
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పటాన్‌చెరు మండలం రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో బీటెక్ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. యూనివర్సిటీ భవనం అయిదవ అంతస్తు నుంచి దూకి రేణు శ్రీ(18) అనే యువతి శుక్రవారం బలవన్మరణానికి పాల్పడింది. యూనివర్సిటీలో చేరిన మూడు నెలల్లోనే విద్యార్థిని ఆత్మ హత్య చేసుకోడానికి గల కారణాలు తెలియల్సి ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా రేణు శ్రీ కుటుంబం మాదాపూర్‌లో నివసిస్తోంది. కూతురు ఆత్మహత్య విషయం తెలుసుకొని హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్ధిని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణల విచారిస్తున్నారు. యువతి ఆత్మహత్య చేసుకుంటుండగా తోటి విద్యార్ధులు వీడియో తీయగా.. వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.
గీతం యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న రేణుశ్రీ అనే యువతి బిల్డింగ్ 6వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. pic.twitter.com/mqA7ChvkBn— Telugu Scribe (@TeluguScribe) January 5, 2024
Video Credits: Telugu Scribe
చదవండి: TS: గుండెపోటుతో టెన్త్ విద్యార్థి మృతి