో పడింది. దీంతో అతడి తల రోడ్డుకు బలంగా తాకడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. హెల్మెట్ తలకు ఉంటే బతికేవాడని అనుకుంటున్నారు. ఇంటికి వస్తానన్నాడు.. ‘మంగళవారం ఇంటికి వస్తానని కాలేజీకి వెళ్లేముందు ఫోన్ చేశాడు. కానీ విగతజీవిగా వస్తాడనుకోలేదు’అంటూ తల్లిదండ్రులు సునీల్‌రెడ్డి, అనురాధలు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడిపెట్టించింది. -
‘సీఎం జగనన్నకు విద్యార్థులంతా రుణపడి ఉంటాం’
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లా ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తిరుపతి నగరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తారకరామ స్టేడియంలో జరిగిన విద్యాదీవెన నగదు జమ కార్యక్రమంలో పాల్గొన్నారు. బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన సొమ్ము జమ చేశారు సీఎం జగన్. జగనన్న విద్యా దీవెన కింద 2022 జనవరి–మార్చి త్రైమాసికానికి గాను దాదాపు 10.85 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లను జమ చేశారు. ఈ కార్యక్రమంలో ‘జగనన్న విద్యాదీవెన పథకం’ ద్వారా లబ్ధిపొందిన బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి ఇందుమతి మాట్లాడింది. ఇవాళ తను ఇంజనీరింగ్ చదువుతున్నానంటే జగనన్నే కారణమని తెలపింది. సీఎం జగనన్నకు విద్యార్థులంతా రుణపడి ఉంటామని పేర్కొంది. తన తండ్రి సామన్య రైతు అని, తననుఇంజనీరింగ్ చదివించేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చిందని తెలిపింది. అదే సీఎం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో సులభంగా చదువును పూర్తి చేసుకున్నానని పేర్కొంది. అలాగే హాస్టల్ వసతి కోసం ప్రతి సంవత్సరం రూ. 20 వేలు వస్తున్నాయని చెప్పింది. చదవండి: చంద్రబాబుకు బాదుడే బాదుడు తప్పదు: మంత్రి ఆర్కే రోజా ‘నాతో పాటు నా కుటుంబాన్ని కూడా జగనన్న ప్రభుత్వం సాయపడుతుంది. చెల్లెకి అమ్మఒడి పథకం ద్వారా 15 వేలు, తండ్రికి రైతు భరోసా ద్వారా 13,500.. నానమ్మకు ఆసరా ఫించన్ వస్తుంది. ఇలా ఎన్నో కుటుంబాలను సీఎం జగన్ ఆదుకుంటున్నారు. ఇందుకు సీఎం జగన్‌కు కృతజ్ఙతలు. జగనన్న విద్యాదీవెన ద్వారా చదువుకొని కాలేజ్ ప్లేస్‌మెంట్స్‌లో మూడు ఉద్యోగాలు సాధించానని జగనన్న చెల్లిగా గర్వంగా చెబుతున్నాను. ఇలా జగనన్న ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను’ అని ప్రసంగించింది. అనంతరం సీఎం జగన్ సదరు విద్యార్ధిని ఆశీర్వదించారు. -
Hyderabad: అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: బీటెక్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఎస్ఐ అహ్మద్ పాషా తెలిపిన ప్రకారం.. శేరిలింగంపల్లిలోని దూబే కాలనీ రోడ్డు నెంబర్–11లో నివాసముంటున్న ఉమారాణి, వెంకటాచారి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె కుమ్మరి సౌజన్య (21) బాచుపల్లిలోని డీఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీటెక్ చదువుతోంది. సౌజన్య గతంలో యూట్యూబ్ చానల్లో పనిచేస్తూ వీడియోలు తీస్తుండేది. అందులో పనిచేస్తున్న విజయ్‌తో సన్నిహితంగా ఉండేవారు. శుక్రవారం తల్లి ఉమారాణి మొయినాబాద్‌లో ఉంటున్న పెద్ద కుమార్తె ఇంటికి వెళ్లగా ఆ రాత్రి ఇంట్లో సౌజన్య ఉరేసుకొంది. కాగా అదే సమయంలో విజయ్ సౌజన్యకు ఫోన్ చేయగా కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో అక్కడికి వచ్చి ఉరి వేసుకున్నది చూసి తాడు తెంచి వేశాడు. పక్క ఇంటిలో అద్దెకు ఉంటున్న సారంగపాణికి సమాచారం అందించి పారిపోయాడు. సారంగపాణి చందానగర్ పోలీసులు, తల్లి ఉమారాణీకి సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అప్పటికే సౌజన్య మృతి చెంది ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. విజయ్‌పై అనుమానంతో కుటుంబ సభ్యులు చందానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (కుటుంబాన్ని కబళించిన ప్రేమ వివాహం) -
హాస్టల్లో ఉండలేక ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
తొట్టంబేడు: ఇంట్లోవాళ్లకు దూరంగా హాస్టల్లో ఉండలేక, ఆపై చదువు ఒత్తిడి తట్టుకోలేక ఇంజినీరింగ్ విద్యార్థిని తెలుగుగంగ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తొట్టంబేడు మండలం కారాకొల్లు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు చిన్న కుమార్తె చైతన్య (19) శనివారం శివనాథపాలెం వద్ద కాలువలో దూకింది. ఆమె మృతదేహాన్ని ఆదివారం గుర్తించారు. ఎస్ఐ రాఘవేంద్ర కథనం మేరకు.. చైతన్య నెల్లూరు జిల్లాలోని ఒక ఇంజినీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం ఈసీఈ చదువుతోంది. హాస్టల్లో ఉంటోంది. ఇంటిపై ప్రేమ, చదువు ఒత్తిడి, హాస్టల్లో వసతుల కొరతతో ఉండలేనని పలుమార్లు తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. ‘లేదమ్మా.. ఈ ఏడాది అక్కడే ఉండి చదువుకో.. హాస్టల్‌కు రూ.50 వేలు చెల్లించా..’ అని తండ్రి నచ్చజెప్పాడు. ఈ క్రమంలో చైతన్య శుక్రవారం ఇంటికి వచ్చింది. శనివారం నూతన సంవత్సరం సందర్భగా కుటుంబసభ్యులతో కలిసి శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్లొచ్చింది. కళాశాలకు వెళ్లనని మళ్లీ చెప్పడంతో తల్లిదండ్రులు సర్దిచెప్పారు. దీంతో మనస్తాపం చెందిన చైతన్య శివనాథపాలెం వద్ద తెలుగుగంగ కాలువ ఒడ్డున సెల్‌ఫోన్‌ను పెట్టి కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. బీడీకాలనీకి చెందిన ఓ వ్యక్తికి ఆ సెల్‌ఫోన్ దొరకడంతో ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. గ్రామస్తులు శనివారం రాత్రంతా మృతదేహం కోసం గాలించినా లభ్యం కాలేదు. శివానాథపాలేనికి సమీపంలో ఆదివారం చైతన్య మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
హైదరాబాద్: సినిమాలో చూసి కారు దొంగిలించిన బీటెక్ విద్యార్థి..
సాక్షి, అడ్డగుట్ట: తను చూసిన ఒక సినిమా తరహాలో కారును దొంగిలించి తన ఫ్రెండ్స్‌తో జల్సాలు చేస్తున్న ఓ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఎల్లప్ప తెలిపిన మేరకు.. ఈస్ట్‌మారేడుపల్లిలోని సెయింట్ జాన్స్ చర్చి వెనుకవైపు ఉన్న ఓ అపార్ట్మెంట్లో పార్క్ చేసి ఉన్న కారును ఈ నెల 9న అమీర్‌పేట్‌కు చెందిన రిత్విక్(25) అనే బిటెక్ విద్యార్థి దొంగిలించాడు. యజమాని డాక్టర్ పద్మావతి తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, వెహికిల్ చెకింగ్‌లో భాగంగా శుక్రవారం మహేంద్రాహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద కారులో వెళ్తున్న రిత్విక్‌ను పోలీసులు పట్టుకొని కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిత్విక్‌ను స్టేషన్‌కు తరలించి విచారించారు. అయితే ‘గాన్ ఇన్ సిక్స్టీ సెకన్స్’ సినిమా చూసి అందులో చేసిన విధంగా కారు దొంగిలించి స్నేహితులతో జల్సాలు చేసినట్లు అతను ఒప్పుకున్నాడు. దీంతో మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టగా 14 రోజుల పాటు జ్యూడీషియల్ రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. -
కష్టంలో జగనన్న అండగా నిలిచారు: రమ్య తల్లి
సాక్షి, అమరావతిబ్యూరో: కన్న కూతురిని కోల్పోయి కష్టాల్లో ఉన్న తనకు జగనన్న అండగా నిలిచి భరోసా ఇచ్చారని ఇటీవల గుంటూరులో హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య తల్లి జ్యోతి చెప్పారు. గుంటూరులోని తమ నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి కష్టం ఏ తల్లికి రాకూడదన్నారు. తన కూతురు హత్యకు గురైన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారన్నారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయడం సంతోషకరమని చెప్పారు. తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చెక్కు ఇవ్వడమేకాకుండా మరో రూ.4.5 లక్షల సాయాన్ని తమ బ్యాంకు ఖాతాలో జమచేశారని తెలిపారు. ఇతర కుటుంబ అవసరాల నిమిత్తం మరికొంత నగదు సాయం అందిందన్నారు. ప్రభుత్వం తరఫున ఇంటి స్థలం, వ్యవసాయ పొలం ఇవ్వడానికి అవసరమైన పనులు జరుగుతున్నాయన్నారు. సీఎం ఆదేశాలతో అధికారులు త్వరగా స్పందించి ఆ పనులు పూర్తిచేస్తున్నారని తెలిపారు. తమ పెద్ద కుమార్తెకు ఉద్యోగం ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. ఈ సమయంలో తమకు జగనన్న పూర్తి అండగా నిలిచారన్నారు. తమపైన ఒత్తిడి తెచ్చి ఇలా చెప్పిస్తున్నారంటూ బయట దుష్ప్రచారం చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ కుటుంబానికి న్యాయం చేశారు కాబట్టే ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. నిందితుడికి త్వరగా ఉరిశిక్ష పడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు దుర్ఘటన జరిగిన తర్వాత ఇక నా చెల్లి లేదని నేను మర్చిపోకముందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మీకు నేనున్నానంటూ అండగా నిలిచారని రమ్య సోదరి మౌనిక చెప్పారు. ఆయన బహుశా తనను కూడా చెల్లిగా భావించి ఉంటారని, అందుకే అంత త్వరగా స్పందించారని పేర్కొన్నారు. ఘటన జరిగిన నాలుగు రోజుల్లోపే అందాల్సిన సహాయం మొత్తాన్ని ప్రభుత్వం అందజేసిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు కూడా వెంటవెంటనే స్పందించి తమకు న్యాయం చేశారన్నారు. తమ కుటుంబానికి అండగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. రమ్య తండ్రి వెంకట్రావు మాట్లాడుతూ ప్రభుత్వం తమకు పూర్తిగా అండగా నిలిచిందని, నిందితుడికి దిశ చట్టం అమలు చేసి త్వరగా శిక్షపడేలా చూడాలని కోరారు. -
ఒక చెల్లిగా సీఎం జగన్ కు నా మనవి
-
సీఎం జగన్ వెంటనే స్పందించారు: రమ్య తల్లి జ్యోతి
సాక్షి, గుంటూరు: బీటెక్ విద్యార్థిని రమ్య హత్య సంఘటన జరగగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించారని బాధితురాలి తల్లి జ్యోతి తెలిపారు. తమ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును అందించారని వెల్లడించారు. మరో రూ.4.5 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా అందించారని తెలిపారు. తమ కుటుంబానికి ముఖ్యమంత్రి పూర్తి అండగా నిలిచారని పేర్కొన్నారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం మీడియాతో మాట్లాడారు. తన కూతురిని హత్యచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆమె ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌ను కోరారు. చదవండి: రమ్య హత్యకు ముందు రెక్కీ చదవండి:‘ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క దళితుడికి అన్యాయం జరగదు’ నా చెల్లి లేదని నేను మర్చిపోకముందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేనున్నానని అండగా నిలిచారని రమ్య సోదరి మౌనిక తెలిపారు. బహుశా తనను కూడా ముఖ్యమంత్రి చెల్లిగా భావించి ఉంటారని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల్లో ప్రభుత్వం ముందుకొచ్చి సాయం చేసిందన్నారు. అధికారులు కూడా వెంట వెంటనే స్పందించారని తెలిపారు. తమ కుటుంబానికి అండగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మౌనిక ధన్యవాదాలు తెలిపారు. -
కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచమర్రి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గంభీరావుపేట మండలానికి చెందిన అల్లెపు రాము అనే వ్యక్తి కామారెడ్డి వైపు వెళ్తుండగా మహిళ లిఫ్ట్ అడగటంతో ఆమెను కూడా బైక్‌పై తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బైకుపై ఉన్న ఇద్దరూ పల్టీ కొట్టి ముందుకు పడ్డారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. గాయపడ్డ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. రామంతపూర్‌లో రోడ్డు ప్రమాదం.. బీటెక్ విద్యార్థి మృతి హైదరాబాద్: ఉప్పల్ పీఎస్ పరిధిలోని రామంతపూర్ డీమార్ట్ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిర్లక్ష్యంగా అతివేగంతో వస్తున్న డ్యుక్ బైక్ వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న బీటెక్ విద్యార్థి సర్వ రేవంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు రేవంత్ రామంతాపూర్ ఆనంద్ నగర్ నివాసిగా గుర్తించారు. మృతుడు బైక్ నడుపుతూ డివైడర్ ను ఢీకొన్న దృశ్యం సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.. -
సరికొత్త మాస్కు.. దీనితో ఇలా ఈజీగా మాట్లాడొచ్చు!
సాక్షి. తిరువనంతపురం: దేశంలో కరోనా మహమ్మారి అల్లాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాయి. ఆయా రాష్ట్రాల్లో కఠినంగా లాక్డౌన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనికి తోడు ప్రతి ఒక్కరు ముక్కుకు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అయ్యింది. ఈ క్రమంలో కోవిడ్‌ను నుంచి రక్షణ పొందేందుకు పలువురు వినూత్న ఆలోచనలు చేస్తున్నారు. నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. ఈనేపథ్యంలోనే కేరళకు చెందిన బీటెక్ విద్యార్థి కెవిన్ జాకబ్ సరికొత్త మాస్క్‌ను తయారు చేశాడు. మాస్కు ధరించినప్పటికీ వ్యక్తుల మధ్య సంభాషణలను సులభతరం చేయడానికి మైక్, స్పీకర్‌తో కూడిన మాస్క్‌ను రూపొందించాడు. ప్రస్తుతం వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది నిరంతరం మాస్క్‌లతోపాటు పీపీఈకిట్లు ధరించడం వల్ల సరిగా కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. అయితే ఈ స్పీకర్ మాస్క్ ద్వారా వైద్యులు.. కోవిడ్ బాధితులతో సులభంగా మాట్లాడేందుకు వీలు కలుగుతుంది. దీనిని 30 నిమిషాలు చార్జ్ చేస్తే ఆరు గంటలపాటు నిర్విరామంగా ఉపయోగించవచ్చని కెవిన్ తెలిపాడు. డాక్టర్లైన తన తల్లిదండ్రులు, పేషెంట్లతో కమ్యూనికేట్ అవడానికి పడే కష్టాలను చూసి ఈ మాస్క్ తయారు చేయాలన్న ఆలోచన కలిగినట్లు పేర్కొన్నాడు. ఇది అయస్కాంతం ద్వారా మాస్క్‌కు అంటించడం జరగుతుందన్నారు. చదవండి: లాక్డౌన్ ఉల్లంఘన.. స్టెప్పులేసిన మహిళా తహసీల్దార్ వైరల్: పెళ్లితో ఒక్కటైన జంట.. భూమ్మీద కాదండోయ్! Kerala | Kevin Jacob, a first year B Tech student from Thrissur, has designed a mask with a mic & speaker attached to ease communication amid pandemic "My parents are doctors & they've been struggling to communicate with their patients since the onset of COVID," he said (23.05) pic.twitter.com/pnvkhzZETt — ANI (@ANI) May 23, 2021 -
పురిటి నొప్పులతో బిడ్డ.. కామాంధుడిగా మారిన కన్నతండ్రి
గంగావతి: ప్రసవం కోసం మహిళను ఆస్పత్రికి తీసుకొచ్చిన ఆశా కార్యకర్తపై గర్భిణి తండ్రి అత్యాచారానికి యత్నించాడు. ఈఘటన గంగావతిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చోటు చేసుకుంది. కనకగిరి తాలూకాలోని బసిరిహళ్ గ్రామానికి చెందిన ఒక మహిళకు ప్రసవ నొప్పులు రావడంతో ఈనెల 16న ఆశా కార్యకర్త ఆమెను గంగావతి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చింది. కాన్పు కష్టంగా మారడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రాత్రి పొద్దుపోవడంతో ఆశా కార్యకర్త ఓ గదిలో నిద్రించింది. ఇదే అదునుగా గర్భిణి తండ్రి బాలప్ప(59) ఆశాకార్యకర్తపై అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ ఆస్పత్రికి చేరుకొని బాలప్పను అరెస్ట్ చేశారు. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య మైసూరు: బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మైసూరు గిరి దర్శిని లేఔట్లో ఆదివారం చోటుచేసుకుంది. విద్యా వికాస్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న సుచిత్ ఓబులేసు రై (19) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నేషనల్ డిఫెన్స్ అకాడెమి (ఎన్డీఏ) పరీక్ష రాయాల్సి ఉంది. ఇందుకు శిక్షణ కూడా తీసుకున్నాడు.∙సుచిత్‌కు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో తీవ్రంగా కుంగిపోయినట్లు తెలిసింది. తల్లిదండ్రులు విధులకు వెళ్లిన సమయంలో ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: దారుణం: ప్రియుడి కామవాంఛకు ఐదేళ్ల కుమార్తె బలి -
మాయగాడు; చదువు బీటెక్.. చోరీల హైటెక్
సాక్షి, గచ్చిబౌలి: బీటెక్ చదివిన పరిజ్ఞానం భవిష్యత్‌కు ఉపయోగించలేదు.. నకిలీ ఐడీ కార్డుల తయారీకి ఉపయోగించి చోరీల బాట పట్టాడు ఓ యువకుడు. ఒకటి రెండు కాదు.. ఏకంగా ఏడు రాష్ట్రాల్లో చోరీలు చేయడం గమనార్హం. జల్సాలకు అలవాటు పడి అదేపనిగా చోరీలు చేయడం అతడి నైజంగా మారింది. ఇప్పటికే పలుమార్లు జైలుకు వెళ్లినా అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పులేదు. అద్దెకార్లు, బైక్‌లను చోరీ చేసిన అంతరాష్ట్ర దొంగను శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో శుక్రవారం ఆయన కేసు వివరాలను వెల్లడించారు. సీసలీ గ్రామం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గుడాటీ మహేష్ నూతన్ కుమార్(27) బీటెక్(ఈఈఈ) 2016లో పూర్తి చేశాడు. భీమవరం టౌన్లో మొబైల్ టెక్నీషన్గా కొద్ది రోజులు పనిచేసి హైదరాబాద్‌కు వచ్చాడు. మలక్‌పేట్‌లో మొబైల్ టెక్నీషన్గా పనిచేస్తూ నకిలీ తాళం చెవిలతో షాపులు తెరిచి చోరీలకు పాల్పడ్డాడు. మలక్‌పేట్ పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం మళ్లీ భీమవరం వెళ్లాడు. కెమెరా చోరీ చేయడంతో పాలకోడేరు పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి బయటకు రాగానే మళ్లీ హైదరాబాద్‌కు వచ్చాడు. బోల్ట్ టాటా కారు, ల్యాప్‌టాప్, రూ.25 వేల నగదు చోరీ చేయడంతో ఎస్ఆర్నగర్ పోలీసులు మూడు కేసులు నమోదు చేసి 2019 డిసెంబర్లో జైలుకు పంపారు. షేరింగ్ రూమ్‌లో చేరి.. జైలు నుంచి బయటకు వచ్చి పంజాగుట్టలో షేరింగ్ యాప్ ద్వారా గది అద్దెకు తీసుకున్నాడు. రూమ్మేట్ నాగేంద్ర ప్రసాద్‌తో స్నేహంగా మెలిగి రూ.1.60 లక్షల నగదు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఐడీ కార్డులు చోరీ చేసి అక్కడి నుంచి ఉడాయించాడు. అక్కడి నుంచి జూలైలో బెంగళూర్‌కు వెళ్లి షేరింగ్ రాయల్ బ్రదర్స్‌లో నాగేంద్ర ఆధార్ కార్డును ఎడిట్ చేసి తన ఫొటో పెట్టి రాయల్ ఎన్ఫీల్డ్ అద్దెకు తీసుకున్నాడు. బైక్ జీపీఎస్ ట్రాకర్‌ను తొలగించి, నకిలీ నెంబర్ ప్లేట్లో బుల్లెట్‌పై నేరుగా వైజాగ్ వెళ్లాడు. అక్కడ షేరింగ్ రూమ్‌లో అద్దెకు దిగి రెండు నెలలు ఉన్నాడు. రూమ్ మేట్ చైతన్యకు చెందిన రూ.30 వేల నగదు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తస్కరించి బుల్లెట్‌పై పూణె వెళ్లాడు. షేరింగ్ రూమ్‌లో చేరి సతీష్ అనే వ్యక్తికి చెందిన రూ.1.80 లక్షలు నగదు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ చోరీ చేసి హైదరాబాద్‌కు వచ్చి చెంగిచెర్లలో నివాసం ఉన్నాడు. చదవండి: చుట్టూ సీసీ కెమెరాలు.. కానీ కారు మాయం..! 2020 అక్టోబర్‌లో కేరళ వెళ్లి కొచ్చిలో సతీష్ ఐడీ కార్డులు ఎడిట్ చేసి జూమ్ కార్స్లో వోక్స్వ్యాగన్ పోలో కారును అద్దెకు తీసుకున్నాడు. జీపీఎస్ ట్రాకర్‌ను తొలగించి, నకిలీ నెంబర్ ప్లేట్‌తో చెంగిచెర్లకు వచ్చాడు. డిసెంబర్లో చెన్నై వెళ్లి రేవ్ కార్స్లో చైతన్య ఐడీ కార్డులు పెట్టి స్విఫ్ట్ కారును అద్దెకు తీసుకొని ఉడాయించారు. 2021 జనవరిలో మైసూర్ వెళ్లి డ్రైవీజీలో సతీష్ ఐడీ కార్డులతో బలేనో కారును అద్దెకు తీసుకొని జీపీఎస్ ట్రాకర్‌ను తొలగించి నకిలీ నంబర్ ప్లేట్‌తో పరారయ్యాడు. అనంతరం కోల్కత్తకు వెళ్లి నాగేంద్ర ప్రసాద్ ఐడీ కార్డులతో రేవ్కార్స్లో ఇన్నోవా క్రిస్టా కారును అద్దెకు తీసుకొని జీపీఎస్ ట్రాకర్‌ను తొలగించి పరారయ్యాడు. ఓఎల్ఎక్స్లో డ్రైవర్ కావాలని ప్రకటన ఇవ్వడంతో తుఫ్రాన్‌పేట్, చౌటుప్పల్ మండల్‌కు చెందిన కిరణ్ సంప్రదించగా అతడి ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఐడీ ప్రూఫ్‌లు తీసుకున్నాడు. జల్సాలు చేసేవాడు అవి ఎడిట్ చేసి 15 రోజుల క్రితం మాదాపూర్ పీఎస్ పరిధిలో జూమ్ కార్స్లో ఇచ్చి స్విఫ్ట్ కారును చోరీ చేశాడు. చోరీ చేసిన కార్లను 30 నుంచి 40 శాతం ధరకే విక్రయించే వాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే శంషాబాద్ ఎస్వోటీ పోలీసులకు పట్టుబడ్డాడు. సమావేశంలో సైబరాబాద్ ఇన్చార్జి డీసీపీ విజయ్‌కుమార్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఎస్వోటీ అడిషనల్ డీసీపీ సందీప్, సీఐలె రవీంద్ర ప్రసాద్, నవీన్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. 9 కేసుల్లో నిందితుడు నిందితుడు మహేష్ నూతన్ కుమార్ ఏడు రాష్ట్రాల్లో 9 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. మాదాపూర్, మహరాణిపేట, శిల్‌పూర్ పీఎస్ వెస్ట్ బెంగాల్, పాలరివట్టం పీఎస్ కొచ్చి, హింజేవాడి పీఎస్ పూణె, రాజాజీనగర్ పీఎస్ బెంగళూర్, అన్నా సాగర్ పీఎస్ తమిళనాడు, హెబ్బల్ పీఎస్ మైసూర్, రామమూర్తినగర్, బెంగళూర్లలో కేసులు నమోదయ్యాయి. ఆరు కేసుల్లో అరెస్ట్ చోరీల కేసుల్లో మలక్‌పేట్, పాలకోడురు, ఎస్ఆర్నగర్లో మూడు కేసుల్లో, మదివాల, బెంగళూర్ పీఎస్ పరిధిలోలో ఆరు కేసుల్లో అరెస్ట్ అయ్యారు. నిందితుడి నుంచి రూ.70 లక్షల విలువ చేసే ఇన్నోవా క్రిస్టా, వోక్స్వాగన్ పోలో, మారుతి బెలేనో, రెండు స్విఫ్ట్ కార్లు, వెర్నా కారు, రాయల్ ఎన్ఫీల్డ్ను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు సెల్ఫోన్లు, ఏడిట్ చేసిన ఐడీ కార్డులు, నకిలీ నెంబర్ ప్లేట్లను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ఓయో రూమ్ తీసుకుందామనుకుంటే.. అంతలోనే! -
చదువులో వెనకబడ్డానని.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, నాగోలు: చదువులో వెనకపడుతున్నానని మనస్తాపానికిలోనైన బీటెక్ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. క్రిష్ణా జిల్లా, అనిగండ్లపాడు గ్రామానికి చెందిన దాసరి డేవిడ్ రాజు నగరానికి వలసవచ్చి ఎల్బీనగర్ సెంట్రల్ బ్యాంకు కాలనీలో ఉంటూ సెక్యురిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అతని కుమారుడు దాసరి చందు (21) మంగళపల్లిలోని ఏవీఎన్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతడికి బీటెక్ రెండో సంత్సరం సబ్జెక్టులు మిగిలిపోయాయి. ఈ విషయమై తరచూ బాధపడేవాడు. ఆదివారం కుటుంబసభ్యులు బయటికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న చందు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధ్యాహ్నం చర్చి నుంచి తిరిగి వచ్చిన అతడి తల్లి కిటికీలో నుంచి చూడగా చందు సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. బలవంతంగా తలుపులు తెరిచి చందును కిందకి దించి 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది అతడిని పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి డేవిడ్ రాజు ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే.. -
ప్రాణం తీసిన ఆన్లైన్ గేమ్స్
లక్సెట్టిపేట (మంచిర్యాల): మొబైల్లో ఆన్లైన్ గేమ్స్‌కు ఓ బీటెక్ విద్యార్థి జీవితం బలైంది. చిన్నచిన్న గేమ్స్‌తో మొదలైన ఆకర్షణ.. బెట్టింగ్‌వరకూ వెళ్లి అప్పుల పాలు చేసింది. విషయం కుటుంబ సభ్యులకు తెలవడంతో వారు అప్పులు తీర్చినప్పటికీ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని మోదెల గ్రామంలో శనివారం ఈ సంఘటన వెలుగు చూసింది. ఏఎస్సై రాజయ్య కథనం ప్రకారం.. మోదెల గ్రామానికి చెందిన తోట శంకర్ కుమారుడు మధుకర్ (24) హైద రాబాద్లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఇంటివద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆన్లైన్ గేమ్స్‌కు బానిసయ్యాడు. తన మొబైల్లో ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ బెట్టింగ్ కాయడంతో తీవ్రంగా నష్టపోయా డు. ఇలా తెలిసినవారి వద్ద రూ.15 లక్షల వరకు అప్పులు చేశాడు. ఈ విష యం కుటుంబ సభ్యులకు తెలియడంతో మందలించి.. అప్పులన్నీ తీర్చా రు. అయితే తాను చేసిన అప్పులకు కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారని ఆవేదనకు గురైన మధుకర్ ఈనెల 7న ఇంటినుంచి బయటకు వెళ్లాడు. మంచిర్యాలలో క్రిమిసంహారక మందు తాగి తన అక్కకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. వారు అక్కడున్న స్థానికుల సాయంతో ఆస్పత్రిలో చేర్పించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా.. పరిస్థితి విషమించి శనివారం ఉదయం మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
అమీర్‌పేట: టైర్ల షాపులో పనిచేసే ఓ యువకుడు వేధిస్తున్నాడన్న మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అమీర్‌పేట ఈస్ట్ శ్రీనివాస్‌నగర్ కాలనీలోని అనురాగ్ అపార్ట్మెంట్లో ఉండే ఆర్టీసీ కండక్టర్ ఎం. గోపాల్, లావణ్య దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కూతురు అశ్విని (22) రంగరాజు గోకరాజు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు చదువుకుంటానని అపార్ట్‌మెంట్‌పైకి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత తండ్రికి ఫోన్‌చేసి అపార్ట్మెంట్ సమీపంలోని టైర్ల షాపులో పనిచేసే నవీన్ కొద్ది రోజులుగా తనను వేధిస్తున్నాడని, మనస్తాపంతో విషం సేవించి ఆత్మహత్య చేసుకుంటున్నా నని ఏడుస్తూ తెలిపింది. గోపాల్ వెంటనే పైకి వెళ్లి చూడగా నోట్లో నుండి నురగలు కక్కుతూ కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా యువతి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
యాప్‌తో అప్పులు.. తీర్చేందుకు తప్పులు!
సాక్షి, హైదరాబాద్ : యుక్త వయసు పిల్లలు డబ్బులడిగితే.. మధ్యతరగతి తల్లిదండ్రులు వంద ఆరాలు తీస్తారు. వివిధ రుణసంస్థలు తామిచ్చే అప్పు తీర్చగలరా? లేదా? అనేది రుణగ్రహీతల ఆర్థిక పరిస్థితిని బట్టి అంచనా వేస్తాయి. అయితే, ఇవేమీ లేకుండానే స్టూడెంట్స్ లోన్ యాప్స్ యువకులకు ఎడాపెడా ఆన్లైన్లో లోన్లు ఇచ్చేస్తున్నాయి. అడ్డగోలుగా వడ్డీలు పిండుతూ, బెదిరింపులకూ దిగుతున్నాయి. ఫలితంగా పలువురు యువకులు ఒత్తిడికి గురై, అప్పులు తీర్చేందుకు దారితప్పుతున్నారు. హైదరాబాద్ సైబర్‌క్రైమ్ స్టేషన్లో నమోదైన బీటెక్ విద్యార్థి ఉదంతమే దీనికి ఉదాహరణ. ఎం–పాకెట్ యాప్‌లో అప్పు తీసుకున్న ఇతడు దాన్ని తీర్చడానికి సైబర్ నేరానికి పాల్పడి పోలీసులకు చిక్కాడు. అన్నీ ఆన్లైన్లోనే.. విద్యార్థులకు రుణాలిచ్చే ఎం–పాకెట్, లెండ్ కరో, క్రేజీబీ, స్లైస్‌పే, ఉదార్ కార్డ్, రెడ్‌కార్పెట్ వంటి యాప్స్ అనేకం ఉన్నాయి. ఎదుటి వారిని నేరుగా కలవకుండానే ఇవి రుణాలు ఇచ్చేస్తుంటాయి. యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా అప్పు తీసుకునే విద్యార్థి తన ఆధార్ కార్డు, టెన్త్ మెమో లేదా పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, స్టూడెంట్ ఐడీ అప్లోడ్ చేయాలి. ఈ యాప్స్ రూ.500 నుంచి రూ.10 వేల వరకు రుణం ఇస్తున్నాయి. ఆ మేరకు విద్యార్థి కోరుకున్న మొత్తం కొన్ని గంటల్లోనే అతనికి చెందిన పేటీఎం, గూగుల్ పే వాలెట్స్‌లోకి వచ్చి పడుతుంది. వడ్డీ, పెనాల్టీ కలిపి నెలకు 5 నుంచి 10 శాతం వరకు అవుతోంది. రూ.2 వేలు అప్పు తీసుకుంటే మొదటి నెల పూర్తయ్యేలోపు రూ.2,114, రెండో నెలలో రూ.2,225, మూడో నెలలో రూ.2,450 వరకు చెల్లించాలి. అప్పు చెల్లింపు గడువుకు వారం ముందు యాప్ నుంచి సందేశం వస్తుంది. అందులో ఉన్న లింకు క్లిక్‌చేస్తే ఆన్లైన్లోనే చెల్లింపు జరిగిపోతుంది. అప్పు తీరుస్తారా? అందరికీ చెప్పాలా? స్టూడెంట్లోన్ యా ప్స్‌ను ప్లేస్టోర్స్ నుం చి డౌన్లోడ్ చేసుకుని, ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు.. కాంటాక్ట్స్, ఫొటో స్, లొకేషన్ యాక్సెస్ కోసం అ నుమతి కోరుతుంది. దీన్ని యా క్సెప్ట్ చేస్తేనే యాప్ ఇన్స్టాల్ అవుతుంది. విద్యార్థులకు రుణాలిస్తు న్న ఈ యాప్స్ తమకున్న యా క్సెస్ ద్వారా సదరు విద్యార్థి ఫోన్ లోని కాంటాక్ట్స్ లిస్ట్‌ను ముందే కాపీచేసి పెట్టుకుంటున్నాయి. రు ణం చెల్లించకున్నా, తమ ఫోన్లకు స్పందించకపోయినా వాట్సాప్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నాయి. తమ వద్ద మీ కాంటా క్ట్ లిస్ట్ ఉందని చెబుతూ.. మచ్చు కు కొన్ని కాంటాక్ట్స్‌ను పేస్ట్ చేస్తు న్నారు. తక్షణం డబ్బు చెల్లించకపోతే మీ కుటుంబసభ్యులు, స్నే హితులకు ఫోన్లుచేసి చెబుతామ ని బెదిరిస్తున్నారు. ఆపై అప్పు చె ల్లింపునకు గంట గడువిస్తున్నా రు. అప్పటికీ చెల్లించకుంటే ఫోన్‌కాల్స్ మొదలవుతాయి. బయటపడనివి మరెన్నో.. ఇటీవలే లెండ్ కరో యాప్ బ్లాక్‌మెయిలింగ్‌పై ట్విట్టర్ ద్వారా మా దృష్టికొచ్చింది. స్టూడెంట్స్ లోన్ యాప్స్ కారణంగా పెడదారి పడుతున్న విద్యార్థులు మరెందరో ఉండొచ్చు. దీన్ని సీరియస్‌గా తీసుకుని అప్పులు ఇచ్చే యాప్స్‌పై విచారణ చేస్తున్నాం. వీటికి సరైన అనుమతులు ఉన్నాయా? ఏ మేరకు వడ్డీలు వసూలు చేస్తున్నాయి? ఏ తరహా బ్లాక్మెయిలింగ్స్కు పాల్పడుతున్నాయి? వంటివి ఆరా తీస్తున్నాం. మధ్య, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లోని తల్లిదండ్రులు తమ పిల్లల ఫోన్లను చెక్‌చేస్తూ ఏయే యాప్స్ ఉన్నాయో పరిశీలించాలి. – సిటీ పోలీసు ఉన్నతాధికారి బీటెక్ విద్యార్థి ఉదంతంతో వెలుగులోకి.. నగరంలోని బీరంగూడకు చెందిన బీటెక్ విద్యార్థి మూడు నెలల క్రితం ఎంపాకెట్ యాప్ నుంచి రూ.2,000 అప్పు తీసుకున్నాడు. అది వడ్డీతో కలిపి రూ.2,450 అయ్యింది. ‘యాప్’ నుంచి ఒత్తిడి పెరగడంతో కట్టుతప్పాడు. పరీక్ష రాయడానికి వెళ్లిన ఇతగాడు ఎగ్జామ్‌హాల్ బయట ఉన్న ఓ యువతి బ్యాగ్ నుంచి సెల్‌ఫోన్ తస్కరించాడు. అందులో ‘సే హాయ్’ చాటింగ్ యాప్ డౌన్లోడ్ చేశాడు. అందులోని వివరాల ఆధారంగా సదరు యువతి మాదిరిగానే ఈ యాప్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. తనతో చాటింగ్ చేయాలన్నా, తన ఫొటోలు కావాలన్నా కొంత మొత్తం చెల్లించాలంటూ తన పేటీఎం వాలెట్ నంబర్ ఇచ్చాడు. ఈ విద్యార్థి ఇదంతా ఆ యువతి డూప్లికేట్ సిమ్ తీసుకునేలోపే, అదే సిమ్‌కార్డు వాడి ఇవన్నీ చేసేశాడు. దీంతో ఒకరిద్దరు కొంత మొత్తం ఇతడి పేటీఎంకు డబ్బు పంపారు. ఈలోపు డూప్లికేట్ సిమ్ తీసుకున్న ఆ యువతికి నగదు చెల్లించిన ఇద్దరు ఫోన్లు చేయడంతో ఆమె కంగుతిని సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి విద్యార్థిని పట్టుకున్నారు. తాను ఎంపాకెట్ నుంచి అప్పు తీసుకోవడం, అది తీర్చడానికి తప్పు చేసినట్టు విచారణలో చెప్పాడు. ఆ విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ యువతి కేసు వద్దని పోలీసులను కోరింది. దీంతో అధికారులు సోమవారం వీరిద్దరినీ రాజీపడటానికి కోర్టుకు పంపారు. బీటెక్ విద్యార్థి తండ్రి, సోదరిని ఠాణాకు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. -
‘పది’, ఇంటర్ ఫెయిల్.. రూ.3 లక్షల జీతం
పెద్దపల్లి: అతడు ఓ సామాన్య కుటుంబంలో పుట్టాడు.. అందరిలాగే సర్కార్ బడిలో చదువు కొనసాగించాడు. ఇంగ్లిష్, మ్యాథ్స్ సరిగా రాక ‘పది’, ఇంటర్లో ఫెయిల్ అయ్యాడు. పదే పదే అవే సబ్జెక్టులు తప్పాడు.. ఫెయిల్ అయ్యానని ఏనాడూ కుంగిపోలేదు. జీవితంలో ఎదగాలనే లక్ష్యాన్నీ మరువలేదు. తనకు నచ్చని సబ్జెక్టులోనే పట్టు సాధించాలనుకున్నాడు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ ట్యూషన్‌కు వెళ్లాడు.. ఫెయిలైన సబ్జెక్టులనే తనకు ఇష్టమైనవిగా మార్చుకుని సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా నెలకు రూ.3 లక్షల వేతనంతో పనిచేస్తూ జీవితంలో డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం లొంకకేసారం గ్రామానికి చెందిన రొడ్డ వైకుంఠం. నిన్నటితరం యువకులతోపాటు రేపటితరం విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన వైకుంఠం సక్సెస్‌పై ఆయన మాటల్లో.. ‘మాది కమాన్‌పూర్ మండలం లొంకకేసారం. అమ్మ మార్తమ్మ, నాన్న పేరు నారాయణ. మేము ముగ్గురం అన్నదమ్ములం. నేనే ఇంట్లో చిన్నవాడిని నాన్న వ్యవసాయం చేస్తూ మమ్మల్ని పెంచాడు. పెద్దన్న భద్రయ్య సింగరేణి ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నన్న హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. నేను 5వ తరగతి వరకు గ్రామంలోనే చదువుకున్నా. 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు కమాన్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న. 1986 వార్షిక పరీక్షల్లో మ్యాథ్స్‌లో ఫెయిల్ అయ్యాను. తర్వాత రెండుసార్లు సప్లిమెంటరీ రాసి టెన్త్ పాస్ అయ్యాను. ఫెయిలైన తర్వాత పెద్దన్న కొన్న ఆటో నడిపించాను. నాకు జీవితంలో బాగా ఎదగాలని, ఉన్నత స్థానంలో ఉండాలనే ఆకాంక్ష ఉండేది. అందుకే ఫెయిల్ అయినా చదువు ఆపాలనుకోలేదు. ఆటో నడుపుతూనే గోదావరిఖని జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివాను. 1989 పరీక్షలు రాసి ఫెయిల్ అయ్యాను. నా లక్ష్యం అన్నయ్యలకు చెప్పడంతో ఆటో నడపడం మానేసి చదువుకోమని సూచించారు. చదువుకుంటేనే బాగుపడుతావని వారు ప్రోత్సహించారు. అయినా.. ఆటో నడుపుతూ నేను వీక్‌గా ఉన్న సబ్జెక్టులు ఇంగ్లిష్, మ్యాథ్స్ ట్యూషన్‌కు వెళ్లాను. అలా రెండు సబ్జెక్టుల్లో పట్టుసాధించి ఇంటర్ పాస్ అయ్యాను. 1989లో ఎంసెట్ కోచింగ్ తీసుకుని ర్యాంక్ సాధించాను. 1990లో వరంగల్ కిట్స్ కళాశాలలో ఇంజినీరింగ్‌లో చేరాను. ఇంగ్లిష్ మాట్లాడడానికి ఇబ్బంది.. ఇంజినీరింగ్‌లో చేరినా.. ఇంగ్లిష్ సబ్జెక్టులో ట్యూషన్‌కు వెళ్లినా మాట్లాడడం మాత్రం రాలేదు. కాలేజీలో ఇంగ్లిష్‌లో మాట్లాడాలంటే ఇబ్బంది పడేవాడిని. ఎలాగైనా తోటి విద్యార్థుల్లా నేనూ ఇంగ్లిష్ మాట్లాడాలని పట్టుసాధించేందుకు స్పోకెన్ ఇంగ్లిష్ కోచింగ్ తీసుకున్న. అందరితో మాట్లాడడం ప్రారంభించి సక్సెస్ అయ్యాను. 1994లో బీటెక్ పూర్తిచేశాను. అప్పటికే రాదనుకున్న ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడడం వచ్చింది. ఇంజినీరింగ్ అయిన ఏడాదికే ఉద్యోగం.. కిట్స్ కాలేజీ రాష్ట్రంలోని టాప్ కాలేజీల్లో ఒకటి. దీంతో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఏడాదికే 1995లో మలేషియా కంపెనీ నుంచి ఇంటర్వ్యూకు లెటర్ వచ్చింది. ఇంటర్వ్యూ సక్సెస్ కావడంతో ఉద్యోగం వచ్చింది. అందులో పనిచేస్తూనే 2008లో ఎరెన్కో గ్రూప్ తలపెట్టిన ఇంటర్వ్యూకు వెళ్లి సెలక్ట్ కావడంతో దుబాయికి వెళ్లాను. దుబాయిలోనూ యూనియన్ రేబర్ కంపెనీ ఇచ్చిన ఆఫర్‌తో అందులో చేరి ప్రస్తుతం క్వాలిటీ మేనేజర్‌గా పనిచేస్తున్నా. నా జీవితంలో ఎన్నోసార్లు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నా. జీవితంపై విరక్తి చెందిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొద్దిగా శ్రమిస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చనే అన్నయ్యల మాటలతో స్ఫూర్తి పొంది నేడు ఈ స్థాయికి చేరుకున్నా. టెన్త్ ఫెయిల్ అయినప్పుడే చదువుపై ఆసక్తి చంపుకుంటే ఇంటర్లో చేరేవాణ్ని కాదు.. ఇంటర్ ఫెయిల్ అయినప్పుడు ఆటోడ్రైవర్‌గా స్థిరపడితే ఇంజినీరింగ్ చేసేవాన్ని కాదు. అబుదాబి అవకాశం దక్కేది కాదు.. వీటన్నింటికి సమాధానం పట్టుదల.. ఓడినా కుంగిపోకుండా కష్టపడడం. -
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
ఆమదాలవలస: ఒక్కగానొక్క కుమారుడు ఆసరాగా నిలబడతాడని కోటి ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు గర్భశోకమే మిగిలింది. పాలు తీసుకువస్తానని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగివస్తూ ప్రమాదానికి గురయ్యాడు ఇంజినీరింగ్ విద్యార్థి. ఆమదాలవలస పట్టణ శివార్లలోని వెంగళరావు కాలనీ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మున్సిపాలిటీ పరిధి రెండో వార్డు కృష్ణాపురం గ్రామానికి చెందిన సువ్వారి చైతన్య (20) మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తమ్మయ్యపేట గ్రామంలో ఉన్న తమ బంధువులు ఇంటి వద్ద నుంచి ప్రతీ రోజు పాలు తీసుకువచ్చేందుకు ఉదయాన్నే దిచక్ర వాహనంపై చైతన్య వెళ్లేవాడు. శనివారం ఉదయం ఎప్పటిగాలే బయల్దేరి వెళ్లి తిరిగి వస్తుండగా వెంగలరావు కాలనీ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీ కిందకు ద్విచక్ర వాహనం దూసుకుపోయింది. ఛాతి భాగంపై దెబ్బ తగిలింది, కాలు విరగడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో (బలగ సమీపంలో) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఆమదాలవలస పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. తల్లడిల్లిన తల్లిదండ్రులు ఒక్కగానొక్క కుమారుడికి ప్రమాదం జరిగిందన్న విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు లక్ష్మి, రమణారావులు తల్లడిల్లారు. వెంటనే ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నారు. కుమారుడు విగత జీవిగా పడి ఉండడాన్ని చూసి ఎలాగైనా బతికించుకోవాలన్న వారు పడిన తపన స్థానికులను కలిచి వేసింది. చైతన్య ప్రస్తుతం ఎచ్చెర్లలో శ్రీవెంకటేశ్వర కళాశాలలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మృతుడి తండ్రి లేబర్ మేస్త్రి. తల్లి గృహిణి. అక్కకు ఇటీవల వివాహం జరిగింది. చైతన్య గ్రామంలోని యువకుల అందరితో కలిసిమెలిసి ఉండేవాడని స్నేహితులు తెలిపారు. చైతన్య మృతి వార్త తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ప్రాణం తీసిన సెల్‌ఫోన్ వివాదం
పటాన్చెరు టౌన్: సెల్‌ఫోన్‌పై గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. సెల్‌ఫోన్ విషయమై విద్యార్థుల మధ్య ఏర్పడ్డ వివాదం బీటెక్ విద్యార్థి ప్రాణాలు తీసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, విద్యార్థి తండ్రి కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరికి చెందిన పితాని నాగేశ్వర్రావు కుటుంబం 20 ఏళ్ల కింద బతుకుదెరువు కోసం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని ఐటీడబ్ల్యూ సిగ్నోడ్ కాలనీకి వచ్చారు. ఇతని కుమారుడు గౌతమ్ (18) హైదరాబాద్‌లోని ఎంఎల్ఆర్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గౌతమ్ తనకు సెల్‌ఫోన్ అవసరం ఉందని స్నేహితుడైన పవన్‌కి చెప్పాడు. ఆన్లైన్లో ఆఫర్స్ ఉన్నాయని చెప్పి సెల్‌ఫోన్ బుక్ చేయాల్సిందిగా పవన్ తన స్నేహితుడైన వినయ్‌కు రూ.8 వేలను గౌతమ్ నుంచి ఇప్పించాడు. నగదు ఇచ్చి నెలరోజులైనా సెల్‌ఫోన్ ఇవ్వకపోవడంతో గౌతమ్ ఆ విషయాన్ని తండ్రికి చెప్పాడు. దీంతో నాగేశ్వర్రావు వారిని అడగడంతో వినయ్, అతని స్నేహితులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో సెల్‌ఫోన్ కోసం డబ్బులు ఇచ్చాను కదా అని పవన్‌ను గౌతమ్ నిలదీశాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్ రింగ్ రోడ్డు వద్దకు రమ్మని గౌతమ్‌కు పవన్ చెప్పాడు. గౌతమ్ అక్కడికి వెళ్లగా పవన్, అతని స్నేహితుడు కాశీమ్ అక్కడ ఉన్నారు. ఈ విషయమై మరోసారి వారిమధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పవన్, కాశీమ్ ఇద్దరూ కలిసి గౌతమ్ గొంతు నులిమి చంపేసి స్థానిక సుల్తాన్పూర్ చెరువులో పడేశారు. అనంతరం తమ మిత్రులైన మిశ్ర, వినయ్‌కి విషయం చెప్పారు. తమ కుమారుడు కనిపించడం లేదని గౌతమ్ తల్లిదండ్రులు సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి గౌతమ్ స్నేహితులను విచారించగా అసలు నిజం బయటపడింది. గౌతమ్ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పవన్, కాశీమ్‌ను రిమాండ్‌కు తరలించారు. -
రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
స్టేషన్‌ఘన్‌పూర్: రైలు కింద పడి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, కాజీపేట రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. జఫర్గడ్ మండల కేంద్రానికి చెందిన షేర్ల పద్మ, శ్రీనివాస్ దంపతులకు ముగ్గురు మగ సంతానం. గత నాలుగు నెలల క్రితం పిడుగుపాటుతో శ్రీనివాస్ మృతి చెందాడు. శ్రీనివాస్ భార్య పద్మ, పెద్ద కుమారుడు రవితేజ, రెండో కుమారుడు రాకేష్ తమ కులవృత్తి అయిన మేదరి పని చేస్తూ వివాహాది శుభకార్యాలకు తడకల పందిళ్లు, డెకరేషన్లు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. చిన్న కుమారుడు రాఘవేంద్ర(20) బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రతీరోజూ అప్ అండ్ డౌన్ చేస్తూ సెలవు రోజుల్లో సోదరులకు పందిళ్లు, డెకరేషన్ పనుల్లో సహాయ పడుతుంటాడు. తండ్రి అకాల మృతి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురై అప్పటి నుంచి ముభావంగా ఉంటున్నాడు. దానికి తోడు అతడి మొబైల్ ఫోన్‌కు ఇటీవల తరచుగా ఫోన్ కాల్స్ వస్తుండగా తల్లితో పాటు అన్నయ్య మందలించినట్లు సమాచారం. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన అతడు శుక్రవారం తెల్లవారుజామున జఫర్గడ్ నుంచి మోటా ర్బైక్పై ఘన్పూర్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. అయితే ఉదయం లేచేసరికి ఇంట్లో రాఘవేంద్ర కనిపించడంతో అనుమానంతో అతడి అన్నయ్య రవితేజ తమ్ముడికి ఫోన్ చేయగా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో వద్దని ఫోన్లో వారిస్తూనే మరో బైక్‌పై ఘన్‌పూర్‌కు బయలుదేరాడు. అయితే అతను ఫోన్లో మాట్లాడుతూ తిమ్మంపేట దాటేసరికి పెద్దగా రైలు చప్పుడు వచ్చిందని, అనంతరం ఫోన్ స్విచాఫ్ అయిందని రోదిస్తూ తెలి పాడు. వెంటనే రైల్వేస్టేషన్‌కు వచ్చి చూసేసరికి మొదటి ఫ్లాట్ ఫారం చివర అప్‌లైన్‌లో ట్రాక్‌పై రాఘవేంద్ర మృతదేహం కనిపించిందని విలపిస్తూ తెలిపాడు. రైల్వే ట్రాక్ వద్ద అతడి తల, మొం డెం వేర్వేరుగా పడి ఉండగా స్థానికులు పెద్ద సం ఖ్యలో అక్కడికి చేరుకుని విచారం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న అతని తల్లి, కుటుంబ సభ్యులు, బంధువులు ఘన్పూర్ రైల్వేస్టేషన్‌కు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. పంచనామ నిర్వహించిన రైల్వే పోలీసులు విషయం తెలుసుకున్న కాజీపేట రైల్వే హెడ్ కానిస్టేబుల్ జస్పాల్సింగ్, కానిస్టేబుల్ అశోక్ సంఘటనా స్థలానికి చేరుకుని శవపంచనామ నిర్వహించారు. తండ్రి మృతిచెందడంతో మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించామని, న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే గరీబ్‌రథ్ సూపర్‌ఫాస్ట్ రైలు కింద పడి మృతిచెందినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ మేరకు మృతుడి తల్లి, అన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాగా విషయం తెలుసుకున్న మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అన్నెబోయిన భిక్షపతి, సర్పంచ్ బల్లెపు నర్సింగరావు తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. -
బీటెక్ విద్యార్థిని దుర్మరణం
నాగోలు: అతివేగంతో వచ్చిన లారీ ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిడడంతో బైకు వెనుక కూర్చున్న విద్యార్థిని లారీ వెనుక చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. న్యూనాగోలు కాలనీ చెందిన సతనపల్లి రామబ్రహ్మం, కల్పనల కూతురు నవ్యశ్రీ(20) మోహన్‌నగర్ ప్రజానివాస్ పేజ్–2కు చెందిన కీర్తికుమార్‌రెడ్డి కూతురు సాతన(20) స్నేహితులు. వీరు తట్టిఅన్నారం సమీపంలోని శ్రేయాస్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నారు. ఆదివారం పనుల నిమిత్తం హోండా యాక్టివా(టీఎస్08ఈడబ్ల్యూ 6092)పై ఇద్దరూ కళాశాలలో పనినిమిత్తం బయలుదేరారు. బండ్లగూడ ఆర్టీసీ డిపో దాకా వచ్చాక ఆదివారం కాలేజీలో ఎవరూ ఉండకపోవచ్చని భావించి తిరుగు పయనమయ్యరు. సాతన బైక్ నడుపుతుండగా నవ్యశ్రీ వెనుక కూర్చుంది. బండ్లగూడ, ఆనంద్‌నగర్ సమీపంలోని రాజీవ్ స్వగృహ సముదాయాల వద్దకు రాగానే తట్టిఅన్నారం వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ (కేఈ 56–1017) వీరి బండిని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నవ్యశ్రీ లారీ వెనుక చక్రాల కింద పడి అక్కడిక్కడే మరణించింది. సాధన ఎడమ వైపు పడడంతో ప్రాణాలతో బయటపడింది. విషయం తెలిసిన నవ్యశ్రీ తల్లి, స్నేహితులు తల్లడిల్లారు. ఒక్కగానొక్క కూతురు ప్రమాదంలో మృతి చెందడంతో వారిని ఓదార్చడం సాధ్యం కాలేదు. ఈ ప్రమాదంతో ఆనంద్‌నగర్ నుంచి తట్టిఅన్నారం మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎల్బీనగర్ సీఐ అశోక్‌రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకునిట్రాఫిక్ క్లియర్ చేశారు. నవ్యశ్రీ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ సాజిద్‌ను పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. సాతన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.