పిల్లలతో రైల్లోంచి దూకిన తల్లి !! | two died in west godavari district due to slip from running train | Sakshi
Sakshi News home page

పిల్లలతో రైల్లోంచి దూకిన తల్లి !!

Published Wed, Apr 13 2016 11:29 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

two died in west godavari district due to slip from running train

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో దారుణం జరిగింది. ఓ మహిళ తన పిల్లలతో కదులుతున్న రైల్లోంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో తల్లి, రెండున్నర ఏళ్ల పాప మృతిచెందగా బాబుకి తీవ్ర గాయాలయ్యాయి.

ఏలూరు రైల్వే ట్రాక్ పై ఏడాదిన్నర బాబు పడి ఉండటాన్ని గమనించిన ట్రాక్ మెన్ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. వట్లూరు రైల్వే ట్రాక్ సమీపంలో తల్లి, కూతురు మృతదేహాలను అధికారులు గుర్తించారు. రైలు నుంచి జారిపడ్డారా లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైల్లోంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement