రాఘవేంద్ర (ఫైల్)
స్టేషన్‌ఘన్‌పూర్: రైలు కింద పడి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, కాజీపేట రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. జఫర్‌గడ్ మండల కేంద్రానికి చెందిన షేర్ల పద్మ, శ్రీనివాస్ దంపతులకు ముగ్గురు మగ సంతానం. గత నాలుగు నెలల క్రితం పిడుగుపాటుతో శ్రీనివాస్ మృతి చెందాడు. శ్రీనివాస్ భార్య పద్మ, పెద్ద కుమారుడు రవితేజ, రెండో కుమారుడు రాకేష్ తమ కులవృత్తి అయిన మేదరి పని చేస్తూ వివాహాది శుభకార్యాలకు తడకల పందిళ్లు, డెకరేషన్లు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. చిన్న కుమారుడు రాఘవేంద్ర(20) బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రతీరోజూ అప్ అండ్ డౌన్ చేస్తూ సెలవు రోజుల్లో సోదరులకు పందిళ్లు, డెకరేషన్ పనుల్లో సహాయ పడుతుంటాడు. తండ్రి అకాల మృతి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురై అప్పటి నుంచి ముభావంగా ఉంటున్నాడు.
దానికి తోడు అతడి మొబైల్ ఫోన్‌కు ఇటీవల తరచుగా ఫోన్ కాల్స్ వస్తుండగా తల్లితో పాటు అన్నయ్య మందలించినట్లు సమాచారం. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన అతడు శుక్రవారం తెల్లవారుజామున జఫర్‌గడ్ నుంచి మోటా ర్‌బైక్‌పై ఘన్‌పూర్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. అయితే ఉదయం లేచేసరికి ఇంట్లో రాఘవేంద్ర కనిపించడంతో అనుమానంతో అతడి అన్నయ్య రవితేజ తమ్ముడికి ఫోన్ చేయగా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో వద్దని ఫోన్‌లో వారిస్తూనే మరో బైక్‌పై ఘన్‌పూర్‌కు బయలుదేరాడు.
అయితే అతను ఫోన్‌లో మాట్లాడుతూ తిమ్మంపేట దాటేసరికి పెద్దగా రైలు చప్పుడు వచ్చిందని, అనంతరం ఫోన్ స్విచాఫ్ అయిందని రోదిస్తూ తెలి పాడు. వెంటనే రైల్వేస్టేషన్‌కు వచ్చి చూసేసరికి మొదటి ఫ్లాట్ ఫారం చివర అప్‌లైన్‌లో ట్రాక్‌పై రాఘవేంద్ర మృతదేహం కనిపించిందని విలపిస్తూ తెలిపాడు. రైల్వే ట్రాక్ వద్ద అతడి తల, మొం డెం వేర్వేరుగా పడి ఉండగా స్థానికులు పెద్ద సం ఖ్యలో అక్కడికి చేరుకుని విచారం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న అతని తల్లి, కుటుంబ సభ్యులు, బంధువులు ఘన్‌పూర్ రైల్వేస్టేషన్‌కు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు.
పంచనామ నిర్వహించిన రైల్వే పోలీసులు
విషయం తెలుసుకున్న కాజీపేట రైల్వే హెడ్ కానిస్టేబుల్ జస్‌పాల్‌సింగ్, కానిస్టేబుల్ అశోక్ సంఘటనా స్థలానికి చేరుకుని శవపంచనామ నిర్వహించారు. తండ్రి మృతిచెందడంతో మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించామని, న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే గరీబ్‌రథ్ సూపర్‌ఫాస్ట్ రైలు కింద పడి మృతిచెందినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ మేరకు మృతుడి తల్లి, అన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాగా విషయం తెలుసుకున్న మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అన్నెబోయిన భిక్షపతి, సర్పంచ్ బల్లెపు నర్సింగరావు తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment