Woman and Man Commits Suicide in Eluru Falling Off Train Track - Sakshi
Sakshi News home page

వివాహితతో యువకుడి చాటింగ్‌.. చివరికి ఇద్దరూ కూడా..

Published Thu, Jan 6 2022 6:34 PM | Last Updated on Thu, Jan 6 2022 7:58 PM

Married woman And young Boy Commits Suicide Over  - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : ఏలూరు పవరుపేట స్టేషన్‌లో ఇద్దరు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.  మంగళవారం అర్ధరాత్రి రైలుపట్టాలపై విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే రైలు వీరిని ఢీకొంది. ఏలూరు కొత్తపేట ఏటిగట్టు ప్రాంతానికి చెందిన సత్యవాడ అరుణకుమారి (37), కిషోర్‌కుమార్‌ దంపతులు. కిషోర్‌కుమార్‌ పెయింటర్‌. రాజమహేంద్రవరం తొర్రీడుకు చెందిన సువ్వాడ హేమవినయ్‌ (27) ఎంటెక్‌ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. కిషోర్‌కుమార్‌కు వినయ్‌ పిన్ని కుమారుడు. 20 రోజులుగా అతను అరుణకుమారితో సెల్‌లో చాటింగ్‌ చేస్తున్నాడు. ఆమె వద్దని వారించినా చనిపోతానంటూ బెదిరించటంతో ఆమె కూడా చాటింగ్‌ చేసింది.

ఇదే విషయాన్ని భర్త కిషోర్‌కుమార్‌కు చెప్పగా వినయ్‌ తల్లిదండ్రులకు కొడుకును అదుపులో పెట్టుకోవాలని చెప్పాడు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా ఇరు కుటుంబాల మధ్య వివాదం సాగుతోంది. రెండు రోజుల క్రితం వినయ్‌ తల్లిదండ్రులు అతన్ని గట్టిగా హెచ్చరించారు. దీంతో వినయ్‌ ఈ నెల 4న ఏలూరు వచ్చి అరుణకుమారికి విషయం చెప్పాడు. ఆమె కూడా ఈ వ్యవహారంతో కుటుంబంలో తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడిందని మనస్తాపానికి గురైంది. తనువు చాలించాలని నిర్ణయించుకుని, తన చావుకు ఎవరూ బాధ్యులు కారని, కుమారుడు నితిన్‌ను ఇంజనీరింగ్‌ పూర్తి చేయించాలని ఉత్తరం రాసి మంగళవారం రాత్రి ఇల్లు విడిచి వెళ్లింది. అరుణకుమారి, వినయ్‌   రైలుకింద పడి మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement