
అమీర్‌పేట: టైర్ల షాపులో పనిచేసే ఓ యువకుడు వేధిస్తున్నాడన్న మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అమీర్‌పేట ఈస్ట్ శ్రీనివాస్‌నగర్ కాలనీలోని అనురాగ్ అపార్ట్‌మెంట్‌లో ఉండే ఆర్టీసీ కండక్టర్ ఎం. గోపాల్, లావణ్య దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కూతురు అశ్విని (22) రంగరాజు గోకరాజు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు చదువుకుంటానని అపార్ట్‌మెంట్‌పైకి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత తండ్రికి ఫోన్‌చేసి అపార్ట్‌మెంట్ సమీపంలోని టైర్ల షాపులో పనిచేసే నవీన్ కొద్ది రోజులుగా తనను వేధిస్తున్నాడని, మనస్తాపంతో విషం సేవించి ఆత్మహత్య చేసుకుంటున్నా నని ఏడుస్తూ తెలిపింది. గోపాల్ వెంటనే పైకి వెళ్లి చూడగా నోట్లో నుండి నురగలు కక్కుతూ కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా యువతి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment