కోహీర్(జహీరాబాద్): జీవితంపై విరక్తితో రైలు కిందపడి వికలాంగుడు ఆత్మహత్మకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని కోహీర్‌లోని 24 నంబర్ రైల్వేగేట్ సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకొంది. బాధిత కుటుంబసభ్యులు అందించిన సమాచారం ప్రకారం.. లక్ష్మణ్(40) అనే వ్యక్తికి ఐదేళ్ల క్రితం సెప్టిక్ అవడంతో డాక్టర్లు ఒక కాలు తొలగించారు. అనంతరం లక్ష్మణ్ ఒక పిండిమరలో పనిచేస్తు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే సెప్టిక్ మరోకాలికి సైతం సోకడంతో గత కొంతకాలంగా పనిమానేసి ఇంటివద్దె ఉంటున్నాడు. కాలిని తొలగించకపోతే ప్రాణాపాయం ఉందని డాక్టర్లు తెలిపారు. అసలే పనిలేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న లక్ష్మణ్ కాలిని తొలగించడానికి డబ్బులు లేక తీవ్ర మానసిక వేదనకు గురైయ్యాడు. దీంతో ట్రైసైకిల్‌పై గేటు వద్దకు వెళ్లి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లక్ష్మణ్‌కు భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఒక కూతురుకు వివాహం జరిగింది. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Published Thu, Oct 18 2018 9:42 AM | Last Updated on Tue, Nov 24 2020 3:32 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment