ప్రతీకాత్మక చిత్రం
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్ పరిధిలోని కార్మెల్ డీఎడ్ కళాశాలలో దేవదానం అనే అధ్యాపకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళాశాల మూడో అంతస్తులో పురుగుల మందు తాగి తనువు చాలించాడు. మృతదేహాన్ని పరిశీలించి చూడగా నాలుగు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనిపిస్తోంది. కళాశాలకు సెలవులు కావడంతో ఎవరూ గుర్తించలేదు. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment